Wednesday, 12 Aug, 2026
ఇటు ముఖ సౌందర్యం శిరోజాల రక్షణ కోసం చర్మం ఆరోగ్యంగా ఉండటంకోసం ఎప్పుడూ తేనె నిమ్మ కాంబినేషన్ ప్రస్తావన వస్తుంది తేనే నిమ్మలతో ఉన్నటువంటి యాంటీ బ్యాక్తీరియాల్ యాన్తి ఆక్సిడెంట్ లక్షణాల వల్ల ఇవి ప్రకృతి సిద్ధంగా చర్మ రక్షణ కు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి . శరీరం బరువు పై అదుపు విషయంలో తేనెలో ఫ్రక్టోజ్ వుంటుంది. యాడ్ ప్రకృతి సిద్ధంగా దొరికే పండ్ల చక్కెర నిమ్మరసం కడుపు నిండేట్లుగా చేస్తుంది. ఉదరం లోపల ఆల్కలైన్ వాతావరణాన్ని నిమ్మ ఎక్కువ జెసి బరువు తగ్గేందుకు సాయపడుతుంది. నిమ్మరసం తేనె సమాన భాగాలుగా చేసి ఆ మిశ్రమ మొహం పై రాసుకుంటే చర్మం రంగొస్తుంది. తేనె నిమ్మ పైనాపిల్ తో ముఖం పై ఉండే మొటిమలు మచ్చలు తొలిగిపోతాయి. నిమ్మ చెక్క పైన తేనె వేసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రాంతంలో రుద్దితే అవిపోతాయి. నిమ్మ తేనెల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ వయసుతో పాటు శరీరంలో మార్పులను ఆలస్యం చేస్తాయి. తేనె లో అధికంగా ఉండే చెక్కర వల్ల మైక్రోబ్స్ పోతాయి. నిమ్మలో ఉన్న ఆమ్లాల వల్ల బ్యాక్తీరియా వృద్ధి చెందదు.

తేనంత గొప్పేం కాదు

తేనె ను లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. లెక్కలేనన్ని ప్రయోజనాలు,పోషకాలు,ఔషద గుణాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాల్లో చెప్పారు. చక్కెర బదులు తేనె వాడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.అయితే ఇంత గొప్పగా అభివర్ణించిన తేనె అంత ఆరోగ్యకరం కాదంటున్నాయి కొత్త అధ్యయనాలు .చక్కెర కంటే తియ్యనిది తప్ప తేనెలో చెప్పుకోదగిన సుగుణాలు ఏవీ లేవని పోషక విలువల విషయంలో తేనె అంత అద్భుతం ఏమీ కాదంటున్నారు. తేనెలో క్యాలరీలు ఎక్కువే .అయితే ప్రయోజనంలో ఏమీ లేదు. బాక్టిరీయా నిర్మూలన విషయంలో కేవలం రెండేరెండు రకాలు తేనె కు లొంగుతాయట. తేనె తీపి కంటే జ్ఞాపక శక్తి పెరుగతుందని సహాజంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా గర్భంలో పిండానికి ప్రమాదం జరుగకుండా కాపాడుతుందని అధ్యయనాలు చెపుతున్నాయి.

Leave a Reply