బుల్లి రచయిత్రి
అభిజిత రాసిన ‘హ్యాపినెస్ ఆల్ అరౌండ్’ పుస్తకాన్ని గుర్ గావ్ లోని ప్రసిద్ధ పబ్లిషింగ్ సంస్థ ఇన్ విన్సిబుల్ ప్రచురించింది. ఇంతకీ అభిజిత వయసు ఏడేళ్లు ఆమె తండ్రి ఆషిష్ గుప్తా తల్లి అనుప్రియ గుప్తా. అభిజిత రాసిన పుస్తకం విపరీతమైన ఆదరణ పొంది ఆమె వరల్డ్ ఎంగెస్ట్ ఆథర్ అనే గుర్తింపు పొందింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ వారు అభిజిత ను గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్ గా గుర్తించారు. ఇన్ విజిబుల్ సంస్థ […]
రజినీ బెక్టర్
మిసెస్ బెక్టర్ సంస్థ స్థాపించిన రజినీ బెక్టర్ పద్మశ్రీ లభించింది. రజినీ లాహోర్ లో పుట్టి పెరిగారు. దేశ విభిజన తర్వాత ఆమె కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది. డిగ్రీ పూర్తి చేసిన రజనీ కుకీలు, ఐస్ క్రీమ్ ల తయారీ లో శిక్షణపొందారు. 1978 నుంచి ఆమె దాన్ని బిజినెస్ గా వృద్ధి చేశారు. కొన్నేళ్ళకే ఆ ఉత్పత్తులు ఉత్తర బారతావణి లో ప్రత్యేకత చాటాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్ లోకి అడుగుపెట్టిన మెక్ […]
బిరుబాల రభా
మూఢాచారాలు దురాచారాలపై పెద్ద పోరాటం చేశారు బిరుబాల రభా. అస్సాంలోని గోల్ పారా జిల్లాలోని తుకురియా అనే గిరిజన గ్రామం ఆమెది. ఆమె కొడుక్కి అనారోగ్యం చేస్తే అది ఒక మంత్రగత్తె పని అని ఇరుగుపొరుగు చెప్పారు.ఎంతో భయపడింది బిరుబాల కానీ అదంత మోసమని తేలిపోయింది. ఆమెకు మంత్రగత్తెల పేరుతో వారికి జరిగే అన్యాయాలపై స్థానిక మహిళలను బృందంగా చేసుకుని ప్రజల్లో అవగాహన తేవటం మొదలుపెట్టింది.ఎన్నో అవమానాలు దౌర్జన్యాలు ఎదుర్కొంది ఈ పోరాటంతో మంత్రగత్తెలన్న పేరుతో మహిళలపై […]
ఎ సి వల్ల నష్టం
సీజన్ తో సంబంధం లేకుండా ఎక్కువ సమయం ఎసి ల్లో గడిపేయటం యువతరానికి అలవాటైపోయింది. గంటలకొద్దీ గడపటం వల్ల శరీరం సేద తీరుతుంది కానీ కళ్లకు సమస్య వస్తోంది అంటున్నారు పరిశోధకులు డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.ఇలాంటి ఇబ్బంది వేసవిలో ఎక్కువ అంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు ఎసి ల్లో గడపటం వల్ల కళ్లు పొడిబారిపోవడం కంటి నుంచి నీరు కారటం దురద మంట చూపు మసకబారడం వంటి […]
ఆక్సిజన్ ఇచ్చే పామ్
కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కంటికి ఆహ్లాదాన్ని ఇవ్వటంతో పాటు ఆక్సిజన్ ను అందిస్తాయి. ఇంటి మూలల్లో ఎంతో అందాన్నిస్తాయి కూడా.ఈత ఆకుల లాగా కనిపించే పామ్ మనీప్లాంట్ ఎలాంటి వాతావరణంలో అయినా పెరుగుతాయి. చిన్నవిగా ఉన్నప్పుడు కుండి ని గదిలో ఒక మూలగా పెట్టుకుంటే గదికి కొత్త అందం వస్తుంది. ఈ మొక్క కాస్త పెద్దదిగా అయ్యాక పైకి పెరుగుతూ కుండీలో మట్టి కనిపిస్తూ ఉంటే అందులో ఒక మనీప్లాంట్ వేస్తే చాలా అందంగా ఉంటుంది.
ఇది వెబ్ సిరీస్ కాలం
ఒక వెబ్ సిరీస్ లో నటించడం అంటే ఐదు సినిమాలకు ఓకే చెప్పేసినట్లే అంటుంది తమన్నా. ఆహా ఓటీటీ పైన లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ లో తమన్నా పోషించిన పాత్ర చాలా కీలకం కూడా. అవకాశాలు వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు మరిన్ని అవకాశాలు వచ్చాయి వెండి వెండితెర తో పాటు వెబ్ వేదిక కూడా ఇంకో కొత్త ఆప్షన్ కదా నేనెప్పుడూ కాస్త ముందే […]
కాంచన్ పరులేకర్
70 ఏళ్ల కాంచన్ పరులేకర్ బ్యాంక్ మేనేజర్ ఉద్యోగం వద్దనుకున్నారు స్వయం సిద్ధ సంస్థ ద్వారా గత 30 ఏళ్లుగా 6500 మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దారు.మహారాష్ట్రలోని కొల్హాపూర్ లో జన్మించిన తన తల్లిదండ్రులు చేసే సామాజిక సేవ వారసత్వంగా అందుకొన్నారు.ఎం. ఏ డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ పూర్తిచేసి బ్యాంక్ మేనేజర్ గా పనిచేసిన కాంచన్ పరులేకర్ 1992 లో స్వయం సిద్ధ లో పని చేసేందుకు పూనుకొన్నారు. బేకరీ నుంచి ఫుడ్ ప్రాసెసింగ్ వరకు బ్యూటీ […]
కెప్టెన్ ప్రీతి చౌదరి
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ సైనిక దళానికి చెందిన మహిళ కాంతి కాంటింజెంట్ కమాండర్ కెప్టెన్ ప్రీతి చౌదరి సైనిక కవాతకు నేతృత్వం వహించారు. ఇందులో భాగంగా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్ షిల్కా ఆయుధ వ్యవస్థకు కెప్టెన్ ప్రీతి ముందుండి నడిపించారు.ఈ వ్యవస్థకు శత్రు స్థావరాలను రెండు కిలోమీటర్ల దూరం నుంచే మట్టుపెట్టే సామర్ధ్యం ఉంది.ఆధునిక రాడార్లు, డిజిటల్ ఫైర్ కంట్రోల్ కంప్యూటర్స్ తో ఆధునీకరించిన షిల్కా ఆయుధ వ్యవస్థ భూమి పై రెండు కిలోమీటర్లు […]
సింధూ తాయి
వెయ్యి మంది పిల్లలను పోషించే సింధూ తాయి కి పద్మశ్రీ లభించింది. పన్నెండేళ్ల కే పెళ్లయింది.20 ఏళ్లకు ముగ్గురు పిల్లల తల్లయింది.గర్భిణీగా ఉన్న సింధు ని భర్త తరిమేస్తే పశువుల కొట్టంలో పురుడుపోసుకుంది. స్మశాన వాటికలో తలదాచుకుని శవాలకు పెట్టే పిండాల ని ఆహారంగా తీసుకున్న సిందు తాయి, బిచ్చమెత్తుకుంటున్న ఊరూరా తిరిగే సింధు తాయి 40 ఏళ్ళ తరువాత తన బిడ్డ కే కాదు వేయి మందికి అనాధ పిల్లలకు అమ్మ అయింది. ఆమె చక్కగా […]
సంగీత సరస్వతి చిత్ర
ఇరవైకి పైగా భాషల్లో పాతిక వేలకు పైగా పాటలు పాడిన చిత్ర 2005లో పద్మశ్రీ పొందారు కేరళ లోని త్రివేండ్రం లో సంగీత కళాకారుల కుటుంబంలో పుట్టిన చిత్ర చిన్న వయసులో సంగీత ప్రపంచంలో అడుగుపెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం తో సహా 20 భాషల్లో పాడారు.ఆరు జాతీయ, ఎనిమిది ఫిలిం ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. ఇప్పుడు తాజాగా పద్మవిభూషణ్ అందుకొన్నారు చిత్ర.
శాంతి దేవి
బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో రాయగడ్ జిల్లాలోని పద్మపురం సమీపంలో సేవ సమాజ్ ఆశ్రమాన్ని స్థాపించారు శాంతి దేవి.ఒడిస్సా లోని బాలేశ్వర్ లో 1934 లో జన్మించారు. శాంతి దేవి కుటుంబంలో అందరూ సమాజ సేవలోనే ఉండటం తో ఆమె కూడా ఆ మార్గాన్ని ఎంచుకున్నారు సామాజిక సేవ కార్యకర్త రతన్ దాస్ ను వివాహం చేసుకున్నారు కొరాపుట్ జిల్లా లోని సంకల్ పదార్ గ్రామంలో కుష్టు రోగులకు సపర్యలు చేస్తూ తన సేవా కార్యక్రమాలకు శ్రీకారం […]
జయ పరాశర్, అంకిత పరాశర్
స్టెమ్ మైండ్స్ కో ఫాండింగ్ డైరెక్టర్స్ జయ,అంకిత జయ తల్లి అంకిత కూతురు. రోగుల ఆరోగ్య సంరక్షణ ను తమ చేతుల్లోకి తీసుకునే రోబోలను సృష్టించారు. ఆరోగ్యానికే కాదు పిల్లల చదువులకు అవసరమైన రోబోటెక్ టెక్నాలజీ పోగ్రామ్ రూపొందిస్తున్నారు. ఆసుపత్రిలో నర్స్ లాగా సేవలందించే రోబో రూపకల్పన చేశారు. ఈ ఇద్దరిని ఐక్యరాజ్యసమితి యు.ఎస్ ఉమెన్ ఆసియా-పసిఫిక్ సంస్థ ప్రామిసింగ్ సొల్యూషన్స్ విజేతలుగా గుర్తించింది. జయ పరాశర్, అంకిత పరాశర్. కోవిడ్ సమయంలో అవసరమైన ఆవిష్కరణలు చేశారు.
శివి కపిల్
ఏంపథీ డిజైన్ లాబ్స్ సి.ఇ.ఒ శివి కపిల్ బెంగుళూరు లో ఉన్న ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణ రంగానికి అవసరమైన పరిష్కారాలు అందిస్తుంది.కరోనా సమయంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవటానికి అవసరమైన వేరబుల్ మోనిటరింగ్ డిజైన్ క్రియ ను కనిపెట్టింది ఏంపథీ సంస్థ డిజైన్ క్రియ వెనుక స్ఫూర్తి ప్రేరణ శివి కపిల్ నే. కోవిడ్ తన విశ్వరూపం చూపిస్తున్నప్పుడు. కరోనా వల్ల మాకేమైనా అవుతుందో మీరేమైనా మాకు సహాయపడగలరా అని గర్భిణీల […]
వసంతి పళనివేల్
సెరాజెన్ బయోథెరపీటిక్స్ కో ఫౌండర్,సి.ఇ. వసంతి పళనివేల్.ఈమె నేతృత్వంలో సెరాజెన్ వైద్య పరిశోధనా సంస్థ శ్వాసకోశాల అస్వస్థతకు ప్లాస్మా చికిత్సను కనిపెట్టింది మహిళల్లో సంతాన సాఫల్యత పై శాస్త్ర అధ్యయనాలు జరిపే సెరాజెన్ కరోనా చికిత్సలో వినూత్న వైద్య పరిష్కారాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మంచి ఫలితాలు సాధించింది. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఎంపిక చేసిన శక్తివంతమైన మహిళల లో ఒకరుగా ఉన్నారు వసంతి.
యాభై ఏళ్లు దాటాయా?
యాభై ఏళ్లు దాటిన మహిళలు కూడా కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే అందంగా ఉంటారు అంటున్నారు ఎక్సపర్ట్స్. చర్మం ఎండకు దెబ్బతినకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి. శరీరం పైన చర్మం పైన మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడిచర్మం రాకుండా మాయిశ్చరైజర్ నిండిన సబ్బులు లోషన్లు వాడాలి. ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. చర్మానికి పోషణ ఇచ్చే ఆహారం తినాలి తప్పకుండా యాంటీ ఏజింగ్ ఉత్పత్తిలు ప్రారంభించాలి. ముడతలు తగ్గించే చర్మ చికిత్సలు గురించి తెలుసుకోవాలి. […]
శిల్పా శెట్టి సీక్రెట్స్
శిల్పా శెట్టి గొప్ప ఫిట్ నెస్ ఫ్రీక్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మే కాకుండా తన వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. శరీరపు ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు వృక్షాసనం బెస్ట్ అంటుంది శిల్పా అలాగే ఓంకారం జపించటం ద్వారా శరీరంలో నాడులు చురుగ్గా పనిచేస్తాయి ఒంటరిగా చేసే వ్యాయామం కన్నా తోడుగా ఎవరైనా ఉంటే వ్యాయామం చేయటం సరైన ఆహారం తీసుకోవటం తేలిక అంటుంది శిల్పా. డీప్ స్క్యాట్స్ శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. వ్యాయామం ఎప్పుడూ […]
రోజంతా ఉత్సాహం
నిరుత్సాహంగా బడలికగా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడేందుకు వ్యాయామాలు కాదు కొన్ని చిట్కాలు చాలు రోజు సమతుల ఆహారం తీసుకుంటే శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది ఒత్తిడి నుంచి బయట పడేందుకు పండ్లు, కూరగాయలు, బ్రోకోలి, బెర్రీలు తీసుకోవాలి సమయానికి నిద్ర పోవాలి. కండరాలు బలోపేతం చేసే బరువులు ఎత్తే వ్యాయామాలు చేయాలి. తరచుగా నీళ్లు తాగాలి పని గంటల మధ్య చిన్నపాటి గ్యాప్ తీసుకోవాలి. భోజనం చేశాక చిన్నపాటి కునుకు చాలా రిలాక్స్ ఇస్తుంది. […]
వేగంగా నడిస్తే లాభం
రోజూ కనీసం నలభై ఐదు నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి స్పీడ్ వాకింగ్ వల్ల కేలరీలు ఖర్చవుతాయి. బరువు నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గిపోతుంది రక్తంలో చక్కెర శాతం అదుపులో ఉంటుంది. మధుమేహం ఉన్న వారికి స్పీడ్ వాకింగ్ మేలుచేస్తుంది కండరాలు బలోపేతం అవుతాయి. ఆర్థరైటిస్ సమస్య దగ్గరకు రాదు శ్వాసకోశ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. క్రియేటివ్ గా ఆలోచించేందుకు స్పీడ్ వాకింగ్ […]
నీకు నేను తోడుంటా !
31 సంవత్సరాల లూసియానా రెబెల్లో గర్భాశయ కాన్సర్ తో బాధ పడుతోంది.ఇందుకు గానూ కీమో థెరపీ తీసుకొంటుంది. ఆ సందర్బంగా తల నున్నగా షేవ్ చేయాల్సి ఉంది. లుథియానా తల్లి కూతురికి షేవ్ చేస్తూ తన తలను కూడా షేవ్ చేసుకోవటం మొదలు పెట్టింది. తల్లి భావోద్వేగ నిర్ణయంతో కూతురు షాక్ తో కనీళ్ళతో చూస్తూ ఉండి పోయింది. కనీళ్ళతో ఉన్న కూతురితో నువు ఒంటరి దానివి కాదు నేను నీకు తోడుగా ఉన్నాను. మన మనిద్దరం […]
అమేయకు పురస్కారం
విశాఖ పట్టణానికి చెందిన అమేయ లగుడు ప్రధాన మంత్రి బాల పురస్కార్ అందుకొన్నాది. ఆరేళ్ళ వయస్సులో విశాఖ పట్నం కళా భారతి ఆడిటోరియంలో రెండు గంటల నలభై ఐదు నిముషాల పాటు నిర్విరామంగా నృత్య ప్రదర్శన ఇచ్చింది అమేయ. ఈ ప్రదర్శనతో ఒకేసారి తొమ్మిది రికార్డులు నమోదయ్యాయి. ఇందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ కూడా ఉంది. అమేయ ఇప్పుడు ఎనిమిదో తరగతి చదువుతోంది. ఇప్పటి వరకు దేశ విదేశాల్లో వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చింది.
