వృక్షాలకు రక్షాబంధన్
2004లో ధన్ బాద్ జిల్లా లోని లుకయా అనే ఒక చిన్న గ్రామంలో ఒక అటవీ అధికారి ఆలోచనతో వృక్షాలకు రాఖీ కట్టించి రక్షించుకునే ఒక గొప్ప కార్యక్రమం మొదలైంది.ఆ ఊరి ప్రజలు చెట్లకు రాఖీలు కడుతూ వాటిని సంరక్షిస్తూ కాపాడుకుంటున్నారు.ఝార్ఖండ్ లోని 24 జిల్లాలలో విస్తరించి ఉన్న 700 గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మొదటి దశలో ఒక లక్ష చెట్లకు రాఖీ కట్టి వాటి సంరక్షణ బాధ్యత కూడా ప్రజలే తీసుకున్నారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం ఈ వృక్షాల పరిరక్షణ వల్ల అడవి విస్తీర్ణం 1128 చదరపు కిలోమీటర్లు పెరిగింది. సేవ్ ట్రీ కార్యక్రమం ఉద్యమం ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది.జార్ఖండ్ ప్రజలు తమకు జీవనాధారాన్ని ఇచ్చే వృక్షాలను తోబుట్టువులు గా భావిస్తూ వాటికి ప్రేమతో రాఖీలు కట్టే సంప్రదాయం విజయవంతంగా కొనసాగుతోంది.
