Sunday, 13 Sep, 2026

ఆత్మహత్యల నివారణకు స్నేహ

చెన్నై కి చెందిన డాక్టర్ లక్ష్మీ విజయ్ కుమార్ ‘స్నేహ’ పేరుతో స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు ఆత్మహత్యల నివారణ పై అవగాహన సదస్సులు నిర్వహించడం, ఆత్మ హత్యలు జరగకుండా నివారించడం, ఆపదలో ఉన్నవారికి సహాయపడటం ఈ స్వచ్ఛంద సంస్థ లక్ష్యం. డాక్టర్ లక్ష్మి చెన్నైలోని అడయార్ లో వాలంటరీ హెల్త్ సర్వీసెస్ లో  సైకియాట్రీ విభాగానికి అధిపతిగా ఉన్నారు. మనో వైద్యం మరియు ఆత్మహత్య నివారణలో  ఆమెకు 45 సంవత్సరాల అనుభవం ఉంది.1986 లో ఆమె చెన్నైలో స్నేహ సంస్థ స్థాపించారు. ఈ స్వచ్ఛంద సంస్థను పూర్తిగా వాలంటీర్లే నడుపుతున్నారు. లక్ష్మి మానసిక ఆరోగ్య పరిశోధన రంగంలో చేసిన కృషికి  గుర్తింపు గా ఆమెకు రాయల్ కాలేజ్ ఆఫ్  సైకియాట్రిస్ట్ గౌరవ ఫెలోషిప్ లభించింది. అలాగే ఫెలోషిప్ ఆఫ్ ది రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ కూడా అందుకున్నారు ఈ రెండు విశిష్ట పురస్కారాలను అందుకున్న తొలి భారతీయ సైకియాట్రిస్ట్ గా తన ప్రత్యేకత చాటుకున్నారు లక్ష్మీ విజయ్ కుమార్. ఆపదలో ఉన్న వ్యక్తులకు ఉచితంగా గోప్యంగా మానసిక మద్దతు, సహాయాన్ని ఈ సంస్థ అందిస్తుంది .24 గంటలు టెలిఫోన్ హెల్ప్ లైన్ లో,ఈమెయిల్ చాట్ లో, లేదా నేరుగా వచ్చి కూడా ఈ సంస్థలో  కౌన్సిలింగ్ తీసుకోవచ్చు.

Leave a Reply