మెట్లెక్కి దిగండి
వ్యాయామం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది.అయితే వాకింగ్ కు జిమ్ కు వెళ్లేందుకు సమయం అవకాశం రెండూ లేవు.ప్రస్తుత పరిస్థితుల్లో బంధుమిత్రులను ఎక్కువగా కలిసేందుకు లేదు. సామాజిక సంబంధాలు తగ్గిపోవటం కూడా ఆ ప్రభావం. మానసిక స్థితి గతుల పైన పడుతుంది అలాంటి సందర్భంలో ఇంట్లోనే మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండమని ఇంటి చుట్టుపక్కల వేగంగా నడవమని చెబుతున్నారు. జర్మనీలో ఆరోగ్య నిపుణులు అలాగే వారానికి 150 నిమిషాలు అంటే రెండున్నర గంటల పాటు ఇంటిపని తోట […]
మాలా అడిగా
ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మాలా పాలసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు మాలా అడిగా. జిల్‌కు సీనియర్ సలహాదారుగా, బైడెన్-కమలా హారిస్ బృందంలో సీనియర్ పాలసీ సలహాదారుగా మాలా పనిచేశారు. యూనివర్శిటీ ఆఫ్ షికాగో లా స్కూల్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మాలా కొంతకాలం పాటు న్యాయవాదిగా పనిచేశారు.బైడెన్ ఫౌండేషన్‌లో ఉన్నత విద్య, సైనిక కుటుంబాల డైరెక్టర్‌గా పనిచేశారు.
సుమోనా గుహా
వైట్‌హౌస్‌కు కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్‌కు ఎంపికైన ముగ్గురు భారతీయ అమెరిన్లలో సుమోనా గుహా ఒకరు. గుహ అమెరికా విదేశీ విధానం, జాతీయ భద్రత అంశాల్లో కీలక భూమిక పోషిస్తారు. బైడెన్ – హారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో దక్షిణాసియా విదేశాంగ వ్యవహారాల కార్యనిర్వాహక బృందానికి ఉపాధ్యక్షురాలిగా గుహ పని చేశారు. తాజాగా గుహ దక్షిణాసియా సీనియర్ డైరెక్టర్ హోదా పొందారు.
శాంతి కలతిల్
వైట్ హౌస్ కు సంబంధించి విదేశాంగ విభాగంలో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల వ్యవహారాల సమన్యాయ కర్తగా నియమితులయ్యారు శాంతి కలతిల్. కాలిఫోర్నియాలో స్థిరపడ్డ మలయాళ కుటుంబం ఆమెది. యు.సి బర్కిలీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదివారు. నేషనల్ ఎండోమెంట్స్ ఫర్ డెమోక్రసీ లోని ఇంటర్నేషనల్ ఫారమ్ ఫర్ డెమోక్రాటిక్ స్టడీస్ లో సీనియర్ డైరెక్టర్ గా వ్యవహరించారు.
అన్ని భావాలకు నిలయం మనిషే
లాఫర్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్ అంటారు (Laughter is the best medicine)నవ్వు కొన్న ప్రాధాన్యత భౌతిక మానసిక ఆరోగ్య లలో ఎంతో గణనీయమైనదని చెపుతారు.ఈ మధ్యకాలంలో నవ్వును ఒక వ్యాయామంగా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు.ఎన్నో లాఫింగ్ క్లబ్ లు నడుస్తున్నాయి.భౌతిక ఆరోగ్యానికి నవ్వు సాయపడుతుంది. ఒత్తిడి ఆందోళన తగ్గిస్తుంది ఆరోగ్యకరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసే యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తుంది. సామాజిక స్థాయిలో మంచి సంబంధాలు పెంపొందింప జేసుకునేందుకు నవ్వు […]
కాలిన గాయాలకు చిన్న చిట్కా
కాలిన గాయాలకు వంటగది లో దొరికే పదార్థాలతో చిట్కావైద్యం చేయచ్చు.అరటి ఆకు కాలిన గాయాలకు మంచి ఔషధం ఆకుల్ని మెత్తగా నూరి గాయంపైనా పై పూతలా పూస్తే గాయం త్వరగా మానిపోతుంది.స్వల్పంగా కాలిన గాయానికి చన్నీళ్ల వైద్యం చాలు కాలిన భాగాన్ని పంపు కింద ఉంచి చన్నీళ్ల ధారగా పదినిమిషాల పాటు వదిలితే చాలు గాయం కారణంగా వచ్చే నొప్పి పోతుంది. వాపు రాదు నీళ్ళలో కాస్త వెనిగర్ కలిపి కాలిన చోట పూసి శుభ్రమైన వస్త్రంతో […]
ఈజీగా కిచెన్ గార్డెన్
వంటగది దగ్గర చిన్న జాగా ఉన్న ట్రే గార్డెన్ లో పెంచుకోవచ్చు.ట్రే గార్డెన్ కోసం ప్రత్యేకంగా అడుగున చిల్లులు ఉన్నా ట్రే దొరుకుతాయి.వాటిలో సారవంతమైన మట్టి నింపి వాటిలో ధనియాలు, మెంతులు చల్లాలి ఇవి నాలుగైదు రోజుల లోపే మొలకలు వస్తాయి. వారం పది రోజుల్లో చిన్న ఆకులు వస్తాయి దశలవారీగా రెండు ట్రే లలో గింజలు చల్లి రెండు రోజులకోసారి తాజా కొత్తిమీర మెంతికూర వాడుకోవచ్చు.అలాగే ట్రే లో టమోటో మిర్చి వంటి గింజలు చల్లి […]
వేలాడే తోట
భూపాల్ కు చెందిన సాక్షి భరధ్వాజ్ ఇంటి పైన వేలాడే తోటను ఏర్పాటు చేసింది మైక్రో బయాలజీ పూర్తి చేసి మన్ సరోవర్ గ్లోబల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే సాక్షి కొబ్బరి బోండాలను కడిగి ఎండబెట్టి వాటికి చక్కని రంగులు వేసి వాటికి రెండు రంద్రాలు చేసి ఇనుప తీగలతో హుక్స్ లా డాబాపై వేలాడ దీసింది. ఆకులతో వర్మీ కంపోస్ట్ తయారు చేసి అందులో మొక్కలు నాటింది. ఈ ఇంటి […]
గాలిలో గడ్డ కట్టేశాయి
ఈ చలి తయారు చేసిన రెండు బొమ్మలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సైబేరియా లోని నావొసిబ్రిస్క్ లో ఉష్ణోగ్రత చాలా రోజుల పాటు మైనస్ 40 డిగ్రీల సెల్సియస్ కి అటూ ఇటుగా ఉంటుంది. గాలి ఆర్కిటిక్ లో కన్నా చల్లగా ఉంటుంది ఆ పరిస్థితి ఏదైనా చేతిలో ఉండగానే గడ్డ కట్టేస్తుంది. ఒలెగ్ అనే స్థానికుడు గుడ్డు పగలకొడితే అది ప్లేట్లో కారే లోపలే గడ్డ కట్టింది. అలాగే వేడివేడి నూడుల్స్ తిందామని ఫోర్క్ తో […]
ప్రారంభోత్సవాలు రచయిత్రి అమందా
22 సంవత్సరాల అమందా కవియత్రి. యు.ఎస్.లో ఉంటుంది అమెరికా అధ్యక్ష ఉపాధ్యక్షులు ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమెకు ఆహ్వానం అందింది. 2011లోనే లాస్ ఏంజలెస్ లో అతి పిన్న వయస్కురాలైన ప్రారంభోత్సవాలు కవిత్రి గా గుర్తింపు తెచ్చుకుంది. 2014లో నేషనల్ యూత్ పోయెట్ లారెట్ అయ్యింది. ఒక ప్రత్యేకమైన థీమ్ తో ప్రారంభోత్సవాలు కవిత్వం రాస్తుంది. అమందా. పోయిన సంవత్సరం అమెరికా స్వాతంత్ర దినోత్సవం కూడా ఆమె కవిత్వం తోనే ప్రారంభం అయింది. ఇప్పుడు బైడెన ప్రమాణస్వీకారానికి అమందా […]
గుండె ఆరోగ్యానికి ఇవి అవసరం
క్యారెట్లు కళ్ళకే కాదు గుండెకు కూడా మంచివి. క్యారెట్ లలోని బీటా కెరోటిన్ శరీరంలో కి చేరాక విటమిన్ ఎ గా మారుతుంది. ఈ విటమిన్ ఎ, రక్తంలో చెడు కొవ్వులు పెరగకుండా హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అయితే గుండె ఆరోగ్యం లో బీటా-కెరోటిన్ లా పాత్ర అంశం పై చేసిన అధ్యయనంలో క్యారెట్ లోని బీటా కెరోటిన్ ని విటమిన్ ఎ, గా త్వరగా మారాలంటే క్యారెట్ తో పాటు పాలు […]
ఇప్పటి వరకు ప్లాన్లే లేవు
మెయిల్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కావటం వాళ్ళ మెప్పు పొందటం అంతా ఏదో కలలాగా ఉంది.చిన్నప్పటి నుంచి యాక్టింగ్ పాటలు అన్నీ ఇష్టమే. టీవీ షో బేబీ సింగర్ 2 లో విజేతగా నిలిచాను. మా కాలేజి మిస్ హైదరాబాద్ కాంటెస్ట్ స్టాల్ లో విజేతగా వచ్చాను.అక్కడ నుంచి మోడలింగ్ యాక్టింగ్ అవకాశాలు వస్తున్నాయి. ఓ టీ టీ లో సినిమా సక్సెస్ ని ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నా అంటుంది గౌరీ ప్రియ రెడ్డి.మెయిల్ సినిమాలో ఒక్కసారిగా […]
సక్సెస్ ఫుల్ గా నమ్మ కేఫ్
స్విట్జర్లాండ్ లో హోటల్ మేనేజ్ మెంట్ చదువుకొంది తమిళనాడు కు చెందిన దమయంతి.భారతీయలు ఇష్టపడే టీ ని నమ్మ కేఫ్ పేరుతో చెన్నయ్ లో దుకాణాలు తెరచి మార్కేట్ చేస్తోంది. పుదుచ్చేరి,కోయంబత్తూర్,చెన్నయ్ లలో కూడా ఈ కేఫ్ లో గోల్డెన్ సులేమాన్, పసుపుతో చేసిన ఎల్లో టీ తో సహా ఎనిమిది రకాల టీ లు ఉంటాయి 40 రూపాయల లోపే ఉంటుంది ఖరీదు. దమయంతి తల్లి నిర్వహిస్తున్న నేచురల్ సెలూన్ లని కూడా మహిళలే నడిపిస్తున్నారు. […]
రోహిణీ గాడ్బోలే
న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ పార్టికల్ ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు రోహిణీ గాడ్బోలే. అంతకంటే ముందు 1982లో ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్‌గా పనిచేశారు. 1995 లో బెంగళూరులోని ఐ.ఐ.ఎస్సీ.లో అసోసియేట్ గా చేరారు. ఇప్పుడు అక్కడే ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఇప్పటి వరకు వందకు పైగా అధ్యయన పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో గౌరవించింది.
కేరళ తొలి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్
కేరళ లో తొలి ట్రాన్స్ ఉమెన్ డాక్టర్ డాక్టర్ ప్రియా. ఆమె పుట్టినప్పటి పేరు జిను శశిధరన్. కేరళలోని త్రిసూర్ ఆమెది. 2013లో బెచిలర్ ఆఫ్ ఆయుర్వేద చేశారు. 2018 లో ఆయుర్వేదంలో ఎండీ పూర్తిచేసి త్రిసూర్ లో హాస్పిటల్లో పని చేయటం మొదలు పెట్టారు. అవసరమైన ఆరు సర్జరీల తర్వాత డాక్టర్ ప్రియా గా వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు.
హెయిర్ కేర్ టిప్స్
చలికాలంలో మాడుపైన పొడిబారకుండా ఇంట్లోనే కొన్ని చిట్కాలతో సంరక్షణ చేసుకోవచ్చు. చిన్న అల్లం ముక్క నూనెలో వేసి మరిగించాలి.వెచ్చగా ఉండగానే ఆ నూనెతో జుట్టు కుదుళ్ల వరకు రాసి మర్దనా చేయాలి. అలాగే వేప నూనె, ఆలీవ్ నూనె సమపాళ్లలో కలిపి వేడి చేయాలి.ఆ గోరువెచ్చని నూనెతో మర్దనా చేయొచ్చు. ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి పొడిగా చేసి దాన్ని నూనెలో కలిపి మర్దనా చేయొచ్చు. కలబంద గుజ్జు కూడా చుండ్రును నివారిస్తుంది.మాడుపై ఉన్న చర్మ సమస్యలను పోగొడుతుంది.
ప్రధమ మహిళ బృందంలో గారిమ
అమెరికా నూతన అధ్యక్షుడు జొ బైడెన్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాను నిర్వహిస్తుంది గారిమ వర్మ. ఆమె తల్లిదండ్రులు భారతీయలు. ఉపాధి కోసం అమెరికా వలస వెళ్లారు. గారిమ కెరీర్ గా డిజిటల్ మార్కెటింగ్ స్టాటజీలను ఎంచుకొన్నారు. అంతకు ముందు వాల్ డిస్నికి చెందిన ఎబిసి నెట్ వర్క్ లో హోస్ట్ గా పనిచేశారు. పారామెంట్ పిక్చర్స్ లో గ్రాఫిక్ డిజైన్ హెడ్ గా బాధ్యతలు నిర్వహించారు. బైడెన్, కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో డిజిటల్ మరియా వ్యూహ […]
Maara (తమిళం) (2021)
మాధవన్, శ్రద్ధా శ్రీనాథ్, నటించిన మారా సినిమాకు మలయాళం మూవీ చార్లీ ఆధారం పార్వతి అన్న యువతి కేరళలోని ఒక కుగ్రామంలో గోడలపైన తాను చిన్నతనంలో విన్న కథ తాలూకూ చిత్రాలను చూసింది.ఆ కథలన్నీ గోడల పైన చిత్రించిన మణి మారన్ ను వెతుక్కొంటూ వెళ్తుంది. ఆ ప్రయాణంలో తాను విన్న కథ లోని ఒక ప్రేమికుల జంటను కలుసుకుంటుంది.అప్పటికే వాళ్ళు వృద్ధులు జీవితం మొత్తం ఒకళ్ళ కోసం ఒకళ్ళు వెతుక్కుంటూ పెద్దవాళ్ళయిపోతారు. తనను ఆదరించిన వృద్ధికి […]
కాక్ టైల్ స్పెషలిస్ట్ మీనాక్షి సింగ్
వైవిధ్యమైన కాక్ టైల్ రుచులూ మెరుగైన ఆతిథ్యం తో మీనాక్షి సింగ్ ప్రారంభించిన బార్ ప్రపంచంలోనే అత్యున్నతమైన 100 బార్ లో ఒకటిగా నిలిచింది. ఈమె నడిపే సైడ్ కార్ బార్ పాత గ్రంథాలయం లాగా బిలియర్డ్స్ రూమ్ లాగా ఉంటుంది.మీనాక్షి టీమ్ ప్రత్యేకమైన రుచులతో డ్రింక్స్ తయారు చేస్తారు. ఈ డ్రింక్ కి అవసరమైన దినుసులు బార్ వెనుక ఉన్న గార్డెన్ లో పండిస్తారు హోటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చేస్తున్న మీనాక్షి సింగ్ […]
ఆడవాళ్లే డ్రైవర్స్
మహిళ డ్రైవర్లు నడిపే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది రేవతి రాయ్ .ఆమె స్థాపించిన హే దీదీ కంపెనీలో ఇప్పుడు తొమ్మిది వందల మంది మహిళ డ్రైవర్లు పనిచేస్తున్నారు.రేవతి ప్రధాన కార్యాలయం ముంబాయి స్వయంగా రేవతి టాక్సీ డ్రైవర్ గా ఎయిర్ పోర్ట్ లో మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక టాక్సీ మొదలు పెట్టింది తరువాత తన వంటి మహిళా డ్రైవర్లను తయారు చేసేందుకు పూనుకొంది ఆమె శిక్షణ ఇచ్చిన మహిళలు టాక్సీలు ద్విచక్ర వాహనాలు నడుపుతూ, అమెజాన్ […]
