WoW
ఇవన్నీ పెన్నుతో గీసిన ఫోటోలే
ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లో నైజీరియన్ చిత్రకారుడు ఆస్కార్ ఉకోను(Oscar ukonu) పెన్ డ్రాయింట్స్ కనిపిస్తాయి. బాల్ పాయింట్ పెన్ తో అచ్చం ఫోటో లాంటి చిత్రాలు ఎంతో గొప్పగా నైపుణ్యంతో గీస్తారు అంటే వాటిని చూస్తుంటే హై రిజల్యూషన్ ఫోటో లేమో అనిపిస్తాయి. చిత్రకారుడు ఆస్కార్ తన తొమ్మిదవ ఏటా నుంచే పెన్సిల్ తో బొమ్మలు గీస్తున్నాడు. 2014లో మొదటిసారిగా ఆర్కిటెక్చర్ చదివే సమయంలో బాల్ పాయింట్ పెన్ పట్టుకుని హైపర్ రియల్ స్టిక్ పోర్ట్ రైట్స్ […]
వసివాడని మట్టి పూల అందం
నిండుగా విరబూసిన గులాబీలు, మల్లెలు, మందారాలు కళ్ళకి మనసుకి ఆనందం. ఈ పూలు ఎప్పటికీ వాడిపోని వైతే ఎంత బావుంటుంది. అందుకే ఈ మధ్య తాజాగా ఎప్పటికీ వసివాడని మట్టి పూలనే ప్రేమిస్తున్నారు అందరూ. నాణ్యమైన ప్లాస్టిక్, నైలాన్, రేయాన్, కాటన్ దారాలను ఉపయోగించి చేసే కృతిమ పూల కంటే పాలీక్లే తో వచ్చే తాజా పూలు కళ్ళను మోసం చేసేంత తాజాగా ఉంటున్నాయి. ఈ మట్టిపూలు కేరాఫ్ అడ్రస్ థాయ్ లాండ్ ప్లాస్టిక్ మట్టితో మనియేచర్ […]
పారిస్ కో మధురై మల్లె పూలు
క్రిష్టియన్ డియర్.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్ఫ్యూమ్ తయారీ సంస్థ. ఇది ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉంది ఆ కంపెనీ తయారు చేసే జెయడోర్,మిస్ డియర్, లా కలెక్షన్ వంటి పర్ఫ్యూమ్ ల తయారీ కోసం మల్లెపూలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా తమిళనాడులోని మధురై లో బొండుమల్లెలు పూస్తాయి. అవి ఒకటి రెండు వరుసలు కావు మూడు నాలుగు వరుసల్లో బొద్దుగా పూస్తాయి. మామూలు మల్లె పూరేక కంటే దళసరిగా ఉంటాయి తొందరగా […]
రోబో హోటల్
మామూలుగా మనం చూసే ఖరీదైన హోటళ్లలో చక్కని ఆతిథ్యం ఇచ్చే ఎంతో మంది ఉద్యోగులు కనిపిస్తారు. కానీ హోటల్ లోకి అడుగు పెట్టగానే ఓ డైనోసార్ రోబో స్వాగతం పలికితే మరో వెయిటర్ రోబో చక్కగా పలకరిస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇది వట్టి అపోహ ఊహలు కావు నిజంగానే ఓ హోటల్లో అన్ని పనులు చేసి పెట్టె రోబో లున్నాయి. దాని పేరు HENNNA. పూర్తిగా హ్యూమనాయిడ్ రోబోలతో నిర్వహించే ఈ హోటల్ జపాన్ […]
అలనాటి శిల్ప కళా వైభవం ఈ దేవాలయం
నిత్యం ఈ జగత్తును తన వెలుగు కిరణాలతో నిద్రలేపే సూర్యదేవునికి ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం అద్భుతమైన శిల్ప కళా వైభవానికి, కళింగ వాస్తు నిర్మాణ శైలికి ప్రతీకగా ఉంటుంది. 70 మీటర్ల ఎత్తు పెద్ద రథం ఆకారంలో కనిపించే ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజు నరసింహ దేవ్ పూర్తిగా శాండ్ స్టోన్ తో నిర్మించారు ఆలయ […]
కాగితం తో కళాకృతులు
ఓరిగామి (Origami) అన్నది జపాన్ వారి జానపద కళారూపాలు. కాగితాన్ని మడతపెట్టి కళాకృతులను తయారు చేసే ఆర్ట్. ఈ కళ ను నేర్చుకొనేందుకు కోర్సులు కూడా ఉన్నాయి. ఈ కోర్సు చేసిన వారి చేతిలో చిత్తు కాగితం అయినా చక్కని చిత్తరువు అవుతుంది. జీవం ఉట్టిపడే శిల్పం అయిపోతుంది. వెలకట్టలేని కళా రూపం అవుతోంది. వాళ్ళు తయారు చేయగలిగే కళాఖండాలు చూస్తే ఇది వట్టి కాగితంతో చేసిన దేనా అని ఆశ్చర్యం కలుగుతుంది ఈ సాంప్రదాయ జపనీస్ […]
మిద్దె తోటల్లో వెండి తెర వేల్పులు
లాక్ డౌన్ సమయాన్ని చక్కగా వినియోగించుకున్నారు ఎందరో సినీ స్టార్స్. పెరటి తోటలు పెంచుతూ తోటి వాళ్ళకు చాలెంజ్ విసురుతూ హడావుడి చేశారు . ఒత్తిడిని తగ్గించుకోవటం, ఇటు ఆరోగ్య లాభం రెండు పొందారు. ముందుగా సమంత ఈ విషయంలో ఓ అడుగు ముందే ఉంది. వ్యాయామం గురించి ఆరోగ్యం గురించి ఆమె పెట్టే పోస్ట్ లకు లక్షలకొద్దీ ఫాలోవర్స్ ఉన్నారు. లాక్ డౌన్ లో సేంద్రియ పద్ధతిలో ఇంటికి కావలసిన ముల్లంగి, క్యారెట్ క్యాబేజీ, బ్రోకలీ, […]
రెయిన్ బో డైట్ బెస్ట్
కరోనా సమయం జీవిత విధానంలో కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఆహారం విషయంలో. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని, రోగనిరోధక శక్తిని ఇచ్చే ఆహారాన్ని సెలెక్ట్ చేసుకుని మరీ తింటున్నారు. ఆ పరంపరలో కి ఇంద్ర ధనస్సు డైట్ వచ్చి చేరింది. భోజనంలో అన్ని రంగుల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవటం ఇవ్వాల్సిన అవసరం. ముఖ్యంగా ఏడు రంగుల్లో ఉన్న పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అపారం. చిలకడ దుంప, స్వీట్ కార్న్, ఆప్రికాట్, […]
మనసు దోచే ముత్యాలు
ఏ సందర్భానికైనా ఎవరైనా ధరించగలరు ముత్యాల ఆభరణాలు అందమైనవీ, విలాసవంతమైన వీ కూడా.ముత్యపు చిప్ప ల నుంచి సహజంగా తయారై వచ్చే ముత్యాలు తేలికైనవీ అత్యంత ఫ్యాషనబుల్ కూడా. ముత్యాలు బంగారం కలిపిన నగలు ఎప్పటికీ అవుటాఫ్ ఫేషన్ కాదు. సెలబ్రెటీలు తమ స్టయిల్ ను ముత్యాల నగల తో మరింత మెరుగుపరచు కొంటుంటారు. ఆధునిక వధువులు ఇష్టంగా ధరించాలి అనుకునే మొగల్ సాంప్రదాయపు జాడవ్ ఆభరణాల్లో కూడా గుత్తులుగా వేలాడే ముత్యాలే ప్రత్యేక ఆకర్షణ. జాడవ్ […]
ఈ సెలబ్రెటీ హీరో వెంకటేష్ కూతురు
ఈ మధ్య కాలంలో ఇంస్టాగ్రామ్ లో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రెటీల జాబిదాను హాపర్ డాట్ కామ్ సంస్థ విడుదల చేసింది. ఈ లిస్ట్ లో ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేష్ పెద్ద కుమార్తె ఆశ్రిత పేరు వచ్చింది. ఈ అమ్మాయి అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంక్ సంపాదించింది. తండ్రి, తాత, పెద్ద నాన్నల పేర్లు ఉపయోగించకుండా తన అభిరుచి సృజనాత్మకత తోనూ గుర్తింపు సంపాదించింది ఆశ్రిత. ఆహారం, ప్రయాణం నా అభిరుచులు, మా నాన్న వెంకటేష్ […]
మేడ పైన అందాల అడవి
అది 1500 చదరపు అడుగుల నివాసగృహం మరో 400 అడుగుల ఇంటి ఆవరణ ఇంకో 400 అడుగులు బయట ఆవరణ అంతా కలిపి బెంగళూరు నగరంలో ఉన్న ఈ ఇల్లు ని ఇప్పుడు ఆశ్రమ గార్డెన్స్ గా పిలిచే ఒక అడవి లా మార్చారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నటరాజ్. బెంగళూరులోని బనశంకరి ప్రాంతంలో ఉండే ఈ ఇంటి పైన చుట్టూ కొన్ని వందల చెట్లు ఉంటాయి. పొదలు,తీగలు మొత్తం కలిపి రెండు వేల రకాలుంటాయి ఇల్లు […]
కదలని పల్లెటూరు
దేశం లో చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ఉత్సవ్ రాక్ గార్డెన్ .ఈ రాక్ గార్డెన్ లో ఒకప్పటి సాంప్రదాయ జీవన విధానాన్ని కళ్లకు కట్టేలా చూపించే అందాల బొమ్మలున్నాయి . చక్కని తోట ఆ మధ్యలో అందమైన పల్లెటూరు అక్కడ ఓ సంత కూరగాయలు, దినుసులు అమ్మే వర్తకులు కొనుక్కుంటున్నా పల్లెటూరి ప్రజలు ఇలా ప్రతి దృశ్యాన్ని కళ్ళకు కట్టేలా సృష్టించిన కళాకారుడు టి బి సోలబక్కనవర్. ఈ రాక్ గార్డెన్ […]
కాలం చెల్లని అపురూప రత్నాలు
అందానికి మెరుగులు దిద్దే ఆభరణాల చరిత్ర 40 వేల సంవత్సరాల నాటిది.ఆభరణాలలో వెండి ప్లాటినం, ముత్యాలు,విలువైన రాళ్లు లోహాలు అన్ని కలిసి జ్యువెలరీ అయింది. ఈ నగలో విరివిగా ఉపయోగించే విలువైన రాళ్ళు నవరత్నాలు వీటిని అత్యంత శక్తివంతమైనవి గా భావిస్తూ ప్రాచీన చక్రవర్తులు రాజులు ధరించే వాళ్ళు తొమ్మిది విలువైన రాళ్ల సమాహారమే నవరత్నాలు వజ్రం కెంపు, నీలం, పగడం, ముత్యం, పచ్చ, వైఢూర్యం, పుష్పరాగం, గోమేధకం, కలిపి నవరత్నాలు అంటారు. ఈ విలువైన రాళ్ళను […]
ఆ ఆకాశానా సూర్యుడు ఉండడు
ఈ ప్రపంచంలో ప్రతి రోజు తెల్లవారుతుందీ అంటే సూర్యుడు కనిపించటం .సూర్యుని వెలుగు కిరణాలతో రోజు మొదలు కావటం. కానీ ఈ జగత్తు కాంతి వెలుగులు పంచే సూర్యుడు కొన్ని ప్రాంతాల వైపు కన్నెత్తి చూడడు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది .ఇటలీ లోని వెగనెల్లా గ్రామం లో మూడు నెలల పాటు సూర్యుడు కనిపించాడు.ఈ గ్రామం చుట్టూ ఎత్తయిన పర్వతాలు ఉన్నాయి మూడు వందల జనాభా వున్న వెగనెల్లా గ్రామం ఓ పెద్ద పర్వతం కింద భాగంలో […]
సాగర మధ్యంలో అందాల గ్రామం
అందమైన ప్రకృతి చుట్టూ నీళ్లు మధ్యలో నివాస గృహాలు ! ఈ ఊహే బాగుంది కదా .అసలు ఒక ఇసుక రేణువు అంతా నేల కూడా అక్కడ లేకుండా కట్టిన ఫ్లోటింగ్ విలేజ్ ‘ko panyi’ ఇది థాయిలాండ్ లో ఉండే సుమారు రెండు వందల ఏళ్ళ క్రితం ఇండోనేషియా నుంచి వలస వచ్చిన కొన్ని కుటుంబాలు సముద్రం మధ్యలో కర్రల సాయంతో ఇల్లు కట్టుకుని చేపలు పట్టడాన్ని వృత్తిగా చేసుకుని ఇక్కడే నివసించడం మొదలుపెట్టారు .నెమ్మదిగా […]
అక్కడ నీళ్ళు చాలా హాట్
ఈ ప్రపంచంలో దట్టమైన అతిపెద్ద అరణ్యం అమెజాన్. ఎన్నో వింతైన జీవరాసులు, ఆరణ్య అందాలు,కలిసి పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. అంతేనా ప్రపంచంలోనే అద్భుతమైన వేడినీటి నది ప్రవహించేది ఇక్కడే .పెరూ ప్రాంతానికి విస్తరించి ఉన్న అమెజాన్ అడవుల్లో మాయంతుయాకు అనే నది ఉంది. 82 అడుగుల వెడల్పుతో సుమారు నాలుగు మైళ్ల పొడవునా ప్రవహించే ఈ నది 20 అడుగుల లోతు ఉంటుంది. ప్రపంచంలోనే ఏకైక వేడి నీటి నది ఇది .సలసల మరిగే ఈ సరస్సు […]
ఇది బంగారు చేపల సరస్సు
అనగనగా ఓ సరస్సు అందులో బంగారు వర్ణంలో మెరిసే పువ్వుల్లాంటి గోల్డెన్ జెల్లీ ఫిష్ లు. పసిఫిక్ మహాసముద్రం పశ్చిమ ప్రాంతం దీవిలోని పలావో దేశానికి చెందిన ఈల్ మాక్ ఐలాండ్ లో ఈ అందాల సరస్సు ఉంది దీన్ని గోల్డెన్ జల్లి ఫిష్ లేక్ అంటారు. మామూలుగా జెల్లీ ఫిష్ తెల్లగా ఉంటాయి. వీటిని మూన్ జెల్లీ ఫిష్ అంటారు .కానీ ఈ సరస్సులో చేపలు తళతళ బంగారు వర్ణంలో మెరిసిపోతూ వుంటాయి. వీటిని చూసేందుకు […]
స్టయిలిష్ రెయిన్ కోట్స్
ఇప్పుడు ఫ్యాషన్ దుస్తుల పరంపరలో కి రెయిన్ కోట్స్ కూడా వచ్చి చేరాయి. వర్షం చుక్క కూడా మీద పడకుండా రక్షణ గా ఉండేందుకు చల్లని గాలిలో వెచ్చదనాన్ని ఇచ్చేందుకు కూడా కొత్త మోడల్స్ రెయిన్ కోట్లు వచ్చాయి .1200 వందల ఏళ్ళ క్రిందట రబ్బర్ చెట్ల నుంచి తీసిన మెటీరియల్ తో వాటర్ ప్రూఫ్ గార్మెంట్స్ తయారు చేసినట్లు చరిత్ర కథనం. 1824 లో స్కాటిష్ కెమిస్ట్ చార్లెస్ మాకి స్తోష్ టార్పాలిన్ ఫ్యాబ్రిక్ తో […]
ఈ గొడుగులు కళాత్మకం
వర్షాలు మొదలయ్యాయి చేతిలో గొడుగు ఉంటేనే బెస్ట్ అనిపిస్తుంది .ఉండేదో స్టయిల్ గా ప్రత్యేకంగా ఉంటే బాగుంటుంది కదా ? అనుకున్నట్లు గానే గొడుగులు స్మార్ట్ గా ఈనాటి త్రీడి పరిజ్ఞానం వెంటబెట్టుకుని వచ్చి మరీ కనువిందు చేస్తున్నాయి .ఫ్యాషన్ డిజైన్ లలో కొత్త ట్రెండ్ ఈ త్రీడి గొడుగులు పైగా మరి పెద్దవి కాకుండా మినీ అంబ్రెల్లా లు స్టయిల్ గా చిన్న బ్యాగ్ లో పట్టేవి చాలా రకాలే ఉన్నాయి. అరటిపండు బొమ్మ, కాప్సూల్ […]
సముద్రంలో హోటల్ ది మురాక
ప్రపంచంలో మొట్టమొదట నీటి అడుగున నిర్మించిన హోటల్ విల్లా ది మురాక క్రావ్రాడ్ మాల్దీల్స్ రంగాలి ఐలెండ్ లో రెండు అంతస్థుల్లో నిర్మించిన ఈ విల్లాలో కింది అంతస్థు సముద్రం లోపల 16 అడుగుల లోతున ఉంది. మొత్తం అద్దాలతో నిర్మించిన ఈ కింది అంతస్థు లోకి వెళితే నీటి మధ్యలో ఉన్నట్లే ఉంటుంది. ఆ అద్దలోంచి ఎన్నెన్నో సముద్రపు జీవులు హాయిగా ఈదుతుంటాయి . ఒక్క మాటలో చెప్పాలంటే ఒక అక్వేరియంలో మనుషులు బయట నీళ్ళూ […]
