లక్షల మందికి టైలరింగ్ లో శిక్షణ
హర్యానాలోని భవాని జిల్లాకు చెందిన రీతు ఇన్‌సాన్ ఒక సాధారణ కుట్టు మిషన్ తో సమాజంలో నిరాదరణకు గురవుతున్న మహిళలకు అండగా నిలవాలనే గొప్ప సంకల్పం తో కొన్ని లక్షల మంది మహిళలకు టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ లో పూర్తి విద్యా శిక్షణ ఇచ్చారు.చాలా కష్టంగా భావించే మెజర్మెంట్స్ కటింగ్ ఫార్ములా లు తేలికైన రీతిలో డిజైన్ చేసి ఆవిష్కరించారు.ఆమె అందిస్తున్న అడ్వాన్స్డ్ బోటిక్ కోర్సులలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్స్ సూట్ స్టిచ్చింగ్ ట్రెండీ కో ఆర్ట్ సెట్స్,కట్ బ్లౌజ్ లు కాలర్ డిజైన్లు సులభ పద్ధతిలో నేర్పిస్తున్నారు. గడిచిన 20 ఏళ్లలో మూడు లక్షల మందికిపైగా మహిళలకు ఆమె శిక్షణ ఇచ్చారు. టాలెంటెడ్ రీతు ఇన్సాన్ పేరుతో ఒక విస్తృతమైన నెట్వర్క్ రూపొందించారు ఆమె.దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 50 కి పైగా శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు ఆమె ప్రత్యేకంగా శిక్షణ అందించారు.యూట్యూబ్ లో ఆమె నిర్వహిస్తున్న ఉచిత ఆన్లైన్ తరగతులలో దేశ విదేశాల్లో లక్షలాది మహిళలు ఎలాంటి ఫీజు లు లేకుండా ఉపాధి పొందే మెలకువలు నేర్చుకుంటున్నారు.కేవలం కుట్టు శిక్షణతో ఆమె లక్షల మందికి ఆర్థిక స్వాతంత్రం ప్రసాదించారు.
