ఇది ప్లాస్టిక్ ఇల్లు
ప్లాస్టిక్ ను నిషేదించమని ప్రపంచం మొత్తం ఘోష పెడుతోంది . మరి ఇప్పటి వరకు ఉపయోగించిన వ్యర్దాలు ఏమిటి ? ఎన్ని కోట్లా ప్లాస్టిక్ సీసాలు ,కవర్లు ,సామాగ్రి ఇదంతా ఏమైపోవాలి . ఇదిగో చూడండి మేం ఇలా వాడేం అంటున్నారు కెనడా ,నోవాస్కోడియా ప్రాంతాలలో జె. డి కంపోజిట్స్ అనే కంపెనీ వాళ్ళు . వాళ్ళు ఆరు లక్షల పన్నెండు వేల బాటిల్స్ కరిగించి చిన్ని గుళికలు చేసి వాటిని ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా ప్రిపా […]
నీళ్ళు తగ్గితే సమస్యే
ఒంట్లో నీరు తగ్గితే ఏకాగ్రత లోపిస్తుంది. విషయాలు తేలిగ్గా మర్చిపోతారంటున్నారు అధ్యయకారులు. శరీరంలో నీటిశాతం తగ్గితే మెదడుకు కూడా నీటి కొరత ఏర్పడుతుంది. అంతే కాదు ఒంట్లో నీరు తగ్గతే మెదడుకు ఆకలి వేస్తుందని తప్పుడు సంకేతాలు వెళ్ళే ప్రమాదం కూడా వుంది. అందుకే ఆకలి వేస్తోంది అనిపిస్తే ముందుగా మంచినీళ్ళు తాగాలి. సాధారణంగా వాతావరణం చల్లగ వుంటే దాహం అని పించదు. అలా అని నీళ్ళు తాగకపోతే జీవనక్రియలు కుంటుపడి వేరే సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్ […]
12 ఏళ్ళకే 132 పుస్తకాలు
ఆరేళ్ళ వయసులోనే పద్యాలతో మొదటి పుస్తకం రాశాడు ఉత్తర ప్రదేశ్ కు చెందిన మృగేంద్ర రాజ్ .రామాయణం లోని పాత్రలని విశ్లేషణలతో కూడిన పుస్తకం, రాజకీయ నాయకులు జీవిత చరిత్రలు, ఆధ్యాత్మికం ఇలా ఎన్నో పుస్తకాలు నేటి అభిమానులు అన్న కలం పేరుతో రాశాడు. నాలుగు ప్రపంచ రికార్డులు వచ్చాయి. లండన్ లోని వరల్డ్ రికార్డు యూనివర్సిటీ నుంచి మృగేంద్ర రాజ్ కు తమ యూనివర్సిటీలు డాక్టరేట్ చేయాలనీ ఆహ్వానం అందింది. మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకోవాలనే […]
జలుబుకి వెల్లుల్లి
వర్షకాలపు దగ్గు ,జలుబు వంటి సమస్యలకు గృహవైద్యం మంచి పరిష్కారం. జలుబు తగ్గించటంలో వెల్లుల్లి ముందుంటుంది. వెల్లుల్లి పై పోర తీసేసి నోట్లో ఉంచుకొని కొరుకుతూ దాని రసం మింగుతూ ఉంటే జలుబు తగ్గుముఖం పడుతుంది . ఒక పాయ అయిపోగానే ఇంకో పాయను నెమ్మదిగా కొరుకుతూ తినమంతున్నారు . రోజుకు నాలుగైదు పాయలు ఇలా వాడచ్చు. ముక్కు దిబ్బడ వల్ల ఇబ్బంది పడుతుంటే వేడి వేడిగా మసాలాలు వేసిన ఆహారం తీసుకోమంటున్నారు . ఈ ఆహారంతో […]
వర్షాల్లో జాగ్రత్త
వానల్లో చల్లగా హాయిగా చక్కని వాతావరణం ఉంటుంది కానీ,ఇంటి గోడలు టెర్రస్ లు ఫర్నిచర్ మాత్రం పాడాయి పోతాయి. కిచెన్ లో కూరలు తొందరగా కూలిపోతాయి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే వానకాలం ఇబ్బందులు ఉండవు. తేమకు లోహంతో చేసిన తలుపులు కిటికీలు తుప్పు పడుతాయి. వాటికీ మెటల్ పెయింటింగ్ సెకండ్ కోటింగ్ వేయించాలి చెక్కతో చేసిన ఫుర్నిచర్,కుషన్లు,దిండ్లు వారానికి ఒకసారైనా శుభ్రం చేయించడం,మార్చడం చేయాలి. ఫంగస్ ఫామ్ అవుతోంది కనుక కిటికీలు తలుపులు తెరిచి ఇల్లంతా గాలి […]
గర్భవతులు నడవాలి
చక్కగా శారీరక వ్యాయామం చేసే వారికి సహజ ప్రసవం అయ్యే అవకాశం ఉందని అనేక అధ్యయనాలు తేల్చాయి . వాకింగ్ వల్ల తుంటి కండరాల్లో సాగే గుణం పెరుగుతుంది . ఈ అంశమే సుఖంగా ప్రసవం అయ్యేందుకు దోహదం చేస్తుంది . ఒక మహిళ తాను గర్భం దాల్చేందుకు ముందుగా పిట్ నెస్ ను బట్టి తనెంత దూరం హాయిగా శ్రమ లేకుండా నడవగలరు అనే అంశాన్ని నిర్ణయించుకొని అంత మేరకు నడిస్తే బావుంటుంది . అంటున్నారు […]
ట్యాగ్ చేయోద్దు
ఫేస్ బుక్ లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు ఇతరుల్ని ట్యాగ్ చేసేప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ ఫేస్ బుక్ లో ఇతరుల ఫోటోలు పెట్టేప్పుడు వాళ్ళ అనుమతి తీసుకోవాలి. కొందరు తమ ఫ్రెండ్స్ లిస్ట్ లో లేని వాళ్ళు చూడకుండా ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకుంటారు. అందుకు అనుమతి తీసుకోవాలి విహార యాత్రకు,పుణ్యకేత్రాలకు వెళితే చెక్ ఇన్ స్టేటస్ పెట్టి తనతో వచ్చిన స్నేహితులకు ట్యాగ్ చేస్తారు. కొందరికి వ్యక్తిగత విషయాలు అందరితో షేర్ […]
డార్లింగ్ డోరిన్
తన మరోవా పుట్టిన రోజు నాడు స్. పిన్నాక టవర్ ఎక్కేసి అక్కడ నవ్వుతూ ఫోజులు ఇచ్చింది డోరిన్లాంగ్ అన్న బామ్మా. ఈ ఫిట్ చూసి 11వేల యూరోలు కలెక్ట్ చేసి ఒక స్వచ్చంద సంస్థకు ఇచ్చేసింది. ఈ మెనూ డేరింగ్ డోరిన్ అంటారు. ఈ సంవత్సరం తన 104 వ ఏట మరణించింది. ఈ ముసలమ్మ కాలక్షేపం కోసం గుళ్ళు గోపురాలు దర్శించలేదు కొండలు గుట్టలు ఎక్కేసింది. ఓపిక ఉన్నంత వరుకు ఏదో ఒక సాహస […]
ఆ దీవి లో ఒక్కడే
80 ఏళ్ళ మౌరో మోరండీ ఇటలీలోని బుడెల్లీ ద్వీపంలో గత 26 సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నది ఆధునిక సమాజంలో ఇమడలేక ప్రకృతి పైన ప్రేమతో తానీ ద్వీపంలో ఒంటరిగా ఉంటున్నట్లు చెపుతాడు మోరండీ . సూర్యోదయం ,సూర్యాస్తమయం ఫోటోలు తీస్తాడు . బొమ్మలు వేయడం శిల్పాలు చెక్కడం చేస్తాడు . తన ఇద్దరు కూతుళ్ళను చూసేందుకు మాత్రం బయటి ప్రపంచానికి ఈ ద్వీపం దాటి వస్తాడు . ఐదు వేలమంది ఫేస్ ఒక ఫ్రెండ్స్ ఇతనే పలకరిస్తారు […]
ఆమె ఎప్పుడు యంగ్
వయసుదే ముంది ఆదో సంఖ్య మాత్రమే అన్నాట్లు అనిపిస్తుంది . ఇంగ్లాండ్ కు చెందిన రూత్ ఫ్లవర్స్ గురించి చదివితే ఆమె ఇంగ్లాండ్ లో పేమస్ డి జె . ఆవిడ మిక్స్ చేసిన పాటలు యువతను ఉర్రుతలూగించేవి . 68ఏళ్ళు వచ్చాక డి జె క్లబ్బులు చేరి మమ్మి రాక్ పేరుతో ఒక డి జె రాక్ బ్రాండ్ పెట్టి డి జె సిస్టమ్ ని ఒక మోత మోగించింది . వృద్దాప్యం శరీరానికే కానీ […]
పోషక విలువలు పుష్కలం
పోషక పదార్దాలలో భాగంగా అక్రూట్ పండుని ఆహారంలో భాగం చేసుకోమని చెపుతున్నారు అధ్యయన కారులు. ఇటీవలి కాలంలో పెరుగుతున్న రొమ్ము కాన్సర్ విరుగుడు ఈ వాల్ నాట్ ,అక్రూట్ ఫలం లో ఉందని చెపుతున్నారు . ప్రతి రోజు కప్పు వాల్ నాట్స్ ఇచ్చి చేసిన పరిశోధనలు రొమ్ము కాన్సర్ని బహిర్గతం చేసే జన్యువుల్లో మార్పు వచ్చిందని అమెరికా మార్షల్ విశ్వ విద్యాలయపరిశోధకులు చెపుతున్నారు . ప్రయోగాత్మకంగా కొన్ని వేలమంది ప్రతిరోజు వాల్ నాట్స్ ఇచ్చారు . […]
ఇవన్నీ హరితవానలు
చెట్టు మనిషీ ఎప్పటికి స్నేహితులే దట్టమైన దండకారణ్యాలు పోయి ,కంక్రిట్ జింగిల్స్ వచ్చాక మనిషి కి చెట్టు విలువ తెలిసొచ్చింది . ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు హరిత నగరాలను నిర్మిస్తున్నారు . స్విజర్లాండ్ లోని జెర్ మాఫ్ట్ ప్రసిద్ద పర్యాటక ప్రాంతం ట్రూఫర్ ను కొద్దీ ప్రాంతాలకే పరిమితం చేశారు . నగరంలో ఎక్కువ కాలినడకనే తిరగాలి వాహనాలు అనుమతించరు . స్వీడన్ లోని మాల్మో హరితనగరం భావనాలను గ్రీన్ రూఫ్ లు ,డెన్మార్క్ లోని కోపెన్ […]
“బంగారు మైసమ్మ ప్రసాదం”
సఖులూ! మరి ఆషాఢమాసం లో గ్రామదేవతలకి కన్నుల పండుగగా బోనంతో,తొట్టెలతో మొక్కులు తీర్చి చద్ది తో ప్రసాదాలు పెట్టి అమ్మవార్ల ఆశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని కోరుకున్నారు కదా!! రండి!!ఈ రోజు బంగారు మైసమ్మ కి మొక్కుదాం.హైదరాబాదు శంషాబాద్ విమానాశ్రయం సమీపంలో వెలసిన ఆలయం ఈ బంగారు మైసమ్మ తల్లి దేవాలయం. చూడటానికి చిన్న గుడి అయిన మహిమ గల తల్లి.భక్తులు తమ పిల్లలను,పంట పొలాలను చల్లగా చూడాలని మొక్కుకుని ముడుపులు కట్టడం మొదలు పెట్టారు. బంగారు మైసమ్మ […]
ఒంటరితనం పర్లేదు
టీనేజ్ పిల్లలు ఒక్కసారి ఒంటరి గా ,ఎవరితో కలుసుకో కుండా ఉండేందుకు ఇష్టపడతారు . అప్పుడు పెద్దవాళ్ళు కంగారు పడకుండా వాళ్ళు ఒంటరిగా ఫీలవుతున్నారు ఒంటరిగా ఉండాలను కుంటున్నారా, తెలుసు కోమంటున్నాను . తమ శక్తి సామర్ధ్యాలు ఏమిటో తెలుసుకోవాలన్నా ఆరాటంతో ఏరంగంలోకి వెలుతూ నిర్ణయించుకునే క్రమంలో పిల్లలు ఒంటరిగా గడిపెందుకు ఇష్టపడతారని అది వాళ్ళ అభివృద్ధికి సూచనగా అనుకోమని చెపుతున్నారు . ఇలా ఒంటరిగా గడపాలని వాళ్ళు కోరుకొంటే అదంతా డిప్రషన్ కొద్దే అని భయపడనక్కర్లేదు […]
సంకేతాలు పట్టించుకొండి
శరీరం ఇచ్చే సంకేతాలు గుర్తించండి . ఏ చిన్ని ఇబ్బంది కైనా శరీరం వెంటనే స్పందిస్తుంది. మెదడుకు సంకేతం అంటుంది . హాయిగా ఓ ఎనిమిది గంటలు నిద్రపోయి ,ఆహారం తీసుకొన్న తర్వాత కూడా అలసటగా అనిపిస్తే వెంటనే రక్తపోటు ,విటమిన్ల స్థాయి పరీక్ష చేయించుకోవాలి. తరచుగా తలనొప్పి రావటం కూడా మంచి సంకేతం కాదు . హఠాత్తుగా తలపోటు వస్తే రక్తపోటు ,రక్తంలోని చక్కెరల స్థాయి కారణం కావచ్చు అలాగే ఏ కారణం లేకుండా కండరాల […]
సౌందర్య రహస్యం
ఎంత ఖరీదైన సబ్బులు,సౌందర్యఉత్పత్తులు వాడుతున్న వాటిలో రసాయనాలు తప్పనిసరి . అందుకే పసుపు,చందనం ,పాలు వంటివి వాడటం లేటెస్ట్ ట్రెండ్ . చందనం క్రమం తప్పకుండా వాడితే బాక్టీరియా అడ్డుకొంటుంది ట్యాన్ పోతుంది . పసుపు మచ్చలు పోగొట్టి హానికర బాక్టీరియా వ్యాపించ కుండా చేస్తుంది . కలబంద ఒక లేయర్ లాగా చర్మంపైన పరుచుకొని తేమను కాపాడుతుంది . దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మాన్ని మెరిసేలా చేస్తాయి . కుంకుమ పూవ్వు లోని విటమిన్లు యాంటీ […]
ఒత్తిడి తగ్గించే ఫ్రూట్ జ్యూస్ బాత్
స్నానం మససుకి హాయి నివ్వటం తో పాటు ఒత్తిడిని తగ్గిస్తుందని తెలసు . కానీ బాగా ఒత్తిడి గా ఉన్న సమయంలో సిట్రిక్ యాసిడ్ ఉండే పండ్ల రసాలు నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఒత్తిడి మాయం అవుతుంది అంటున్నారు నిపుణులు . ఎన్నో పరిశోధనల అనంతరం ఈ విషయం నిరూపితం అయింది . నిమ్మ ,అరేంజ్ ,ద్రాక్ష పండ్లలో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది . ఇది చర్మం లోపలి వరకు వెళ్ళి మలినాలను శుభ్రం […]
నీళ్ళలో నానితే ఫంగస్
పాదాలకు ఎప్పుడు తడి తగులుతూనే ఉంటుంది . పొడిగా అయ్యే లోగానే మళ్ళీ నీళ్ళలోకి వెళ్ళవలసి వస్తుంది . అలా తడిలో నానుతూ ఉంటే ఫంగల్ ఇన్ ఫెక్షన్లు వస్తాయి . అందుకే చిన్న పాటి శ్రద్ద చూపించ మంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పని అయిపోగానే యాంటీ సెప్టిక్ సబ్బుతో కాళ్ళను శుభ్రం చేసుకొని ,యాంటీ సెప్టిక్ క్రీమ్ రాసుకోవాలి . కాళ్ల గోళ్ళపై పౌడర్ చల్లి తేమ పోయేలా చేయాలి . ఇలా చేస్తే […]
ఇళ్లంతా పరిమళం
ఇక వర్షాలు మొదలయ్యాయి . ఇళ్ళల్లో ఆఫీసుల్లో ఎండపడక వాసన వస్తూ ఉంటుంది . రూమ్ ఫ్రెషనర్ కంటే ఆరోమా నూనెలు వాడి చూడమంటారు ఎక్స్ పర్డ్స్ . అరోమా నూనెల్లో యాంటీ బాక్టరియల్ ,యాంటి ఫంగల్ లక్షణాలు ఉంటాయి . ఒక గిన్నెలో నీళ్ళుపోసి మరిగించి ఆ మరిగే నీళ్ళు నిమ్మనూనె గానే యూకలిఫ్టస్ నూనెగాని వేస్తే ఇల్లంతా పరిమళం వస్తుంది . కమలా పూవులు ను లవంగాల గుచ్చి ఎండబెట్టి వాటిని వంటింటి మూలల్లో […]
నాసిక కుహ శక్తి అపూర్వం
ముక్కు సరిగా పని చేయకపోతే ఎలా ఉంటుందో ఊహించను కూడా లేము . నాసిక ఒక చక్కని జ్ఞానాంగం . మనిషి నిద్రపోతున్నా ముక్కు వాసనలు గుర్తిస్తూ మనల్ని కాపాడుతూనే ఉంటుంది . అలాటి శక్తి వయసుతో తగ్గుతూ ఉంటుంది . రకరకాల వాసనలకు అలవాటు పడి ,లేదా ముక్కు నాడులు పని తీరు తగ్గి ఈ ష్రుణ శక్తి తగ్గచ్చు . కానీ వాసన గ్రహించి శక్తి తగ్గటం ముఖ్యమైన వార్ధక్య లక్షణం నిజమే వాసనా […]
