Friday, 31 Jul, 2026

అన్నీ బోగస్

నేషనల్ కమిషన్ ఫర్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సుప్రీం కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో దేశవ్యాప్తంగా 2874  చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూట్ లను తనిఖీ చేస్తే అందులో కేవలం 54 మాత్రమే చట్టబద్ధంగా నడుస్తున్నాయని అంది. బీహార్ లో ముజఫర్ లో ఇటీవల బాలల సంరక్షణలో జరిగిన లైంగిక అకృత్యాలపై ఆలోచన చెలరేగిన నేపథ్యంలో ఆ సంరక్షణాలయాల విషయంలో క్షుణంగా అధ్యయనం చేసి ఎన్.సి.పి.ఆర్ ఈ నివేదిక ఇచ్చింది. పిల్లల జీవితం […]

తెలికైన నూనె

మేకప్ తొలగిచేందుకు మేకప్ రిమూవర్స్ కంటే బేబీ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. పేరుకు పిల్లలకోసం అని ఉంటుంది కానీ దీనీ వల్ల చర్మానికి చక్కని తేమ ఉండి ఆరోగ్యంగా అయిపోతుంది అంటారు మేకప్ ఎక్స్ పర్ట్స్. వాకింగ్ తర్వాత దద్దుర్లు రాకుండా ఉండాలంటే కాస్త ఈ ఆయిల్ తో మృదువుగా రాస్తే సరిపోతుంది. చర్మానికి స్వాంతన కలుగుతుంది. కంటి కింద వలయాలకు బేబీ ఆయిల్ చక్కని మందు. ప్రతి రోజూ ఈ ఆయిల్ తో కళ్ళ కింద […]

మచ్చలు పోతాయి

కాలిన గాయపు మచ్చలు చాలా రోజుల వరకు చర్మంలో కలసిపోకుండ కనిపిస్తాయి. ఆయిట్ మెంట్ కంటే గృహ చికిత్సలే వీటికి బాగా పని చేస్తాయి. మెంతుల్ని నానబెట్టి రుబ్బి మచ్చలపై రాస్తూ ఉంటే చాలా తోందరగా తగ్గుతాయి.పెరుగు ,బార్బీపొడిలో నిమ్మరసం కలిపి మచ్చలపై రాసి కాసేపు ఆరనిచ్చి కడిగేయాలి. ఉల్లిపాయరసం కూడా మచ్చలకు బాగా పనిచేస్తుంది. క్యారెట్ గుజ్జు చేసి రాసిన మంచి ఫలితం ఉంటుంది. పసుపు ,తెనే ,గులాబీ నీరు కలిపి మచ్చలపై రాస్తూ ఉంటే […]

బద్దకం ఎక్కువే

నేను ఎప్పుడు ఒకేలా ఉండను అంటోంది కియా అద్వానీ .అప్పుడప్పుడు క్రమ శిక్షణగా ఉంటాను. సినిమా షూటింగ్ అంటేనే తెల్లవారు జామునా లేచేస్తాను,చాలా హుషారైపోతాను. ఒక వేళ షూటింగ్ లేకపోతే అస్సలు మంచం దిగాలనే ఉండదు అంటోంది కియారా అద్వానీ. భరత్ అనే నేనులో నటించిన కియారా ఇప్పుడు రామ్ చరణ్ తో నటిస్తుంది. ఎప్పుడు ఒకే రకమైన ఎనర్జీ ఎందుకు ఉండదో ఏమో . ఏమాత్రం వీలున్న నా పద్దతి మార్చుకోవాలనిపిస్తుంది. కానీ షూటింగ్ లేకపోతే […]

కఠినంగా వద్దు

పిల్లలకు క్రమశిక్షణ నేర్పడం చాలా కష్టమైన బాద్యతే ఒక వయసు వచ్చే దాక పర్లేదు తర్వాత వాళ్ళు శారీరంకంగా బలపడ్డతర్వాత టీనేజ్ లోకి వచ్చాక వాళ్ళను తిట్టి కొట్టి అదుపులో పెట్టాలనుకోవడం అవివేకం. అలా చేస్తే అప్పటి వరకు ఉన్న భయం కూడా పోయినట్లే పిల్లలు తల్లిదండ్రుల ప్రతిరూపాలు తల్లిదండ్రులను బట్టి,పెరిగిన పరిణామాలను బట్టి వాళ్ళ వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది.అందుకే ముందు నుంచి పిల్లలతో ఎక్కువసేపు గడపాలి, తెలిసో తెలియకో తప్పుయ చేస్తే మరి కోపగించుకోవద్దు.పిల్లల పెంపకంలో ప్రేమ […]

చూసి నేర్చుకుని మరీ!

పిల్లలు అబద్దాలు ఆడితే మనకి ఒళ్ళు మండిపోతుంది. ఒక పరిశోధన ఏం చెబుతుందంటే పిల్లల చుట్టు వాతావరణాన్ని పెద్దవాళ్ళు చేసే పనులు తమ ప్రవర్తన బట్టే అబద్దాలు గాని ఏవైనా నేర్చుకుంటారు.పన్నెండు సంవత్సరాలు ఉన్న వందమందిని ఎంపిక చేసి వాళ్ళ ప్రవర్తనను,కుటుంబ నేపథ్యం ఇంట్లో వాళ్ళ ప్రవర్తన,చదువు,ఉద్యోగం అన్ని కూలంకషంగా పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చారు.పెద్దవాళ్ళు ఎదైన విషయం తప్పించుకోవల్సి వస్తే ఎలాంటి కబుర్లు చెప్తారు, చిన్న చిన్న అబద్దాలు సంకోచించకుండా ఎలా ఆడతారో చూసి నిశితంగా […]

అనాసతో ఆరోగ్యం

పైనాపిల్ లో పొటాషియం పుష్కలంగా ఉండటంతో పాటు సమృద్దిగా యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్లనూ బీపి ని తగ్గించటంలో దంతాల చిగుళ్ళు బలంగా ఉంచటంలో ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షించడంలో ముందుంటుందట.క్యాన్సర్ రోగుల్లో రేడియేషన్ కారణంగా తలెత్తే దుష్పరిణామాలు ఇందులోని బొమిలైన్ అనే ఎంజైమ్ తగ్గించ గలుగుతుంది. పుండ్లు,గాయాలు మాన్పగలుగుతుంది.కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. సంతాన సాఫల్యానికి ఈ పండు ఎంతగానో ఉపకరిస్తుందట.ఇందులో ఉండే సీ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది.కంటి కండరాల క్షీణతను తగ్గిస్తుంది.

జన్యువులే కారణం

కొందరు తీపి ఎక్కువ తినేందుకు కొవ్వు పదార్ధాలు ఇష్టపడుతున్నందుకు జన్యువులే కారణం అంటున్నారు .ఏ కారణం తెలియకుండానే చాలా మంది ఊబకాయం ఉన్న వాళ్ళు కొవ్వు పదార్ధాలు తినటం ,తియ్యనివి ఇష్టపడటం తెలుస్తుంది. ఇప్పుడు వచ్చిన కొత్త పరిశోధన ఈ అలవాట్లకి కారణం జన్యువులే నంటోంది. చిన్నతంలో ఆహారపు అలవాట్లు కనిపెట్టి తీపి కొవ్వు పదార్ధాలు ఇష్టంగా తినే పిల్లల్ని గమనించి ఆజన్యు లోపాన్ని సవరించగలిగితే ఊబకాయం ముప్పు ఉండదంటున్నారు.

నానపెట్టి తినాలి

భాదం పప్పుల్ని నానబెట్టి తింటేనే మంచి ఫలితం ఉంటుందని వాటిలో పోషకాలు పూర్తి స్థాయిలో అందుతాయని పోషక నిపుణులు చెపుతున్నారు. బాదం తొక్కల్లో ఉండే టాన్సిన్లు అందులోని పోషకాలు శరీరంలోని ఇంకకుండా అడ్డుకుంటాయి. బాదం పప్పుల్ని కనీసం ఎనిమిది గంటలు నాననిచ్చి తింటే అందులోని పోషకాలు పూర్తిగా వంటపడతాయి. నానిన బాదం పప్పు పై తొక్క వలిచేసి ఫ్రిజ్ లో భద్ర పరిచినా వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. నానబెట్టిన పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్స్ […]

పరిమళం మహత్యం

భయమేసిందా? బాధకలిగిందా? మనలో ఒత్తిడా? మరువ లేని లేని సంఘటనా ? ఇలాంటి ఏదైనా జీవింతంలో సంభవించిన ఆ కష్టం నుంచి మనసు కోలుకోలేకపోతే సిట్రస్ జాతికి చెందిన పండ్లతో చేసిన గాఢ తైలాన్ని వాసన చూస్తే శాంతిగా ఉంటుందని పరిశోధనలు చెపుతున్నాయి. కమలా నుంచి కమలా పండు తొక్కల నుంచి తైలం తీస్తారు. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుతో పాటు ఎన్నో ఆహార పదార్థాల తయారీలో వాడుతారు .ఈ వాసన మనసును కుంగదీస్తే ఒత్తిడి నుంచి […]

మొటిమల సమస్యా?

మొటిమల సమస్యకు ఆహారం చక్కని పరిష్కారం అంటున్నారు నిపుణులు. టోమోటోల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మ మృదుత్వాన్ని కాపాడుతాయి. మొటిమలు రాకుండా చేస్తాయి.వెల్లుల్లి లోని ఎలిసిన్ చర్మంలోని హానికారక బ్యాక్టిరియా వైరస్ లను నియంత్రించటం ద్వారా మొటిమలు రాకుండా చేస్తాయి. ముఖాన్ని వేడి నీటితో శుభ్రం చేస్తూ ఉంటే మొటిమలు రావు. నిమ్మపండు ముక్కలు మొటిమలపై తేలిగ్గా రాస్తే చాలు . నిమ్మలో ఉండే సిట్రిక్ యాసిడ్ మొటిమలకు కారణమైన బ్యాక్టిరియాను చంపేస్తుంది. పచ్చి బంగాళ […]

గొప్ప ఔషధం

తులసిని పూజిస్తారు .దేవతా రూపంగా భావిస్తారు.కాని తులసిలోని జీవ రసాయనాలకు యాంటీ బ్యాక్టీరియా,యాంటీ ఫంగస్ ,యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉన్నాయని ఏనాడో నిరూపించాయి అధ్యయనాలు. ఈ మధ్య కాలంలో తులసిలోని జీనోమ్స్ ని ఇటీవల పరిశోధించారు. మొక్కలో జరిగే జీవక్రియలో భాగంగా విడుదలయ్యే రసాయనాలు మెటబోలైట్స్ అని పిలుస్తారు. ఈ జన్యుకోడ్ తెలుసుకోవటం వల్ల మెటాబోలైట్స్ లో పది ఎందుకు ఉపయోగపడుతోందో తెలుసుకోవచ్చు. దీని ద్వారా ఔషదాల తయారీ సులభం అవుతోందని అంటున్నారు . […]

కాస్త శ్రధ్ద పెట్టండి

మహిళల్లో గుండె పోటు లక్షణాలు స్పష్టంగా కనబడవు .పురుషుల్లో గుండె పోటు వస్తే ఛాతీనొప్పి ,బరువు ,చెమటలు పట్టడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. కానీ మహిళల్లో అంత స్పష్టంగా ఏవీ ఉండవు. కడుపు నొప్పి అనో,వికారమో ఏదో అసౌకర్యమో అనిపంచటం ఎన్నో సంధర్భాల్లో అసలు అదేం నొప్పో తెలియకపోవటం,పోత్తి కడుపు పై భాగాంలో నొప్పిగా ఉండటం,వీటి వల్ల స్త్రీలలో గుండెపోటు గుర్తించటడం ఆలస్యం అవుతోంది. అందువల్లేనే గుండె జబ్బు కారణంగా మరణాలు స్త్రీలలో ఎక్కువని ప్రపంచ ఆరోగ్య […]

ఇక అందమే అందం

ప్రపంచ వ్యాప్తంగా ఇవ్వాళ ఎన్నో ఫేషియల్ మాస్క్ లు సందడి చేస్తున్నాయి. పాములతో రిలాక్స్ అవ్వటం,నత్తలతో ఫేఫియల్ కూడా అశ్యర్యం ఏమీ లేదు. అలాంటిదే ఇంకొక మార్కెట్ ఫేఫియల్ . ఈ ఫేషియల్ తో ముఖం ఎంతో యవ్వనంగా మెరిసిపోతుంది అంటున్నారు. మెత్తని ఆయస్కాంత రేణువు పొడికి తడిచేసి ముఖానికి మాస్కులా వేస్తారు. పది నిమిషాల్లో మాస్క్ పొడారి పోతుంది. ఇప్పుడు ఒక ఆయస్కంతం ముక్కను ముఖంపై పెట్టి అలాపై పైన రాస్తే మాస్క్ పోరలు ఊడివస్తాయి. […]

అస్సలు వాడద్దు

నిద్రపట్టకపోవడం చాలా విసిగించే సమస్య.ప్రపంచం మొత్తం ప్రశాంతంగా నిద్రలో ఉంటె నిద్రపట్టని వాళ్ళ సంగతి ఏమిటి. వెంటనే నిద్ర మాత్రలను ఆశ్రయించాలి కానీ ఈ నిద్రమాత్రలతో మిగతా ఆరోగ్య సమస్యలు సంగతి ఎలా ఉన్న మతిమరపు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నాయి అద్యయనాలు. నాలుగు లక్షలమంది వృద్దుల పైన చేసిన అద్యయనం ఈ విషయం తేల్చి చెప్పింది. వైద్యుల సలహా పైనే నిద్రమాత్రలు వాడాలని లేకుంటే ప్రాణాంతక సమస్యలు తప్పవని అంటున్నారు. సహజంగా వయసు పెరిగిన కొద్ది నిద్రపోయే […]

ఇష్టమైన పనే విశ్రాంతి

ఎప్పుడు ఒకే రకంగా విసుగు తెచ్చే రోటిన్ లో ఉంటాం. నిద్ర లేచిన దగ్గర నుంచి పది గంటలకు ఆఫీస్ కు పోవడం వరకూ కొన్ని రోటిన్ పనులు ఆ తర్వాత ఆఫీస్ లో ఒకే లాంటి చాకిరీ, ఆ పనిలో వచ్చే విసుగు ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరగడం బిపి పెరగడం గుండె కొట్టుకునే వేగం పెరగడం ఇక నెమ్మదిగా అనారోగ్యాలు ఇదీ వరస. ఇప్పుడూ కొన్ని అద్యాయనాలు వత్తిడి తగ్గించే శక్తి మనకు ఇష్టమైన […]

ఎవళ్ళూ తప్పించుకోలేరు

బాడీ షేమింగ్ విషయంలో మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ కూడా అవహేళన ఎదుర్కొందట. ఒక మీడియా ఇంటర్యూలో మీ లైఫ్ లో మీరెప్పుడనా బరువుతో ఇబ్బంది పడ్డారా అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ నాలుగేళ్ళ క్రితం వసీం అక్రమ్ తో నేషనల్ లెవల్ టివీ చానెల్ ప్రోగ్రాం కోసం వెళ్ళినప్పుడు తాను బరువు పెరిగిన విషయాన్ని ఒక ఛానల్ స్క్రోలింగ్ లో ఇప్పుడు సుస్మిత ఎలా ఉందో చూడండి అని నానా హంగామా చేశారని చెపుకొచ్చింది. ఆ […]

ఆహరమే ఔషధం

జీవితంలో ఎన్నో ఒత్తిడులు డిప్రెషన్ కలిగిస్తాయి. ఆ కుంగుబాటుకు మంచి వైద్యం ఆరోగ్యకరమైన ఆహారం అంటున్నాయి అద్యయనాలు. శరీరంలో సెలీనియం తక్కువైతే డిప్రెషన్ వస్తుంది. కనుక సెలీనియం ఉండే ముడి ధాన్యాలు ,సీ ఫుడ్ ,మేక,కోడి కాలేయ భాగాలు తినాలి.విటమిన్ డి తక్కువైనా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి.చేపలు,పుట్టగొడుగులు తింటే మంచిది. అలాగే అవిసె,పిస్తా,బాదం,వాల్ నట్స్ ,పండ్లు ,కూరగాయలు మొదలైనవన్ని ఒత్తిడి పరమైన సమస్యలను తగ్గిస్తాయి.బీన్స్,పప్పు దినుసులు పాలు,గుడ్లు చేపలు కూడా శరీరానికి ప్రోటీన్ అందించి ఒత్తిడిని తగ్గేలా […]

రుచే కానీ ప్రమాదం

మైదాపిండి చపాతీలు కొన్ని వంటలు చాలా రుచిగా ఉంటాయి.కానీ ఇంత రుచి నిచ్చే ఈ తెల్లని పిండిలో కార్బో హైడ్రేట్స్ అధిక స్థాయిలో ఉంటాయి. పోషకాలు చాలా తక్కువ మైదాలో గ్లైకామిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఒంట్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ఒక్కసారి పెరిగిపోయే ప్రమాదం ఉంది.మైదా పిండితో తయారు చేసిన వంటకాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో కాన్సర్ వంటి వ్యాదులు వచ్చే అవకాశం ఉందని అద్యాయనాలు చెభుతున్నాయి.

రెండు లాభాలు

వర్షల్లో దోమల బెడద ఎక్కువవుతుంది.మస్కిటో కాయిల్స్ ఇతర మందులు దోమల బెడద నుంచి పూర్తిగా కాపాడలేకపోతున్నాయి.పైగా ఈ రసాయనాలతో శ్వాసకోశ ఇబ్బందులు తప్పవు. అలాంటప్పుడు రెండు బిర్యానీ ఆకులు కాల్చి మంటవేస్తే ఆ పొగాకు దోమలు పోతాయి.ఒక్క గదిలో ఈ బిర్యాని ఆకు మండించటం వెంటనే ఆ గది తలుపులు మూసేస్తే ఆ రూంలో పొగ అంతా వ్యాపించి దోమలు పోతాయి. ఆ వాసన మనం పీల్చినా ఒత్తిడి ఆందోళన మాయమై మనసు ప్రశాంతంగా ఉంటుందని ఈ […]