Tuesday, 29 Sep, 2026

వినూత్నంగా లట్ కాన్

ఉలెన్ కుచ్చులు బీడ్స్ మెరిసే రాళ్ళు ఫ్యాబ్రిక్ ఇలా ఎన్నో రకాల స్టైల్స్ తో లట్ కాన్ మార్కెట్ లో దొరుకుతున్నాయి. వీటితో బ్లౌజులు, లెహంగా లకు కొత్త అందం యాడ్ అవుతుంది. బ్లౌజ్ వెనక మెడ దగ్గర రోప్స్ కట్టి లట్ కాన్ లను వేలాడదీయవచ్చు. లేదా బ్లౌజ్ అడుగుల రెండు అంచులు కలుపుతూ డోరి కట్టుకోవచ్చు డోరి రంగులు బ్లౌజ్ తో మ్యాచ్ అయ్యేలా ఉండాలి. చిలుకలు, ఏనుగులు వంటి పులి బొమ్మలు కూడా […]

ఇలా చేస్తే చాలు

ఎన్ని పర్ఫ్యూమ్స్ వాడిన చెమట వాసన వదలకుండా ఉంటుంది. స్నానం చేసే నీటిలో లావెండర్ రోజ్ మేరీ టీట్రీ ఆయిల్ ఇలా నచ్చిన సువాసన ఎంచుకొని కొన్ని చుక్కలు కలుపుకోవచ్చు. చర్మంపై సూక్ష్మక్రిములు పెరగటమే వాసనకు కారణం. వేపాకులు లేదా టమాటో రసం ఎక్కువగా చెమట పోసే చోట రాసి పది నిమిషాల తర్వాత కడిగేయండి. అలోవెరా లో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి ఎక్కువ. అలోవెరా జెల్ లో ముంచిన కాటన్ తో బాహు మూలలను శుభ్రం […]

ఇదే అసలైన చదువు

ఏ దారి లేదు అనుకున్నప్పుడు ఈ మిల్లు దారి చూపింది. మా చదువు కొనసాగేందుకు సాయం చేసింది మా అక్క చెల్లెళ్ళం చదువుకున్నాం అంటుంది నివేదా.ఎం. తమిళనాడులోని కోయంబత్తూరు లో కే పి ఆర్ మిల్స్ లో పనిచేస్తున్నారు అక్క చెల్లెలు ముగ్గురు. యాజమాన్యానికి విద్యాసంస్థలు ఉన్నాయి తన సంస్థలో పనిచేసే యువతులకు కళాశాలలో చదువుకునే అవకాశం కల్పించారు. ఆ వస్త్రాల మిల్లు లో ఆపరేటర్ గా పని చేస్తూ రాత్రివేళ చదువుకున్నారు. తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ […]

తక్షణ శక్తి కి ద్రాక్ష

సాయంత్రం ఏదైనా స్నాక్స్ తినాలి అనిపిస్తే కాసిన్ని ఎండు ద్రాక్ష పండ్లు ప్రయత్నం చేయచ్చు. ఇది తక్షణ శక్తిని ఇవ్వటమే కాకుండా చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిలో పీచు, ఇనుము, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.ద్రాక్షలోని పొటాషియం, మెగ్నీషియం శరీరంలో ఆమ్ల తత్వం పెరగకుండా చేస్తాయి.  బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉండటం తో రక్తహీనత రాదు. చర్మం పొడిబారి పోకుండా ఉంటుంది. వీటిలో ఉండే జింక్, విటమిన్-సి సెలీనియం లు చర్మానికి మేలు చేస్తాయి.

తోలి హెలికాప్టర్‌ పైలట్‌

అమ్మాయిలకు అదంతా సులువుకాదు అని కొట్టిపడేస్తారు కానీ హెలికాప్టర్‌ పైలట్‌ అవ్వటం నా జీవిత కాంక్ష. నా పట్టుదల చూసి అమ్మ నాన్న వప్పుకొన్నారు. 2016 లో అమెరికా లోని హవాయిలోని మానలోవా హెలికాప్టర్‌ అకాడమీలోచేరాను. నేను చేరిన సంస్థనే నాకు ఉద్యోగం ఇచ్చింది అంటోంది వైజాగ్ అమ్మాయి క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్‌ హెలికాప్టర్‌ పైలట్‌. విమానాల్లో లాగా దీనిలో ఆటో పైలట్ అవకాశం ఉండదు. ప్రతి సెకను దీక్ష తో […]

సంతోషాన్నిచ్చే వర్ణాలు

రంగు లను చూసినప్పుడు తెలియకుండానే ఆనందం కలుగుతుంది అంటున్నారు థెరపిస్ట్ లు వాతావరణంలో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపుతాయి అంటున్నారు. ఒత్తిడితో సతమతమయ్యే వారి లో కూడా ఈ రంగులు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ని కలిగిస్తాయి వర్షాకాలంలో కాస్త మబ్బు ముసిరి ఇల్లు చీకటి గా అనిపిస్తే ఇంటిని వర్ణమయం చేసుకోమంటున్నారు. ప్రకాశవంతమైన ఎరుపు, నారింజ, పసుపు ప్రశాంతతకు సంకేతమైన ఆకుపచ్చ, నీలం ఆనందం కలిగించే లేలేత నీలం గులాబీ ఉదా పీచ్ కలర్ తో ఇంటికి […]

హెల్దీ లంచ్ బాక్స్

స్కూళ్లు మొదలయ్యాయి పిల్లల లంచ్ బాక్స్ ఏమేం ఉంటే వారికి ఆరోగ్యం అన్న ప్రశ్న ప్రతి తల్లి ముందు నిలబెడుతుంది. పిల్లల ఆహారాన్ని బట్టర్ ఫాయిల్ లో చూటేసి పెడితే పదార్థాలు చెక్కు చెదరవు. పాలు, పెరుగు తో చేసినవి బాక్స్ లో పెట్టక పోవటం మంచిది. ఒక్కసారి అవి పాడైపోతాయి. పళ్ళ ముక్కలు ఉదయాన్నే కట్ చేసి ఎయిర్ టైట్ డబ్బాలో ఫ్రిజ్ లో పెట్టాలి. స్కూల్ కు వెళ్లే ముందు ఈ బాక్స్ బ్యాగ్ […]

పర్ ఫెక్ట్ మ్యాచ్

సరిగ్గా డ్రెస్ కలర్ లో ఉండే ఫ్యాబ్రిక్ జ్యువెలరీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. డ్రెస్ పోలికలో ఉండే చెప్పులు, హ్యాండ్ బ్యాగ్ ఎంచుకోవటం తెలిసిందే కానీ డ్రెస్ లోని మెటీరియల్ తోనే ఆభరణాలు తయారు చేస్తున్నారు. కొన్ని చీరల తో వాటికి సరిపోను ధరించే ఆభరణాలు ఇస్తున్నారు చీరె డిజైన్ ను పోలి చిన్న చిన్న మార్పులతో ఉండే ఆభరణాలు క్యాజువల్ గా ఫ్యాషన్ వేర్ గాను అందుబాటులో ఉంది. ఈ ఫ్యాబ్రిక్ ఆభరణాలు చాలా […]

చీరెల బ్యాంక్

2016 లో ఆస్థాజనవికాస్‌ పేరుతో శారీ బ్యాంక్ ఏర్పాటు చేసింది ఔరంగాబాద్ కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేసే ఆర్తి తన ఇంట్లో పోగుపడిన అనేక పాత చీరెలను ఏం చేయాలో అని ఆలోచించింది. ఇవి నిరుపేద మహిళలకు ఉపయోగపడతాయి అని భావించి తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. వాళ్ళు చెప్పిన కృతజ్ఞతలే స్పూర్తి సారీ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 25 వేల చీరెలను […]

సామాజిక సేవలో పాలక్

పాలక్ ముచ్చల్ అద్భుతమైన గాయని హిందీ లోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల్లో పాటలు పాడింది పాలక్. గజల్స్,భజన్స్ ఆలాపనలు గీత రచన తో, ఆమె ఎంతో పాపులర్, గుండెకు సంబంధించిన రుగ్మతతో బాధపడేవారు చిన్న పిల్లల కోసం దిల్ సే దిల్ తక్ పేరుతో దేశ విదేశాల్లో ఎన్నో చారిటీ షోలు చేసింది పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకున్నారు.సామజిక సేవలో ఆమె కృషికి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ […]

ఇవి చాలా సౌకర్యం

జిమ్ కు వెళ్ళేటప్పుడు ప్రత్యేక దుస్తులు ఎంచుకుంటే సౌకర్యంగా ఉంటుంది. సాధారణంగా హై వెయిస్ట్ లెగ్గింగ్స్ ప్రింటెడ్ ప్యాంట్స్  చాలా సౌకర్యంగా ఉంటాయి. సైక్లింగ్ కు ప్రత్యేకంగా వస్తున్నా షార్ట్స్ ఇబ్బంది కలిగించవు. అలాగే యాంకిల్ లెంగ్స్ వర్క్ వుట్స్ టైట్స్,  జిమ్ కోసం ధరించేందుకు వీలుగా ఉంటుంది. మెష్ లెగ్గింగ్ వర్క్ వుట్స్ ప్యాంట్స్ చెమట రానివ్వవు.స్లిమ్ ఫిట్స్ ప్యాకెట్ సౌకర్యం ఉండేది దొరుకుతున్నాయి. స్పోర్ట్స్ బ్రాలెట్స్ కొంత వదులుగా ఉండేది తీసుకోవాలి. స్పోర్ట్స్ బ్రా […]

అద్భుతమైన పానీయం

గ్రీన్ టీ ఎంతో పాపులర్. డైట్ అనే విషయం ప్రస్తావన వస్తే అందులో గ్రీన్ టీ తప్పనిసరిగా ఉంటుంది. కామెల్లియా సినెన్సిస్ అనే మొక్క నుంచి తయారైన గ్రీన్ టీ కి ఆకుపచ్చ రంగు కారణంగా ఆ పేరు వచ్చింది గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. టైప్-టు డయాబెటిస్ రిస్క్ కూడా తగ్గుతుంది. దంతాల ఆరోగ్యానికి గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. చిగుళ్ల వ్యాధి కలిగించే బ్యాక్టీరియా గ్రీన్ టీ లో […]

ఎంతో బలం

నట్స్ ని ఆహారంలో భాగంగా చేసుకోమంటున్నారు అధ్యయనకారులు. నట్స్ తీసుకుంటే గుండె జబ్బులు టైప్-టు మధుమేహం వంటివి దూరం చేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజు గుప్పెడు నట్స్ తీసుకుంటే మహిళలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తాజాగా ప్రచురితమైన ఓ అధ్యయనం చెబుతోంది. అంతేకాదు మరణించే ముప్పులను మూడోవంతు తగ్గిస్తాయని కూడా అధ్యయనకారులు చెబుతున్నారు. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్ నట్స్, వేరుశెనగ అన్నింటికీ ఇది వర్తిస్తుంది నట్స్ లో ప్రొటీన్స్ అసంతృప్త ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ […]

నిద్రకు సాయం

నిద్రకు సంబంధించి అన్ని విషయాలు రికార్డ్  చేసే స్మార్ట్ పిల్లో మార్కెట్లోకి వచ్చింది తల కదలికల ఆధారంగా మనం విశ్రాంతి తీసుకుంటున్నామ, లేదా గాఢంగా నిద్ర పోతున్నామా అన్న విషయాలను ట్రాక్ చేసి ఈ పిల్లో యాప్ ద్వారా పంపిస్తుంది. పని చేసేందుకు అవసరమైన విద్యుచ్చక్తి  దానంతట అదే తయారు చేసుకుంటుంది. తల కదలికల నుంచి వచ్చే రాపిడి వల్ల లోపల ఉన్న ట్రైబ్ ఎలక్ట్రిక్ నానో జనరేటర్లు విద్యుచ్చక్తి  శక్తిని ఉత్పత్తి చేస్తాయి. దీన్ని ప్రత్యేకంగా […]

దట్ గర్ల్ విత్ ఎ బ్రోకెన్ నెక్

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎడెల్ వీస్ సి ఈ ఓ గా ఉన్నారు రాధికా గుప్తా. పుట్టుకతోనే కాస్త మెడ వంకర తో ఉన్న రాధిక ఎన్నో అవమానాలకు గురయ్యారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సి ఈ ఓ గా అరుదైన గుర్తింపు సాధించారు. వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ లో డ్యూయల్ డిగ్రీ చేశారు రాధిక. సొంతంగా ఫోర్ ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ పనితీరు […]

మా తెగలో నేనే మొదట

బడగా తెగ కు చెందిన ఆర్.మీరా నుంచి తొలి నౌకాదళ అధికారిగా గుర్తింపు తెచ్చుకోంది.  మా బడగా తెగ లో ఇంత వరకు ఒక్క ఎయిర్ ఫోర్స్ అధికారి ఉన్నారు. నేవీలో మొదటి మహిళా అధికారిని నేనే. నేను ప్రస్తుతం సబ్‌-లెఫ్టినెంట్‌ గా ఉన్నారు. తర్వాత లెఫ్టినెంట్‌ కెప్టెన్ ప్రమోషన్లు వస్తాయి. యుద్ధ నౌకలకు అమర్చిన ఆయుధాలు ఆపరేట్ చేయటం,నాణ్యత ధృవీకరణ పరిశీలించే బాధ్యతలను ప్రస్తుతం నేను నిర్వహిస్తున్నాను. నీలగిరి జిల్లా అచనకల్‌ నేను పుట్టిన ప్రాంతం. […]

ఫ్లవర్ ప్యాక్స్

పువ్వులతో చేసిన ఫేస్ ప్యాక్ లు వారానికి ఒకసారి వేసుకుంటే ముఖ చర్మం మెరుపులు మెరుస్తుంది. గుప్పెడు మల్లె పూలు స్పూన్ పెరుగు టీ స్పూన్ చక్కెర కలిపి మెత్తగా చేసి ఈ మిశ్రమం ముఖం మెడ పై అప్లై చేయాలి. పదినిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.  గుప్పెడు గులాబీ రేకులు నీళ్లలో ఉడికనిచ్చి మెత్తగా చేసి దానికి ఓ స్పూన్ గంధం పొడి, పాలు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. […]

హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్

25 దేశాలకు చెందిన 82 మంది మహిళలు ఒకేసారి ఎత్తైన బ్రీతోర్న్ పర్వతాన్ని ఎక్కి కొత్త అధ్యయనం సృష్టించారు. ఈ లాంగెస్ట్ ఉమెన్ రోప్ టీమ్ లో ప్రపంచంలో నలుమూలల నుంచి మహిళలు పాల్గొన్నారు. మన దేశం నుంచి అంచల్ ఠాకూర్, షిబానీ ఘరత్, ఛార్మి దేధియా లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సాహసిక పర్వతారోహణలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

కనురెప్పల అందం

కనురెప్పల అందం కోసం మస్కారా వాడతారు. ఇప్పుడు ఐ లాషెస్ అందాన్ని మల్టి పై చేసేందుకు పోర్ డి మస్కారా మార్కెట్ లోకి వచ్చింది.ఈ మస్కారా వస్తే ఫేక్ ఐ లాస్ స్టిక్కర్స్ అతికించు కోవలసిన అవసరం లేదు కనురెప్పలు అందంగా కనిపిస్తాయి. ఒక్క బ్రష్ కు 12 cm పొడవు పెరిగినట్లు అవుతాయి కనురెప్పలు. ఎంత లెంగ్త్ కావాలో దానిపై అప్లయ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ 4డి మస్కారా  చెమట,తడి తగిలిన చెక్కు చెదరదు. అన్ని […]

సలహాదారు ఆరతి

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు సలహాదారుగా ఆరతి. దిల్లీలో పుట్టిన ఆరతి 1993లో బిల్‌క్లింటన్‌ అధ్యక్షుడిగా ఉండగా ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ’ హెడ్‌గా బాధ్యతలు తీసుకొన్నారు. తర్వాత డీఏఆర్‌పీఏ కు నాయకత్వ బాధ్యతలు వహించారు.‘క్యాన్సర్‌ మూన్‌షాట్‌’ పేరుతో క్యాన్సర్‌ పరిశోధన, చికిత్స కోసం జో బైడెన్‌ తెచ్చిన కార్యక్రమంలోనూ ఆరతి పనిచేశారు. ‘ప్రతిభావంతురాలైన ఇంజినీర్‌, భౌతికశాస్త్రవేత్త. శక్తిమంతమైన ఆవిష్కరణలలో అమెరికాను ముందుంచే వ్యక్తి అని ఆరతిని […]