Tuesday, 29 Sep, 2026

పఠనం దివ్యౌషధం

ఈ పుస్తకం చేతిలో ఉంటే ప్రశాంతత ఉన్నట్లే ఇప్పుడు నేను విలియం కాల్ డింపుల్ రాసిన వైట్ మొఘల్స్ చదువుతున్నారు ప్రపంచ కప్ విజేత గా భారత్ ను మార్చటంలో ఆయన పాత్ర కీలకం. జట్టు ఎలా ఓకే పట్టుతో ముందుకు వెళ్లాలో సానుకూల దృక్పథం తో ఉండాలో నూరిపోశారు ఆయన మనోబలం దివ్యౌషధం అని పుస్తకం ద్వారా నే తెలుసుకున్నాను అంటుంది మిథాలి రాజ్. క్రికెట్ క్రేజ్ లోకి వెళ్ళ వలసిన సమయం వచ్చే వరకు […]

‘అలా కుదిరింది మరి’

సెంటిమెంట్లు తప్పే కానీ అలా కుదిరింది మరి. ఒక సారి ఐపీఎల్ మ్యాచ్ కు వెళ్ళినప్పుడు మరిచిపోయి రెండు వాచ్ లు పెట్టు పోయాను మా జట్టు గెలిచింది. అలాగే కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉన్నాను అప్పుడు మా టీమ్ కే గెలుపు ఇక ప్రతి మ్యాచ్ కు రెండు వాచ్ లు కాలు మీద కాలు సెంటి మెంటయి కూర్చున్నాయి అంటుంది శిల్పా శెట్టి. ఆమె నటి మాత్రమే కాదు, ఐపీఎల్ క్రికెట్ టీమ్ […]

నేనేం ఫీలవను

నా సీరియల్స్ అన్ని సూపర్ హిట్ అందులో కె అనే మాట ఉండటం వల్లనే. అందుకే సీరియల్ టైటిల్ లో కె అక్షరం ఉండేలా చూసుకుంటాను అంటుంది ఏక్తాకపూర్. కుమ్ కుమ్ భాగ్య, కసౌటీ జిందగీ కె, కస్తూరి, ఏవైనా సరే కె వర్డ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటుంది. చాలామంది గాఢ నమ్మకం అంటారు కానీ నాకైతే నమ్మకం ఎవరు ఏమనుకున్నా నేనేం ఫీలవ్వను అంటుంది ఏక్తాకపూర్.

ఈ బీడ్స్ కళే ప్రత్యేకం

వజ్రాలు,కెంపులు,పచ్చలు నీలాల లాగే నేల పొరల్లో ఒనిక్స్ జేడ్ వంటి సహజాతి రత్నాలు ఉన్నాయి. ఇవి చాలావరకు సిలికేట్ ఖనిజాలు. నలుపు నుంచి తెలుపు వరకు అన్ని రంగాల్లో ఒనిక్స్ రాళ్లు దొరుకుతాయి. వీటిని పూసలు గా మర్చి ఆభరణాలు చేస్తున్నారు. చిన్న పెద్ద సైజుల్లో క్రిస్టల్స్ లేదా పూసల లాగా చెక్కి వాటిని రెండు మూడు వరుసల్లో గుచ్చి వాటికి కుందన్ మీనాకారి టెంపుల్ డిజైన్  లలో బంగారు లాకెట్ లను అమర్చి హారాలుగా నెక్లెస్ […]

సాదియా కు స్వర్ణం

ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరి కి చెందిన పవర్ లిఫ్టర్ సాదియా అల్మాస్ తన సత్తా చూపించింది. 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే టర్కీ లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన సాథియా దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసింది .

మిసెస్ ఇండియా సర్గమ్

మిసెస్ ఇండియా వరల్డ్ కిరీటం గెలుచుకుంది సర్గమ్ ఆమె భర్త భారత నౌకాదళ అధికారి వృత్తి రీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారు. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న సర్గమ్ టీచర్ గా పని చేశారు. క్యాన్సర్ బాధ్యత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన 52 మందిని వెనక్కి నెట్టి కిరీటం సాధించారామె. ఈ గెలుపుతో వచ్చే ఏడాది అమెరికాలో జరుగుతున్న మిసెస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించారు […]

హెవెన్లీ పిట్స్

భూమి లోపల ఒక అద్భుతాన్ని కనుక్కొన్నారు. గ్యాంకీ ప్రాంతంలో భూగర్భ శాస్త్రవేత్తలు పరిశోధనల్లో ఒక పెద్ద సింక్ హోల్ బయటపడింది. పర్వతాల మధ్యన ఉన్నా ఈ సింక్ హోల్ 630 అడుగుల లోతులో ఉంది. లోపల అంతా ప్రాచీన వాతావరణం నెలకొని ఉంది. అక్కడ వృక్షాలు కొన్ని 130 అడుగుల పొడవున ఉన్నాయి. ఇక్కడ వృక్ష జంతుజాలం పై మరిన్ని పరిశోధనలు చేస్తున్నారు చైనీయులు. వీటికి హెవెన్లీ పిట్స్ అనే పేరు పెట్టారు. ఇప్పుడు ఆ ప్రాంతాల్లో […]

వర్షాలకు రెడీనా ?

వర్షాలు మొదలవుతున్నాయి అందుకు తగ్గట్టు ఇల్లు సిద్ధం చేయాలి. గోడలు,కిటికీలు, పైకప్పులు లీకేజీలు ఏవైనా ఉంటే ఇప్పుడే బాగు చేయించాలి. ఇంటి బయట గోడలకు వాటర్ ప్రూఫ్ పెయింటింగ్ వేయించుకోవాలి. ఇంటి చుట్టూ గుంటలు పూడ్చి చేయాలి. విద్యుత్ వైర్లు అన్ని టెస్ట్ చేసుకోవాలి. ఇక ఇంట్లో ఇరుగ్గా కనిపించే పాత సామాన్లు ముఖ్యంగా బయట పడేయాలి. ఇల్లు మూలల్లో సామాను నిండి కీటకాలు చేరుతాయి. ఎక్కువ దోమలుండే ఏరియాల్లో దోమతెరలు తెచ్చుకోవాలి. సాధారణంగా చెక్క బీరువాలు […]

అది ఒక వ్యసనం

డిజిటల్ అడిక్షన్ నుంచి బయటకు రావాలని చూస్తోంది యువతరం. గంటల తరబడి ఫోన్ కు బంది అవటం ఒక వ్యసనం అని అర్థం చేసుకొని దీనిలో నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతోంది. ప్రతి 20 నిమిషాలకు ఫోన్ నుంచి బ్రేక్ తీసుకోవాలి. ఫోన్ కాస్త దూరంగా ఉంచటం నిద్రపోయే ముందర స్క్రీన్ ఆఫ్ చేయటం అధిక సమయం ఫోన్ ఉపయోగించకుండా సెల్ఫ్ కంట్రోల్ లో ఉండటం ముందు ముఖ్యం. అలారం సెట్ చేసుకొని ప్రతి అరగంటకు ఒకసారి […]

టట్టింగ్ విజేత నిధి

అంతర్జాతీయ టట్టింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచింది నిధి అచ్చా. ముంబైలోని కుర్లా కు చెందిన డాన్సర్ నిధి అచ్చా సరదాగా చేసిన ఈ డాన్స్ ఆమెను అంతర్జాతీయ పోటీలకు తీసుకుపోయింది. టట్టింగ్ అనేది ఒక స్ట్రీట్ డాన్స్.1960-70 ల్లో కాలిఫోర్నియా లో వాడుకలో ఉంది. జామెంట్రీ కల్ ఆకారంలో 90 డిగ్రీల కోణంలో చేతులు కాళ్ళను కదిలించటానికి ఈ డాన్స్ ప్రత్యేకత అమెరికా, చైనా రష్యా బ్రిటన్ దక్షిణాసియా దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఇండియా […]

ఇది రారాజుల ఫ్యాషన్  

ఎన్ని రకాల ఫ్యాషన్ లు వస్తున్నా, వేసవిలో మాత్రం పప్డ్ స్లీవ్స్ ఓటేస్తారు అమ్మాయిలు వీటినే బుగ్గ చేతులు అంటారు. చిన్నవిగా అయినా పెద్దవిగా అయినా  పప్డ్ స్లీవ్స్ లో ఎంతో ఫ్యాషన్ గా కనిపిస్తారు. ఎప్పుడో రాజుల కాలం నాటి ఈ స్లీవ్స్ ఇప్పటికీ యువతరాన్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇవి లెహంగా పైన చక్కగా మ్యాచ్ అవుతాయి. బరువు తక్కువ ఉండే జార్జెట్ చీర కు జోడీగా  పప్డ్ స్లీవ్స్ బ్లవుజ్ వేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. […]

రసాయనాలు లేని టోనర్

మార్కెట్ లో దొరికే రసాయనాలు ఉన్న టోనర్ కంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని దానిమ్మ టోనర్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కప్పు వేడి నీటిలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి ఆ డికాషన్ చల్లారనివ్వాలి. ఆ నీళ్లలో అర కప్పు దానిమ్మ రసం ఒక స్పూన్ రోజ్ వాటర్ వేసి కలిపితే టోనర్ తయారైనట్లే. దాన్ని పొడి సీసాలో ఫ్రిజ్ లో నిల్వ ఉంచుకోవచ్చు. ఈ టోనర్ తో మొహం మెడ మర్దన చేసి ఉదయం […]

ప్రయోగాలు వద్దు

తెరపైన తారలను చూసి అలా నాజూగ్గా అయిపోవాలని అనవసర ప్రయోగాలు చేయొద్దు బాడీ సైజ్ రూపం మార్చాలంటే ఎక్సపర్ట్స్  పర్యవేక్షణలో ఎన్నో వర్క్  వుట్స్ చేయాలి. సహజంగా ఉన్నదే అందం సినిమా వాళ్ళ అందం మేకప్ మహిమ మాత్రమే అంటోంది  యామీ గౌతమి. బ్యూటీ కేర్ ప్రకటనల్లో ఎక్కువగా కనిపించే ఆమె సహజమైన గాలి, వెలుతురు వాతావరణంలోనే అందం ఆనందం  ఉన్నాయంటుంది. మహిళలు చక్కగా చదువుకుంటేనే భవిష్యత్ అంటోంది. అచీవ్మెంట్, యాంబిషన్, సక్సెస్ అన్న పదాలు ప్రతి […]

చినుకుల్లో పూవులే మ్యాచ్

చినుకులు రాలే వర్షాకాలంలో పూవ్వుల ప్రింట్స్ ఉన్నా దోస్తులు బెస్ట్ ఎంపిక అంటుంది ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా. ఈ రోజుల్లో ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, గులాబీ, నీలం రంగుల్లో లైక్రా లేదా పాలిస్టర్ వంటి ఫాబ్రిక్ లు ధరిస్తే బావుంటాయి. అవి ముడతలు పడకుండా సులభంగా పొడిగా అయిపోతాయి. పలాజోలు బాటమ్ గా విశ్రాంతిగా ఉంటాయి. ప్రింటెడ్ ఆర్గాంజాలు సిల్క్ డ్రెస్ లు బాగుంటాయి. ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ ఏవైనా సరే చిన్న ప్రింట్ […]

నాజుకే కాదు ఆరోగ్యం కూడా

నాజూకుగా మారేందుకు మాత్రమే కాదు,ఆరోగ్యంగా ఉండేందుకే వ్యాయామం చేయండి అంటున్నారు ఎక్సపర్ట్స్. వ్యాయామం తో గుండె వేగం పెరిగి ఎక్కువ మొత్తం లో ఆక్సిజన్ మెదడుకు చేరుతుంది దీని ద్వారా హార్మోన్ల ఉత్పత్తి పెరగటమే కాకుండా మెదడు కణాల అభివృద్ధి జరుగుతుంది. పనుల వత్తిడిలో నిద్ర సరిగా పోకపోతే అది జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపెడుతుంది. దీనికి వ్యాయామమే పరిష్కారం కనీసం అరగంట అయినా నడిస్తే మంచిది. బయట వాతావరణం అనుకూలంగా లేకపోతే మెట్లు ఎక్కి […]

ఐ పి ఎస్ నా ధ్యేయం

థాయ్ లాండ్  లో జరిగిన 14 వ ఏషియన్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో ఆత్మవిశ్వసం పెంచింది.మేము గెలిచింది ఒక మ్యాచ్ లో అయినా వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గర నుంచి చూడటం నాకు ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇచ్చింది. జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావటం,ఐ పి ఎస్ సాధించటం నా ఆశయం అంటోంది శాంతకుమారి. ఉమ్మడి పాలమూరు వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పు తాండ కు చెందిన క్రీడా […]

ఎం ఎల్ సి మున్నీ రజక్

రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ తరఫున ఎం ఎల్ సి గా 75 మంది సభ్యుల విధాన పరిషత్ లో కాలు పెట్టబోతుంది. మున్నీ రజక్. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి జీవించే మున్నీ రజక్ లాలూ యాదవ్ మెప్పుదల పొందింది.గత పదేళ్లుగా మున్నీ ఆర్జేడీ కార్యకర్తగా ఉంది చక్కగా పాటలు పాడగలదు పార్టీ సభల్లో పడుతుంది గట్టిగా మాట్లాడగలదు. ఎం ఎల్ సి ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్.

పిసీఐ చైర్మన్ గా రంజనాదేశాయ్

ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా (పిసీఐ) చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రంజనా ప్రకాశ్‌ దేశాయ్ (72) ని ఎంపిక చేశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా,సిపిఐ సభ్యుడు ప్రకాష్ తో కూడిన కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. జస్టిన్ రంజనాదేశాయ్ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన కమిషన్ కు నేతృత్వం వహించారు.

జుట్టుకు పోషణ

కరివేపాకు భోజనం లోని రుచి ఇవ్వటమే కాదు జుట్టు పెరుగుదలకు మంచి ఔషధం వంటిది అంటున్నారు ఎక్సపర్ట్స్. కరివేపాకు లో ఉల్లిపాయ రసం కలిపి మెత్తగా రుబ్బి మాడుకు పట్టించి గంట తర్వాత షాంపూ చేస్తే తల నెరవటం వెంట్రుకలు రాలడం తగ్గుతాయి. మెంతి ఆకులు, కరివేపాకు కప్పు చొప్పున తీసుకొని మెత్తగా రుబ్బి దానికి రెండు స్పూన్ల ఉసిరి పొడి కలిపి మాడుకు రాసి అరగంట పాటు ఉంచి తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి జుట్టు […]

అందాల పోటీల్లో శివాని

ఎవరిపై వారికి నమ్మకం ఉండాలి. ఎంతమంది నీ అభిప్రాయాన్ని మార్చాలని చుసినా మనసు చెప్పిందే విను నీకలాల్ని నువు నెరవేర్చుకో అంటుంది శివాని. హీరో రాజశేఖర్‌,జీవిత ల పెద్ద కూతురు. శివాని సినిమాల్లో నటించి,ఇప్పుడు మోడలింగ్ పైన దృష్టి పెట్టింది. ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతోంది ఫెమీనా ఇండియా అందాల పోటీల్లో తమిళనాడు తరఫున ఎంపికైంది. జులై లో జరగనున్న అందాల పోటీలకు దరఖాస్తులో వివిధ రాష్ట్రాలను ఎంచుకొనే అవకాశం ఉంటే శివాని ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు,తెలంగాణ లను ఎంచుకొంది. […]