అంతర్జాతీయ వేదిక పైన శివాని

అంతర్జాతీయ వేదిక పైన శివాని

అంతర్జాతీయ వేదిక పైన శివాని

కర్నూల్ దగ్గర లోని హోసూరు గ్రామానికి చెందిన ఉప్పర శివాని జావెలిన్ త్రో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ బాల పురస్కారాన్ని అందుకున్నది.పుట్టుకతోనే చేయి లేకుండా పుట్టిన ఈ శివాని తన శక్తిని మొత్తం ఒక చేతిలోకే తీసుకొన్నది. 2023 లో థాయిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో రెండు బంగారు పతకాలు 2024 లో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం గెలుచుకున్నది. గత మూడేళ్లలో 14 పతకాలు సాధించింది. గుజరాత్ లో జరిగిన జాతీయ పోటీల్లో శివాని జావెలిన్ త్రో లో బంగారు పతకం షాట్ పుట్ లో రజిత పతకం సాధించింది.12వ తరగతి చదివే శివాని తన లక్ష్యం ఒలంపిక్స్ అంటోంది.