Sunday, 28 Jun, 2026

వీటికి గృహవైద్యమే

బ్లాక్ హెడ్స్ ముక్కు చుబుకం వీపు బుజాలపైన కూడా వస్తాయి. స్వేద గ్రంధులు నుంచి నూనె అధికంగా ఉత్పత్తి కావటం శరీరం పైన బాక్టీరియా ఏర్పడటం వల్ల ఇవి వస్తాయి. గుడ్డు తెల్ల సొన తీసుకొని అందులో నిమ్మరసం కలిపి ఈ మిశ్రమం బ్లాక్ హెడ్స్ పైన రాయాలి. అది ఆరాక మళ్ళీ పూయాలి, అలా నాలుగైదు సార్లు పొరలుగా పూసి ఆరనివ్వాలి. బాగా ఎండి నట్లు అయ్యాకా దాన్నీ చేత్తో నెమ్మదిగా లాగేస్తే ఆ పొరతో […]

ఎన్నింటికో రంగు

ఎన్నో రంగుల్లో గోళ్ళ రంగు సీసాలు ఇంట్లో పేరుస్తూ ఉంటారు. మ్యాచింగ్ కోసం తప్పుదు మరీ .కొంచెం వాడే సరికి నచ్చకుండా పోతుంది. వీటిని ఇంట్లో వస్తువులకు అలంకరణ కోసం ఉపయోగించవచ్చు .పూల కుండీలపై చక్కని డిజైన్లు వేయవచ్చు. టూవీలర్స్ ట్రాఫిక్లో వెళ్ళేప్పుడు గీతలు పడతాయి. ఆ ఫ్యాబ్ సరైన గోళ్ళ రంగు ఎంచుకొని మరక కనబడకుండా చేయవచ్చు. రంగురాళ్ళ నగలు ఫ్యాషన్ కోసం కొంటుంటారు ఒక్కసారి వేసుకోగానే రాళ్ళు ఊడి వస్తాయి. ఆ ఊడిపోయిన రాళ్ళు […]

ఈ స్టీల్ ఆరోగ్యం

టైటానియం స్టీల్ లేదా రెయిన్ బో స్టీల్ ఇప్పుడు వంటింటిల్లో సందడి చేస్తోంది. ఈ ఇంద్ర భవనాల్లో స్టీల్ పాత్రలు ,స్పూన్లు ,గరిటెలు ,ఫ్లేట్స్ ,కప్పులు ,ముక్కుపుడకలు,గాజులు బ్రాస్ లేట్లు ఒకటేమిటి ఈ స్టీల్ ఇవ్వాళా ఫ్యాషన్ ట్రెండ్. స్టీల్ పాత్రల్నీ ,వస్తువున్న టైటానియం ద్రావకంలో ముంచి విద్యుదీకరణ ప్రక్రియకు గురిచేయటం వల్ల ఈ సప్త వర్ణాలు ఏర్పడ్డాయి. ఈ టైటానియం రంగుల వల్ల ఎలాంటి హానీ జరగదు. ఎలాంటి చర్మ తత్వం గలవారికైనా ఈ లోహాపు […]

ఏ రకం చర్మం

కొన్నీ సౌందర్య ఉత్పత్తులు తీసుకొనేప్పుడు సహాజంగా చర్మం గురించి ప్రశ్నవస్తుంది. నార్మల్ స్కిన్ ఆయిల్ స్కిన్ అని ఫలానా చర్మానికి ఫలానా క్రీమ్ సూటవుతోంది అంటారు . ఏ చర్మం ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఉదయం లేవగానే టిష్యూ పేపర్ మొహం పైన అలా వేస్తే ఏ మార్పు చెందకపోతే అది నార్మల్ స్కిన్ . మరకలు అయితే అది ఆయిల్ స్కిన్ . పేపర్ తో మొహం పైనప ప్రెస్ చేస్తే , ఇసుకతో పేపర్ ప్రెస్ […]

వంట వేడిగా

పిల్లలు ఉయదాన్నే స్కూళ్ళకు బయలుదేరుతారు. ఉదయం ఏడు గంటలకే రెడీ చేసే భోజనం పిల్లలు తినబోయే సరికి చల్లారిపోతుంది. అలా వేడి చల్లారకుండా నియోఫ్రిన్ థర్మల్ ఇన్సులేటెడ్  బ్యాగ్ లు ఆహారాన్ని వేడిగా ఉంచుతాయి. లేదా చల్లనివి పెడితే అవి చల్లగానే ఉంటాయి. జ్యూస్ లు , ఫ్రూట్ సలాడ్ లు ఎక్కడైన తీసుకు పొవాలంటే ఈ బ్యాగ్ లో పెట్టి తీసుకుపోవచ్చు . పిల్లలు తీసుకుపోయేందుకు తేలికగా ఉన్నాయి కూడా.

ఈ నీళ్ళతో అందం

కూరలు ,బియ్యం ,పప్పులు ఉడికించిన నీళ్ళతో ముఖం కడిగితే ఎక్కుడ లేని అందం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. బంగాళా దుంపలు ఉడికించిన నీళ్ళల్లో కొంచెం ముల్తానీ మట్టి ,పెరుగు,బాధం నూనె కలిపి ముఖానికి రాసి ఆరిపోయాకా కడిగితే ముఖంపై జిడ్డు మృత కణాలు పోతాయి. ఎండలో ముఖం అలిసిపోతే బియ్యం ఉడికించిన గంజిలో కాస్త తేనె కలిపి ముఖానికి మర్ధన చేస్తే చాలు .ఇది స్క్రబ్ లాగా వాడాలంటే ఇందులో కాస్త బియ్యం పిండి కలిపి రాస్తే […]

శివగామి కథ

ఆనంద్ నిలకంఠన్ రామాయణగాథను అసుర టేల్ ఆఫ్ ది వేంక్విష్ట్ రాశారు. అలాగే మహాభారతాన్నీ రాశారు. ప్రజాదారణ పొందిన టి.వి సీరియల్స్ కు స్క్రీన్ ప్లే రాశారు. బాహుబలిలో శివగామి పాత్రను సృష్టిస్తూ దిరైజ్ ఆఫ్ శివగామి రాశాడు .రాజమౌళి ఈ కథను రాస్తున్నప్పుడే చదివి ఉత్సహపడ్డానని ముందు మాటాలో రాశారు. కుతంత్రం అధికారం ,ప్రతీకారం,మోసాల కథ ఇది. బాహుబలి వంటి సినిమాలు తీసే ముందర పాత్రలు ఎలా సృష్టిస్తారో ఈ 538 పేజీల నవలలో చదువు […]

గాలిలో తేలినట్లుందే !

యాంటీ గ్రావిటీ కేక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గొప్ప ట్రెండ్ .ఈ కేకుల పైన రకరకాల వస్తువులు అలా గాల్లో తేలినట్లు ఉంటాయి. ఇక కేకు పైన గాల్లో తేలే ముగ్గుల్లోంచి పాలు పడుతు ఉంటాయి. ఇలా గాల్లో అంటే అది నిజానికి కేక్ లో గుచ్చిని స్ట్రాకి అంటించిన తేలికైన కప్పు . అదే పాలు కూడా క్రీమ్ లో చేసే అలంకరణే . మామూలు కేకు పైన పెట్టే వస్తువులు అన్ని తేలికగా ఉంటాయి. ఇవి […]

అందమైన ఉరుళి

కేరళలో ఇళ్ళు,దేవాలయాలు ,రిసార్ట్స్, స్పాలు అన్ని చోట్ల రంగు రంగులపూలతో అలంకరించిన ఉరుళి కనిపిస్తుంది. ఇప్పుడు అన్నీ ఇళ్ళలో ఈ అందమైన సంప్రదాయం కనిపిస్తుంది. నీళ్ళుపోసి పూవులు వేసిన వెడల్పాంటి పాత్రల్లో సువాసనలతో ఉండే కొవ్వుత్తుల్ని కూడా వెలిగిస్తారు. ఒక రకంగా మంచి వాసన వచ్చే సంపెంగ ,గులాబీ,బంతి ,చామంతులతో నింపిన ఉరుళి ఇత్తడి చెంబు ,రాగి బంగారం తో కూడా తయారు చేస్తున్నారు. వీటిలో వినాయకుడు, దశవతారాలు, విష్ణువు ,లక్ష్మి దేవి,రక రకాల దేవతామూర్తులు కూడా […]

మెరుపుల పిన్నులు

చక్కని చీరెకట్టుకు అందమైన పిన్ను ఫ్యాషన్ …అవి మ్యాచింగ్ గా చూసి ఎంచుకొనేవాళ్ళు . ఇప్పుడు చీరెలకే కాదు , గౌన్లు ,మాక్సీలు కూడా పిన్నులతో మెరుస్తున్నాయి. జిగెల్ మని మెరిసిపోయే రాళ్ళు , పూవ్వులు ,పక్షులు మంచి డిజైన్లు ,విచిత్రమైన ఆకృతులు కూడా  బ్రూబ్ లుగా వచ్చాయి. చక్కగా పార్టీలకు ,ప్రత్యేక సందర్భాలకు ఈ అందమైన బ్రూబ్ లు ఎంతో బావుంటాయి.

ఇలా చేయండి

బరువు తగ్గేందుకు ఎలా తింటే బావుంటుందా అని చాలామంది ఆలోచిస్తారు. వెనిలా సువాసనలో ఉండే కొవ్వోత్తుల్ని ఇంట్లో వెలిగిస్తే ఆ వాసనకు తీపి తినాలన్న కోరిక తగ్గిపోతుంది అంటున్నాయి పరిశోధనలు. బరువు తగ్గాలనుకుంటే మంచి చిట్కా ఇది. ఎరుపు రంగు ప్లేటులో తింటే 40 శాతం తక్కువ తింటారట. టీవీ చూస్తూ తింటే రెండింతలు ఎక్కువ తింటారు. స్పూన్ తో నూనె కొలిచి కూరలు చేస్తే క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కూల్ డ్రింక్స్ తాగాలనిపిస్తే అవి పంచదార,నిమ్మరసం […]

నిద్ర చాలా ముఖ్యం

కనీసం ఆరుగంటల సేపు గాఢంగా నిద్రపోతే మెదడు చురుగ్గా ఉంటుందంటున్నాయి పరిశోధనలు. మెదడు ఆరోగ్యం గురించి చేసిన పరిశోధనలో భాగంగా వెయ్యిమంది పై ఈ పరిశోధన నిర్వహించి యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకులు వాళ్ళ మణికట్టుకు యాక్టిగ్రాఫ్ అనే పరికరాన్ని కట్టి దీని ద్వారా వాళ్ళు ఎంత సేపు చక్కగా నిద్రపోయారు. అందువల్ల మెదడు ఎంత విశ్రాంతిగా ఉంది పరీక్షించారు. సరిగ్గా నిద్రపట్టక అటుఇటు కదులుతు ఉండేవాళ్ళలో మెదడు పనితీరు సరిగ్గా లేదని క్రమంగా అది వాళ్ళలో […]

పిల్లలకు నచ్చుతాయి

బావుంది తిను అని తల్లులు ఎంత మొత్తుకున్న మంచి మంచి వంటకాలను తిననే తినరు. నోట్లో అయినా పెట్టుకోకుండా బాగాలేదు అని రిజెక్ట్ చేస్తారు. తేలికైన తల్లులు అ తినే దాన్ని కాస్తా పిల్లల కళ్ళకు ఆకట్టుకునేలా తయారు చేస్తే పిల్లలు దాని అందానికి మెచ్చి తింటారు ఇప్పుడు రెవోలిన్ రోలింగ్ పిన్‌ ఉందనుకోండి. రెండు చపాతీల మధ్య ఏ ఆకు కూరనో, కోలినో, తియ్యని కొబ్బరి బెల్లం పోడి ని పెట్టేసి ఈ అప్పడాల కర్రతో […]

చీకటి వెలుగుల్లా

బ్లాక్ ఎన్డ్‌ వైట్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. వానా కాలానికి సూటయ్యే రంగు నలుపేనంటారు ఫ్యాషన్ నిపుణులు. హీరో తనానికి హోదా కి ప్రతీకగా ఉండే నలుపుని చక్కని ప్రకాశవంతమైన శాంతికి రూపమైన తెలుపుతో జోడిస్తే ఎంతందం. కొత్త దనానికి స్థిర చిత్తానికి, ఆశావాదానికి తెలుపు సంకేతం అంటారు. తెలుపు నలుపుని క్లాసిక్ కలర్ కాంబినేషన్ అంటారు ఫ్యాషన్ గురూలు. నగలు,దుస్తులు,వాహనాలు చివరకు ఇంటీరియర్స్ లోనూ ఈ కాంబినేషన్ బావుంటుంది. ఈ రెండింటిని కలిపి ధరించడం తిరుగులేని […]

ఒత్తిడి ప్రమాదం

ఎక్కువ ఆందోళన పడినా ఒత్తిడితో సతమతమైనా ముఖ్యంగా ఎముకలకు ప్రాబ్లం అంటున్నారు వైద్యులు. ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువ అంటున్నాయి అధ్యాయనాలు. ఆందోళనకు గురయ్యే మహిళల్లో ఖనిజాల శాతం తగ్గిపోయినట్లు గుర్తించారు. ఎముకలు బలహీనపడి అతి చిన్న ప్రమాదాలను కూడా తీవ్రంగా గాయపరుస్తాయి. డీ విటమిన్ స్థాయి పడిపోతాయి. శరీరం ఇన్ ఫెక్షన్ తట్టుకునే శక్తిని పొగొట్టుకుంటుంది. విటమిన్‌ డీ పుష్కలంగా ఉండే ఆహారం తీసుకోమని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా గుడ్లు బాదం, సోయా, బ్రకోలి,అవిసె గింజలు, […]

ఇది లాభమే

డాక్టర్ మైకల్ మోస్లే ఒక డైట్ ప్లాన్ ఇప్పుడు పాశ్చత్య దేశాల్లో ట్రెండ్ అవుతుంది. వారంలో ఐదు రోజులపాటు చక్కగా మూడు పూటల భోజనం చేసి మిగతా రెండు రోజులు ఉపవాసం చేయాలి. అది పూర్తిగా ఉపవాసం కాదు పండో ఫలమో, గ్లాసుడు పాలో రెండు రోజులు తినే తిండిలో 500 కేలరీలు మించకుండ చూసుకుంటే శరీరానికి అందే క్యాలరీల సంఖ్య పడిపోతుంది. ముఖ్య అవయవాల్లో కొవ్వు కరగడం మొదలవుతుంది. ఆరోగ్యంతో పాటు బరువు కూడా తగ్గుతారు […]

ఈ రోజుల్ల్లో ఉపయోగం

ప్రతి సీజన్ కు అనుకూలమైన వస్త్రశ్రేణి ఉంటుంది. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయనుకోండి చర్మానికి ఫ్రెండ్లీగా ఉండే కాటన్స్ ఇతర ఫ్యాబ్రిక్స్‌ ఎక్కువ వాడాలి. లెనిన్ గొప్ప యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగిన ఫ్యాబ్రిక్. పాలీ రేయన్ కూడా త్వరగా ఆరిపోయే ఫ్యాబ్రిక్స్. డెనిమ్ వంటి భారీ ఫ్యాబ్రిక్ లు లేయర్డ్ డ్రెస్ లు మడమల కింద దాకా జీరాడే దుస్తులు రోజువారి వాడకం నుంచి తీసేయాలి. సాధరణంగా రోజు వాడటానికి పాప్లిన్ టాప్స్ బావుంటాయి.

ఈ క్రీములతో నష్టం

స్కిన్ లైటెనింగ్ క్రీములతో హైపర్ టెన్షన్ వస్తొందని కాల క్రమంలో చర్మానికి మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. లైటెనింగ్ క్రీముతో (చర్మాన్ని తెల్లబరిచే క్రీములు) తయారీలో వాడే కొన్ని స్టెరాయిడ్స్ మెర్క్యూరీ వంటివి కాల క్రమేణా నరాల వ్యవస్థను దెబ్బతీస్తాయని హైడ్రో క్వీనైన్ వంటి రసాయనాలు ఉన్న క్రీములు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలని లేకపోతే శాస్వత దుష్పరిణామాలు కలుగుతాయని హెచ్చరిస్తున్నారు. శరీరక భయం తక్కువ ఉండటం పెద్ద నష్టమేమి కాదని తెలుసుకోమంటున్నారు.

రుచి ఆరోగ్యం

డెహ్రాడున్ ప్రాంతంలో బాగా పండే లీచెస్ పండ్లు మనకు స్నేహితుల్లాటివి. పై తొక్క గట్టిగా ఉంటుంది కాని లోపల పండు తెల్లగా మెత్తగా తియ్యని బుల్లి లాంటి ముంజలాగా ఉంటుంది. చల్లగా ఉండే ఈ వాతావరణంలో ఇంకా ఇష్టంగా తినాలి కూడా దగ్గు రానీయదు. విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. వివిధ గ్రంధుల పైన సానుకూల ప్రభావం వుంటుంది. వీటిలో కాల్షీయం,ఫాస్పరస్,పోటాషీయం ఎక్కువగా ఉంటాయి. రెబోఫ్లోనిక్, ఐరన్,పెక్టిన్ లు లీచెస్‌ లో లభిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ […]

పిల్లల కోసం చక్కని పుస్తకం

బాల సాహిత్యం మనకు చాలానే ఉంది కాని కాని అవన్ని చాలా మటుకు పెద్దవాళ్ళ కోసం పెద్దవాళ్ళు రాసినట్లు వుంటుంది. మరి నీతి కథలతో పిల్లలకు బోర్ కొట్టేలా ఉంటుంది. అనిల్ బత్తుల రష్యన్ జానపద కథలు అనువాదం చేశాడు. ప్రసిద్దులైన రచయితలు టాల్ స్టాయ్ ,గోర్కి,పుస్కిన్ వంటి వాళ్ళు పిల్లల కోసం రాసిన కథలున్నాయి. పెద్ద అక్షరాల ప్రింట్ తో చక్కని బొమ్మలతో పిల్లలు చదువుకునేందుకు వీలుగా ఉన్నాయి. అనువాదం తేలికైన చక్కని తెలుగు భాషలో […]