క్యాన్సర్ రానివ్వరు
ప్రాసెస్ చేసిన మాంసాహారం ఎక్కువగా తినటం వల్ల పేగు క్యాన్సర్ వస్తోందని పరిశోధనలు చెపుతున్నాయి . అయితే ఫ్లేవనాయిడ్స్ ఎక్కువగా ఉండే ఎర్ర ఉల్లి ,బ్రకోలి,దానిమ్మ స్ట్రాబెరీలు ,ఆప్రకాట్లు ,ఎర్ర క్యాబేజ్ వంకాయలు వంటివి ఎక్కువగా తినే వాళ్ళలో క్యాన్సర్ వచ్చే ఆస్కారం చాలా తక్కువగా ఉందంటున్నారు . గతంలో ఆస్ట్రిన్ లో శాలిసిలిన్ ఆమ్లం ,పొట్టలోని బాక్టీరియా తో కలిసినపుడు 2,4,6,ట్రై హైడ్రేడ్స్ బెంజాయిక్ ఆమ్లం విడుదలై క్యాన్సర్ కణవిభజనను అడ్డు కొనేలా చేస్తుందని తెలుసుకొన్నారు […]
ఇది అసలైన పెళ్ళి పందిరి
పెళ్ళి వేడుకల కోసం చేసే ఏర్పాట్లలో వివాహ వేదిక అలంకరణను కేవలం పూవులతో నే చేస్తే బావుంటుందని పర్యావరణ హితులు సూచిస్తున్నారు. ఒక్కప్పుడు వేదిక అలంకరణ కేవలం మామిడి ఆకులు,కొబ్బరి మట్టలతోనే ఉండేవి. ఆ స్థానంలోకి ప్లాస్టిక్ పూలు ఎన్నో అలంకరణ వస్తువులు వచ్చాయి. ఈ ప్లాస్టిక్ వాడకం తగ్గించమని స్థానిక రైతులు సాగు చేసే మల్లె లిల్లీ బంతిపూలు కనకాంబరం వంటివి వాడితే వారికీ ప్రోత్సహకారంగా ఉంటుందంటున్నారు. ఖర్చు కూడా పరిమితంగానే ఉంటుంది. పైన సహజమైన […]
ఆరోగ్య ఫలం నారింజ
చక్కని రుచి రుచే కాదు అంతకు మించిన ఆరోగ్య లాభాలు ఉన్నాయి కమల పండ్లలో అంటారు ఎక్సపర్ట్స్. ప్రపంచ వ్యాప్తంగా ఏడున్నర కోట్ల టన్నుల ఆరెంజెస్ ఉత్పత్తి అవుతున్నాయి. రోగులకు ఆపిల్స్ తో పాటు ఇవ్వా ల్సింది కమలాలే. రోజుకి ఒక గ్లాస్ కమల రసం తాగితే మంచి కొలెస్ట్రాల్,ఫోలేట్ ల శాతం పెరిగినట్లు పరిశోధనలు తెచ్చాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ అనారోగ్యాల్ని నియంత్రిస్తాయి వయసుని మీద పడనీయ కుండా చేస్తాయి. పీచు ఎంతో ఎక్కువ. కమలాల్లోని కెరోటినాయిడ్ల […]
శిరోజాల అందానికి ఔషధం
శిరోజాల మెరుపుతో వుండాలన్న,రాలిపోకుండా కుదుళ్ళు బలంగా ఉండాలన్న ఆముదం చాలా బాగా పనిచేస్తుంది. వెంట్రుకలకు సరిపోయినంత ఆముదం తీసుకొని అందులో ముడు స్పూన్ల అల్లం రసం కలిపి కుదుళ్ళకు పట్టించాలి. 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే వెంట్రుకలు రాలటం తగ్గుతోంది. ఆముదంలో రెండు స్పూన్ల కలబంద గుజ్జు ముడు చుక్కల టీట్రీ ఆయిల్,బాగా కలిపి గిలకొట్టి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి ఓ అరగంట ఆగి తలస్నానం చేస్తే చుండ్రు […]
హాకీ కెప్టెన్ కు పురస్కారం
భారత హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ ను పద్మశ్రీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం . ఆమెది హరియాణా లోని షాబార్ . తండ్రి రిక్షా కార్మికుడు . ఆమెకు హాకీ క్రీడ పైన ఆశక్తిని గమనించి ప్రోత్సహించారు తల్లిదండ్రులు . రైల్వేలో జూనియర్ క్లర్క్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది రాణీ . అన్ని అవరోధాలను దాటుకొంటూ ఆటలో మేటిగా నిలిచి రాణీ ఇప్పటి వరకు 200 పైగా మ్యాచ్ లు అడి జట్టుకు ఎన్నో […]
వన నారి కి పద్మశ్రీ
కర్నాటక లోని అందోలా తాలుకా హొన్నోలి గ్రామానికి చెందిన తులసి గౌడ్ ను ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అంటారు. ఇప్పుడు తులసికి 76 సంవత్సరాలు. అరవై సంవత్సరాలుగా అడవిలో ఆమె 40 వేలకు పైగా చెట్లు పెంచింది. చిన్న తనంలోనే గోవింద్ గౌడ్ తో ఆమెకు వివాహం జరిగింది. కొన్నాళ్ళకే ఆయన చనిపోయాక అడవిలో తాత్కాలిక ఉద్యోగి గా చేరి పోయింది తులసి ఆ చెట్ల పెంపకం పరి రక్షణ లోనే జీవితాన్ని గడిపిన తులసి ప్రతి […]
రైతు సేవకు పద్మశ్రీ
సేంద్రీయ పసుపు సాగుతో గ్రామాల్లో 900 మందికి ఆదాయ మార్గం చూపుంచిన మేఘాలయకు చెందిన ట్రినిటీ సాయొ కి పద్మశ్రీ లభించింది . మేఘాలయా లోని ములేహ్ అనే చిన్నఊరు ఆమె స్వగ్రామం . ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు . రైతులను కూడగట్టి సహకార సంఘం ఏర్పాటు చేసి ,పసుపు కొమ్ములు ఆరబెట్టి మిల్లులో పసుపుగా మర్చి ఫ్యాకింగ్ చేయటం అలవాటు చేశారు . ఇప్పుడు రైతులు తమ పంట ఉత్పత్తులు దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఆ […]
అప్పుడు సంప్రదాయం ఇప్పుడు ఫ్యాషన్
వంకీలు ,వడ్డానాలు ఒకప్పుడు పెళ్ళి కూతురి ఆభరణాల్లో ఒకటిగా ఉండేవి . ఇప్పుడు ఆ వంకీలు ఫ్యాషన్ లో చేతి పట్టిల రూపంలో ఎన్నో రకాల ఆధునిక వస్త్రధారణల మీదకు ఉపయోగిస్తున్నారు . స్టీల్ ,సిల్వర్ ,ఎల్లో మెటల్ గవ్వలు లెదర్ లతో కూడా చక్కగా డిజైన్ చేస్తున్నారు ,పూవులు లతలు ,నెమళ్ళు సీతాకోక చిలుకలు ,పాములు గిరిజనులు వాడే పూసలు స్టోన్స్ తో కూడా చక్కని వంకీలు వస్తున్నాయి . స్టోన్స్ తో చేసిన చేతిపట్టిలు […]
అహింస ప్రచారానికి సత్కారం
గాంధీ మార్గాన్ని అనుసరిస్తూ బ్రెజిల్ సమాజంలో అహింస నెలకొల్పేందుకు కృషి చేసిన లీయా దిస్కిన్ ను ఈ ఏడాది పద్మ శ్రీ లభించింది . బ్రెజిల్ లో ఎంతో హింస నేరాలు ,ఘోరాలు ఉన్నాయి . లీయా గాంధీ ప్రభావం తో విద్య, శాంతి ,విలువలు ,సంస్కృతి సంప్రదాయలు గురించి రాసిన ‘పీస్ హౌ టు మేక్’ అన్న పుస్తకం ఐదు లక్షల కాపీలు అమ్ముడైంది. . బ్రెజిల్ లోని ఆరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆపుస్తకాన్ని పిల్లల […]
“ఆంజనేయ ప్రసాదం”
బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతాః ఆజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్!! అంజనీ పుత్రుడు ఆంజనేయుడు.పవనసుతుడు,హనుమంతుడు ఏ రూపంలో పిలచిన పలుకుతాడు.మంగళవారం ముఖ్యంగా మనం 11 తమలపాకులతో లేదా 5 నిమ్మకాయలతో దండ వేసి పూజ చేస్తాము.స్వామికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టం. మంగళవారం మంగళకరుడు శుభాశీస్సులు అందిస్తాడు.ఎంతటి కార్యము అయిన సులువుగా మార్గం చూపించే దేవుడు. నిత్య ప్రసాదం: కొబ్బరి,గారెలు -తోలేటి వెంకట శిరీష
సుష్మాస్వరాజ్ కు పద్మవిభూషణ్
దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కు లభించింది. ఏడు సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా,మూడు సార్లు శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు 1977 లో 28 సంవత్సరాల వయసులో క్యాబినెట్ మంత్రి గా చేసారు సుష్మా. 27 సంవత్సరాల వయసులో జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. 1987 నుంచి 1990 వరకు ఆమె హర్యానా రాష్ట్ర విద్య మంత్రిగా ఉన్నారు.
సామజిక సేవకు గుర్తింపు
సామజిక సేవ రంగంలో ఉషా చౌమార్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. పదేళ్ళ వయసులో పారశుధ్య కార్మికురాలుగా జీవనం ప్రారంభించి ఎన్నో ఛీత్కారాలు, అంటరాని తనాన్ని ఎదురుక్కొన్నారు ఉషా చౌమార్,నయా దిశ స్వచ్చంద సంస్థ ఆమెను చేరదీసింది. ఇప్పుడా సంస్థ లోని సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కు ఉషా అధ్యక్షురాలు. చేతులతో మల మూత్రాల ఎత్తి వేతకు వ్యతిరేకంగా ఉషా పోరాటం చేస్తున్నారు.
సింధు కు పద్మభూషణ్
క్రీడా కారులకు,యువతకు ఆదర్శంగా నిలిచిన బాడ్మింటన్ సంచలనం పి.వి సింధుని ఈ సంవత్సరం పద్మభూషణ్ వరించింది. సాధారణ నేపద్యం నుంచి వచ్చి ప్రపంచ,బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రెండు కాంస్యాలు రెండు రజితాలు సాధించింది. గత సంవత్సరం స్వర్ణం సాధించి ప్రపంచ బాడ్మింటన్ శిఖరం పై సగర్వంగా నిలబడింది సింధు. 2013 లో అర్జునా, 2015 లో పద్మశ్రీ,2016 రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ లు ఆమెకు దక్కాయి.
దిగ్గజ బాక్సర్ కు పద్మవిభూషణ్
అరడజను సార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా దిగ్గజ క్రీడాకారిణి మేరీ కోమ్ ను భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించింది . బాగా వెనక బడిన ఈశాన్య ప్రాంతంలో పుట్టిన ఈ అమ్మాయి మొదటిసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో స్వర్ణం ,ఆ తర్వాత సంవత్సరం కూడా స్వర్ణం సాధించింది. 2005 ,2006,2008,2010 సంవత్సరాల్లో ప్రపంచ ఛాంపియన్ అయింది . 2012లో లండన్ ఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకొంది . ఇద్దరు బిడ్డల తల్లి […]
మహిళల భద్రత కోసం హాక్ ఐ
మహిళలకు ఒంటరి ప్రయాణాల్లో సాయంగా ఉంటుంది హాక్ ఐ మొబైల్ యాప్. ఇందులో sos విభాగం ఉంటుంది. ప్రాధమిక సమాచారం ఇందులో రిజిస్టర్ చేయాలి. హెల్ప్ డెంజర్ వంటి అంశాలు ఇందులో పొందు పరిచి కుటుంబ సభ్యులు,సన్నితులకు చెందిన ఐదు ఫోన్ నెంబర్లు షేర్ చేయాలి. అత్యవసర సమయంలో ఈ sos ను నొక్కితే కంట్రోల్ రూమ్ జోనల్ డిసిపి. డివిజినల్ ఎసిపి లతో పాటు సమీపంలోని పెట్రోలింగ్ వాహనాలకు లొకేషన్ జి పి ఎస్ తో […]
విత్తన మాతృమూర్తికి పురస్కారం
రహీబాయి సాము పోపిరె సేవా తత్పరతను గుర్తించి ఆమె కు పద్మశ్రీ పురస్కారం అందించింది ప్రభుత్వం. అహ్మద్ జిల్లాకు చెందిన మహిళా రైతు రహీబాయి అక్షరం చదువుకోలేదు ,అయినా గిరిజన ప్రాంతంలో విభిన్న వరి రకాలు,కూరగాయల సాగుద్వారా 50 ఎకరాల భూమిని పరిరక్షించి ,విత్తన నిధిని ఏర్పాటు చేశారామె . విత్తన మాతృమూర్తిగా సో. ఎస్.ఐ.ఆర్ పురస్కారం అందుకున్నా అన్నదాత . నీటి సంరక్షణ విధానాల రూపకల్పన తో బంజరను బంగారు భూమిగా మర్చి, దిగుబడులను 30 శాతం […]
ఏక్తా కు పద్మశ్రీ
వెండితెర ,బుల్లి తెరలకు ఆమె సేవలకు గాను ఏక్తాకపూర్ ను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో గౌరవించింది . ప్రముఖ బాలీవుడ్ నాటులు జితేంద్ర ,శోభాకపూర్ ల కుమార్తె ఏక్తా . బుల్లితెర పైన 130 షోలకు పైగా నిర్మించారు .ది క్వీన్ ఆఫ్ ఇండియన్ టివి గా పేరు తెచ్చుకున్నారు . 40 పైన వెబ్ సిరీస్ లను లాంచ్ చేశారు . ఎ కే లేబుల్ పేరుతో ఫ్యాషన్ రంగం లోనూ ఉన్నారు. క్యా […]
పస్తులు నుంచి పద్మశ్రీ కి
నటిగా ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకున్న కంగనా రనౌత్ ఇప్పుడు పద్మ శ్రీ గౌరవం కూడా సొంతం చేసుకొన్నారు . మనాలి దగ్గర లోని భాంబ్లీలో జన్మించిన కంగనా పస్తులు అనుభవిస్తూ ఎన్నో మెట్లు ఎక్కింది . మోడలింగ్ చేస్తూ ధియేటర్ ఆర్ట్ పై దృష్టి సాధించింది . తొలి సినిమా గాంగ్ స్టార్ తోనే ఆమెకు ఎన్నో అవకాశాలు వరస కట్టాయి . ఫ్యాషన్ లో ప్రియాంక చోప్రా తో కలిసి నటించింది . ఈ […]
“శ్రీ శరభేశ్వర స్వామి ప్రసాదం”
మెదక్ జల్లా సిద్ధిపేటలోని శరభేశ్వరుని చూశారా సఖులూ!! మరి చూసొద్దాం రండి. అన్నపూర్ణ సమేతుడై శరభేశ్వర స్వామి వారు భక్తుల కోరికలు తీర్చేందుకు కొలువై ఉన్నాడు. ప్రతి సోమవారం మహన్యాసపూర్వక రుద్రాభిషేకం కన్నుల కింపుగా జరుగుతుంది. ఈ క్షేత్రంలో సాక్షి గణపతి,కుమారస్వామి, ఆంజనేయులవారు కూడా దర్శనం ఇస్తారు.శరభేశ్వరాచార్యులవారు ఈ దేవాలయాన్ని కట్టించి ప్రతిష్ఠ చేశారు.భక్తులు కార్తీక మాసంలో తండోపతండాలుగా వచ్చి దర్శనం చేసుకుని కటాక్షం పొందుతారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం. -తోలేటి వెంకట శిరీష
అమ్మాయిలు మెచ్చే లుక్
ఎన్ని అందమైన డ్రెస్ లు వేసుకొన్న షూస్ మటుకు ఫార్మల్ లుక్ లో లెదర్ తో చేసినవే ఇష్టపడుతారు. అమ్మాయిలు ఇప్పుడా లెదర్ షూస్ క్లాత్ డిజైన్స్ లో ఎంబ్రాయిడరీ చేసినవి వస్తున్నాయి, సో కోఫీ ల్యారీ లింధర్ వంటి కంపెనీలు రంగులతో పెయింట్ చేసిన లెదర్ ఎన్నో రకాల ఫ్యాషన్ ఫుట్ వేర్ లు తయారు చేశారు.వింటేజ్ లుక్ కోసం పూవులు,సీతాకోక డిజైన్లు జోడించారు. ఈ లెదర్ పైన వేసే రంగులు కూడా అమ్మయిలు కామన్ […]
