తనుశ్రీ కి గ్యాలెంటరీ అవార్డ్

తనుశ్రీ కి గ్యాలెంటరీ అవార్డ్

తనుశ్రీ కి గ్యాలెంటరీ అవార్డ్

పుల్వామా లో సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేస్తున్న తనుశ్రీ గ్యాలెంటరీ అవార్డు అందుకున్నారు. బీహార్ లో పుట్టి పెరిగిన తనుశ్రీ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బి ఎ ఆనర్స్ చదివారు తర్వాత సివిల్స్ వైపు వచ్చారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ను సాధించారు. 2017 ఐ పి ఎస్ అయ్యారు. మిలిటెంట్ల హాట్ స్పాట్ గా చెప్పే పుల్వామాలో ఉగ్రవాద దాడులను అడ్డుకున్నారు తనుశ్రీ. ఆమె ధైర్యానికి నాయకత్వానికి వృత్తి పట్ల నిబద్ధతకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక గ్యాలెంటరీ అవార్డుకు ఎంపికయ్యారు.