Sunday, 02 Aug, 2026

ఈ విటమిన్ సర్వరోగ నివారిణి

రక్త నాళాల్లో దెబ్బతిన్న లోపలి పొరను బాగు చేయటంలో విటమిన్ డి కీలకపాత్ర పోషిస్తుందని ఒహయో విశ్వవిద్యాయలం నిపుణులు చెపుతున్నారు.ఇప్పటి వరకు ఈ పొర కేవలం రక్తప్రసరణ వ్యవస్థకు కవచంలా మాత్రమే పని చేస్తుందని భావించే వాళ్లు ,కానీ గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న పరిశోధనల్లో ఆ పొర ఒక కీలకమైన అవయవమని ,అది దెబ్బ తింటేనే బిపి ఇన్సులిన్ నిరొధం,మధుమేహం ,గుండె జబ్బు ,పక్షవాతం వంటివి వస్తాయని తెలింది. ఇలాంటి రక్త నాళాల లోపలి పొర […]

ఎప్పుడు ఎందుకు తింటారో

కారణాలు కొన్ని,ఎన్ని పరిశోధనలు చేసినా పూర్తిగా బయటపడవుగానీ రోజు మొత్తంలో కొన్ని పదార్థాలని కొన్ని సమయాల్లో తినాలని అనిపిస్తుందట. దీనికి శాస్త్రీయ బద్దత ఉందంటారు నిపుణులు. నూనెతో చేసిన వేపుడు పదార్థాలు మధ్యాహ్నం వేళ తినాలని మనసు ప్రేరేపిస్తుంది. డిన్నర్ తర్వాత రాత్రి ఎనిమిది ,తొమ్మిది గంటలకు తీపి తినాలనిపిస్తుందట. అలాగే ఆరోగ్యవంతమైన స్నాక్స్ ఇళ్ళల్లో కంటే బయటే తింటూ ఉంటారట. 40 శాతం మంది స్నాక్స్ లో నట్స్ ఇష్టపడరు కానీ అదే స్నాక్స్ ని […]

మేలు చేసే పంచ రత్నాల పొడి

కొన్ని రకాల కూరలు మసాలాలు ఎక్కువగా వేస్తేనే రుచిగా ఉంటాయి. అందుకే అవి పంచ రత్నాల పొడితోనే చేస్తారు. అంటే స్టార్ అనీస్ ,సోంపు గింజలు ,మిరియాలు,దాల్చిన చెక్క,లవంగాలు కలిపి చేసే పొడినే పంచ రత్నాల పొడి అంటారు. ఇవి కూరలకు లేదా ఆహార పదార్థాలకు ఘాటు,నోరు ఊరించే వాసనలు ఇస్తాయి. ఇవి పూర్తిగా ఫిలో కెమికల్స్ తో నిండి ఉంటాయి. గరం మసాలాల్లో యాలకులు ,మిరియాలు,దాల్చిన చెక్క, లవంగాలు కలిపి ఉంటాయి. చాట్ మసాలాలో ధనియాలు […]

ఇంక నగలెందుకు?

బ్లవుజుల్లో వస్తున్న కొత్త ట్రెండ్ జ్యూవెల్ ఎంబ్రాయిడరీ బ్లవుజులు. నగలే అవసరం లేదు వీటిని ధరిస్తే నెక్లెస్ లు ,చెవిదిద్దులు, మొదలుకొని అన్ని రకాల నగలు ఈ బ్లవుజ్ పైన ఎంబ్రాయిడరీ చేస్తున్నారు. రంగు రంగుల రాళ్లు,మెరుపు దారాలతో బంగారు హారాలు రాళ్ళ నెక్లెస్ లు చాలా అందంగా ఈ బ్లవుజ్ పైన కనికట్టు చేస్తుంటే ఇక అన్ లైన్ నగల అవసరమే లేదు. ఎదైనా ఫంక్షన్ సమయంలో తేలికైన చీరెతో ఈ ఎంబ్రాయిడరీ జాకెట్లు వేసుకొంటే […]

ష్…తప్పు

గోళ్ళు కొరుక్కోవటం ,జుట్టు లాక్కుంటూ ఉండటం ,గొనుక్కోవటం, నోట్లో వేలేసుకోవటం వంటి చిన్ననాటి నుంచి అలవాటైన కొన్ని పనులు ఎంత ప్రయత్నం చేసిన మానలేకపోతారు. పదిమందిలో ఉన్ననప్పుడు కూగా నియంత్రంచుకొలేక చాలా ఇబ్బంది పడతారు.ఇదిగో ఇలాంటి హ్యబిట్స్ తో నలుగురిలో ఉన్నప్పుడు అనుకోకుండా అలావాటుగా ఆ పని చేస్తూ అవమానం అనుకొనేవాళ్ల కోసం హ్యాబిట్ ఎవేర్ అనే కంపెనీ కీన్ అన్నా పేరుతో ఒక బ్రాస్ లెట్ తయారు చేసింది అనుకోకుండా గోర్లు కొరికేందుకు వేలు నోట్లోకి […]

గడ్డిపైన నడిస్తే ఒత్తిడిమాయం

క్లింట్ బచెర్ అన్న కార్టియాలజిస్ట్ , రోజుకు ఒక అరగంట సేపు నడిస్తే ఇసుక ప్రదేశాల్లో నడవ మంటున్నారు. పాదాలు నేలకు ఆనించి నడిచే నడకలో రక్త ప్రసరణ మెరుగు పడుతుందని ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతోందని చెపుతున్నారు పాదరక్షలు లేకుండా నడిచే గ్రౌండింగ్ వల్ల వచ్చే లాభాలను దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే నడిచే నడకను ప్రకృతిలో ,పచ్చని చెట్ల మధ్యలో ,పచ్చిక పైన నడిస్తే ఎంతో ఆరోగ్యం చూడమంటున్నారు. కోపం ,స్ట్రెస్ ,భయం వంగి నెగిటివ్ […]

బరువు నియంత్రణ సాధ్యమే

సరైనా ఆహార నియమాలు పాటిస్తూ క్రమం తప్పక వ్యాయమం చేస్తూ ఉంటే రెండు మూడు నెలల్లో పది కిలోలు తగ్గిపోవచ్చు. అయితే ఆహారం సరైన సమయంలో తీసుకోవాలి. పళ్ళు ,కూరగాయాలు ఎక్కువగా ఉండాలి. పప్పు ,గుడ్డు ,వెన్న తీసిన పాలు ,పెరుగు కూడా బరువు నియంత్రణకు ఉపయోగపడతాయి. ఆకలైనప్పుడు మాత్రమే ఆహారం తీసుకోవాలి. కడుపు నిండే వరకు తినవద్దు. స్నాక్స్ ఆరోగ్యవంతమైనవి అయి ఉండాలి. పండ్లు ,శనగలు మొలకెత్తిన గింజల్లో ఎక్కువ పోషకాలుంటాయి. అలాగే శారీరక వ్యాయామాల […]

చపాతీలు పర్లేదు

ఈ చలి రోజుల్లో అన్నం కంటే వేడి వేడి చపాతీలు తినాలని అనిపిస్తుంది. గ్లోటెన్ అలర్జీ లేకపోతే వారంలో నాలుగు రోజులు రెండు పూటలా తిన్న పర్లేదు. అయితే గోధుమ పిండితో పాటు చిరుధాన్యాల పిండి,అవిసె పొడి కూడా కలపితే ఆరోగ్యం.అలాగే పిండిలో తురిమిన క్యారెట్ బీట్రూట్ ఉడికించిన ఆకు కూరలు వంటివి కలుపుకొంటే విటమిన్స్ మినరల్స్ కూడా లభిస్తాయి. వీటిలో ఉప్పు కారం కాస్త తక్కువ వేయటం కూర పప్పు ఎక్కువగా తీసుకోవటం మంచిది. రోట్టెలపై […]

మిల్లెట్స్ తింటున్నారా?

మనిషికి రోజుకు 38 గ్రాముల ఫైబర్ కావాలి.సిరి ధాన్యాలు కనుక తినటం అలవాటు చేసుకొంటే 20 నుంచి 30 గ్రాములు పీచు వీటిలోంచే లభిస్తాయి, అలాగే మిగిలిన పదిగ్రాముల ఫైబర్ కూరగాయాలు ఆకుకూరల ద్వారా లభిస్తుంది.సిరిధాన్యాలకు ఉండ ఫైబర్ ధాన్యపు కేంద్రం నుంచి పొరలు పొరలుగా అంతర్లీనంగా ఉండటం వల్ల మనిషికి ఆరోగ్యం ఇవ్వటంలో పూర్తిగా సహకారం ఇస్తాయి. కొర్ర బియ్యంలో 8 శాతం ఫైబర్ 12 శాతం ప్రోటీన్ ఉంటుంది.ఇది గర్భిణులకు సరైన ఆహారం నరాల […]

మళ్ళీ వేడి చేస్తే అనారోగ్యం

రెండు పూటల కోసం ఒకే సారి వండేసి ఫ్రిజ్లో పెట్టేస్తారు సాధారణంగా ఉద్యోగినులైన వాళ్ళు .వచ్చి రాగానే ఉరుకులు పరుగులతో ఇబ్బంది లేకుండా కాస్త వేడి చేసుకొని తీరుబడిగా సాయంత్రం భోజనం చేసేస్తారు. అయితే కొన్ని పదార్థాలు వేడి చేయకండి అంటారు డాక్టర్లు. పాలకూరతో బంగాళాదుంపలను వేడి చేసినప్పుడు మృత బాక్టీరియా విడుదల అవుతుంది. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయి. పుట్టగొడుగులు ఒక సారి వండేక మళ్ళీ వేడి చేస్తే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. చికెన్ […]

బ్రెష్ ల శుభ్రం

మొహం పైన గుల్లలు ర్యాష్ వచ్చిన ఇది మేకప్ బ్రెష్ లు శుభ్రంగా లేక పోవటం వల్లనే అనుకోవచ్చు. వీటిలోని బాక్టీరియా చర్మం ఎలర్జీలకు కారణం అవుతుంది. మేకప్ బ్రెష్లు డన్ ఇన్ ఫెక్ట్ చేసేందుకు షాంపూ క్లీన్ స్పాంజి చాలు.లేకపోతే క్లీన్ బ్రెష్ ల కోసం ఉద్దేశించిన క్లెన్సింగ్ సోల్యూషన్ తో కూడా వీటిని శుభ్రంగా ఉంచవచ్చు. లేదంటే లిక్విడ్ శానిటైజర్లు కూడా ఉపయేగమే ప్రతి సారీ వాషింగ్ తరువాత బ్రెష్ లను ఇరవై నిమిషాల […]

సంప్రదాయపు అందం

భారతదేశానికి చెందిన నేత కళ అమూల్యమైన సంప్రదాయాన్ని ఔన్నాత్యాన్ని చాటి చెపుతోంది. బనారస్ చీరె పట్టు దారాల అల్లికతో బంగారు తీగల తారళ్యంతో బనారస్ జరీ చీరె మిలమిల లతో రాజరికపు సౌందర్యాన్ని ప్రతి ఫలిస్తుంది.ఈ నేత పని చేసే నిపుణులు సంప్రదాయమైన రంగుల అద్దకం లోనూ ,జనాదరాణ పొందిన రసాయన వర్ణాలు ఉపయోగించటంలోనూ చాలా శ్రద్దగా ఉంటారు. వివాహా సందర్భంలో బెనారస్ చీరె గొప్ప ఎంపిక .వీటికి ఎంచుకొనే రంగులు ప్రత్యేకమే ప్రేమకు సంకేతంగా ఎరుపు […]

మార్బుల్ పేలెస్

కలకత్తాలోని మార్బుల్ పే లెస్ చూడదగిన చారిత్రాత్మక ప్రదేశాల్లో ఒకటి. 19వ శతాబ్దంలో సంపన్న వ్యాపారవేత్త రాజా రాజేంద్ర ముల్లిక్ ఈ భవనాన్ని నిర్మించారు.అలనాటి యూరోపియన్ ఆర్కిటెక్చర్ కు ఈ అందమైన పాలరాతి భవనం చక్కని ఉదాహరణ. రమణియమైన పాలరాతి ఫ్లోరింగ్ ,గోడల్లో అరలు 76 అరుదైన శిల్పాలు,పెయింటింగ్స్, అద్భుతమైన శాండిలియర్స్ పురాతన గడియారాలు వస్తువులతో ఇది రాజారాజేంద్ర ముల్లిక్ వారసుల నివాసం కూడా,ఇక్కడ జూ అరుదైన పక్షులు ఉన్నాయి.ఫోటోలు తీయడం నిషేధం.ప్రవేశం ఉచితం. ఒక రాజభవనాన్ని […]

వీటిలోనూ నీరే

నీళ్ళు తాగాలని తెలుసుకానీ అది ఆచరణలో కష్టం అయిపోతుంది. నీటి ఆధారిత పండ్లు,కూరగాయలు తింటూ వుంటే శరీరానికి నీటి అవసరం కొంత తీరుతుంది. కనీస మాత్రమే క్యాలరీలు కడుపు నిండిన భావన కలుగుతుంది. కీరాలో 96.7 శాతం నీరే ఉంటుంది. విటమిన్ సీ,కెఫెక్ యాసిడ్ వంటివి చర్మాన్ని చక్కగా పరిరక్షిస్తాయి.కొత్తిమీరలో 95.4 శాతం నీరు ఉంటుంది.కరగని పీచు కలిపి శరీరాన్ని చల్లబరుస్తుంది.ముల్లంగిలో 95.3 శాతం నీరు ,క్యాప్సికలంలో 93.9 శాతం నీరు,కాలిఫ్లవర్ లో 92.1 శాతం పుచ్చకాయలో […]

హైపర్ టెన్షన్ తగ్గించే వెండి

వెండికి ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది.వెండితో స్వస్థత ఇచ్చే రోగ నిరోధక ఆరోగ్యపరిరక్షణ గుణాలు ఉన్నట్లు చెభుతారు. పసిబిడ్డకు వెండి ఉగ్గు గిన్నెలో పాలు,మందులు తాగిస్తారు.వెండి గిన్నెలో అన్నం పెడతారు నోటికి వచ్చే బ్యాక్టీరియాను వెండిని చప్పరించటం వల్ల తగ్గించవచ్చు అన్న నమ్మకం వల్లనే శిశువుకు వెండి చెంచాలు టీ రింగ్స్ కానుకలుగా ఇస్తారు. వెండి ఉంగరాలు ,కడియాలు ధరిస్తే ఆర్ధరైటీస్ లక్షణాలు తగ్గుతాయని హైపర్ టెన్షన్ అదుపులో ఉంటుందని కీళ్ళ వైకల్యాన్ని దూరం చేస్తుందని […]

పాటించ వలసిన సూత్రాలు

ప్రతి వాళ్లు ఆహారానికి సంబంధించి కొన్ని సూత్రాలు పాటించాలి అంటున్నారు వైద్యులు. ఔషధ గుణాలున్న పదార్థాలు వినియోగించి ఆహారం తయారు చేసి వంట చేసే విధానం, పద్ధతి పదార్థాల మిశ్రమ విధానాలు తెలుసుకోవటం ఆహార పరిమితి కోరటం వయసు ఆరోగ్యం సమయా సమయాలు దృష్టిలో ఉంచుకోని వీటిలో ముఖ్యమైనవి ,పోషక విలువలతో కూడిన షడ్రుచుల సమ్మేళనమైన ఆహారం తినాలి. హితమైన ఆహారం మితంగా తీసుకొంటే శరీరం నిర్మాణంలో ప్రత్యేకమైన ఎదుగుదల కనిపిస్తుంది.ఇది శరీరానికి మనకు మంచిది. రాత్రి […]

లెడ్ తో అనారోగ్యం

హ్యండ్ బ్యాగ్స్ మెరుస్తూ ఉండటం కోసం లెడ్ ఉపయోగిస్తారు. ఈ లెడ్ పాలి వినైల్ క్లోరైడ్ లో కనిపిస్తుంది. తయారీ రకాలు సింథటిక్ హాండ్ బ్యాగ్స్ వంటి వాటికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తారు. దీనివల్ల మెటీరియల్ మెరుస్తూ మృదువుగా కనిపిస్తుంది కానీ ఇవి వాడేప్పుడు పిల్లలు వాటిని ఆడుకుంటూ నోట్లో పెట్టుకుంటే ప్రమాదం అంటున్నారు ఎక్స్ పర్ట్స్.లెడ్ ను హాండ్ బాగ్ పర్సులపై ముట్టుకోంటూ ఆ చేతులతో పిల్లలను ఎత్తుకొంటారు. పిల్లల చేతికి ఇస్తారు. వీటి పైన […]

వెయింట్ లిఫ్టింగ్ కూడా తేలికే

యాక్షన్ సినిమా భాఘి-2 తరువాత తనపైన తనకు నమ్మకం పెరిగింది అంటోంది దిశా పటాని. సోనుసుద్ తో కలిసి జాకీ చాన్ కుంగ్ పూ యోగాలో నటించాక తన వర్కవుట్స్ పద్దతే మార్చేశానంటుందామె. మహిళలు కేవలం కార్టియో వర్కవుట్స్ మాత్రమే చేయగలరు అనుకొంటారు కానీ వాళ్ళ వెయింట్లిఫ్టింగ్ కూడా హాయిగా ఈజీగా చేయగలరు. కేవలం అది ప్రాక్టీస్ మాత్రమే అంటుంది దిశా పటాని. ఉదయం సాయంత్రం తప్పని సరిగా వర్కవుట్స్ చేస్తూ ఆహార పానీయాల విషయంలో అత్యంత […]

అల్లం,తేనె మంచిది

గర్భిణులలో ఉదయం లేస్తునే వికారం ,వాంతులతో ఇబ్బందిపడుతూ ఉంటారు. ఏం తినాలన్న ,తాగాలన్న భయపడతారు. డాక్టర్ ఈ లక్షణాలు తగ్గించేందుకు విటమిన్ బి6 లేదా ఇతర మందుల్ని సూచిస్తారు. అయితే మూడు వారాల పాటు ప్రతిరోజు అల్లం తీసుకొంటే వారికి వికారపు లక్షణాలు తగ్గుతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పైగా ఈ అల్లం గర్భస్థ శిశువుపై ఎటువంటి దుష్ప్రభావం చూపించదు. కొంచెం తేనె అల్లం కానీ అల్లంతో చేసిన టీ కానీ తీసుకొన్న ఈ వికారం ఇబ్బంది […]

టీవీతో గుండె జబ్బులు

టివీ ముందు గంటల తరబడి రకరకాల కార్యక్రమాలు చూస్తుంటారు .అయితే ఆ కంటెంట్ ప్రభావం శరీరంపై ఉంటుంది అంటున్నాయి అధ్యయనాలు. కార్యక్రమాల్లో కనిపించే హింస ,ఉద్రేకం ,వేదన ,కష్టం ,కొపం ఇవన్ని శరీరంపై ప్రభావం చూసిస్తాయని దీని ద్వారా గుండెకు సంబంధమైన ఒత్తిడి ఇతర అనారోగ్యాలు వస్తాయంటున్నాయి అధ్యయనాలు. కంప్యూటర్ ముందో కారులోనూ గంటల తరబడి కూర్చున్న వ్యాయామం అందక స్థూలకాయం కీళ్ళ నొప్పులు రావచ్చు కానీ ఈ టీవీ వీక్షణం వల్ల ప్రవర్తన నాటకీయంగా మారీపోతుందని […]