Sunday, 28 Jun, 2026

ట్రై చేయండి

ఇంట్లో ఇప్పుడు రాగి పాత్రలు మంచి నీటి జగ్గుల వాడకం మొదలు పెట్టారు.రాగి పాత్ర ల్లో ఉంచిన నీళ్ళు ఆరోగ్యం అంటున్నారు.అలా ఇతర లోహాలతో చేసిన పాత్రలు వెండితో చేసిన వస్తువులు హాయిగా వాడుతున్నారు. కానీ వీటిని క్లీన్ చేయటం చాలా కష్టం.చింతపండు ,బయట దొరికే పౌడర్లతో కడిగితే కాసేపటికే వాటిపైన మరకలు కనిపిస్తాయి. తరిగేశాక మిగిలిన ఆకు కూరల కాడలు ,ఆకులు మెత్తగా చేసి కుంకుడు కాయపొడి ,శీకాయి పొడి కలిపి ఆ మిశ్రమంతో ఈ […]

తులసిలో శక్తి

ప్రతి ఇంటి ముంగిట్లోనూ తులసి చెట్టు ఉంటుంది. ఇందులో ఔషధ విలువలు తెలిసే పూర్వీకులు తులసి ని ఇంటి ముందు నాటి పూజలు చేయమని చెప్పి ఉంటారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,యాంటీ ఇన్ ఫ్లమేటర్ గుణాల కారణంగా తులసి జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగు పరచగలుగుతుంది. తులసి ఆకు మరిగించి ,కషాయం లేదా టీ రూపంలో తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. తులసి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గించే గుణం […]

ఫిట్ నెస్ అవసరం

ఫిట్ నెస్ తో ఉండమంటే అది శరీరం తీరుగా ఉంచుకొండి అనటం మాత్రమే కాదు శరీరంలోని ప్రతి అవయవం చేయవలసిన పని చేయటం కోసంగా అర్ధం చేసుకోమంటున్నారు. ఇవ్వాల్టి రోజుల్లో ఉన్నత విద్యా అభ్యసించి మంచి జీతం సంపాదించే ఉద్యోగినులు కూడా వారానికి ఐదు రోజులు సర్వశక్తులతో పని చేయగలగాలి అంత శక్తి కావాలంటే ప్రతి రోజు ఎక్సర్ సైజులు చేయవలసిందే .ప్రతి రోజు ఒకే రకం ఎక్స సైజులు విసుగనిపిస్తే మోడరన్ టెక్నిక్స్ జోడించి అప్పుడు […]

సేమ్ టూ సేమ్

ఫ్యాషన్ డిజైనర్స్ shantanu Nikhil డిజైన్ చేసిన ఒకే రకంగా ఉన్నా బ్లాక్ కలర్ ,ఫ్లోరల్ ప్రింటింగ్ ఉన్నా డ్రెస్ ను పరిణితీ చోప్రా అర్జున్ కపూర్ లు వేసుకొని ఢిల్లీలో జరిగిన ఫ్యాషన్ షో ,ఇండిపెండెన్స్ లో ర్యాంప్ పైన క్యాట్ వాక్ చేశారు. సేమ్ కలర్ డిజైన్ ఉన్న గౌన్ ,కుర్తాల్లో సేమ్ టూ సేమ్ డ్రెసింగ్ స్టైల్ లో ఇద్దరూ చాలా చక్కగా ఉన్నారు. ఈ సెలబ్రెటీల స్టైల్ ఇవ్వల్టి జంటల దాకా […]

ఎంత మంచి డాక్టరమ్మ

సిద్దిపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో డాక్టర్ అరుణా నాయుడు ఒకే రోజు 33 ప్రసవాలు చేసి రికార్డ్ సృష్టించారు. మూడు షిఫ్టుల్లో జానియర్ రెసిడెంట్ డాక్టర్ ,పదిమంది నర్సులు శ్రమించారు . మంగళవారం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు నేను మంచి నీళ్ళు కూడా తాగే సమయం లేదు. నా ఆధ్వర్యంలో ఒకే రోజు ఇన్ని ప్రసవాలు జరగటం నాకెంతో సంతోషంగా ఉంది అన్నారు డాక్టర్ అరుణ. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేందుకు ఇంతకంటే ఏం […]

రెండు మిలియన్ల వీక్షకులు

కళ్ళ ముందు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్నీ వీడియో తీసి అప్ లోడ్ చేయటం మొదలు పెట్టింది కేరళలోని అలప్పళలో పుట్టిన jinsha Basheer .మొదట్లోనే వేలకు వేలు లైక్స్ వచ్చాయి.సమాజం లోని లోటు పాట్లను ,సాటి మనుషుల అవసరాలను ప్రపంచం దృష్టికి తెచ్చేందుకు తన పేరుపైనే jinsha Basheer యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టింది. రెండు మిలియన్ల మంది చూస్తున్నారు ఈ చానల్. నెలకు 70వేల వరకు ఈ చానల్ పైన సంపాదన ఉంటుంది. […]

వేరే నగలెందుకు ?

ఎంత అందమైన ఖరీదైనా బ్లౌజులు డిజైన్ చేస్తున్నారంటే అవి ఒక్క సారి చీర కంటే ఖరీదు. పైపింగ్ ,డోరీ ఎంబ్రయిడరీ బ్లవుజులు పాతవైపోయి ఇప్పుడు జ్యువెలరీ ఎంబ్రయిడరీ బ్లవుజులు వస్తున్నాయి.కాసుల పేర్లు చక్కని వేలాడే లోలాకులు ముత్యాలు రంగు రాళ్ల దండలు ,ఖరీదైన హారాలతో బ్లవుజులు మెరిసిపోతున్నాయి. ఈ బ్లవుజులు ఒక చక్కని సాదా పట్టుచీరెకు ఈ జ్యువెలరీ ఎంబ్రయిడరీ బ్లవుజు జోడిస్తే ఇంకా వేరే అభరణాలు అక్కర్లేదు .చక్కని గాజులు ,పొడుగ్గా వేలాడే జుంకీలు ఉంటే […]

ఇలా వాడండి

పంచదార తినవద్దు అంటారు మరి అంత నోరూరించే పంచదార ఇంకెందుకు పనికిరాదా? అంటే సౌందర్యానికి మెరుగు పెట్టుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అరచేతిలో స్పూన్ పంచదార వేసుకొండి రెండు చుక్కల నీళ్ళతో తడిపి ఆ మిశ్రమంతో పెదవులు రుద్దితే మృత కణాలు పోతాయి. చర్మం నలుపుగా అయిపొతే ,చక్కెర నూనె కలిపి మొహాం మర్ధన చేస్తే చాలు పది నిమిసాల్లో తేడా తెలుస్తుంది. పంచదార,పిప్పరమెంట్ ఆయిల్ కలిపి పాదాలకు పట్టించి మర్ధన చేసి కడిగేస్తే పాదాలు […]

దాచేయచ్చు

జీవనశైలి మార్చుకొంటే పెరిగే వయస్సు కనిపించదు. ఐదు పదులు దాటిన ఇక జీవితం అయిపోయినట్లే అనుకోకండి శరీరం ఫిట్ గా ఉంచుకొనేందుకు ముందు అరగంటైనా వ్యాయామం కోసం ఖర్చు చేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కళ్ళచుట్టు ముడతలు పెరిగి వయసుని చూపెడతాయి. చర్మం సాగే గుణం పోగోట్టుకొని మొరుపు తగ్గిపోతుంది. ముందు ఆహారం పైన శ్రద్ధ పెట్టాలి. పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. రాగి జావా ,ఓట్ మీల్ ,ఉడికించిన కోడిగుడ్లు ఆకు కూరలు, కాయగూరలు […]

పాతవే ఫ్యాషన్

సింపుల్ గా ఉండటం ఫ్యాషనే. కానీ నగల విషయం వచ్చేసరికి ముత్యాలు,రత్నాలు ,నవరత్నాలు దేవత విగ్రహాలు ,చంద్రహారాలు ,కాసుల మాలలే ష్యాషన్ అంటున్నారు అమ్మాయిలు. పచ్చలు,కెంపులు,ముత్యాలు కూర్చిన గొలుసుకి లక్ష్మీదేవి పెండెంట్ ఇప్పుడు ఆషాడం , శ్రావణాల ష్యాషన్ , టెంపుల్ డిజైన్,మినీ హారాలు పాతకాలపు వడ్డాణం ,వంకీలకు వజ్రాలు కెంపులు జోడించి ఇప్పుడిదే ట్రెండ్ అంటున్నారు. ఆధునిక నగలంటే ఇప్పుడు పాతకాలపు డిజైన్ లే .ఇక 2019 వచ్చే సరికి పాతకాలం నగలే ఫ్యాషన్ ప్రపంచాన్ని […]

వ్యాపారం మొదలెట్టండి

రోజు సరదాగా చూసే ఫేస్ బుక్ ,వాట్సాప్ ,ట్విట్టర్ లో ఎంతో చక్కగా ఒక వ్యాపారాన్ని మార్కెట్ చేస్తాయి. ఈ మద్య కాలంలో ప్రతి బిజినెస్ కు సోషల్ మీడియానే వేదిక అవుతుంది. మనలో చాలా మందికి ఎన్నో కళలపైన ఇష్టం అందులో ప్రావీణ్యత ఉంటుంది. వంటలు,డ్రెస్ డిజైనింగ్ కొన్ని వస్తువులు అమ్మటం పెయింటింగ్స్, చేత్తో చేసిన బొమ్మల అమ్మటం మొదలైనవి ఇక ఫేస్ బుక్ పేజీ ఓపెన్ చేసి అందులోంచి అమ్మకాలు ప్రారంభం చేయవచ్చు. మన […]

జుట్టు వత్తుగా

జుట్టు వత్తుగా పెరగాలని ,ఆరోగ్యంగా మిలమిల లాడి పోతూ కనిపించాలని అందరికీ కోరికే. ఖరీదైన హెయిర్ ఆయిల్స్ ని మించినవి కొబ్బరి పాలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొబ్బరి పాలలో సమృద్దిగా ఉండే నియాసిన్ ఫాలెట్లు వంటివి మాడుపైన రక్త ప్రసారాన్నిపెంచుతాయి. విటమిన్ ఇ వంటి కొవ్వులు జుట్టు పాడవ్వకుండా కండీషనర్ గా పనిచేస్తాయి. కొబ్బరిని మొత్తగా రుబ్బి గట్టిగా పిండి చిక్కని పాలు తీసుకోవాలి. వాటిని అప్పటికప్పుడు జుట్టుకు పట్టించి ఓ గంటసేపు అలా వదిలేసి […]

అందాన్నిచ్చే నూనెలు

మనకు ఇప్పటి వరకు కొన్ని రకాల వంట నూనెలు ,సువాసనల నూనెలు తెలుసు. కొత్తగా కొన్నీ వంటలకు ,సౌందర్య పోషణకు పనికి వచ్చే నూనెలు వస్తున్నాయి. గుమ్మడి గింజల నూనె మోనోపాజ్ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. మొక్క జోన్న నూనె తలకు పట్టిస్తే జుట్టుకు పోషకాలు , వంటికి రాసుకుంటే చర్మానికి అందం . అలాగే జీడిపప్పు నూనె చర్మం ముడతలు పడనీయదు. సలాడ్స్ పైన చల్లుకొని తింటే రుచి . ద్రాక్ష గింజల నూనె […]

నాలుగడుగులు వేస్తే

నడక ఎంత వేగంగా ఉంటే అంత మంచిది అంటున్నారు పరిశోధకులు. మామూలుగా నడిచే కంటే బాగా స్పీడుగా నడిచే వాళ్లు ఎక్కువ ఆయుష్షుతో ఉంటారంటున్నారు .ఈ వేగం ఫిట్ నెస్ పైన ఆరోగ్యంపైన ఆధారపడుతుంది.నడక బరువును నియంత్రిస్తుంది.మానసిక స్థితిని అదుపులో ఉంచుతుంది.శరీరంలో కోవ్వు శాతం తగ్గిస్తుంది.రక్తసోటు నియంత్రిస్తుంది .ఎముకలు గట్టిపడతాయి. కండరాలు సమతూలంగా ఉంటాయి .చెమటలు పట్టేంత స్ఠాయిలో నడిస్తే దాన్ని వేగంగా నడుస్తున్నారు అనవచ్చు.

ఉల్లి కాడలు

ఉల్లిపాయలు లేకపోతే ఏ కూరకు రుచిరాదు. ఉల్లి కాడలు కూడా కూరల్లో వేస్తే అంత రుచి గాను ఉంటాయి. ఉల్లి కాడల్లో ఉండే అలిసిన్ చర్మానికి ఎంతో మంచింది. ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా కాపాడుతోంది. వీటిలో ఉండే కెరోటనాయిడ్స్ కంటి చూపును మెరుగు పరుస్తుంది. జలుబు వల్ల తలెత్తే నిమ్ము తగ్గిస్తాయి. ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకొంటాయి. ఉల్లి కాడల్లోని యాంటీ ఆక్సీడెంట్లు ,విటమిన్ సి ,కె ,యాంటిబాక్టిరీయల్ యాంటి ఫంగస్ సుగుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు […]

టుస్సాడ్స్ లో దీపికా

ఇట్స్ ఆల్ ఎ బౌట్ ది డిటైల్స్ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది దీపికా పడుకొణె. టుస్సాడ్ మ్యూజియంలో తన మైనపు బోమ్మ పెట్టడం కోసం కావాలసిన కొలతలన్ని తీసుకొన్నారు అంటోందామె.పద్మావత్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఒక ప్రముఖ పత్రిక నిర్వహించిన 100 మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ పీపుల్ చోటు దక్కించుకొన్నాక ఇప్పుడీ గౌరవం దక్కించుకుంది దీపికా. ఈమె మైనపు విగ్రహాన్ని హాలివుడ్ తారలు హిలెన్ మిర్రెస్ ,ఏంజిలీనా జోలీ మధ్య ఏర్పాటు చేయనున్నారు. […]

వరల్డ్ రికార్డులు

హైదరాబాదుకు చెందిన ఆస్ఫియా ఖాద్రి అనే యువతి మూడు ప్రపంచ రికార్డ్స్ సాధించింది. చిన్నతనం నుంచి ఆ అమ్మాయి రోజు వారీగా ధరిస్తూ వచ్చిన షూస్ ,సాక్స్, యాక్సిసరీస్ ,భద్రంగా బిల్లులతో వాటిని ప్యాక్ చేసిన బాక్స్ లతో సహా కాపాడి భద్రంగా ఉంచినందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ , ఆసియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్,ఇండియాల బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రతినిధిలు ఆస్ఫియాకు 18 పతకాలు ,21 ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈమె […]

అద్దెకు ఫ్యాషన్ వేర్

అద్దె కు అందమైన ఖరీదైనా గౌన్లు కావాలా? హైద్రాబాద్ లో fly robe gownes on rent in hyderabad లో ఆన్ లైన్ లో ఆర్డరివ్వచ్చు బ్రాండెడ్ ,డిజైనర్ ఎంతో ఖరీదైనా వైనా రీతు కుమార్ ఆర్మాని, సవ్యసాచి ,మనీష్ మల్హోత్రా ఎవరి ఫ్యాషన్ వేర్ అయినా సరే కొనుక్కోనవసరం లేకుండా అద్దెకు తెచ్చుకోవచ్చు. ఎన్నో అన్ లైన్ స్టోర్స్ ఉన్నాయి. బాంబే ,ఢిల్లీ ,కలకత్తా ఎక్కడైనా సరే కోత్త కలక్షన్స్ ని వినియోగదారులకు అందిచటంలో […]

పొడవే అందం

పొడుగ్గా వేలాడే బుట్టలు ఎప్పడు అందంగా ఉండేవి. కానీ ఆ బుట్టలు బరువైన దిద్దులు పోయి లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. పొడుగ్గా చెతులకు వేలాడుతూ లేటెస్ట్ సూపర్ లాంగ్ ఇయర్ రింగ్స్ ,ఇయర్ కఫ్ ,ఇయర్ రింగ్ డిజైన్లు వచ్చాయి. బంగారం వజ్రాలతో మెరిసే ఈ సన్నని తీగల్లాంటి లోలాకులు చాలా అందంగా ఫ్యాషన్ గా ఉన్నాయి. ట్రెడిషనల్ ఇండియన్ జుంకీలను ఇవి వెనక్కు నెట్టేశాయి.

దానికీ ఓ పద్ధతి

నీళ్ళే కదా అని ఎలాపడితే అలా తాగకూడదు అంటున్నారు డాక్టర్స్. తాగేందుకు పద్ధతులు ఉన్నాయి. ఒకే సారీ నోట్లో ఎత్తి పోసుకొని తాగకూడదు. కొద్దీ కొద్దీగా తాగుతూ మధ్యలో శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా కూర్చోని తాగాలి. నిలబడి ,నడుస్తూ హాడవుడిగా తాగవద్దు. నిద్ర లేవగానే గోరు వెచ్చని నీళ్ళు తాగాలి కొంత మంది ఎప్పుడు చల్లని ఫ్రిజ్ నీళ్ళే తాగు తారు అవి ఆరోగ్యానికి హాని చేస్తాయి తప్ప మేలు చేయవు .అతి శీతలమైన పానీయాలు తాగితే […]