Wednesday, 12 Aug, 2026
ఆనందాన్నిట్టే ఐదు పదార్ధాలు ఉన్నాయంటున్నారు పరిసోధకులు. ఈ ఐదు రకాలు తింటే ఆందోళన వుండదు, అసలు విచారమే మాయం అయిపోతుందిట. ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ పోష్కలంగా వుండే చేపలు, అవకాడో, అరటిపండ్ల పాలకూర, ముడి బియ్యంలో వుండే అన్నం తినడం వల్ల మనసు ప్రశాంతంగా హాయిగా వుంటుంది అంటున్నారు. ఆ పదార్ధాలలోని పోషకాలతో మెదడులో నెరటోసిన్, డాపమైన అనేక రసాయినం ఫలితంగా ఉత్సాహంగా సంతోషం వుంటుంది. కనుక ఈ ఐదింటిలో ముడిబియ్యపు అన్నం పూర్తిగా తీసుకుంటే మిగతావి రోజుకొకటి అయినా భిజనంలో ఉండేలా చూసుకుంటే సంతోషం మన దగ్గర, మనతోనే ఉంటుందన్నారు పరిశోధకులు. చుట్టూ పచ్చని ప్రక్రుతి కళ్ళకు సంతోషం ఇస్తే, ప్రక్రుతి సహజంగా దొరికే పదార్ధాల తోనే ఆనందపు రహస్యం వుంది తెలుసుకోండి అని చెప్పుతున్నారు పరిశోధకులు.

అన్నం వల్లనే సమస్య

మహిళల జీవితంలో తప్పని దశ మెనోపాజ్. ఇది కొందరిలో చాలా ముందుగా మరికొందరిలో చాలా లేటుగా ఎందుకు వస్తున్నాయో తెలుసుకొనే అధ్యయనాలు ఎన్నో జరుగుతున్నాయి. కొందరిలో మరింత ముందే మెనోపాజ్ రావటానికి కారణం వాళ్ళు తీసుకొనే ఆహారం అంటాయి అధ్యయనాలు. ఇటీవలే తాజా పరిశోధన అన్నం ప్రధాన ఆహారంగా తీసుకొనే వారిలో ఈ దశ ముందుగా మొదలవుతుంది అంటున్నారు .లండన్ యూనివర్సిటీ వెయ్యి మంది మహిళలో కౌమారపు అలవాట్లపైన సుదీర్ఘకాలం అధ్యయనం చేస్తే కార్భోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నా అన్నం పాస్తా వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకొంటే మెనోపాజ్ తొందరగా వస్తోందని పరిశోధన ఫలితాలు చెప్పాయి.

Leave a Reply