ఎంబ్రాయిడరీ జేబులు
బయటకు వెళ్లేప్పుడు ఫోను, క్రెడిట్ కార్డ్ వంటి ముఖ్యమైన 12 వస్తువుల కోసం వేసుకున్న డ్రెస్ కు పాకెట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. బ్యాగ్ తగిలించుకొని వెళ్లే అవసరం లేకుండా చక్కని డిజైనర్ పాకెట్స్ తో డ్రెస్ తయారవుతున్నాయి. ప్లేన్ కుర్తా టాప్ ఏదైనా సరే ఎంబ్రాయిడరీ సొగసులు, ప్యాచ్ వర్క్ మెరుగు లతో, కాంట్రాస్ట్ కలర్స్ తో ఈ ప్యాకెట్ ను కుట్టేస్తున్నారు. ప్యాచ్ వర్క్ అయినా పాకెట్ చుట్టూ ఎంబ్రాయిడరీ చేసి అయినా అసలు […]
సాంప్రదాయ దొన్నె బిర్యాని మా స్పెషల్
కర్ణాటక సాంప్రదాయ వంటల్లో ఒకటైనా బిర్యానీ ఒక బ్రాండ్ గా చేయాలని సంకల్పంతో ఆర్ ఎన్ ఆర్ బిర్యాని నమ్మ బిర్యానీ పేరుతోక్లౌడ్ కిచెన్ ప్రారంభించారు. ఒక చెఫ్ కు మా బిర్యానీ లో ఉండే ప్రత్యేక పదార్థాలు వివరంగా చెప్పి యాభై ఆర్డర్స్ తయారు చేయించి స్విగ్గి యాప్ లో ఆర్డర్ పెట్టాం. అదే మొదలు నెల తిరిగే సరికి 10 వేల ఆర్డర్స్ అందుకొన్నాం అంటారు బెంగుళూరుకు చెందిన అక్కాచెల్లెళ్లు రమ్య, శ్వేత ఏడాదిలో […]
శిరోజాలు పెంచే గింజలు
పోషక విలువలున్న ఆహారానికి కొన్ని రకాల గింజలు జతచేసి తీసుకుంటే శిరోజాలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. నువ్వుల్లో పాలీ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ ఆహారంలో భాగంగా తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా అవుతాయి.పొద్దు తిరుగుడు విత్తనాలు లోని జింక్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్-ఇ వంటివి శిరోజాలు పెరగటం లో తోడ్పడతాయి. అవిసె గింజల్లోని ఖనిజాలు శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. రోజు ఒక స్పూన్ గుమ్మడి విత్తనాలు […]
వస్తువులు తగ్గిస్తే హాయ్
కంటికి నచ్చిన ప్రతి వస్తువు కొని ఇల్లంతా నింపేస్తే ముందు ఇల్లు శుభ్రం చేసుకోవటం, సౌకర్యంగా జీవించడం కష్టమైపోతుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . అవసరమైన వస్తువుల కే ఇంట్లో చోటిస్తే ఇల్లు విశాలంగా కంఫర్ట్ గా ఉంటుంది. వర్షాకాలంలో దుస్తులు ఆరేసేందుకు లోహపు స్టాండ్ లు కొంటూ ఉంటాం కానీ అది నడిచేందుకు అడ్డుగా ఉంటుంది. కిటికీకి అమర్చే వేలాడదీసే పరికరం తో బట్టలు ఆరేసే చోటు కలిసి వస్తుంది. లాప్ టాప్ కోసం రైటింగ్ టేబుల్ […]
లూయిస్ ఎలిజిబెత్ గ్లుక్ 2020 లో నోబెల్
లూయిస్ ఎలిజిబెత్ గ్లుక్ ప్రఖ్యాత అమెరికన్ కవయిత్రి.1943లో న్యూయార్క్‌లో జన్మించింది. అధ్యాపక వృత్తి స్వీకరించి ప్రస్తుతం ,మేరీ విశ్వ విద్యాలయంలో తన 78వ ఏట ప్రొఫెసర్ గా పనిచేస్తోంది చిన్నతనంలో ఆమెకు నరాల వ్యాధి ఉండేది. దాన్ని అధిగమించి ఆమె ఎన్నో కవితలు రచనలు చేశారు. ప్రభాత అమెరికన్ కవులలో రచయిత్రులతో ప్రొఫెసర్ లలో ఒకరు. పులిట్జిర్ ప్రైజ్,బోలింజన్ ప్రైజ్,నేషనల్ బుక్ అవార్డ్,నేషనల్ హ్యుమానిటీస్ మోడల్ మొదలైనవి ఆమెకు లభించాయి 2013-2004 వరకు ఆమె అమెరికా ఆస్థాన […]
అప్ డేట్ అవ్వాలి
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కీ మ్యాప్ లు రూపొందిస్తారు ప్రజ్ఞ. ఆమె స్విగ్గి ఇంజనీరింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్ కూడా వినియోగదారుడికి డెలివరీ బాయ్ కు ఎదురయ్యే ఇబ్బందులు పరిష్కరించేందుకు గాను నగరాలను జోన్లుగా విభజించి వాటిలోని వీధులను అపార్ట్మెంట్స్ ని ఇళ్ళని మ్యాపింగ్ చేశాం. ఖచ్చితత్వం కోసం జిపిఎస్ ఇతర సాంకేతికతలను వాడము దీనికోసం లొకేషన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను నెలకొల్పము దీనితో డెలివరీలు అందించడం లో స్విగ్గి వేగం పెరిగిందని చెబుతారు ప్రజ్ఞ. […]
అలిస్ మన్రో 2003 లో నోబెల్
కెనడాకు చెందిన రచయిత్రి అలిస్ మన్రో. 1931 కెనడాలోని విం ఝo అనే పట్టణం లో వ్యవసాయి కుటుంబంలో జన్మించింది. ఉన్నత పాఠశాలలో చదువుతూ ఉండగానే ఊహల్లో పుస్తకాల్లో విహరించేది. ఆమె రచనలు ద డైమన్షన్స్ ఆఫ్ ఎ షాడో, ద ప్రోగ్రెస్ ఆఫ్ లవ్, ఫ్రెండ్ ఆఫ్ మై యూత్, టూమచ్ హ్యాపినెస్ మొదలైనవి ఎంతో పేరు తెచ్చాయి చక్కని కధనం లో స్పష్టత, మానసిక వాస్తవిక చిత్రణతో ఆమె కథలు, రచనలు పాఠకులను ఆకర్షించాయి.ప్రజల […]
స్వెత్లానా అలెక్సీయెవిచ్ 2015 లో నోబెల్
స్వెత్లానా అలెక్సీయెవిచ్ బెలారసియకు చెందిన రచయిత్రి.1948వ సంవత్సరంలో యుక్రేన్‌లో జన్మించింది. తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు. స్కూలు పత్రికలోనే స్వెత్లానా రచనా వ్యాసంగం మొదలైంది.మిన్స్క్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం చదివి,నేమ్యాన్ సాహిత్య పత్రికలో విలేఖరిగా చేరి అందులోనే కాల్పనికేతర విభాగానికి అధిపతిగా పనిచేసింది. ఆమె రచనల్లో ఐ హావ్ లెఫ్ట్ మై విలేజ్, ద బాయ్స్ ఇన్ జింక్, ఎన్ చాంటెడ్ విత్ డెత్ మొదలైనవి చాలా ప్రఖ్యాతి చెందాయి సమకాలీన ప్రపంచంలో బాధల్ని, సాహసాల్ని వినిపించే ఆమె […]
చర్మం రంగు మారుతోందా ?
కాస్త పెద్దవిగా అనిపించే ఉంగరాలు ధరించటం ఫ్యాషన్. ఈ ఉంగరం ధరించే వెలికి ఉంగరం ఉన్న మేరా నల్లగా నో తెల్లగా నో రంగు మారి కనిపిస్తూ ఉంటుంది. ఉంగరం ధరించి,స్నానం చేయటం ముఖం కడుక్కోవడం కోసం సబ్బు వాడటం తో దాని తాలూకా డిటర్జెంట్ లు ఉంగరం అడుగుభాగంలో పేరుకు పోతూ ఉంటాయి. ఆ డిటర్జెంట్ ప్రతిచర్య వల్ల చర్మం నల్ల బడటం లేదా అలెర్జీలు రావటం జరగవచ్చు. లేదా ఆభరణాల్లో ఉండే ఇతర లోహాల […]
ఓల్గా టోకర్‌జక్ 2008 లో నోబెల్
ఓల్గా టోకర్‌జక్ పోలెండ్‌కు చెందిన రచయిత్రి 1962వ సంవత్సరంలో జన్మించిన ఓల్గా వార్సా విశ్వవిద్యాలయంలో ఆమె మనస్తత్వశాస్త్రం అభ్యసించారు. ఆమె గొప్ప రచయిత్రి, కార్యకర్త, ప్రజా మేధావి. ఆమె వామపక్ష భావాలకు చెందినది.ఎన్నో వ్యాసాలు, కథలు, నవలలు రాసింది. ఆంగ్ల భాష నుండి అనేక అనువాదాలు చేసింది.ఆమె రచనలు సినిమాలుగావచ్చాయి. 2015 నుండి ఆమె విస్తృతంగా రాశారు.ఆమెకు వచ్చిన అవార్డ్సు కు లెక్కలేదు. ‘ఫ్లైట్స్’ అనే నవలకు 2018లో మ్యాన్ బుక్కర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ లభించింది.2018లో నోబెల్‌బహుమతి […]
నెల్లీసాచ్స్ 1966 లో నోబెల్
1891 లోజన్మించిన నెల్లీసాచ్స్ జర్మనీ యూదు కవయిత్రి. తండ్రి పారిశ్రామికవేత్త, తల్లి గృహిణి,ఒక్కతే కూతురు కావటం చేత తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచారు. సెల్మా లోగెర్లోఫ్ రాసిన నవల ‘గోస్టా బెర్లింగ్ సగా’ తో ప్రభావితురాలైంది నెల్లీసాచ్స్. 1933లో జర్మనీ నాజీలకు హస్తగతం అయ్యాక సాచ్స్ జీవితం ఏకాంతంలోకి నెట్టబడిరది. 1966లో సమస్త యూదు ప్రజల విషాదం పట్ల భావోద్వేగ తీవ్రతతో, పౌరాణిక నాటకీకరణలతో నెల్లీసాచ్స్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మెచ్చుకొనేలాగా రచనలు చేసినందుకు గాను సాహిత్య నోబెల్ […]
నాదిన్ గోర్దిమెర్ 1991 లో నోబెల్
1923లో జన్మించింది నాదిన్ గోర్దిమెర్ తల్లిదండ్రులు బ్రిటన్ నుంచి దక్షిణాఫ్రికా కు వలస వచ్చారు.పసితనంలో అనారోగ్య కారణంగా తల్లి నాదిన్ ను చాలా జాగ్రత్తగా ఆమెకు అలసట కలగ నివ్వకుండా పెంచింది. స్కూలు కు కూడా పంపకుండా ఇంటి దగ్గరే ఆమె విద్య బోధన సాగింది.నాదిన్ రచనలకు ప్రేరణ ఆమె బాల్యం నుంచి అనుభవించిన వంటరి తనమే 1945లో జోహన్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య కోసం చేరింది. మండేలా కు భావపరంగా దగ్గరయింది. నాదిన్ రచనలకు మండేలా […]
హేర్తా మ్యూలర్ 2009 లో నోబెల్
హేర్తా మ్యూలర్ రుమేనియాకు చెందిన రచయిత్రి.హేర్తా జర్మనీ మాట్లాడే అల్పసంఖ్యాకులు నివసించే రుమేనియాలోని నిచిటార్ఫ్ అనే పట్టణంలో 1953 వ సంవత్సరం లో రైతు కుటుంబంలో జన్మించింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్ల స్టాలిన్ నిర్బంధ కార్మిక శిబిరాల్లో ఉంచాక హేర్తా తల్లి కార్మిక శిబిరాల్లోనే జీవించింది.హేర్తా చదువు పూర్తిచేశాక,తండ్రి మరణం,బ్రతుకు తెరువు కోసం తల్లి కూలీగా పనిచేయడం చూశాక తనను తాను ఓదార్చు కొనేందుకు రచనలు సాగించింది. కొన్నాళ్ళు టీచర్ గా పని చేసింది. […]
టోనీ మోరిసన్ 1993 లో నోబెల్
1931వ సంవత్సరంలో ఓహియో నగరంలో జన్మించిన టోనీ మోరిసన్ తండ్రి వెల్డరు, తల్లి ఆధ్యాత్మిక స్త్రీ, చర్చి గాయక బృందం లో పాటలు పాడేవారు.టోనీ వయస్సు పెరుగుతున్న కొద్దీ అమెరికాలోని దక్షిణ ప్రాంతపు జాత్యహంకారం అనుభవం లోకి రావటం మొదలైంది కాలేజీ కి వెళుతున్న రోజుల్లో వాషింగ్టన్ బస్సులలో ‘శ్వేతేతరుల కోసం’ అని రాసి ఉండటం ఆమెకు ఆగ్రహం కలిగింది. తెల్లవారి వైఖరిని తిప్పి కొట్టాలన్నదే ఆమె రచనల కు ప్రేరణ. 1955లో కోర్నెల్ విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. […]
ఇల్ఫ్రీడే ఇయెలినెక్ 2004 లో నోబెల్
ఇల్ఫ్రీడే ఇయెలినెక్ ఆస్ట్రియా రచయిత్రి. ఈమె 1946వ సంవత్సరంలో ఆస్ట్రియా దేశంలో జన్మించింది. తండ్రి యూదు ఇల్ఫ్రీడే ని తల్లి సంగీతకారిణినితీర్చి ద్దిదాలనుకొన్నది. ఆ లక్ష్యం కోసం చాలా కఠినంగా వ్యవహరించేది. కానీ ఇల్ఫ్రీడేరచయిత్రి అయింది.ఆమె ప్రసిద్ధ రచనలు వర్ డెకోస్ బేబి, ఉమెన్ యాజ్ లవర్స్, వండర్‌ఫుల్ టైమ్స్, ద పియానో టీచర్ మొదలైనవి. స్రీల మధ్య సంబంధాలు, యజమానులు బానిసల వంటివని, ఎక్కడైతే స్త్రీలు తమ యవ్వనం, అందం, దేహం మూలంగానే కేవలం శక్తిమంతులుగా […]
డోరిస్ లెస్సింగ్ 2007 లో నోబెల్
డోరిస్ లెస్సింగ్ బ్రిటన్‌కు చెందిన రచయిత్రి.బ్రిటీష్‌కు చెందిన దంపతులకు ఇరాన్‌లో 1919 తండ్రి లో జన్మించింది.మొదటి ప్రపంచ యుద్ధంలో గాయపడి ఒక కాలు పోగొట్టుకున్నాడు. తల్లి నర్సు. తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం మొక్కజొన్న సాగు చేసేవారు ఆమె తల్లిదండ్రులు. ఆ పొలాల్లోనే తల్లి ఆమెకు పాఠాలు నేర్పేది కూతుర్నిచక్కగా పెంచాలని చాలా కఠిన నిబంధనలు అమలు పరిచేది తల్లి డోరిస్ చక్కని రచయిత్రి ఆమె రచనలు ద గ్రాస్ ఈజ్ సింగింగ్, అండర్ మై స్కిన్, ద […]
విస్లావా సింబోర్స్కా 1996 లో నోబెల్
విస్లావా సింబోర్స్కా నోబెల్ బహుమతి పొందిన మొదటి పోలెండ్ కవయిత్రి. ఈమె 1923వ పశ్చిమ పోలెండ్‌లోని కోర్ణిక్ పట్టణంలో జన్మించింది.విస్లావా సింబోర్స్కా తండ్రి మంచి పాఠకులు ఎన్నో పుస్తకాలు చదివి ఇంట్లో చర్చించేవాడు.తండ్రి ప్రభావం తోనే విస్లావా అయిదేళ్ళ వయసు నుంచే కవితలు రాసింది.1945 నుండి 1948 వరకు జగియెలోనియన్ విశ్వవిద్యాలయంలో పోలీష్ ప్రాచీన భాషాశాస్త్రం, సామాజిక శాస్త్రం చదువుకొంది.1952లో ‘అందుకనే మనం బతికున్నాం’ శీర్షికన మొదట కవితా సంకలనం వచ్చింది.ఆమె కవితా ధోరణి చాలా స్పష్టంగా, […]
గబ్రియేలా మిస్ట్రాల్ 1945 లో నోబెల్
గబ్రియేలా మిస్ట్రాల్ లాటిన్ అమెరికాలో 1889వ సంవత్సరంలో జన్మించింది. తల్లి తండ్రి ఇద్దరు కవిత్వం రాసేవారు తండ్రి పెంచిన పూల తోటలో పూలతోను, పక్షులతోను మాట్లాడుకుంటూ పెరిగిన మిస్ట్రాల్ తండ్రి కుటుంబాన్ని పట్టించుకోక పోవడంతో బ్రతుకుదెరువుకోసం 16 ఏళ్ళ వయస్సులోనే పల్లెలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టాల్సి వచ్చింది. విద్యావ్యవస్థ వైఫల్యాల పైన అనేక వ్యాసాలు రాసింది. తన కవిత్వాన్ని అత్యంత ప్రభావితం చేసిన ఇటలీ కవి గాబ్రియేలా డి అన్నుంజియొ నుండి ‘గబ్రియేలా’ అనే పదాన్నీ, తీసుకొని […]
సీగ్రిడ్ ఇండ్సెట్ 1928 లో నోబెల్
సీగ్రిడ్ ఇండ్సెట్ నార్వే రచయిత్రి. ఈమె 1882 లో డెన్మార్క్ నగరంలో జన్మించింది. సీగ్రిడ్ తండ్రి తన 11వ ఏట మరణించడంతో ఆ విషాదం ఆమె బాల్యంలోను, యవ్వనంలో ను బలమైన ముద్ర వేసింది.మధ్యయుగం లోని స్కాండినేవియా దేశపు జీవితాన్ని శక్తివంతంగా, కళ్ళకు కట్టినట్లు చిత్రించినందుకు, ఆ నేపధ్యపు నవలలు క్రిస్టిన్ లవ్రన్స్ డాట్ట్టెర్, ఓలవ్ ఔడున్ స్సోన్ వ్రాసినందుకు ఆమెకు 1928 లో నోబెల్‌బహుమతి ప్రదానం చేశారు. 1949లో పరమపదించిన సీగ్రిడ్ ఇండ్సెంట్ స్మృతి చిహ్నంగా […]
పెర్ల్ ఎస్ బక్ 1938 లో నోబెల్
1892లో అమెరికాలో జన్మించారు బాల్యం, యవ్వనం చైనాలో గడిపి చివరకు అమెరికాలోనే మరణించారు 1931లో పెర్ల్ నవల ‘ద గుడ్ ఎర్త్’ ప్రచురణ అయ్యింది.1935లో ఆ నవలకు పులిట్జెర్ బహుమతి, హోవెల్స్ పతకం లభించాయి. ఈమె అత్యంత ప్రజాదరణ కలిగిన రచయిత్రి, మానవతావాది, స్త్రీల హక్కుల కోసం పని చేశారు. ఆసియా పత్రికకు సంపాదకురాలు చైనా జీవితాన్ని ప్రతిబింబించిన రచనలు చేసి ఖ్యాతిపొందిన పెర్ల్ ఎస్ బక్ కు 1938లో నోబెల్‌బహుమతి లభించింది. అమెరికా పెర్ల్ స్మారక […]
