రుద్రవీణ కళాకారిణి
బెంగళూరు కి చెందిన జ్యోతి హెగ్డే రుద్రవీణ కళాకారిణి గా సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్నారు. సితార వీణ వంటి వాయిద్యాలతో పోలిస్తే ఈ రుద్రవీణ నేర్చుకునే వారు చాలా తక్కువ మంది అజంతా ఎల్లోరా హంపి శిల్పాల్లో మహిళల చేతుల్లో ఈ వీణ కనిపిస్తూ ఉంటుంది.ఈ రోజుల్లో ఆ రుద్రవీణ అభ్యాసం చేసింది మాత్రం జ్యోతి హెగ్డే అని చెప్పుకోవచ్చు.ఈ రుద్రవీణ చాలా బరువుగా ఉంటుంది దీన్ని నేర్చుకునేందుకు రోజుకు పది గంటలు సాధన చేసేదాన్ని అని చెప్తారు జ్యోతి. ఈ బరువైన వీణ మోస్తూ నేర్చుకుంటూ శారీరకంగా మానసికంగా అలసిపోయాను కానీ నేర్చుకోవాలన్న ఆసక్తి ఉత్సాహంతోనే ఇందులో ప్రావీణ్యత సంపాదించాను.నా గురుకులం లో 60 మందికి పైగా విద్యార్థులకు ఈ రుద్రవీణ లో శిక్షణ ఇస్తున్నాను అంటుంది జ్యోతి హెగ్డే.
