శారీ సల్వార్
ఇంట్లో ఉండే ఇద్దరు అక్కా చెళ్లెల్లు లేదా ప్రాణ స్నేహితులు ఒకే లాంటి దుస్తులు ధరించేందుకు ఇష్టపడతారు. ఒకళ్ళకు ఆధినికమైన దుస్తులు ఇష్టం,మరొకరికి చీరలు ఇష్టం. అచ్చం ఒకేలాంటి డ్రెస్ ఇద్దరు వేసుకుంటే బావుంటుంది అనుకుంటారు. అలా ప్రత్యేకంగా డిజైన్ చేసిందే సల్వార్ చీరె కాంబో డిజైన్.అలాగే చీరెలు కట్టుకునే తల్లులు సల్వార్ వేసుకునే కూతుళ్ళు కూడా ఇష్టపడే డ్రెస్ ఇదే. అలాగే కొన్ని కార్పోరేట్ ఆఫీసుల్లో ఎంప్లాయిస్ అందరు ఒకే రకం డ్రెస్ కోడ్ లో […]
కసరత్తులతో తగ్గే మధుమేహం
ఫిట్ నెస్ కోసం రకరకాల వ్యయామాలు చేస్తూ ఉంటారు. కండలు పెంచేందుకు, అందమైన శరీరాకృతి కోసం కూన్నో కసరత్తులు చేస్తారు అమ్మాయిలు.కారణం ఏదైన ఈ రకమైన వ్యాయామాలతో మధుమేహం వచ్చే ప్రమాదం తప్పుతుంది అంటున్నారు పరిశోధకులు. కొంతమంది 30 ఏళ్ళ వయసులో అమ్మాయిల పైన చేసిన పరిశోధనలో పని తీరుని అభ్యాసం చేసి రెగ్యూలర్ గా కసరత్తులు చేసే వాళ్లలో బరువు తగ్గడంతో పాటు క్లోమ గ్రంధి పనితీరు మెరుగైనట్లు గుర్తించారు.అంటే రక్తంలో గ్లూకోజ్ నిల్వలు పేరుకోకుండా […]
ఈ ఒక్క నగే చాలు
ఇవ్వాల్టి అమ్మాయిలకు గాజుల కంటే బ్రాస్ లెట్స్ ధరించడం ఇష్టం. ఫ్యాషన్ బుల్ గా కనిపింఛడం కోసం ఉంగరాన్ని,బ్రాస్ లెట్ ని కలుపుతు రింగ్ బ్రాస్ లెట్ లు రూపోందించారు డిజైనర్లు.ఇవి వేడుకలప్పుడు ధరించేందుకు వీలుగా ఉంటాయి.మణికట్టు నుంచి వేళ్ళ వరకు ఒకే నగ ధరించినట్లు ఉండటంతో ఇక చేతికి ఏ అలంకరణలు అక్కర్లేదు.ఖరీదైన రత్నాలు పొదిగిన ఈ రింగ్ బ్రాస్ లెట్లు పూలు,తీగలు,నెమళ్ళు రకరకాల డిజైన్లతో వస్తున్నాయి.బంగారంతో పాటు ఇమిటేషన్ నగలు ఈ తరహాలో రూపోందిస్తున్నారు.
చర్మ ఛాయకు మెంతి పూత
ఎండలో తిరిగితే చర్మం,జుట్టు పొడవుగా ఉంటాయి. చర్మంపై జిడ్డు పేరుకుని మొటిమలు ఇబ్బంది పెడతాయి.జుట్టు పొడిబారిపోతూ ఉంటుంది.ఈ రెండు సమస్యలకు మెంతులు చక్కని ఉపశమనం. మెంతు పిండిని పుల్లని పెరుగులో కలిపు ముఖానికి రాసి మర్ధనా చేస్తే చర్మం మృదువుగా అవుతుంది.మెంతులు తారిపూట నీళ్ళలో వేసి నానబెట్టి తెల్లవారి మెత్తని పేస్ట్ లా చేసి పుల్లని పెరుగు నిమ్మరసం ,ఆలీవ్ నూనె కలిపి తలకు పెట్టుకుని ఓ అరగంట ఆగి తలస్నానం చేయాలి.అప్పుడు మాడుకు చల్లదనం అందుతుంది. […]
మొదటి మహిళా వైస్ ఛాన్స్ లర్
వందేళ్ళ చరిత్ర ఉన్న జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో వైస్ చాన్స్ లర్ గా నజ్మా అక్తర్ నియమితులయ్యారు.ఢిల్లీలోని ఓ విశ్వవిద్యాలయంలో ఓ మహిళా ఈ స్థానాన్ని పొందడం ఇదే తొలిసారి. నజ్మా ప్యారీస్ లోని ఐఐఈసి యునెస్కో లండన్ లోని వార్విక్ విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నారు.అలీగఢ్ ముస్లీం విశ్వవిద్యాలయంలో పీహెచ్ డీ లో స్వర్ణపతాకం తీసుకున్నారు. ఐదేళ్ళపాటు నజ్మా వీసీ విధుల్లో ఉన్నారు.
ఇది చర్మానికి బేస్టే
బేకింగ్ సోడా తో సౌందర్యాన్ని కాపాడుకునే చిట్కాలు ఎన్నో ఉన్నాయి. కాఫీలు, టీలతో నల్లబడిన దంతాలను టూత్ పేస్ట్ పైన ఈ బేకింగ్ సోడా వేసి రుద్దితే తెల్లగా వస్తాయి. కళ్ల కింద నల్లగా అయిపోతే ఈ బేకింగ్ సోడానీళ్ళలో కలిపి అందులో దూది ముంచి నల్లబడిన చోట పది నిమిషాలు ఉంచేస్తే నలుపు తగ్గిపోతుంది.షేవింగ్ తో వెంట్రుకలు తొలగిస్తే ఒక్కోసారి వెంట్రుకలు చర్మం లోపల పెరిగే అవకాశం ఉంది. షేవ్ చేసిన వెంటనే బేకింగ్ సోడా […]
ఈ మూడింటి చుట్టు నా భవిష్యత్
తెలుగు తమిళం ,హిందీ భాషల్లో నటిస్తొంది రకుల్ ప్రీత్ సింగ్ .మంచి కథలు ఎక్కడ నుంచి వస్తే అక్కడ నటించేందుకు నేను సిద్ధంగా ఉంటాను . మూడు పరిశ్రమలో నాకు పరిచయం ఉన్నవి. నచ్చినవి కూడా . చేసే పనిని ప్రేమిస్తున్నప్పుడు ,మన కలలతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రయాణం సమస్య కానే కాదు.మూడు భాషా చిత్రాలే కాదు ఇంకా చాలా పనులున్నాయి. సినిమాలు, ఫుడ్,బిజినెస్ ఈ మూడు నాజీవితంలో కీలకం.అలాగే భవిష్యత్లో కూడా ఈ మూడు […]
అల్పాహారం అదనపు బరువే
ఇప్పటి వరకు ఉదయపు అల్పాహారం బ్రేక్ చేయకండి అనే సలహాలే ఎన్నో, కానీ ఒక కొత్త పరిశోధన బ్రేక్ ఫాస్ట్ తో బరువేం మారదు. ఆరోగ్యకరమైన అల్పాహారంతో శరీరం బరువు స్థిరంగా ఉంటుందనే. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకొకపోతే ఆకలితో లంచ్ ఎక్కువగా తీసుకోనే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. బ్రేక్ ఫాస్ట్ వల్ల 260 క్యాలరీలు శరీరానికి వెళతాయి, అటు తరువాత లంచ్ బరువు ,స్నాక్స్ బరువు ఇవన్ని కలుపుకొని సరాసరి 0.44 కొలోల బరువు పెరిగే […]
ఊయల నిద్ర పెద్దలకు మంచిదే
కొన్ని పరిశోధనలు సంతోషకరమైన విషయాలు రుజువు చేస్తూ ఉంటాయి.ఊయల ఊగటం అందరికీ ఇష్టమే పసిబిడ్డను ఊయాలలో ఊపితే హాయిగా నిద్రపోతారు.ఊయాల అలవాటు ఎంతగా ఉంటుందంటే ఊయల ఊపు ఆగినా పిల్లలు నిద్రలేస్తారు.ఇప్పుడు ఒక పరిశోధన ఈ ఊయల ఊపు అన్ని వయసుల వారిగా స్వాంతన కలిగించి నిద్ర ఇస్తుందని తేల్చింది. ఒక సారి నిద్రలోకి .జారుకొంటే మధ్యలో మెలుక రానంత నిద్రలోకి పోతారని చెపుతున్నారు. ఊయల ఊపు మెదడు పైన ప్రభావం చూపెడుతుంది. మెదడు చురుగ్గా పని […]
మహిళల్లో ఎత్తు కీలకం
ఎత్తు ఎక్కువగా ఉండే ఆడవాళ్ళు ఎక్కువ కాలం జీవించే అవకాశం ఉంది అంటున్నాయి డచ్ దేశ పరిశోధక ఫలితాలు. ఎత్తు ,బరువు ,ఆరోగ్యంపైన జరిగిన ఒక పరిశోధనలో 90 ఏళ్ళ వరకు జీవించే మహాళల్లో ఎత్తు బరువు పాత్ర ఉంది. 5.3 అడుగుల కన్నా తక్కువ ఎత్తు ఉన్న మహిళలు అంత దీర్ఘకాలం జీవించటం లేదన్నారు.యుక్త వయసు నుంచి శరీరం బరువు ఎత్తు ఆరోగ్య పరిస్థితిపై ఉన్న అంశాలపైన జరిగిన అధ్యయనంలో ఎత్తు తక్కువగా ఉన్నా ఆడ,మగ […]
మాది నటనే వాస్తవం చూడండి
న్యాయ వ్యవస్థలో మార్పులు మాత్రమే మహిళల జీవితంలో వచ్చే సమస్యల నుంచి బయటపడేలా చేసి సాయపడగలవు ,సినిమాలు ప్రసంగాల వల్ల మాత్రం కాదు అంటోంది రాశిఖన్నా. నటిగా నేను మహిళలకు సంబంధించిన ఇతి వృత్తాలున్న సినిమాలు ఆ పాత్రను అర్ధం చేసుకొని నటించగలను .సామాజిక మాధ్యమాల ద్యారా ప్రజల్లో అవగాహన కల్పించేలా మాట్లాడగలను . నేను చెప్పిన అంశాలకు కట్టుబడి ఉండగలను . కానీ ఒక గొప్ప మార్పు రావాలంటే నేను చేసే పని సరిపోదు .మహిళలపై […]
ఇప్పట్లో రాజకీయాలోద్దు
నేనిప్పుడు జయలలితగారి బయోపింక్ లో నటిస్తూ కెమెరా ముంవదు రాజకీయాలు ఆస్వాధిస్తున్నాను.నిజం చెప్పాలంటే నా జీవితంలో ఎన్నో అనుభవాలకు జయలలిత అభి ప్రాయాలకు పోలికలున్నాయి. ఆమె ఆలోచన ధోరిణి నిర్ణయత్మాక శైలి నన్ను పోలి ఉందనిపిస్తుంది. అందుకే ఈ బయోపిక్ అనుభవం నాలో ఉత్సాహాం నింపింది అంటోంది కంగనా రనౌత్ . ఇప్పుడు రాజకీయాలోకి రావల్సిందిగా ఎన్నో పార్టీలు ఆహ్వానిస్తున్నాయి కూడా. పదవులు ఇస్తామాని కొందరు చెపుతున్నారు. నా మాటలతో యువతను ఆకట్టుకోవచ్చని వారి అభిప్రాయం కావచ్చు. […]
రంగుల్లో గోరింటాకు
మొత్తగా రుబ్బిన ఆకు పచ్చని గోరింటాకు అరచేతిలో పెట్టుకోంటే ఎర్రగా పండటం ఇప్పటి వరకు మన అనుభవం, వాస్తం కూడా. కానీ ప్రకృతిలోని అన్ని రంగులు గోరింటాకు లా మార్చేసే మల్టీ కలర్ గ్లిట్టర్ మెహాందీ వచ్చేసింది. చీరె రంగులలకు మ్యాచ్ అయ్యేలా కోన్ లో అరబిక్ డిజైన్ వేపసుకోని ఏ ఫంక్షన్ కు వెళ్ళి వచ్చాక, కొబ్బరి నూనె తోనో నెయిల్ పాలిష్ రిమూవర్ తోనో దీన్ని తుడిచి వేసుకోంటే పోతుంది.ఎన్ని రంగుల్లో ఈ గ్లిట్టర్ […]
ఎంతో గొప్ప ప్రయాణం
గడచిన నా ఏడేళ్ళ ప్రయాణం ఫెంటాస్టిక్ అని ఆనందంగా చెబుతుంది అందాల నటి శృతి హాసన్. ఇంత మంది అభిమానుల ఆదరణ దొరికింది. ఈ ప్రయాణంలో. ఇది నా అదృష్టం అందువల్లే ఇంత దీర్ఘకాలం నాకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నా కోసం అందమైన పాత్రలు సృష్టించారు. నేను నటించే అవకాశం ఉన్న చక్కని సినిమాల్లో అవకాశం వచ్చింది.నేను సంతోషంగా కృతజ్ఞతగా ఉన్నా. పరిచయం లేని వాళ్లతో అంత సౌకర్యంగా మాట్లాడలేను. దయచేసి నాధోరణిని అపార్థం చేసుకోవద్దు. […]
టాటూలు నాకెంతో ఇష్టం
ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కు టాటూలంటే చాలా ఇష్టమటా. ఇప్పటికే ఏనిమిది టాటూలు ఉన్న ఇంకో రెండు కొత్తగా వేయించుకోందట వరలక్ష్మి. సినిమాల్లో ధీరత్వం ఉన్నా మహిళలకు సపోర్ట్ గా నేనీ టాటూలు వేయించుకొంటున్నా ,మనం జీవితంలో ఎంతగానో నటిస్తాము. అంటే మనుసులు భావాలు బయటకి రాకుండా ముసుగు వేసుకోవటమే కదా నటనంటే. ఆలాంటి ముసుగులు వేసుకోని బతుకుతున్న అందరం ,వీటిని తీసేసి స్వేచ్ఛగా జీవించే రోజుకోసం ఎదురుచూద్దాం. ఈ సంగతి గుర్తు చేసుకోవటం […]
ఫ్యాషన్ స్టైల్ ఇదే
సమ్మర్ వచ్చింది అంటే బాలీవుడ్ దివాస్ సన్ గ్లాస్ లు లేకుండా కనిపించరు. నిజానికి సన్ గ్లాస్ సూర్య కిరణాల నుంచి కళ్ళను పరి రక్షించేవే కాదు,ఫ్యాషన్ పోకడలు స్టైల్ లో ముందుంటాయి. ఏ ముఖానికైనా ,ఎవరికైన ఫ్యాషన్ బుల్ గా అమరిపోతాయి. వేసవి ఎండల్లో ఈ సినీతారల అందమైన ఫ్యాషన్ డ్రెస్ ల కంటే వీళ్ళు పెట్టుకొనే చక్కగా ప్రేములున్న కళ్ళాద్దాలే ఆకర్షిస్తాయి.రెట్రో సన్ గ్లాస్ తో అనుష్క శర్మ మెరిస్తే ,ఓవర్ సైజ్డ్ సన్ […]
హెచ్చు తగ్గుల వల్ల అనారోగ్యం
శరీరంలోని అవయవాలు ,కణాల పనితీరుని హార్మోన్స్ ప్రభావితం చేస్తాయి. వీటిల్లో హెచ్చు తగ్గులు వస్తే ఆరోగ్యం పాడవుతుంది. ఈ స్ట్రోజన్ ,ప్రోజెస్టిరాడ్ హార్మోన్ల స్థాయిలో వ్యత్యాసాలు వస్తాయి. మహిళల్లో రుతుక్రమం 21 రోజుల నుంచి 35 వరకు ఉంటుంది. ఈ సమయంలో రుతుక్రమం వచ్చిన అసలు రాకపోనా, వేళలు తప్పుతున్న హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ అసమతుల్యాలు అనారోగ్య సమస్యల వల్ల కావచ్చు థైరాయిండ్ కారణం కావచ్చు కానీ వెంటనే డాక్టర్ ను కలిస్తే సమస్య […]
సన్నని మంటపై వండితే మేలు
కొన్ని రకాల ఆహార పదార్ధాలు శరీరం తీసుకోవాలి అంటే అవి వండే పద్ధతిలోనే వండాలి. కాయగూరలు ,ఆకు కూరల్లోని పోషకాలు పోకుండా ఉండాలంటే వాటిని చిన్న మంటపైన నెమ్మదిగా ఉడికే లాగా వండాలి. గిన్నె మూత పెట్టి అప్పుడప్పుడు నీళ్ళు చల్లుతూ నెమ్మదిగా ఉడక నివ్వాలి.వేపుళ్ళు తినక పోవటం మంచిది. కూరగాయలు ఉడికించిన నీటిని రసం ,సాంబారు ,ఇతర వంటకల్లో వాడుకొంటే ఆయా వాటిల్లో ఉండే పోషకాలు అందుతాయి. వంటకు రుచి కూడా వస్తుంది. మెత్తగా ఉడికిన […]
ముఖకాంతి పెరగుతోంది
చర్మం ఆరోగ్యంగా ఉంటేనే మొహం చక్కగా కనిపిస్తుంది. చర్మం కాంతిగా తాజా,యవ్వనంగా అనిపించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే మామిడి ,పుచ్చ,కమలా ,బొప్పాయి, కర్భూజా, కాప్సికం,టోమోటో ఆకు కూరలు తింటే సరిపోతుంది అంటున్నారు న్యూట్రిషనిష్టులు.ఈ వేసవి లో పలు సార్లు కాఫీ టీ లు తాగకుండా రెండు మూడు రకాల కూరలు,పండ్లు నీళ్ళు తీసుకోవాలి, నూనెలో వేయించిన చిరు తిండ్లు బేకర్ వస్తువులు తీసుకోకూడదు. కడుపు నిండా కాకుండా ఆకలి తీరే వరకూ ఆహరం తీసుకోవాలి. రోజుకు […]
చిటికెలో మెరుపులు
మేకప్ ఇప్పడు ఆధునిక జీవితంలో ఒక భాగం . కొద్ది పాటి మేకప్ లేకుండా చివరకు షాపింగ్ కు ,ఆఫీస్ కు కూడా పోరు. అందులో భాగంగా లిప్ స్టిక్ వేసుకోవటం కూడా , కాస్త ప్రత్యేకంగా కనిపించాలంటే సియెట్ లండన్ గ్లిటర్ ప్లిప్ ఉంటే చాలు. పెదవులకు గ్లిట్టర్ మెరుపులోస్తాయన్నమాట. ఈ లిప్ స్టిక్ వేసుకొన్నప్పుడు సాదాగా మామూలు లిప్ స్టిక్ పూత లాగే ఉంటుంది. కావాలనుకొన్నప్పుడు రెండు పెదవులను బిగించి అదిమి పెట్టి మళ్ళీ […]
