Sunday, 28 Jun, 2026

ఇప్పుడు బావుంటుంది

జుట్టు పైకి దువ్వుకుని పైకి బిగుతుగా కొప్పు పెట్టుకోవడం లేదా క్లిప్ పెట్టుకుని పోడవాటి జుట్టు అలాల్ల కదిలేలా వదిలేయడం ఫ్యాషన్. కానీ మరి పైకి దువ్వేస్తే నుదురు వెడల్పుగా అయిపోయినట్లు ఉంటుంది. అలాంటప్పుడు చిన్న ట్రిక్ తో నుదురు చిన్నగా అయిపోయేలా చేయవచ్చు. నుదిటి పైన జుట్టు కుదుర్లు కనిపించే చోట నుంచి కాస్త ముదురు రంగు పౌండేషన్‌ రాయాలి. అలాగే ముఖం మొత్తానికి వేసుకునే పౌండేషన్ కంటే తేడా గా ఉండకూడదు. కాస్త ముదురు షేడ్ […]

ఎంత గొప్ప కష్టం

తెల్లని బట్ట పైన ఖూరాన్‌ గ్రంధంలోని అక్షరాలు రాసుకుని చేతి ఎంబ్రాయిడరీతో వాటిని కుట్టిస్తూ 726 పేజిల పుస్తకాన్ని పూర్తి చేసింది పంజాబ్ కు చెందిన 62 సంవత్సరాల నజామ్‌. 31 సంవత్సరాలు పట్టిందట ఆవిడకు అది పూర్తి చేసేందుకు. ఇప్పుడామెకు 62 సంవత్సరాలు వచ్చాయి. వస్త్రం పైనే కుట్టిన ఈ ఖురాన్ బరువు 55 కిలోలు. మదీనాలోని గ్రంధాలయంలో దీన్ని ఉంచాలని ఆమె కోరిక. ఒక్క చిన్న పని చేసేందుకు బద్దకించే వాళ్ళు ఈమె కృషికి ఏం […]

పోషకాల గుమ్మడి

ఎండకాలం వస్తే బూడిద గుమ్మడితో వడియాలు పెడతారు. అలాగే ఒక వంతు గుమ్మడికాయ గుజ్జు, రెండు వంతులు పంచదారతో కలిపి పాకం పడితే గుమ్మడి సిరప్ తయారవుతుంది. ఫ్రెటో న్యూట్రియంట్లు గుమ్మడిలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో అధికంగా ఉండే ఇనుము ఏకాగ్రతను జ్ణాపకశక్తిని పెంచుతుంది. పొటాషియం, విటమిన్ సీ లు ఎక్కువగా ఉండే గుమ్మడిలో శరీరానికి కావలిసిన విటమిన్ సీ అవసరాన్ని చాలావరకు తీరుస్తుంది. వ్యాది నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో వ్యర్ధాలను మూత్రం రూపంలో బయటకు […]

నమలటంతో ప్రయోజనం

ఒక్కోసారి మనకిష్టమైనవే మంచివని రిపోర్టు వస్తుంది. ఇది చూడండి వాకింగ్ చేస్తు బబుల్ గమ్ నములుతూ ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు అంటున్నారు టోక్యోలోని వాసెడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. నడుస్తూ బబుల్ గమ్ తింటే గుండె కొట్టుకునే వేగం పెరిగి శరీరంలో శక్తి ఎక్కువగా ఖర్చు అవుతుంది. నడిచే వేగం దూరం పెరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్త్రీ, పురుషుల భేదం లేకుండా కొన్ని వేల మంది పై ఈ రిసెర్చ్ నిర్వహించారు. ఇది మధ్య వయసు వారి […]

హ్యాపీనే అసలందం

డ్రూ బ్యారీ మోర్ హాలివుడ్ లో పాపులర్‌ స్టార్. 40 ఏళ్ళ వయసులో కూడా ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆమె చెప్పే బ్యూటీ టిప్స్ కు సోషల్ మీడియాలో ఎంతో క్రేజ్‌. 40 ల్లోకి వచ్చాకా ఆడవాళ్ళకు ఎదురయ్యే సౌందర్య సమస్యల గురించి చెబుతూ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఏదో డిప్రషన్‌ లో ఉన్నట్లు చూపెడతారు. నాకు అవంటే భయం. మనం హ్యాపీ గా ఉన్నట్లు ప్రపంచానికి ఎలా చూపెడదాం మరి ఇలాంటి డార్క్ […]

మార్నింగ్ సిక్ నెస్ కు మందు

బుల్లి పాపాయి ఇంట్లోకి రావడం ఒక ఉత్సవం లాంటిదే. కాని పాపాయి ని మోస్తూ తల్లి అనుభవించే ఇబ్బందిని వర్ణించడానికి మాటలుండవు. వేవిళ్ళతో కాబోయే అమ్మ సతమతం అవుతుంటే అప్పుడు ఆమెకు తేనె, అల్లం ఇవ్వండి అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. నిమ్మరసం,తేనె, అల్లం కలిపి ఒక్కో బొట్టు చప్పరిస్తే వికారం తగ్గుతుంది. అల్లంలో ఆరోగ్య విశేషాలు ఎన్నో ఉన్నాయి. నేరుగా ఉప్పులో ఎండబెట్టిన అల్లం చప్పరించినా, అల్లం టీ తాగినా వికారానికి విరుగుడుగా పని చేస్తుంది. కూరలు,పప్పుల్లో […]

అలోవేరా ఉత్తమం

ఎండతో ఎఫెక్టయ్యేది ముఖ చర్మం. కళ్ళజోడు వాడినా క్యాప్ పెట్టుకున్నా ఎండ తాకిడికి మొహం కందిపోయి పొడిబారి పోతుంది. కమిలిన చర్మానికి అలోవేరా గుజ్జు అద్భుతమైన ఉపశమనం. అలాగే బొప్పాయి గుజ్జు కుడా. ఈ రెండు రకాల గుజ్జులు చర్మాన్ని యధాస్థితికి తెస్తాయి. ఎండలో నుంచి బయటకు రాగానే దోస రసం, పుచ్చకాయ రసం కలిపి ఆ నీటిలో దూది తడిపి మొహనికి , మెడకు రాసి కాసేపు ఆగి కడిగేయాలి. పాలలో దూది ముంచి మొహం […]

ఇవే ఫ్యాషన్

కాలేజీ కైన, ఆఫీస్ ల కైన ఆక్సిడైజ్డ్‌ సిల్వర్ జ్యూలరీ చక్కగా ఉంటుంది. లోటస్ జుంకాలు, టాజీలు చెవి పోగులు వైల్డ్ మోటిఫ్ పెండెంట్లు కుర్తల మీదకు షర్టుల మీదకు బావుంటాయి. సాదా డ్రెస్ ల మీదకు వెండి నగలు చాలా బావుంటాయి. తెలుపు,నలుపు, రాయల్‌ బ్లూ , బర్గండీ రంగులు దుస్తుల పైకి పొడవాటి గొలుసులు పెండెంట్లు చక్కగా కనబడతాయి. మెరిసే తెల్లని వెండి నగల కంటే స్టెరిలైజ్ సిల్వర్ తో చేసిన జూకాలు, చాంద్ […]

మేము సైతం

కొన్నేళ్ళుగా జిమ్ ట్రైనర్స్ పులప్స్ చేయమని చెప్తున్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని ఫిట్ నెస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ తీసుకున్నకా ఇక తప్పలేదు. ఇప్పుడు ప్రయత్నం చేశా. నా దృష్టిలో ఫిట్ నెస్ అంటే అందం కోసం కానే కాదు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం బలం అంటుంది సమంత. మనం ఫిట్ గా ఉంటే ఇండియా ఫిట్ గా ఉంటుందంటూ కేంద్రమంత్రి రాజ్యవర్ధన్‌ సింగ్ రాధోడ్ హమ్‌ ఫిట్ తో ఇండియా ఫిట్ హై పేరుతో ఫిట్ […]

ఈ పర్స్ ఉపయోగం

ఒక్క రోజు బయట ఊరికి వెళ్ళినా అమ్మాయిలకు తమ మేకప్ సామాగ్రి, అలంకరణ వస్తువులు అన్ని కావాలనుకుంటారు. బ్యాగ్ లో పడేస్తే అన్ని ఒక పట్టానా చేతికి అందవు ఏ లిప్ స్టిక్కో అడుక్కు జారిపోతుంది. ఇష్టంగా పెట్టుకోవాలనుకున్న జూకాల్లో ఒకటి ఎక్కడో ఇరుక్కుపోతుంది. డ్రెస్సింగ్ మేకప్ ఆర్గనైజర్ గనుక కొనేస్తే ఈ సమస్య రాదు. ఇవి చూసేందుకు గుండ్రని పర్స్ లో ఉంటాయి. ఇందులో కావలిసినన్ని పెట్టేసి దానికి ఉన్న డోరిలను దగ్గరకు లాగితే పర్స్ […]

కొంతయినా ఇవ్వాలి

సెలబ్రిటీ లయితేనే, డబ్బున్న కుటుంబాల నుంచి వస్తేనే కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎవో కొన్ని ఎంతో కొంత సాటివాళ్ళకి తిరిగి ఇవ్వటం నేర్చుకోవాలి అంటుంది శ్రద్దా కపూర్. సంఘసేవ అంటే ఎంతో ఇష్టపడే శ్రద్దకపూర్ ఎన్నో సేవ కార్యక్రమాల్లో చురుగ్గ పాల్గొంటుంది. చారిటీల్లో భాగంగా ఉన్న శ్రద్ద కపూర్ ఈ సారి బోలెడన్ని డ్రెస్ లు ఇస్తాను. ఒక సినీ నటిగా మాకు ఎన్నో కంపెనీల నుంచి మంచి మంచి దుస్తులు వస్తూ ఉంటాయి. […]

అందరికీ ఇష్టం

బ్యాగిల్ డిజైన్స్ కోసం ఆన్ లైన్ లో వెతికితే వందలాది మోడ్రన్ డిజైన్లు కనిపిస్తాయి. వాటిలో బంగారు వజ్రాలు ప్లాటినంతో మొదలుపెట్టి గోల్డ్ సిల్క్ థ్రెడ్ తో రంగు రాళ్ళు కూర్చిన అందమైన గాజులు కనిపిస్తాయి. వేసుకునె డ్రెస్ లను బట్టి అమ్మాయిలు ఎన్నో రకాల గాజులను ధరిస్తూ ఉంటారు ఈ గాజులు ధరించే సంప్రదాయం ప్రాచీనకాలం నాటిదే. ఏనుగు దంతం,లోహాలు, మెటల్,ఇత్తడి,వెండి,రబ్బరు, ప్లాస్టిక్ వంటి ఎన్నో రకాల పద్దార్ధాలతో గాజుల తయారి జరుగుతుంది. వీటికి హైదరాబాద్ […]

నా ఇష్టమే కదా

ఒక్క మాట అన్న సహించం అంటారు సెలబ్రిటీలు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా రెస్పాండ్ అయ్యే వాళ్ళలో కరీనాకపూర్ కూడా ముందే ఉంటుంది. తైమూర్ పుట్టాకా కూడా చిన్న పిల్లలా ఆ డ్రెస్ లేమిటి. తల్లిలా కనిపించరా అంటూ వినబడిన కామెంట్ చూసి కరీనా కపూర్ ఎవరైన ఏది సౌకర్యమో అది ధరిస్తారు మదర్ డ్రెస్ వేసుకోవడం ఎంటో అర్ధం కావడం లేదు. మా అమ్మ బబితా మా అత్త షర్మిలా టాగూర్ అయినా చక్కని మోడ్రన్ […]

ఇందులో వివక్ష లేదు

veere di wedding సినిమాలో సోనమ్, కరీనా, శిఖాలతో కలిసి నటించడం నాకు గొప్ప అనుభవం అంటుంది స్వర భాస్కర్. వాళ్ళంత నాలాగే పక్క ప్రోఫెషనల్స్. విభిన్న కుటుంభ నేపథ్యంలో సంస్కృతులను నుంచి వచ్చాను. మేం సినిమాల్లో స్నేహితుల్లాగే నటించాం. కాని నిజమైన స్నేహితుల్లా కనిపించాం. ఇది నలుగురు అమ్మాయిల కథే కాని ఎలాంటి సందేశాలు ఇవ్వవు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ల పాత్ర తీరు తెన్నుల్లో చాలా మార్పులు వస్తాయని చెప్పగలను అంటుంది స్వర భాస్కర్. […]

సమ్మర్ స్టైల్

జుట్టును సముద్రపు అలలతోనూ ముఖం పై వాలే ముంగురులను ముఖపద్మం చుట్టు తిరిగే తుమ్మెదలతోనూ పోల్చారు కవులు. చక్కని జుట్టు ఉంటే కోటి ఆభరణాలు పెట్టుకున్నట్లే. అయితే వేసవి వస్తే చాలు ఇంత అందమైన జుట్టు కూడా మెడ పైన ముఖంపైన పడిపోతూ చిరాకు పెడుతుంది. హెయిర్ స్టైలిస్టులు ఎన్నో ప్రయోగాలు చేస్తారు. ఈ ఎండల్లో ఇచ్చింగ్ లేని హెయిర్ స్టైల్స్ కోసం జుట్టు పూర్తిగా నెత్తి మీదకు తెచ్చి కోప్పు పెట్టుకునేటట్లు నడి నెత్తిన ఎత్తుగా […]

ఇంటి చిట్కాలే నయం

ఈ ఎండల్లో చెమటకు తడిసి నూనె అతుక్కుపోయి చుండ్రు తలెత్తుతూ ఉంటుంది. ఇంట్లో చేయగలిగిన చిట్కాలతో చుండ్రు మాయం చేయవచ్చు. గసగసాలు పాలలో నూరి తల పై పూస్తే చుండ్రు తగ్గుతుంది. మందార పూల రసం, సమానంగా నువ్వుల నూనె కలిపి మరగనిస్తే నూనె మిగిలిపోతుంది. ఈ నూనెతో తలపై మర్ధన చేయవచ్చు. అలాగా వేప నూనె, కానుక నూనె, కర్పురం కలిపి రాసినా మంచిదే. ఇక అన్నింటికంటే త్రీ ఫల చూర్ణం అద్భుతంగా పని చేస్తుంది […]

థీమ్ నగలు

ఏ వేడుకకైన నగలు,బుట్టలు,చెప్పులు, బ్యాగ్‌ తో సహా థీమ్ సెట్ లు వచ్చాయి. చెవి జూకాలు, చెప్పుల డిజైన్, కాలి పట్టీలు, షూ డిజైన్ చేతి గాజులు , చెప్పుల జతపై నగిషీలు ఒకేలా వుంటున్నాయి. చేతి గాజులతోనూ, మెడలో నగలతోనూ చెప్పుల డిజైన్ కలిస్తే బావుంటుంది కదా. మెడలో హారం కాలి చెప్పుల రంగు ఒకేలా ఉంటే బావుంటాయి. డిజైనర్ ఆభరణాలు మొత్తం చీరె అంచులు, హ్యాండ్ బ్యాగ్ చెప్పులు కలగలిపి ఒక సెట్ గా తయారై […]

మేకప్ వదలదు

సబ్బుతో మొహం శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది అనుకుంటాం కాని మేకప్ వదలటం చాలా కష్టం. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటే దాన్ని తప్పనిసరిగా నూనె ఆధారిత మేకప్ రిమూవర్ ను వాడి తుడిచేయాలి. అటు తర్వాత నీళ్ళలో కడుక్కుంటే పోతుంది. అలాగే సబ్బులు నేరుగా శరీరం పై రుద్దకూడదు. ముందు చేతుల పై రుద్దుకుని ఆ నురగనే మొహం పై రాసి సున్నితంగా రుద్దితే మృతకణాలు పోతాయి. అలాగే మొహానికి వేసుకునే పీల్ ఆఫ్ మాస్క్ లు వేసుకున్న […]

విలువైనవి

బరువు పెరగాలని వుందా. రోజు ఖర్జురాలు తింటే చాలు వీటిలో షుగర్ పోషకాలతో పాటు అత్యంత విలువైన విటమిన్లు చాలానే ఉన్నాయి. శారీరానికి ఇవి తగినంత శక్తిని ఇస్తాయి. నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. బాగా పండిన ఖర్జుర పండ్లలో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువ. కోలెస్ట్రాల్ పరిమాణాలను క్రమబద్దీకరిస్తాయి. వీటిని తరచు తింటే చర్మం ముడతలు పడతాయి. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు రాలనివ్వదు. జుట్టు చక్కగా […]

కనిపించని కష్టం

కథానాయకులు ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రత్యేకతలో కనిపిస్తారు. హెయిర్ స్టైల్, సిక్స్ ప్యాక్‌ వీటికి వాళ్ళు ఎంతో కష్టపడి శరీరాన్ని తీరుగా మలుచుకున్నారనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలుగుతుంది. మరి మా సంగతేమిటి. మేం ఎంత శ్రమ పడితే ఎప్పుడూ ఒకేలా కనిపించగలుగుతామో ఎవ్వరు అర్ధం చేసుకోరు అంటుంది రాశీఖన్న. శారీరకంగా ఎలాంటి మార్పు కనిపించకూడదు అనుకున్నం అంటే కసరత్తులు చేయాలి. బరువు కాస్త తగ్గినా, పెరిగినా ఆ ప్రభావం మొహంలో కనిపిస్తుంది. వ్యయామం ఎక్కువైతే నాజుకుతనం […]