Thursday, 20 Aug, 2026
ఎండకు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేవి కళ్ళు. అత్యంత కాంతివంతమైన వాతావరణంలోకి వెళ్ళే సమయంలో కళ్ళకు తప్పనిసరిగా సన్ గ్లాస్సెస్ వాడతారు. ఏ రంగైనా పర్లేదు కంటికి పూర్తి రక్షణ ఇచ్చేదిగా వుండాలి. పోలరైజ్ డ్ సన్ గ్లాస్సెస్ వల్ల అంత ఉపయోగం లేకపోవచ్చు తెల్లని చాయ గలవారు సన్ స్క్రీన్ లోషన్ మొఖానికి అప్లయ్ చేయాలి. అంత పెద్దగా వున్న టోపీలు ధరిస్తే కళ్ళ పైకి నేరుగా ఎండ పడకుండా వుంటుంది. కళ్ళని చల్లని నీళ్ళతో కడుక్కుంటూ వుండాలి. పిల్లల్లో కంటి పోర పెద్దదిగా వుంటుంది. ఎండల్లో ఎక్కువగా ఆడుతుంటారు. వీలైనంత వరకు ఎండ ప్రభావం తగ్గే వరకు పిల్లల్ని ఎండలోకి వేల్లనివ్వక పోవడం మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ వుండే మంచి పోషకాహారం పిల్లలకు ఇవ్వాలి. పెద్దలూ తీసుకోవాలి. అప్పుడే ఎండ నుంచి మనల్ని రక్షించుకో వచ్చు. ఎట్టి పరిస్తితుల్లోనూ సూర్యుడిని నేరుగా చూడకూడదు. ఇది వేసవికే కాదు అన్ని కాలాలకూ వర్తిస్తుంది.

కళ్ళను కాపాడే సూర్యకాంతి

పిల్లలకు బయట ఆడుకొనే సమయమే ఉండటం లేదు. కాస్తంత ఆడుకొనే సౌకర్యాలు లేని అపార్ట్ మెంట్లో ఒకవైపు స్కూళ్ళు,ట్యూషన్లు ఇంటికి వస్తే ఐపాడ్ లో .అయితే ఒక కొత్త అధ్యయనం ఇంటి లోపలే గడిపే పిల్లల్లో దృష్టి సమస్యలు కనిపిస్తుంది.బయట సూర్యకాంతి లో గడిపే పిల్లల్లో కాళ్ళజోడు అవసరం తక్కువగానే ఉందట. సూర్యకిరణాలకు ఎక్స్ పోజ్ అయితేనే మంచిదంటోంది అధ్యయనం రిపోర్ట్. పగటి వెలుతురు కళ్ళకి తగిలి దృష్టి సమస్యలు నెమ్మదిస్తాయి. ఎండ కన్నెరగకుండా ఇల్లు ,స్కూల్ ,ఐపాడ్ ప్రపంచంగా ఉంటే పిల్లల్లో కంటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి.

Leave a Reply