Friday, 16 Oct, 2026
కొన్ని పరిశోధనలు మనకి చాలా సంతోషం ఇస్తాయి. మనకి ఇష్టమైనవి ఏవైనా మేలు చేస్తాయి తినండి, తాగండి భయం లేదు ఏ రిపోర్ట్స్ అయినా చెప్పితే ఎంత సంతోషం. ఇదిగో ఇలాంటి ఆనందం ప్రసాదించారు. ఇండియా విశ్వవిధ్యాలయ నిపుణులు. కాఫీలో కెఫిన్ తో పాటు వుండే ఇతరాత్రా ములకణాలన్ని కూడా మెదడులో వుండే హానికర ప్రొటీన్లు శాతం తగ్గించడం ద్వారా మతిమరుపు రాకుండా అడ్డుకుంటాయట. ముఖ్యంగా అందులోని 24 రసాయినాలు MMNAT2 అనే ఎంజైమ్ ను విడుదల చేయడం వల్ల మతిమరుపు అల్జిమర్స్ లాంటి నడి సంబందమైన వ్యాదుల్ని దివ్యంగా అడ్డుకొంటాయట. దీని ఆధారంగానే, మెదడు లో ఈ ఎంజైమ్ స్రావాన్ని పెంపొందించే మందుల్ని రుపొందించ వచ్చునని శాస్త్రజ్గూల అభిప్రాయం. అంచేత కాఫి సంతోషంగా నిర్భయంగా తాగొచ్చు. ఉదయం కప్పు కాఫీ కోసం మనస్సు కొట్టుకు పోతుంటే, ఆ కాఫీని మరుపున దూరం చేసే ఔషదం సుమా అని నిపుణులు హెచ్చరిస్తూ ఆహా ఏమి ఆనందం. కాఫీ గత ప్రాణులకూ ఇంకెంతటి శుభవార్త.

వేస్ట్ చేశారా?

గ్రీన్ టీ గురించి అందరికీ తెలుసు. కానీ గ్రీన్ కాఫీ ఇప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోంది. అసలీ గ్రీన్ కాఫీ ఏమిటీ? ఎలా చేస్తారు అంటే రోస్ట్ చేయని కాఫీ గింజలని నానబెట్టి వాటి నుంచి ఈ కాఫీ తయారు చేస్తారు. దీనిలో ఉండే క్లోర్ జెనిక్ యాసిడ్ శరీరంలోని కొలెస్ట్రాల్ ని బాగా కరిగిస్తుందని నిపుణుల అభిప్రాయం. అలాగే ఇన్సులిన్ ఉత్సత్తిని మెరుగుపరుస్తుంది. ఆకలిని అదుపు చేస్తుంది.బరువు పెరుగుతారనే అనుమానం అక్కర్లేదు. ఈ గ్రీన్ కాఫీలోని లక్షణాలతో ఇప్పుడిప్పుడే దీన్ని ఇష్టపడుతున్నారు.

Leave a Reply