అంజూ కు అరుదైన పురస్కారం
భారత లాంగ్‌జంప్ అథ్లెట్‌దిగ్గజం అంజూ బాబీ జార్జ్ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది యువ అథ్లెట్స్ ను తీర్చి దిద్దటం తో పాటు లింగ సమానత్వం కోసం గళం వినిపించినందుకు ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఆమె సొంతం అయింది. దీనితో డబ్ల్యూ ఏ అవార్డ్ గెలుచుకున్న తొలి భారతీయురాలిగా అంజూ నిలిచింది. వర్చువల్ గా సాగిన వార్షిక అవార్డుల కార్యక్రమంలో 44 ఏళ్ల అంజు ఈ అవార్డును దక్కించుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
జార్ బ్రేక్ ఫాస్ట్ నా పేవరెట్
ఇంటి భోజనానికే నా మొదటి ఓటు ,యు ఆర్ వాట్ యు ఈట్ అనే మంత్రం నమ్ముతా ఆచరిస్తా అంటోంది అనుష్కా శర్మ. 33 ఏళ్ళ వయసులో ఆమె ఫిట్ నెస్ రహస్యం వివరిస్తూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఇన్ ఎ జార్,తీసుకొంటూ అంటే ముప్పావు కప్పు ఒట్స్,రెండు చెంచాల సబ్జా గింజలు గుప్పెడు నాట్స్,సీడ్స్ వీటిని విడివిడి గా నాన బెట్టి అన్నింటినీ కప్పు పాలతో కలిపి ఫ్రిజ్ లో పెట్టేసి ఉదయం ఈ మిశ్రమానికి […]
కథా బలం ముఖ్యం
నా దృష్టిలో ఓటీటీ వేదిక, థియేటర్ అన్నీ సమానమే నేను సూర్య కలిసి నిర్మించిన జై భీమ్ ఓటీటీ లో రిలీజై ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఇవన్నీ పేజీ కి ఒకే వైపు ఉన్నాయి. సినిమా కంటెంట్ ఏ వేదిక పైన ఉంచిన ఒకే ఫలితం వస్తుంది అంటుంది జ్యోతిక. సూర్య జ్యోతిక లు కలిసి నిర్మిస్తున్న సినిమాలు ఇప్పటికే పదిహేను నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కొన్ని ఓటీటీ ల కోసం మరికొన్ని థియేటర్ […]
స్పీడ్ ఈటర్ డోనట్స్
నా జీవితంలో అత్యంత అద్భుతం అనే అనుకునేది 20కి పైగా గిన్నిస్ రికార్డ్ లు బద్దలు కొట్టటం అంటుంది స్పీడ్ ఈటర్ పేరుపొందిన లేహ్ షట్కేవర్ .వయస్సు 28, చక్కగా సన్నగా కనిపిస్తుంది కానీ తిండి కార్యక్రమం మొదలు పెట్టిందీ అంటే మూడు నిమిషాల్లో 10 జామ్ డోనట్స్ లు 6 వేడివేడి రొట్టెలు తినగలదు. లీటర్ గ్రేవి 1.49 నిమిషాల్లో తాగేయగలదు. స్ప్రింగ్ రోల్స్ దేన్నైనా నిమిషంలో తినేస్తుంది సాధారణంగా మగవాళ్లే ఇలా తిండిపోటీల్లో ఉంటారు. […]
అవసర సాయం
‘ల్యాండ్ కే సిపాయి’ పేరుతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ చలికాలంలో వృద్ధులకు కంబళ్ళు దుప్పట్లు పంచారు మహిళా పోలీస్ అనితా పరాశర్. వీధుల్లో భాగంగా రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కొందరు మహిళలు వృద్ధులు చలిలో చనిపోవటం చూశాక అనితా తన తోటి పోలీస్ ఉద్యోగులు, భర్త వికాస్ పరాశర్ తో కలిసి ఎనిమిది వేలకు పైగా దుప్పట్లు పంచింది. ఈ కార్యక్రమం ద్వారా ఆస్పత్రులు, అనాధ శరణాలయాల్లో కూడా దుప్పట్లు, కంబళ్ళు పంచుతున్నారు పోలీసు […]
ది బిగ్ బుక్ ఆఫ్ ట్రీట్స్
పూజా దింగ్రా రాసిన ‘ది బిగ్ బుక్ ఆఫ్ ట్రీట్స్’ పుస్తకం ప్రపంచ గౌరమండ్ కుక్ బుక్ అవార్డ్ ల కార్యక్రమంలో రెండో విజేతగా నిలిచింది.మ్యాక్రాన్ క్రీన్ అని పిలుస్తారు. ఇండియా లో తొలి మ్యాక్రాన్ స్టోర్సే ప్రారంభించి ఫ్రెంచ్ రుచులను మనదేశంలో అందిస్తూ 23 ఏళ్లకే ఎంట్రప్రెన్యూర్ షిప్ గా ఎదిగి ఎన్నో లక్షల మందికి ప్రేరణగా నిలిచింది.ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో చోటుచేసుకుంది పూజా ముంబాయి లో పుట్టి పెరిగిన అమ్మాయి స్విజర్లాండ్ లో […]
పట్టుబట్టి తగ్గాను
తొమ్మిది వారాల్లో 15 కేజీల బరువు తగ్గాను పోషక విలువలు తగ్గకుండా ఆహారంలో జాగ్రత్తలు తీసుకొని యోగా లో చక్రాసనలు వంటివి వేసి ఒక్క రోజు కూడా జిమ్ కు గైర్హాజరు కాకుండా బరువు తగ్గి పోయాను అంటుంది ఖుష్బూ సుందర్. దక్షిణాది లక్షల మందికి అభిమాన పాత్రమైన ఖుష్బూ ను తలుచుకుంటే ఆమె పేరిట కట్టిన ఆలయం ఆమె పేరు పైన ఫేమస్ అయిన ఇర్లీ లు గుర్తుకు రాక తప్పదు 40 ఏళ్లు దాటాక […]
కేవలం వ్యాయామమే సాయం
సహజమైన పోషక విలువలు పోకుండా ఆహారంలో మార్పులు తెచ్చి పరిమాణాన్ని ఏమీ తగ్గించకుండా తిని వ్యాయామం యోగ తోనే శారీరకంగా మానసికంగా ఫిట్ గా తయారయ్యాను అంటుంది స్మృతి ఇరాని. బుల్లితెరపై పేరు తెచ్చుకుని రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ 45 ఏళ్లకే బరువు బాగా పెరిగింది. ఇటీవల బరువు తగ్గి నాజూకుగా అయిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఒకవేళ ఆపరేషన్ల ద్వారా తగ్గారా అని […]
పారేయకండి పనికొస్తాయి
సౌందర్య ఉత్పత్తులు గడువు దాటితే చెత్తబుట్టలో పారేస్తూ ఉంటారు. కానీ వాటితో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫుట్ మ్యాట్ లు మురికి పడితే గోరువెచ్చని నీటిలో గడువు దాటిన ఫేస్ వాష్ వేసి నానబెట్టి కాస్త బ్రష్ వేస్తే కొత్తవి లాగా మెరుస్తాయి. మగ్గులో నీళ్లు ఫేస్ వాష్ షాంపు కలిపి వాహనాలు తుడిస్తే మురికిపోయి మెరుస్తాయి. పెద్ద స్పూన్ నిండా ఉప్పు వంటసోడా ఫేస్ వాష్ కలిపి ఈ మిశ్రమం తో మురికిగా ఉన్న కిచెన్, బాత్ […]
స్త్రీలకు ప్రత్యేకం
నాటక రంగంలో స్త్రీల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు గాను మహాలక్ష్మి లేడీస్ డ్రామా గ్రూప్ ఏర్పాటు చేశారు జ్ఞానం బాలసుబ్రమణియన్ ఈ ఆల్ విమెన్ డ్రామా గ్రూపు నుంచి కాలక్షేప నాటకాలు రావు కనువిప్పు కలిగించే ఇతివృత్తాలతో నాటకాన్ని మలుస్తారు స్టేజీ ఎక్కేముందర ఒక నాటకం ముప్పై సార్లు రిహార్సల్స్ వేస్తారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఈ నాటకం గ్రూప్ నుంచి ‘ఎందరో మహానుభావులు’ నాటకం తొలిసారిగా యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఈ నాటకాన్ని మూడు […]
దివ్యాంగులకు అండ
మస్కులర్ డిజార్డర్ వల్ల వీల్ చైర్ కు పరిమితమైన స్వర్ణలత గాయనిగా రచయితగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు పొందింది. ఆమె స్థాపించిన స్వర్ణ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తోంది. ఆమె ఫౌండేషన్ తరఫున సారధి పేర తయారు చేసిన ఒక వాహనంలోకి దివ్యాంగులు తమ వీల్ చైర్ తో పాటు ఎంత దూరమైనా ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయచ్చు. సోఫా, బెడ్, వేడి నీళ్లు, టాయిలెట్ […]
సోలార్ లజ్జా !
సోలార్ లజ్జా మెషిన్ ను కనిపెట్టిన ముంబై కి చెందిన మధురిత గుప్తా ఆమె తమ్ముడు రూపన్ లకు ఎన్నో అవార్డులు వచ్చాయి. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్ సోలార్ లజ్జా మెషిన్ కాల్చి బూడిద చేస్తుంది. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తి తో పనిచేస్తుంది.దీని ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీని ద్వారా వెలువడే బూడిద ను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు. 2019లో ప్రారంభించిన ఈ మిషిన్ […]
ఈ ప్లెయిన్ నేటి ఫ్యాషన్
సాంప్రదాయ ఆభరణాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వడ్డానం ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్ ల పైన ధరిం చేందుకు వీలుగా ప్లెయిన్ గా వస్తుంది. పైగా సింపుల్ ప్లెయిన్ వడ్డాణాన్ని సందర్భానుసారంగా స్టయిలింగ్ చేసుకునే వీలుంటుంది మెడలో వేసుకునే హారానికి చెవులకు మ్యాచింగ్ ఆభరణాన్ని మ్యాచింగ్ గా సదా వడ్డానం అయినా అదే మాదిరి లాకెట్ ను సెట్ చేసుకోవచ్చు. బెల్ట్ మాదిరిగా ఉండే ఈ ప్లెయిన్ వడ్డానం బంగారం తోనే కాదు వెండి, వన్ గ్రామ్ గోల్డ్ […]
బయట తిండితో అనారోగ్యం
రోజూ బయట తిండి తింటే ఇబ్బందే అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజు రెస్టారెంట్ భోజనం చేసేవారికి 49 శాతం రిస్క్ ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ లోనా చేసిన అధ్యయనం లో హోటల్ ఫుడ్ లో బ్యాలెన్స్ ఉండదని,రుచి కోసం రంగు కోసం కలిపే కొన్ని రకాల పదార్ధాలు అనారోగ్య హేతువులని తేలింది. సోడియం తో పాటు కొవ్వు ఎక్కువ గా ఉండే పదార్ధాలు శ్యాచు రేటేడ్ ఫ్యాట్స్ పెంచే వాటినే రెస్టారెంట్ లో […]
ఈ నూనె పోషక భరితం
వెంట్రుకల ఆరోగ్యం కోసం, పొడవుగా పెరిగేందుకు ఇంట్లోనే పోషక భరితమైన శిరోజామృతాన్ని తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ నూనె కోసం పావు కప్పు ఆముదం పావు కప్పు కొబ్బరి నూనె టేబుల్ స్పూన్, మెంతులు టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర టేబుల్ స్పూన్, రోజ్ మేరీ ఆయిల్ రెండు చుక్కలు పిప్పర్ మెంట్ ఆయిల్ రెండు చుక్కలు కావాలి ముందుగా నల్ల జీలకర్ర మెంతులు కొబ్బరి నూనెలో వేసి పదిహేను నిమిషాలు మరిగించాలి. ఆముదం, రోజ్ […]
ఎత్తు పెరుగుతారు
పిల్లలకు కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తే ఎత్తు పెరుగుతారు అంటున్నారు ఎక్సపర్ట్స్. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేస్తే శరీరంలో ఉన్న ఎముకలు కండరాలపై ఒత్తిడి పెరిగే పిల్లలు పొడవు పెరిగేందుకు సాయిపడుతుంది. తాడాసనం వేయిస్తే కాళ్ళు చేతులు వెన్ను బలోపేతం అవుతాయి. ధనురాసనం వల్ల వెన్ను తో పాటు శరీరం మొత్తం బలం పుంజుకుంటోంది. ఈ రెండు ఆసనాలు పొడుగు ఎదిగేందుకు సాయపడతాయి. వ్యాయామంతో పాటు పోషకాహారం అందించాలి. పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చికెన్, సోయా […]
చీరెకట్టు లో సొగసు
దక్షిణ భారత మహిళలు వేడుకల్లో చీరలు కట్టే తీరులో ఎంతో వైవిధ్యం కనబరుస్తున్నారు. సాంప్రదాయ చీరెకట్టుకు ఆధునిక శైలిని జోడిస్తున్నారు ప్రింటెడ్ శారీని, లాంగ్ స్కర్ట్ తో జత చేస్తే పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు పాంట్ శైలి శారీ అయితే కుచ్చిళ్ళను ప్యాంట్ కు జోడించి వడ్డానం లేదా లెదర్ బెల్ట్ పెడుతున్నారు. ఇంకో వినూత్నమైన శారీ డ్రేపింగ్ చీరె కుచ్చులు వెనక్కు పెట్టుకోవటం ఇంకా లెహంగా శైలిలో చీరె కట్టించుకోవటం కూడా ఇవ్వాట్టి ఫ్యాషన్ […]
ఈ క్రీములతో జాగ్రత్త
చర్మం తెల్లబరుస్తాయని చెబుతూ మార్కెట్ లో విక్రయిస్తున్న ఎన్నో విదేశీ సౌందర్య ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన మెర్క్యురీ ఉన్నట్లు ఢిల్లీ శ్రీ రామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధనలు వెల్లడించాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ రసాయనం వల్ల చర్మం అందంగా మారటం కన్నా జరిగే చేటే ఎక్కువ ఇది చర్మానికే కాక పలు రకాల అనారోగ్యాలకు కారణం అని తేల్చారు. ఇది నరాల వ్యవస్థ జీర్ణ వ్యవస్థను దెబ్బ తీయటం తో పాటు వ్యాధినిరోధక శక్తిని […]
క్షణం వృధా చేయను
పనిలేకుండా నిరుపయోగంగా గడపటం నాకు నచ్చదు నాకు వయసు ఒక నంబర్ మాత్రమే. పని చెయ్యాలనే సంకల్పం ఉంటే వయస్సు ఒక లెక్క కాదు అంటుంది యామినీ మజుందార్. బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ తల్లి 58 ఏళ్ళ వయసులో ఆమె జీన్స్ డ్రై క్లీనింగ్ సర్వీస్ వ్యాపారం ప్రారంభించారు. 1990లో ఈ లాండ్రీ బిజినెస్ కోసం విదేశాల నుంచి హై ఎండ్ ఎక్విప్ మెంట్ ను దిగుమతి చేసుకున్నారు ఇప్పుడామెకు ఎనభై ఏళ్ళు రోజుకు నాలుగు […]
అత్యంత ధనవంతురాలీ కుక్క
ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన కుక్క గుంథర్ Vl .ఈ కుక్క కు వాళ్ల తాతగారైన గుంథర్ III కి జర్మన్ దేశస్థురాలైన కౌంటిస్ కార్లోట్టా లైచెస్ స్టెయిన్ అన్నావిడ తాను చనిపోయే ముందు 431 కోట్ల విలువ చేసే తన ఆస్తిని ఆ కుక్క కు రాసి ఇచ్చింది. అట్లా తాత ఆస్తి వచ్చి ఇప్పుడు దాని ధర పెరిగి 3715 కోట్లు విలువ చేసే ఈ గుంథర్ ప్రపంచంలోనే డబ్బున్న కుక్క గా నిలిచింది.
