శుభ సందర్భం
చండీఘడ్, అస్సాంలోని మోహన్ బరీ చినూక్ హెలికాప్టర్ యూనిట్ లో తొలిసారిగా ఇద్దరు మహిళ ఫైటర్ లు విధులు నిర్వహించనున్నారు.పరుల్ భరద్వాజ్ స్వాతి రాథోడ్ లు ఇద్దరూ ఆయుధాలు సరుకులు తీసుకుపోయే మిషన్ చినూక్ సారథ్య బాధ్యత తీసుకుంటారు. అస్సాంలోని మోహన్ బరీ లో ఈ ఇద్దరు విధులు నిర్వహిస్తున్నారు.
ఇది కాస్త మంచిది
ఎక్కువసేపు కూర్చొని పని చేసే విధానానికి భిన్నంగా స్టాండింగ్ డెస్క్ అనే కొత్త వాకింగ్ స్టయిల్ వాడుకలోకి వస్తోంది. రోజులో 30 నుంచి 60 నిమిషాలు నిలబడి పని చేస్తే మంచిదని ఉద్యోగులను ప్రోత్సహిస్తున్నారు ఎక్సపర్ట్స్. గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల ఒబేసిటీ, గుండె జబ్బులు పెరుగుతున్నాయి కనుక ఈ నిలబడి పని చేసే విధానం తో కొంత ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అభిప్రాయం.
పలాజో కు కొత్త అందం
పార్టీల కోసం బార్డర్ పలాజో లు డిజైన్ చేశారు. ప్రింటెడ్, ఎంబ్రాయిడరీ లతో ప్రత్యేకంగా కనిపించే ఈ పలాజో పార్టీలకు ప్రత్యేకం కొన్ని టాప్స్, బాటల్స్ కూడా గ్రాండ్ గా ఎంబ్రాయిడరీ డిజైన్లతో వస్తున్నాయి. సింపుల్ గా ఉండే టాప్స్ కూడా బార్డర్ కలిపితే గ్రాండ్ గా కనిపిస్తున్నాయి. లెహంగా కు ఉండే బార్డర్ లు అదే థీమ్ తో లెహంగా కు అంచులు తెచ్చారు డిజైనర్స్.
ట్రీ లైబ్రరీ
ట్రీ లైబ్రరీ ని సృష్టించారు ఆలీపూర్ దౌర్ మహిళలు మరియాని గర్ల్స్ హైస్కూల్ ప్రాంగణంలో ఉన్న చెట్టుకు బాక్స్ లు అమర్చి వాటిలో దిన పత్రికలు మ్యాగజైన్ లు పుస్తకాలు పెట్టారు. ఈ లైబ్రరీ అందరికీ నచ్చింది. ఈ లైబ్రరీ పశ్చిమ బెంగాల్ లోని ఆలీపూర్ దౌర్ యూరోపియన్ క్లబ్ గ్రౌండ్ లో ఉంది. అస్సాం లోని జోర్వాత్ జిల్లా కు చెందిన మహిళలు ఒక బృందంగా ఏర్పడి సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. వారి ఆలోచనల్లోంచి […]
40 వేల మందికి ఆమె బాస్
ఇప్పటివరకు ఈ పదవిలో అమ్మాయిలు లేరు. నాదైన ముద్ర వేయడం ద్వారా అనేక మంది అమ్మాయిలు నాయకత్వం హోదా అందుకునేలా స్ఫూర్తి ఇవ్వాలని నా ప్రయత్నం అంటుంది మనీషా సాబూ. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అధ్యక్షురాలు ఎన్.ఐ.టి నాగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్, ముంబై లో ఎంబీఏ చేసింది మనీషా. ఇన్ఫోసిస్ హైదరాబాద్, ఇండోర్ లకు కూడా హెడ్ 40 వేల మంది ఉద్యోగులకు బాస్. తెలంగాణ ప్రభుత్వం నుంచి విమెన్ అచీవర్ […]
బర్ఫీ బామ్మ
జీవితంలో అన్నీ దొరికాయి కానీ నా సొంత సంపాదన అంటూ లేనే లేదు అని దిగులు పడింది 90 ఏళ్ల హర్భజన్ కౌర్. కూతురు ఆమె దిగులు చూసి చండీఘడ్ సెక్టార్-18 లో చిన్న స్టాల్ పెట్టే సాయం చేసింది. శనగపిండితో చేసిన బర్ఫీ లు అమ్ముతాను. మా పూర్వీకులకు కూడా ఈ బర్ఫీ లు చేయటం వచ్చు అన్నది 90 ఏళ్ల హర్భజన్. మొదటి రోజే మూడు వేల రూపాయలు వచ్చాయి ఆమె తయారు చేస్తున్న […]
స్లీప్ ఛాంపియన్
వరుసగా 100 రోజుల పాటు రాత్రి పూట 9 గంటల నిద్ర పోయి 5 లక్షల బహుమతి సంపాదించింది త్రివర్ణ చక్రవర్తి. సంపూర్ణ ఆరోగ్యానికి నిద్ర ప్రాముఖ్యత పైన అవగాహన కల్పించేందుకు వేక్ ఫిట్ సంస్థ ఈ వినూత్నమైన పోటీ నిర్వహించింది. ఈ పోటీకి ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే 15 మందిని ఎంపిక చేశారు. కలకత్తా కు చెందిన అపర్ణ స్లీప్ చాంపియన్ గా ఈ అవార్డు గెలుచుకుంది.
కుట్టు పనికి గుర్తింపు
గుర్తింపు మహిళలకు శక్తినిస్తుంది వారు వారి విలువను అర్థం చేసుకుంటారు. ఉపాధి కల్పించుకుని సాధికారత సాధించేందుకు ఇది ఉత్సాహం ఇస్తుంది అంటారు స్వరా బో డబ్ల్యూ ఫౌండర్ ఆశ స్కారియా కేరళ లోని ఎట్టు మన్నూరు కు చెందిన హస్త కళాకారులను గుర్తించి వారి కళను మరింత శక్తివంతం చేశారు ఆశా స్వరా బ్రాండ్ కళాకారులు తయారు చేసిన చీరలను అంతర్జాతీయంగా మార్కెట్ చేస్తుంది. పశ్చిమ బెంగాల్ కేరళ కు చెందిన కళాకారులు చేసిన కుట్టు పనికి […]
బావుంటాయి
సాదా సీదా దుస్తులకు కాస్త ప్రత్యేకమైన రూపం ఇవ్వాలి అనుకుంటే ఇండో వెస్ట్రన్ జాకెట్స్ ఎంచుకోండి అంటున్నారు డిజైనర్స్. లాంగ్ ఫ్రాక్, లెహంగా, గౌను ఇలా ఎలాంటి డ్రెస్ అయినా చక్కగా మ్యాచ్ అవుతాయి. ఈ జాకెట్స్ డోరీలు,బటన్స్ క్రాస్ కట్స్ వంటి వేర్వేరు డిజైన్లతో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి జాకెట్స్ ధరిస్తే చెవులకు హ్యాంగింగ్స్ తప్ప ఎలాంటి ఆభరణాలు అవసరం ఉండదు వేసుకున్న డ్రెస్ మెటీరియల్ కు తగ్గట్టు నచ్చిన జాకెట్ ఎంచుకోవాలి.
చక్కని పరిష్కారం
రోజు రోజుకి పెరిగిపోతున్న వ్యర్థాలు వాతావరణం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ సమస్య పరిష్కారం కోసం మట్టిలో వేగంగా కలిసి పోయే వ్యర్థాలు మట్టిలో వేగంగా కలిసిపోయే బయో ప్లాస్టిక్ తయారీ మొదలుపెట్టాను అంటారు నేహా జైన్ సముద్రపు నాచు తో తయారు చేసే ఈ ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ జీరో ప్లాస్టిక్ పేరుతో మార్కెట్ లోకి వచ్చింది. ముంబై కు చెందిన నేహా జైన్ బెంగళూరులోని క్రెస్ట్ కాలేజీలో జర్నలిజం చేసింది.
తెలుసుకొని చూడాలి
లైంగిక విజ్ఞానం స్త్రీ పురుషులు ఇద్దరికీ అవసరమే అప్పుడే వాళ్ళ పైన జరుగుతున్న లైంగిక దాడి గృహహింస,అవాంఛిత గర్భాలు గర్భస్రావాలు గురించి తెలుసుకోగలుగుతారు.అంటున్నారు డాక్టర్ నివేదిత. ఆమె భారతదేశానికి చెందిన చర్మవ్యాధి నిపుణురాలు వెనిరియోలాజిస్ట్ సిడ్నీ హెచ్ ఐ వి మెడిసిన్ లో క్లీనిషియన్ గా పని చేస్తున్నారు. మా అమ్మ నాన్న కూడా వైద్యులే కానీ ఈ విషయాలను గోప్యంగా ఉంచారు.సిడ్నీ వెళ్ళాక నా దృష్టికోణం మారింది లైంగిక విజ్ఞానం ఎంత తెలుసుకుంటే స్త్రీలు ఎదుర్కొనే […]
ఇదే నా కానుక
పర్యావరణ కాలుష్యానికి కారణమైన ఈ ప్రపంచంలో మూడవ అతిపెద్ద రంగం ఫ్యాషన్ ప్రపంచ. దీన్ని నా వంతు కొంత మార్చాలి అనుకుంటున్నాను. పర్యావరణ ఫ్యాషన్ వస్తువుల పైన దృష్టి పెట్టాను యాపిల్ తొక్కతో లెదర్ కు ఏ మాత్రం తీసిపోని మెత్తని మెటీరియల్ తయారు చేశాను. అలాగే అనాస ఆకుల నారతో బ్యాగ్స్ తయారు చేసే మెటీరియల్ రూపొందించాను ‘సర్జా’ పేరుతో ఈ బ్యాగ్స్ మార్కెట్లోకి వచ్చాయి అంటోంది అంజన. ప్రముఖ యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు […]
ఈమె చాలా ప్రత్యేకం
కేరళ తొలి గిరిజన ఎయిర్హోస్టస్ గోపిక గోవింద్ కేరళలోని కోజికోడ్ జిల్లాల్లో కనిపించే అతి చిన్న గిరిజన తెగ కపుంకుడికి వీళ్ళు మలయాళంలో తుళు పదాలు కలిపి ఒక మిశ్రమ భాష మాట్లాడుతారు. అటవీ భూమి లీజుకు తీసుకుని వ్యాపారం చేస్తారు. నాయినాడ్ లోని డ్రీమ్ స్కై ఏవియేషన్ అనే సంస్థలో ఎయిర్ హోస్టెస్ కోర్స్ ను స్కాలర్ షిప్ ద్వారా చేరింది గోపిక ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థలో ఎయిర్ హోస్టెస్ గా జాయిన్ అయ్యింది. […]
వెరైటీ కేప్ స్టయిల్స్
జాకెట్ కు మరో రూపం కేప్ స్టయిల్స్ స్కర్ట్ మీదికే కాదు జీన్స్ మీదకు కేప్ ధరించవచ్చు. ప్రింట్ చేసిన క్లాత్ కి రంగులు టాజల్స్ జతచేసి కొత్త కళ చేస్తున్నారు డిజైనర్స్. వెస్ట్రన్ స్టయిల్ కేప్ కు అద్దాలు జతచేస్తే వేడుకల్లో మరిచిపోవచ్చు. నెటెడ్ కేప్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లతో జత చేస్తే దీనికి జరీ అందాల తోడైతే సాధారణ కేప్ బ్లౌజ్ కాస్తా ఎంబ్రాయిడరీ కు మారిపోయి ఎ డ్రెస్ పైన అయినా మరి […]
కోహినూర్
కోహినూర్ వజ్రం మన దేశం లోనే కృష్ణాతీరంలో దొరికింది అంటారు చరిత్రకారులు. దాన్ని మొదట్లో శమంతకమని అని అన్నారు. 11 వ శతాబ్దంలో పర్షియన్ భాష లో కోహినూర్ అంటే కాంతి శిఖరం అనే అర్థం వచ్చేలా పేరు పెట్టారు. ఆ కాలానికి ప్రపంచంలో అతి పెద్ద వజ్రం అదే 1849 లో ఈస్టిండియా కంపెనీ దాన్ని సొంతం చేసుకొని 1851లో బ్రిటిష్ రాణి కి బహూకరించారు. అప్పటికి అది 186 క్యారెట్ల వజ్రం. మరో రెండు […]
అదేం కొత్త కాదు
వ్యాపార నిర్వహణ నాకేం కొత్త కాదు చిన్నప్పటి నుంచి నాన్నను చూస్తూనే ఉన్నాను బిజినెస్ నాకు కష్టమని నేను చేయలేను అని ఎప్పుడూ అనుకోలేదు అంటుంది ఇషా అంబానీ. ఇటీవలే రిలయన్స్ రిటైల్ వెంచర్స్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్నారు ఆమె 30 ఏళ్ళ వయసులో రెండు లక్షల కోట్ల రెవెన్యూ ఉన్న కంపెనీ పగ్గాలు పుచ్చుకున్నారు. స్టోన్ ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి ఎంబీఎ పూర్తి చేశారు. పిరమల్ గ్రూప్ కు చెందిన వారసుడు ఆనంద్ పిరమల్ […]
సక్సెస్ ఫుల్ డాటర్
వారాంతాల్లో సెలవుల్లో మా నాన్నతో ఆఫీస్ లోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని నేను మా నాన్నకు ఇష్టమైన గినియా పిగ్ ను అంటుంది నదియా సరదాగా. పార్లే ఆగ్రో చైర్మన్ ప్రకాష్ చౌహాన్ కూతురు నదియా తండ్రి నుంచి వారసత్వంగా వ్యాపార బాధ్యతలు పుచ్చుకున్నారు ఆమె పార్లే ఆగ్రో సంస్థకు జాయింట్ ఎండి సి ఈ ఓ గా వ్యవహరిస్తున్నారు 36 ఏళ్ల నదియా ఎన్నో కొత్త ఉత్పత్తులను విడుదల చేశారు విజయవంతంగా నడుపుతున్న క్రెడిట్ నదియాకే […]
జోయితా మండల్
బెంగాల్ కు చెందిన జోయితా మండల్ మొదటి ట్రాన్స్ ఉమెన్ మహిళా జడ్జ్. సాంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టిన జోయితా ఎంతో వివక్షను ఎదుర్కొన్నారు. పదవ తరగతి లోనే ఆమెనూ స్కూల్ నుంచి పంపేశారు. బస్ స్టాండ్ ల్లో నిద్రిస్తూ వీధుల్లో భిక్షాటన చేశారు జోయితా కరస్పాండెంట్ కోర్స్ తో న్యాయవాది అయ్యారు. 2010లో ట్రాన్స్ జెండర్ గా ఓటర్ ఐడి కార్డ్ పొందిన మొదటి వ్యక్తి జోయితా దినాజ్‌పూర్ న్యూ లైట్ పేరుతో ఎన్జీవో స్థాపించి […]
రమ్యమైన రహదారి
ఇటలీ లోని స్టెల్వియో పాస్ రోడ్ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ రోడ్ అంటారు. ఉత్తర ఇటలీ స్విట్జర్లాండ్ మధ్య సరిహద్దుగా ఉన్న ఈ పర్వత మార్గం ఆల్ఫ్ పర్వతాల్లో అత్యంత ఎత్తైనది సముద్ర మట్టం నుంచి సుమారు తొమ్మిది వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. 25 కిలోమీటర్ల పొడవున్న ఈ రోడ్డు లో 48 మలుపులు ఉంటాయి ఈ ఎత్తయిన దారిలో ప్రయాణించేందుకు సాహసికులు వస్తూ ఉంటారు. మే నుంచి నవంబర్ వరకు సైకిల్ లిస్ట్ లు, […]
ఇది సుదీర్ఘమైన కెరీర్
మిగతా రంగాలతో పోలిస్తే మహిళ పైలెట్లు రాణించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఫ్లైటిక్ ఏవియేషన్ అకాడమీ నిర్వహిస్తున్న కెప్టెన్ మమత హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శిక్షణా కేంద్రం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పదివేల మంది పైలెట్లకు సుదీర్ఘమైన కెరీర్ లో కొనసాగేందుకు అవకాశాలున్నాయి. కమర్షియల్ పైలట్ కు నెలకు గరిష్టంగా 120 గంటలు మించి పర్మిషన్ ఉండదు కనుక కుటుంబంలో కుటుంబంతో కలిసి గడిపే సమయం ఎక్కువ గానే ఉంటుంది. ప్రసూతి సెలవులు ఉంటాయి […]
