దివ్యాంగులకో భవిష్యత్తు
నాసిక్ లోని పంపల్ గావ్ బహు లలో ఘర్ కుల్ పరివార్ పేరుతో దివ్యాంగ బాలికలు మహిళల కోసం హోమ్ ప్రారంభించింది విద్యా ఫడ్కె. మహారాష్ట్రలో ఇదే తొలి హోమ్ విద్యా ఫడ్కె. నాసిక్ లోని దివ్యాంగ ప్రత్యేక పాఠశాల లో హెచ్ ఎం గా పనిచేస్తున్నారు. 32 ఏళ్లుగా దివ్యాంగ బాల బాలికలకు చదువు నేర్పిస్తున్న విద్య వారికి చదువుతో పాటు వివిధ రకాల నైపుణ్యాల నేర్పే హోమ్ ఉంటే బాగుంటుంది అనుకుంది. ఆమె నెలకొల్పిన […]
ఆదివాసీలకు సాయం
ఆదివాసీ ఉత్పత్తులను ఆన్ లైన్ లో ప్రపంచానికి అందిస్తోంది కావ్య సక్సేనా. రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన కావ్య ఇండియన్ ఆయిల్ లో పనిచేసింది మహేంద్ర అండ్ మహేంద్ర ఆర్థిక సాయంతో గ్రామీణ భారతదేశ ప్రత్యేకతలు వివరిస్తూ వీడియోలు పోస్ట్ చేసేది. ఆదివాసీల ఉత్పత్తులు పరిచయం చేయాలనుకుంది ఒడిస్సా లోని కోరాపుట్ లో ఉంటూ అక్కడ దొరికే నాణ్యమైన పసుపు తో సబ్బులు తయారు చేసి అమ్మిస్తోంది. ఒక గ్రామాన్నే దత్తత తీసుకుంది. ఆదివాసి మహిళలు […]
ఆధ్యాత్మిక డిజైన్లు
రాధాకృష్ణుల ప్రణయ సౌందర్యానికి ఎప్పటినుంచో చీరలపై డిజైన్లు గా చేస్తున్నారు కళాకారులు. కేరళ నుంచి ఈ హ్యాండ్ ప్రింటెడ్ రాధాకృష్ణ చీరలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. అలాగే కలంకారి డిజైన్ లలో రాధాకృష్ణుని బాల్యం, నెమళ్ళు, గుళ్లు, గోపురాలు కూడా ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ల కిందే లెక్క. పల్లూ డిజైన్ లేక కాకుండా లెహంగాలు, దుపట్టాలు అనార్కలి ల్లో కూడా ఉదయ్ పూర్ కళాకారులు శ్రీకృష్ణుని చిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.ఈ డిజైన్లలో విలువైన పచ్చలు, ముత్యాలు, జర్దోసి, గొట్ట […]
మేలు చేసే మెంతులు
పాలిచ్చే తల్లులకు మెంతులు మేలు చేస్తాయని అంటున్నారు ఎక్సపర్ట్స్. మెంతుల్లో ఉండే డయాస్జోనిక్ చనుబాల ఉత్పత్తి అయ్యే మామరీ గ్రంథుల లోని కణజాలం పెరుగుదలకు తోడ్పడుతుంది. బెల్లం, శొంఠి, డ్రైఫ్రూట్స్, నెయ్యి జోడించిన మెంతుల లడ్డులను పాలిచ్చే తల్లులు తినవచ్చు. దక్షిణాది రాష్ట్రాల్లో మెంతి పొడి, పసుపు, శొంఠి, బెల్లం ఇతర మూలికలు కలిపి ఉడికించి హల్వా ఉండలాగా చేసి పరగడుపున తినిపించటం ఆనవాయితీ. ఈ తియ్యని ఉండలతో బరువు పెరుగుతారని భయం ఉంటే మెంతులను రాత్రంతా […]
నా ప్రపంచమే స్ఫూర్తి
బాల్య జ్ఞాపకాల దగ్గర నుంచి 15వ శతాబ్దపు ఇటలీ పెయింటింగ్స్ కూడా నాకు స్ఫూర్తి ఇస్తాయి అంటుంది ముంబై ఆర్టిస్ట్ బిరాజ్ దోడియా ఆమె తల్లిదండ్రులు అంజు అతుల్ దోడియా లు పేరున్న ఆర్టిస్ట్ లు ఆమె చిన్నతనాన తల్లిదండ్రులు ఆర్ట్ స్టూడియోలోనే గడిపేది స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ షికాగో, న్యూయార్క్ యూనివర్సిటీల్లో ఆర్ట్ చదువుకోండి బిరాజ్. పెయింటింగ్ ప్రింట్ మేకింగ్, శిల్పా నిర్మాణంలో గట్టి పట్టు సంపాదించింది. ఆర్ట్ స్కూల్ నన్ను నేను […]
నిఖత్ జరీన్ కు స్వర్ణం
ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. టర్కీ లో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం ప్రపంచ సీనియర్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆమె స్వర్ణం సాధించింది. 25ఏళ్ల నిఖిత్ నిజామాబాద్ కు చెందిన అమ్మాయి. భారత్ నుంచి ఇప్పటి వరకు మేరీ కోమ్ ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా నిలవగా మేరీకోమ్, సరితాదేవి, జెన్సీ ఆర్ ఎల్, లేఖ మహిళా ఛాంపియన్లు గా నిలిచారు తాజాగా […]
ఆమె దారే వేరు
71 ఏళ్ల రాధా మణి 11 వాహనాలు నడపడం తో లైసెన్స్ పొందారు. ఇప్పుడు మహిళల కోసమే డ్రైవింగ్ స్కూల్ నడుపుతున్నారు. కేరళకు చెందిన రాజమణి భర్త ఏ టు జెడ్ అనే డ్రైవింగ్ స్కూల్ నడిపేవారు. 1970 లో ఆయన మరణించాక అది మూల పడింది. ఇద్దరు కొడుకుల సపోర్టుతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరిన రాధామణి ట్రాక్టర్, రోడ్ రోలర్ వంటివి నడపడం నేర్చుకొన్నారు. 1993లో స్కూటీ లైసెన్స్ తీసుకున్న రాధా మణి 1998 లో […]
బిజినెస్ స్టార్
ఈ బొమ్మ నిజంగా బంగారు బొమ్మే విశ్రాంతి తీసుకో వలసిన 95 ఏళ్ల వయసులో హర్బజన్ కౌర్ తీపి వంటల వ్యాపారం మొదలు పెట్టి సూపర్ హిట్ చేశారు. బేసన్ కి బర్ఫీ ఆమె స్పెషల్. హర్భజన్ పేరుతో ఈ భర్తీ అమ్మటం మొదలు పెట్టారు హర్బజన్ కౌర్. పంజాబ్ లోని చండీఘడ్ కి చెందిన ఈమె కొన్నేళ్ళ క్రితం ఈ తియ్యని పిండి వంటలు వ్యాపారం మొదలు పెట్టారు .
కూతురు కోసం కొత్త అవతారం
భర్త చనిపోయాక కూతురిని పెంచుకోవటం కోసం పురుష వేషం కట్టి ముత్తు మాస్టర్ గా మారిపోయింది తూతుకుడి జిల్లా కు చెందిన పెచ్చియమ్మాళ్ కు 20 ఏళ్ల వయసు లో గర్భం తో ఉండగా భర్త చనిపోయాడు. ఆ తర్వాత కూతురు పుట్టింది. ఒంటరి స్త్రీ ఎన్ని ఇబ్బందులు పడాలో అన్నీ పడి చివరకు మగ అవతారం ఎత్తింది. కుతూ నాయకన్ పట్టి లో తన పేరు ముత్తు గా చెప్పుకొని హోటల్ లో పరోటా మాస్టర్ […]
మెహందీ ట్రెండ్స్
పెళ్లిళ్లు ఫంక్షన్ లలో గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆనవాయితీ ఇప్పుడు అనేక టెక్నిక్స్ డిజైన్స్ తో మెహందీ ఒక ఫ్యాషన్ ట్రెండ్స్ అయింది కూడా. ప్రస్తుతం వాడుకలో ఉన్న మెహందీ స్టయిల్స్ లో అరేబియన్ శైలిలో పూల నమూనాలే ఉంటాయి. ఇది అరబిక్ పెయింటింగ్స్ లాంటివి ఉత్తరాఫ్రికా స్టయిల్స్ లో కూడా పూల డిజైన్ లు ఉంటాయి. ఇక భారతీయ, పాకిస్తానీ శైలిలో చుక్కలు గీతలు నమూనాలే అధికం. ఇండోనేషియా దక్షిణాసియా శైలిలో పూలు, లతలు, చుక్కలు, […]
వెండి మెరుపుల కుండీలు
ఇంటికి ఇండోర్ ప్లాంటే అందమని తేలిపోయాక ఆ పచ్చని మొక్కలు పెట్టుకునే కుండీలు ప్రత్యేకంగా ఉండాలంటున్నారు ఎక్సపర్ట్స్ . సిరామిక్, ప్లాస్టిక్ కుండీలు వెనక్కి పోయి అల్యూమినియం తో చేసిన సిల్వర్ మెటాలిక్ ఫినిషింగ్ కుండీలు వచ్చాయి. పచ్చని మొక్కలు పెట్టుకునే ఈ వెండి మెరుపులు కుండీలు ఇంటీరియర్ డిజైనింగ్ లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నాయి. అందమైన ఆకృతులతో కళ్ళని కట్టిపడేసే ఈ వెండి మెరుపుల కుండీలు హాల్లో 1 ఉన్న అందమే అందం.
స్టార్స్ వెయిటింగ్
లాక్ డౌన్ లో బ్రేకప్ కాన్సెప్ట్ పైన ఒక రీల్ చేస్తే పది లక్షల మంది చూశారు. హాస్యం ఎంచుకొని నిహారిక ఎన్. ఎం చేస్తున్నా వీడియోలను 22 లక్షల మంది చూస్తారు. ఆమె ఫాలోవర్స్ రకుల్, రెజీనా, ఖుష్బూ వంటి వాళ్లు ఉన్నారు. ఇన్ స్టా లో పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న నిహారికతో ఇప్పుడు మహేష్ బాబు, హీరో యష్, అజయ్ దేవగన్, షాహిద్ కపూర్ కూడా ఆమెతో రీల్స్ చేస్తున్నారు. సినిమా […]
మితాహారం తో ఆయుష్షు
మితాహారం ఆరోగ్యకరమని చెప్తారు ప్రాచీనులు. తక్కువ క్యాలరీలు ఆహారాన్ని నియమిత సమయంలో తింటే ఎక్కువ కాలం జీవిస్తారని హోవార్డ్ హ్యూజెన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు చెబుతున్నారు. పగటిపూట మనం చురుకుగా ఉండే సమయంలో తగు మోతాదులో ఆహారం తీసుకుంటే దీర్ఘకాలం జీవించవచ్చు అంటున్నారు. తక్కువ ఆహారంతో వయస్సుతోపాటు పెరిగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది ఆయుష్షు పెరుగుతోందని వారు చేసిన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఇది కొత్త చరిత్ర
రెండేళ్ల పాటు హైకోర్టును ఆశ్రయించి చివరకు మొదటి మహిళా జేఎల్ఎం గా చరిత్ర సృష్టించింది. 21 సంవత్సరాల శిరీష సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం బిబ్బర్సీ గ్రామానికి చెందిన శిరీష మేడ్చల్ లో ఐ.ఐ.టి పూర్తి చేసింది ట్రాన్స్ కో లో లైన్ మెన్ పోస్టులు ఉండటంతో దరఖాస్తు చేసుకుంది. ఈమెతో పాటు 32 మంది మహిళలకు కూడా స్తంభం ఎక్కే పరీక్షలు ట్రాన్స్ కో నిర్వహించలేదు. శిరీష తో సహా ఎనిమిది మంది కోర్టును ఆశ్రయించి […]
కోట్ల మందికి స్ఫూర్తి
మౌత్ అండ్ ఫుట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ఆఫ్ ది వరల్డ్ అసోసియేషన్ పురస్కారం అందుకుంది సారా టొల్చి. సారా చేతులు లేకుండా పుట్టింది మొదటి నుంచి చిత్రకళ అంటే ఇష్టం. పెయింటింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కాళ్ళతోనే బొమ్మలు గీస్తూ తన ప్రతిభను ప్రదర్శిస్తుంది సారా. బెల్జియంకు చెందిన సారా ఇక్కడి బ్రస్సెల్స్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఆర్ట్స్ లో తన పెయింటింగ్స్ ప్రదర్శించి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. వివాహమై ఒక పాపకు తల్లి అయిన […]
హస్తకళ వారధి బృందా !
భారతీయ హస్తకళల సాంప్రదాయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యం అంటారు బృందా దత్. దేశంలో కళాకారులు ఏ మూల ఉన్నా అక్కడ నేను ఉంటాను అని చెప్పే బృందా కు హస్త కళల పట్ల అపారమైన గౌరవం. గుజరాత్లోని గాంధీ నగర్ లో మోరి డైనమిక్ డిజైన్ స్టూడియో స్థాపించి దేశం నలుమూలల ఉన్న క్రాఫ్ట్ కమ్యూనిటీ లతో కలిసి పనిచేస్తూ కళ ఎప్పటికీ నిలిచే లా వినూత్నమైన డిజైన్ రూపొందిస్తోంది బృందా దత్. ఎంతోమంది గ్రామీణ […]
ఇల్లంతా అందం
బోన్సాయ్ మొక్క హాల్లో టేబుల్ పైన పెట్టుకుంటే ఎనలేని అందం. ఇప్పుడా బోన్సాయ్ వృక్షాల పైనా మినియేచర్ ట్రీ హట్స్ వస్తున్నాయి, ట్రీ హట్స్ కట్టాలి అనుకున్నప్పుడు బలమైన కొమ్మలు ఉండేలా చూసుకుని పలచని చెక్కతో బాల్కనీ ఉండేలా ఉన్న ఇంటిని తయారు చేస్తారు. మొక్క కాండానికి సరిపోయేలా బాల్కనీ కి రంధ్రం చేసి అందులో నుంచి మొక్క పైకి వచ్చేలా చేస్తారు. ఎక్కువ కొమ్మలు కావాలన్నా వాటి మధ్య ఇమిడేలా చక్కని ఇల్లు తయారు చేసి […]
సరైన క్లిక్
ఇప్పుడు మిర్రర్ సెల్ఫీలు ట్రెండ్. అద్దం ముందు నిలబడి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఈ సెల్ఫీలు బాగా రావాలంటే నిలువుటద్దం ని కొంచెం వెనక్కి వంచి ఛాతి భాగం నుంచి సెల్ఫీ తీస్తే బాగా వస్తుంది. మెడ సాగదీసి తల కాస్త పక్కకి వంచి గదవని కొంచెం ముందుకు తెచ్చే క్లిక్ మనిపించాలి. సరైన వెలుతురు లేకపోతే సెల్ఫీ సరిగ్గా రానట్లే అయితే ఆ లైటింగ్ అద్దం ఫోన్ తెరపైనా నేరుగా పడకూడదు. […]
దీపా ఎంతో ప్రత్యేకం
కర్ణాటకలో పి.హెచ్.డి చేస్తున్న తొలి ట్రాన్సజెండర్ గా చరిత్ర సృష్టించింది దీపా. చామరాజనగర్ హెగ్గవాడిపుర దీపా పుట్టిన ఊరు. పది పన్నెండేళ్ళ వయసులో ఆమె ట్రాన్స్ జెండర్ గా గుర్తించి ఇంట్లో నుంచి తరిమేశారు తల్లిదండ్రులు. ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ కోసం పనిచేసే సమతామరహళ్లి లో చేరి పార్ట్ టైం పనిచేస్తూ చదువుకొని దీప ఉన్న ఈ సొసైటీలో ఇప్పుడు ఆమె అధ్యక్షురాలు. డిగ్రీ తర్వాత మైసూర్ విశ్వవిద్యాలయంలో ఎంఎ చేసేప్పుడు అడ్మిషన్స్ దరఖాస్తులు ట్రాన్స్ జెండర్ […]
15 నిమిషాలు చాలు
విటమిన్ డి ఎముకల నిర్మాణానికి కీలకం కాల్షియం, ఫాస్పరస్, ఖనిజాలను ఎముకల్లోకి శోషించుకొనేందుకు విటమిన్-డి అవసరం. శరీరంలో విటమిన్ లేకపోతే ఆహారంలో కేవలం 15 శాతాన్ని మాత్రమే శరీరం గ్రహించగలుగుతుంది. ఈ విటమిన్ కేవలం కొవ్వు లో మాత్రం కరిగే పదార్థం సూర్యరశ్మి లో ఉండే యు వి బి కిరణాలు మన చర్మంపై పడినప్పుడు శరీరంలో విటమిన్-డి తయారవుతుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్యలో కనీసం పదిహేను ఇరవై నిమిషాలు […]
