నాననిస్తే ఆరోగ్యం
గింజలను నానపెట్టి తింటే అందులో ఉన్న ఇరాన్ క్యాల్షియం జింక్ వంటి ముఖ్యమైన పోషకాలను శరీరం సులభంగా గ్రహించ గలుగుతుంది. ప్రీరాడికల్స్ తొలగించటంలో వాల్ నట్స్ బాదం పలుకులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. నానబెట్టిన గింజలు నిత్య యవ్వనాన్ని ఇస్తాయి. రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉంచేందుకు నట్స్ సాయపడతాయి ముఖ్యంగా డయాబెటిస్ రోగులు నానపెట్టిన నట్స్ తినాలి.కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది బరువు తగ్గాలనుకొనే వారు పిస్తా పలుకులు లేదా వాల్ నట్స్ […]
సంతోషంతోనే అందం
నిత్యం సంతోషంగా ఉండే వాళ్లలో హ్యాపీ హార్మోన్ లు ఉత్పత్తి అవుతాయి. అవి శరీరమంతా వ్యాపించి,ప్రతి అవయవానికీ సమాచారం అందించి జీవక్రియలు సక్రమంగా జరిగేలా చూస్తాయి ముఖ్యంగా మెదడును ఉత్సాహంగా ఉంచుతాయి హ్యాపీ హార్మోన్స్ లో డోపమైన్,సెరోటోనిన్,ఆక్సిటోసిన్ ఎండోర్షిన్ లు అన్ని కలసి అనారోగ్యం,మానసిక వత్తిడి నుంచి ఉపశమన్నానిస్తాయి. దీనితో రక్తప్రసరణ సవ్యంగా జరిగి కండరాలకు మంచి వ్యాయామం అందుతోంది. ముఖ చర్మం ఆరోగ్యంగా మారి కొత్త మెరుపు సంతరించుకొంటుంది.
క్రికెట్ తోనే ఫ్యూచర్ కూడా
వన్డే ప్రపంచ కప్ లో నిరాశ ఎదురైంది. ఇంకో ప్రపంచ కప్ ఆడే పరిస్థితి లేదు అలాంటప్పుడు క్రికెట్ లో కొనసాగటం లో అర్థం లేదు. అందుకే వీడ్కోలు పలికాను అంటోంది మిథాలీ రాజ్.రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ లో ఎన్నో రికార్డ్ లు అందుకొన్న మిథాలీ ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికారు. భవిష్యత్ లో కూడా కెరీర్ క్రికెట్ మాత్రమే. కోచ్ గా ఉండచ్చు లేదా వ్యాఖ్యాత గానో నన్ను చూడచ్చు. దేశం కోసం […]
పాలతో అందం
పాలతో చర్మానికి మంచి పోషణ అందుతుందని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. పచ్చి పాలతో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి తేమ అందించి పొడిబార నివ్వదు అందుకే పాలు మంచి క్లెన్స్‌ర్ గా టోనర్ లుగా పనిచేస్తాయి. పచ్చి పాలను మొహానికి రాసి ఐదు నిమిషాలు మర్దన చేసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. అలాగే కుంకుమ పువ్వు లో యాంటీ ఏజింగ్ ఔషధ గుణాలున్నాయి కొన్ని కుంకుమ పువ్వు రేకలను పచ్చి పాలలో నానపెట్టాలి. […]
మహిళలకోసం టాయ్ లెస్
ఏ పని చేసిన సామాజిక బాధ్యత కోణం నుంచే ఆలోచిస్తాను నేను మొదలుపెట్టిన పూర్ లివింగ్ పేపర్ పెన్ కాన్సెప్ట్ మొదలైనవి, దేశవిదేశాల్లో ఆదరణ పొందాయి. ఇప్పుడు ప్రారంభించిన ‘టాయ్ లెస్’ స్టార్టప్ కేరళ మొత్తం వ్యాప్తి చేయాలన్నదే నా లక్ష్యం అంటుంది లక్ష్మీమీనన్. కేరళ కు చెందిన లక్ష్మి మీనన్ ప్రయాణాలు చేసే మహిళలకు శుభ్రమైన వాష్ రూమ్స్ గురించి సమాచారం సదుపాయం కలిగించేందుకు టాయ్ లెస్ స్టార్టప్ ని ప్రారంభించారు. మహిళలు కాసేపు ఫ్రెషప్ […]
ఒక చిన్న బ్రేక్ అవసరం
బిజీ లైఫ్ వల్లే మహిళలు వత్తిడి ని గురవుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంట్లో పని ఒత్తిడి,కెరీర్ ఒత్తిడి నుంచి మానసికంగా స్ట్రాంగ్ అయ్యేందుకు రెండు నెలలకో చిన్న బ్రేక్ తీసుకుని ఏదైనా ప్రయాణం చేయాలి. కొత్త ప్రదేశం ఆటోమేటిక్ గా ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిదీ అనుకొన్న టైమ్ టేబుల్ ప్రకారం చేసి తీరాలనే భారం వదిలేయాలి. ప్రతిదీ అనుకున్న సమయం లోనే పూర్తి అవుతుందన్న గ్యారంటీ ఉండదు. లక్ష్యాలు మార్చుకుంటూ ఉండొచ్చు. ఐరన్, క్యాల్షియం ఉండే ఆహారం […]
నాటి క్రేజీ స్టయిల్
బెల్ స్లీవ్స్ 60,70 ల నాటి ఫ్యాషన్.. ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని స్టేట్ మెంట్ స్లీవ్స్ అంటున్నారు భుజం దగ్గర బిగుతుగా ఉండి కిందికి వచ్చేసరికి వెడల్పుగా గంట ఆకారంలో స్లీవ్స్ ఉంటాయి వీటిలో ఆఫ్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ త్రీ ఫోర్త్ మోచేతి వరకు మన ఇష్టం కొద్దీ కుట్టించుకోవచ్చు. మోచేతి వరకు బిగుతుగా ఉండి కిందకు బెల్ లాగా ఉండే ఫ్యాషన్ ఇప్పటి ట్రెండ్. జార్జెట్ చీరెల పైకి బెల్ స్లీవ్స్ […]
ఇది మహాదానం
అన్నదానం మాత్రమే కాదు రక్త దానం కూడా మహాదానం అంటుంది ఆశ సూర్యనారాయణ్ బెంగళూరుకు చెందిన ఆశా ను గోల్డెన్ బ్లడ్ డోనర్ అంటుంటారు అభిమానులు. 24 సంవత్సరాల వయసు నుంచి ఆమె నిరంతరం రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడామె వయస్సు 55 సంవత్సరాలు రక్తదానం తో మొదలైన ఆమె సమాజ సేవ అక్కడితో ఆగిపోలేదు కోవిడ్ సమయంలో అన్నదానం అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయటం. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆమె చేసిన మంచి పనుల్లో కొన్ని.
మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్
ఇదొక వింత మ్యూజియం వివిధ సంస్థలకు చెందిన ఫెయిల్యూర్ వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి. గొప్ప కంపెనీలు తయారు చేసిన ఎన్నో వస్తువులు మార్కెట్లో ఆదరణ పొందలేదు. బిజినెస్ పాఠాల్లా నిలిచిన ఈ ఉత్పత్తులు గురించి ప్రపంచానికి తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో 2017లో శామ్యూల్ వెస్ట్ అనే ఒక ఆయన మ్యూజియం ఏర్పాటు చేశాడు. మ్యూజియం ఆఫ్ ఫెయిల్యూర్ పేరుతో స్వీడన్ లోని హెల్సింగ్‌బోర్గ్ లో ఉందీ మ్యూజియం. దీన్ని చూడాలనుకుంటే ఈ మ్యూజియం సైట్లోని వర్చువల్ టూర్ […]
ఉప్పు హోటల్
ఈ హోటల్ లో అడుగు పెట్టిన వాళ్ళని దయచేసి గోడలు నాకొద్దు అని చెప్తారట నిర్వాహకులు. ఎందుకంటే ఈ హోటల్ లోని గోడలు పైకప్పు మొదలు కుర్చీలు టేబుళ్లు వరకు అన్ని ఉప్పు తోనే నిర్మించారు. బొలీవియా లోని ‘పాలాసియో డి సాల్’ అనే హోటల్ ప్రపంచంలోనే ఏకైక సాల్ట్ హోటల్ విశాలమైన 12 గదులు డైనింగ్ హాల్ ఈత కొలను వంటి సకల సౌకర్యాలతో ఉండే ఈ హోటల్ ఉప్పుతో మెరిసిపోతుంది. ఇక్కడి ‘ సాలార్ […]
చూసి కొనండి
ఇప్పుడన్ని ఆన్ లైన్ లో చూసి ఆర్డర్ ఇవ్వటమే. తీరా ఇంటికి వచ్చాక అసంతృప్తిగా ఉంటుంది. చూసి నచ్చితేనే కొనటం లేదా వాపస్ పంపించే ఏర్పాట్లు ఉంటాయి కనుక ముందుగా ఆర్డర్ చేసిన దుస్తుల నాణ్యత చూడాలి. అంచుల నుంచి దారాలు ఊడుతున్నాయా కుట్టు సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆర్డర్ ఇచ్చిన డ్రెస్ చూసేందుకు రంగు బావుండచ్చు కానీ చర్మానికి మెత్తగా తగులుతుందో లేదో మెడ పైన వస్త్రం తో రుద్ది చూసుకోవాలి. ఒకసారి […]
ఫోల్డింగ్ బేబీ బెడ్
ప్రయాణాల్లో పసిపిల్లలు ప్రశాంతంగా నిద్ర పోయేలా చూడటం తల్లులకు కాస్త కష్టమే. మేలుకుని ఆడుకొన్న అంత సేపు పర్లేదు కానీ నిద్ర వస్తే మాత్రం వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఫోల్డింగ్ బేబీ బెడ్ లో అలాంటి సమస్యలు ఏవీ లేకుండా హాయిగా ప్రయాణాలు చేసేయచ్చు. హై క్వాలిటీ లగ్జరీ కెపాసిటీ కలిగిన ఈ బ్యాగ్ ని పిల్లల వస్తువులు అన్నీ చక్కగా తట్టుకునేందుకు వాళ్ళకి నిద్ర వస్తే దాన్ని బెడ్ గా మార్చేందుకు సౌకర్యంగా ఉంటుంది. తల […]
ఆకలి తీర్చే ఫ్రిజ్
ది పబ్లిక్ ఫౌండేషన్ పేరుతో ఆహారం తో పాటు దుస్తులు, స్టేషనరీ, నిత్యావసరాలు, బొమ్మలు పేదలకు పంచి పెడుతోంది చెన్నై కు చెందిన ఫాతిమా జాస్మిన్. ఈమె దంత వైద్యురాలు పేదల కోసం నిత్యం భోజనం పెట్టాలి అనుకుందామె. అందుకే ఫ్రిజ్ లను ఏర్పాటు చేసి రోజంతా అందులో ఉండేలా ఆహారపదార్థాలు పెడుతుంది. చెన్నై లోని 15 చోట్ల ఫ్రిజ్ లు పేదలకు అందుబాటులో ఉన్నాయి. వాలంటీర్ల సాయంతో హోటళ్లలో ఆహారం కొని, పండ్లు, మంచినీళ్లు, బిస్కెట్లు […]
లోటు తీరిపోతుంది
ఇప్పటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక్క బిడ్డ ఉంటే చాలు అనుకుంటున్నారు తల్లిదండ్రులు. అలా ఒక్కరే ఉన్నా ఇంట్లో పిల్లలు వంటరితనం ఫీలవకుండా దగ్గర లో వారి కజిన్స్ ఉంటే వాళ్లకు అనుబంధం ఏర్పడేలా చూడాలి. అలాగే బంధుత్వానికి మించిన బలం స్నేహానికి ఉంది. స్నేహితులు ఉంటే ఒంటరి భావన పిల్లల్లో కలగదు. ఇంటికి పరిమితం చేసే కొద్ది ఒంటరితనం పెరుగుతుంది. పుట్టిన రోజులు, పండుగ రోజులు ఒకే ఈడు పిల్లలు ఒకే చోట కలిసేలా చూడాలి. […]
మానసిక ఒత్తిడి మాయం
రుచి, వాసనతో పాటు పుదీనా లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పుదీనా లో ఎ-విటమిన్, ఐరన్ మెగ్నీషియం తదితరాలు ఉన్నందున ఇది మంచి పోషకాహారం. పుదీనా పరిమళంతో అరోమా థెరపీ లు చేస్తున్నారు. దీనితో తయారు చేసే పెప్పర్ మింట్ ఆయిల్ మానసిక వత్తిడి తగ్గుతుంది. మెదడు పనితీరు కూడా పెరుగుతుంది. పాలిచ్చే తల్లులకు చనుమొనలు వాచిన, పగుళ్ళు వచ్చిన పుదీనా ఆకుల పేస్ట్ రాస్తే తగ్గిపోతుంది.
మళ్లీ ఆఫ్గాన్ వెళ్తా
విద్యతో జీవితాలు ఎట్లా మారుతాయో తెలుసుకొన్నాను. భారతదేశం నన్ను అక్కున చేర్చుకుంది. ఈ దేశం చూపిన ప్రేమ ఆప్యాయత మరువలేను. లండన్ లో కోర్స్ పూర్తి కాగానే ఆఫ్గాన్ వెళ్తాను అక్కడ ఆడపిల్లల మహిళల చదువుల కోసం కృషి చేస్తా నంటోంది లైలా రాసేఖ్. ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో పుట్టిన లైలా తల్లే వ్యభిచార ముఠాకు అప్పగించింది. ఏడేళ్ల వయసు నుంచి ఆ నరక కూపం లో గడిపిన లైలా ను డబ్ల్యూ ఏ డబ్ల్యూ […]
ఇక్కడొక మ్యాజిక్
ఈ నగరంలో ఏదో ఒక మ్యాజిక్ ఉంది. అది మనల్ని కట్టిపడేస్తుంది ఇది ఒక డివైన్ సౌందర్యం అంటారు పర్యాటకులు. ఎల్లో సిటీ గురించి చెబుతూ మెక్సికో లోని ఒక ఊరు ఇజామెల్ ఈ నగరంలో ప్రతి భవనం ఇల్లు సమస్తం పచ్చ రంగులో ఉంటాయి. ఇక్కడి ప్రజలు సూర్య దేవతారాధకులు ఆయిన పై భక్తితోనే ఊరంతా పసుపు రంగు వేసుకున్నారు. మెక్సికన్ సంస్కృతుల సమ్మేళనంతో కనిపించే ఇక్కడి కొలోనియల్ ఆర్కిటెక్చర్ ఆకట్టుకుంటుంది.
అక్కడ యాక్షన్ కు స్కోప్ లేదు
వెండితెర పైనా గ్లామర్ కు ఉన్నంత స్కోప్ యాక్షన్ కు ఉండదు. అరణ్యక్ వెబ్ సిరీస్ నాకు అనుకోని సువర్ణ అవకాశం అంటుంది రవీనాటాండన్.పత్తర్ కే ఫూల్ సినిమా లో బాలీవుడ్ లోకి వచ్చిన రవీనా అగ్ర హీరోయిన్ గా పదేళ్లపాటు స్టార్స్ సరసన నటించారు. 2004లో పెళ్లి చేసుకొని వెండితెరకు దూరంగా ఉంది. గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన అరణ్యక్ లో ఇన్ స్పెక్టర్ కస్తూరి డోగ్రా పాత్రలో చాలా పవర్ ఫుల్ […]
అమ్మాయిలు జాగ్రత్త
ఆడపిల్లల విషయంలో నేరాలు, ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆడపిల్లలు కొన్ని జాగ్రత్తలు పాటించండి అంటున్నారు పోలీసు అధికారులు. కాస్త పరిచయం ఉన్నంత మాత్రాన వాళ్లను నమ్మి బైక్ పైన కార్ లోనూ వెళ్ళవద్దు. అలాగే రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణాలు వద్దు. తప్పనిసరి అయితే ఆటో అతని ముందే ఆటో నెంబర్ ఇంట్లో వాళ్లకి పంపించి మరీ ఎక్కండి. ఏదైనా అనుమానం అనిపిస్తే 100 నంబర్ కి కాల్ చేయాలి దగ్గరలో ఉన్న పోలీస్ […]
వాళ్ళే నాకు స్ఫూర్తి
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి విజేతలైన ఎంతో మంది నాకు ప్రేరణ. నేను గెలుచుకున్న గోల్డ్ మెడల్ నా పసి తనంలోనే కోల్పోయిన మా నాన్నకు అంకితం ఇస్తున్నాను. నా సక్సెస్ వెనుక మా అమ్మ నా కోచ్ ప్రోత్సాహం బలం ఉంది అంటోంది సుప్రీత్ కచ్ఛాప్. హర్యానాలోని పంచకుల లో జరుగుతున్నాఖేలో ఇండియా యూత్ అథ్లెటిక్స్‌లో జార్ఖండ్‌కు చెందిన సుప్రీతి కచ్చప్ 3000 మీటర్లను 9 నిమిషాల,46.14 సెకన్లలో పరుగెత్తి సరికొత్త రికార్డు సృష్టించింది. ట్రాక్ […]
