Tuesday, 04 Aug, 2026

పాక్ లో తొలి డీఎస్పీ

పాకిస్థాన్ లో తొలి హిందూ మహిళా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రూపిత ఇతర ఆమె ఆమె జకోబాబాద్‌లో బల్లో మాల్ అనే వ్యాపారి కుమార్తె. జిన్నా మెడికల్ సెంటర్ లో మెడికల్ థెరపీ డాక్టర్ గా పనిచేస్తున్న రూపిత సి.సి.ఇ అయిన ఎస్పీ,ఎస్సీ రాసిన గవర్నమెంట్ లో డైరెక్టర్ గా అత్యున్నత స్థాయి ఉద్యోగానికి వెళ్లాలన్నా కోరికతో సర్వీసు పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు మంచి ర్యాంక్ తో లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇప్పుడు డిఎస్సీ సీట్లో కూర్చో […]

కాస్త జాగ్రత్త

ప్రతిరోజు వ్యాయామం మంచిదే కానీ కొన్ని జాగ్రత్తలు పాటించకపోతే చర్మ సమస్యలు తప్పవు అంటున్నారు ఎక్సపర్ట్స్. జిమ్ ఫిట్ నెస్  సెంటర్లలో ఉపయోగించే యంత్రాలు ఎప్పటికప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్ తో తుడవాలి. ఇంట్లో ఉపయోగించే వ్యాయామ సాధనాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కసరత్తులు చేసే సమయంలో రిస్ట్ బ్యాండ్స్ ఆభరణాలు వంటివి ఏవి ఉంచుకోవద్దు. మేకప్ తో వర్క్ వుట్స్ చేయకూడదు ఇందులో ఉండే రసాయనాలు చెమటతో కలవటం వల్ల మొటిమలు దద్దుర్లు ఇబ్బంది పెడతాయి […]

ఇక లక్ష్యం ఒలంపిక్స్

నా లక్ష్యం నుంచి నన్ను ఏదీ వేరు చేయలేదు మొదట నాతో నేను పోటీ పడతాను మిగిలిన వాళ్లు సంగతి ఆ తరువాతనే ఎప్పుడూ సానుకూలంగా ఉండేందుకు  ప్రయత్నం చేస్తాను. ఈ మధ్య జరిగిన ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో క్లీన్ అండ్ జర్క్  విభాగంలో సరికొత్త రికార్డ్ నెలకొల్పడం సంతోషంగా ఉంది ఇప్పుడు నా దృష్టి మొత్తం ఒలంపిక్స్ పైనే ఉంది అంటోంది మీరాబాయ్  ఇటీవల ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ […]

బొద్దింకల బెడదా ?

బొద్దింకల బెడద వదిలించుకునేందుకు గాఢమైన రసాయనాలు ఉన్న మందులు వాడితే అనారోగ్యాలు వస్తాయి. కొన్ని చిన్న చిట్కాలతో బొద్దింకల బాధ వదిలించుకోవచ్చు బొద్దింకలు వచ్చే ప్రదేశాల్లో బేకింగ్ సోడా చల్లితే బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే నిమ్మకాయను చిన్న ముక్కలుగా తరిగి సింగ్ లో వేస్తే అక్కడి కి బొద్దింకలు రావు, వాడేసిన నిమ్మకాయ తొక్కలను సింక్ లోనే ఉంచాలి. బీరువాల్లో బట్టల మధ్య కర్పూరం లేదా  నాఫ్తలీన్ బిళ్ళలు పెడితే బొద్దింకల వాటిలో చేరకుండా […]

ఇకపై భరించం

ఆడవాళ్ళ ను శరీరాకృతి తోనే గుర్తించే మగవాళ్ళను ఎదుర్కొనేందుకు ఆడవాళ్ళం సిగ్గుపడతాం కానీ ఈ తరహా బాడీ షేమింగ్ ను ఇన్నాళ్లు భరించాం ఇక చాలు అంటుంది నాగిని సీరియల్ నటి టీవీ నటి సయంతాని ఘోష్ ఒక ఇంటర్వ్యూలో ఒకతను నా బ్రా కొలత అడిగాడు ఆడవాళ్ల ఛాతిలో ప్రత్యేకత ఏముంది. అది ఒక శరీర అవయవం. పాలిచ్చే తల్లికి ఆ అవయవం అవసరం అనుభవంలోకి వస్తుంది. ఇలా శరీరం తీరు గురించి మాట్లాడితే మౌనంగా […]

షీ టీమ్ కి కంప్లయింట్ ఇవ్వండి

అమ్మాయిలు సోషల్ మీడియాలో మోసానికి గురైతే వెంటనే టీమ్ కు కంప్లయింట్ చేయచ్చు సోషల్ మీడియాలో షీ టీమ్ వాట్సాప్ నంబర్ క్యూ ఆర్ కోడ్ ఉన్నాయి దీని ద్వారా ఒక మెసేజ్ చేసినా చాలు నిందితుడు దొరక్కపోవటం అనే సమస్య ఉండదు జాగ్రత్త పడాలి అంటే  బాధితులు ఆ నిందితుడు పేజీ స్క్రీన్ షార్ట్ చేసి పెట్టుకోవడం మంచిది దీనివల్ల ఆ ఎకౌంట్ ఎవరు ఉపయోగిస్తున్నారో తెలిసిపోతుంది అని చెబుతున్నారు తెలంగాణ, ఉమెన్ సేఫ్టీ డి.ఐ.పి […]

ఏడుపు మంచిదే

మనిషి ఆరోగ్యానికి నవ్వు ఎంత ముఖ్యమో ఏడుపు కూడా అంతే ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఏడిస్తే మెదడులో ఆక్సిటోసిన్,  ఎండార్షిన్ అనే ఫీల్ గుడ్ రసాయనాలు విడుదలై శారీరక మానసిక భావోద్వేగాల కు సంబంధించిన మార్పులు కలుగుతాయి.ఈ రసాయనాలతో శరీరానికి నొప్పిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది కన్నీళ్ళు కళ్ళలోని మలినాలను, దుమ్మును బయటకి పోగొడతాయి కన్నీళ్లు మూడు రకాల బాసల్ టియర్స్ కళ్ళను తేమగా ఉంచుతాయి. రిఫ్లెక్స్ టియర్స్ ఉల్లిపాయలు వంటివి  కోసినప్పుడు  కళ్ళ మంటలను తగ్గించేందుకు […]

ఇమ్యూనిటీ డ్రింక్

కీర దోస,తులసి పానీయం వేసవిలో శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు ఇమ్యూనిటీ ని పెంచుతుందని చెపుతున్నారు ఎక్సపర్ట్స్. తయారీ కూడ చాలా తేలిక. కీరా దోస ఒకటి తులసి ఆకులు ఎనిమిది స్వీట్ సిరప్ 60 ఎం.ఎల్ ,సోడా కొద్దిగా సరిపోతాయి. ముందుగా కీరదోస పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక గ్లాస్ లో నీళ్ళు తీసుకుని అందులో దోస ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఇంకో గ్లాసులో  తులసి ఆకులు తీసుకోవాలి.తరువాత అందులో స్వీట్ […]

అందుకే ఆ పేరు

ది గ్రోయింగ్ జిరాఫీ పేరుతో ఆరోగ్యకరమైన స్నాక్స్ తాయారు చేసి వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు కోల్ కతా కు చెందిన రుక్మిణీ బెనర్జీ న్యాయ విద్య పూర్తిచేసి లండన్ లో మాస్టర్ చేయాలనుకున్నారు ఈలోగా తల్లి కాబోతున్నారు అని తెలుసుకుని మాస్టర్స్ కాకుండా పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్ అందించే వ్యాపారం చేద్దామనుకున్నారు. రుక్మిణి సాధారణంగా పిల్లలు ఎత్తు పెరగాలనుకొంటారు తల్లులు అందుకే నా ఉత్పత్తులకు జిరాఫీ పేరు, బొమ్మ పెట్టానంటారు ఆమె తయారు చేసే హెల్త్ బార్ లకు […]

పద్మశ్రీ ఫ్రెడరిక్ బ్రూనింగ్

జర్మనీ నుంచి భారత్ కు వచ్చిన ఫ్రెడరిక్ బ్రూనింగ్ తిన్ కోరి బాబా మంత్ర దీక్ష తీసుకొన్నారు సుదేవి మాతాజీ గా మారారు ఉత్తరప్రదేశ్ లో మథుర లో ఆమె తెలియని వాళ్ళు ఉండరు మథుర లో రాధా సురభి గోషాల అంకురార్పణ చేశారు.రెండున్నర వేలకు పైగా గోవులకు  ఆవాసం కల్పించారు ఈ గోశాల అధికశాతం దాతలు చందాలతో నడుస్తుంది. ఆమె నిరంతర సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

డెమెన్షియా రావచ్చు

50, 60 ఏళ్ల వయసున్న వారు ఆరు గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోతే డెమన్షియా వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. నిద్రకు డెమన్షియా కు ఉన్న సంబంధాన్ని విశ్లేషించడం పై పరిశోధనలు చేస్తున్న లండన్ యూనివర్సిటీ కాలేజ్ కు చెందిన పరిశోధకులు ఎనిమిది వేల మందిపై ఈ పరిశోధనలు జరిపారు అధ్యయన వివరాలు నేచర్ కమ్యూనికేషన్స్ అన్న జర్నల్ లో ప్రచురించారు ఏడు గంటలు నిద్ర పోతున్న వారితో పోల్చితే ఆరు గంటలు లేదా […]

ఇటలీ గ్యాలరీ లో మాధురి పెయింటింగ్స్

అమెరికాలో ఉంటున్న నలగొండ వాసి మాధురి శ్రీకాంత్ పెయింటింగ్స్ ఇటలీ మిలాన్‌ లోని ఆర్ట్ గ్యాలరీలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి ఇంస్టాగ్రామ్ లో పెయింటింగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటుంది మాధురి శ్రీకాంత్ ఇటలీలోని మిలాన్ కు చెందిన మాడ్స్‌ గ్యాలరీలో నా పెయింటింగ్స్‌ ప్రదర్శించవలసిందనీ, ఆ ఆర్ట్స్ గ్యాలరీ ఎంచుకున్న ‘రొమాంటికా’ థీమ్‌కు నా పెయింటింగ్స్‌ సూటవుతాయని సందేశం వస్తే మొదట్లో నమ్మలేక పోయిందట మాధురి ఇప్పటి వరకు 120 పెయింటింగ్ వేశారామె తంజావూర్‌, మధుబని, మ్యూరల్స్‌, వర్లి, […]

మోడల్ ఆవాలనుకొంది

అంతర్జాతీయ పత్రిక పీకాక్ మ్యాగజైన్  మలీషా ఖర్వా ను అక్టోబర్ 2020 సంచిక కవర్ పేజి పైన వేశాక మలీషా ముగ్ధత్వం రూపం నవ్వు ప్రపంచానికి తెలిసింది ముంబై మురికి వాడలో జన్మించిన మలీషా తండ్రి పార్టీ లో జోకర్ వేషం వేసి పొట్ట పోసుకునే వాడు. మలీషా మాత్రం మోడల్ అవ్వాలనుకుంది. హాలీవుడ్ నటుడు  రాబర్ట్‌ హాఫ్‌మ్యాన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం మురికివాడలో వెతుకుతుంటే వచ్చి పరిచయం చేసుకుంది మలీషా ఆమె పేరుతో ఇంస్టాగ్రామ్ […]

కొందరికైనా స్ఫూర్తిని ఇస్తే చాలు

నా నలభైయ్యవ పుట్టిన రోజు తర్వాత అలోపేషియా అనే వ్యాధి వచ్చింది. మొత్తం జుట్టు రాలి పోయింది ఈ వ్యాధికి చికిత్స లేదన్నారు వైద్యులు మొదట్లో షాక్ అనిపించింది. అసలు ఈ గుండు తోనే అద్భుతాలు ఎందుకు చేయకూడదు అనుకున్నాను. 2017 లో మిస్ ఇండియా ఆఫ్ వరల్డ్ అందాల పోటీ జరిగింది అందులో పాల్గొనాలని నిర్ణయించుకున్నాను.అప్లికేషన్ లో జుట్టు రంగు అని ఉన్నచోట ‘నో హెయిర్’ అని రాశాను గంటలోపే ఓకే అని సమాధానం వచ్చింది […]

అత్యంత శక్తి

మహిళలు మరింత ఆరోగ్యంగా శక్తిమంతంగా మారాలంటే ఆహారం చాలా బలవర్ధకం గా ఉండాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.  మీగడ లేని పెరుగులు శరీరానికి మేలు చేసే ప్రో బ్యాక్టీరియాతో పాటు క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.ఎక్కువ పనులు చేసేందుకు ఎముక సామర్థ్యం కావాల కనుక పెరుగు ఎక్కువగా తినాలి చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరంలోని ప్రతి అణువూకు  ఆరోగ్యాన్ని ఇస్తాయి క్రమం తప్పకుండా చేపలు తింటే హైపర్ టెన్షన్ ఒత్తిడికి కీళ్ల నొప్పులు రావు. రోజు గుప్పెడు […]

బొల్లివుంటే మాత్రం ఏం ?

బొల్లి ఇతర అనారోగ్యాలలో ఒకటి,ఇది బయటికి కనిపిస్తుంది. అంతే మన శరీరాన్ని ప్రేమించటం మొదలు పెడితే మనం మనకు అందంగా కనిపిస్తాం. ఈ దిశగా ఆలోచించి నేను అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టాను బొల్లి గురించి మాట్లాడి మొదటి వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాను. ఇంస్టాగ్రామ్ లో నా భావాలు షేర్ చేశాను అంటోంది బెంగుళూరు కు చెందిన ప్రార్ధన జగన్.  ఇప్పుడామె ఫ్యాషన్ ప్రపంచంలో ప్రభంజనం 11 సంవత్సరాల వయసులోనే నా మొహం పై […]

దేశాయ్ డిజైన్స్ అద్భుతం

‘ది ఇండియా ఎథినిక్ కో డాట్’ ప్రస్తుతం కోట్ల టర్నోవర్ తో దూసుకుపోతోంది. ఈ బిజినెస్ డాట్ కాం సృష్టికర్తలు తల్లీకూతుళ్లు హేతాల్ దేశాయ్,లెఖినీ దేశాయ్ లు. ఒక హ్యాండ్ లూమ్ ఎక్సిబిషన్ లో చేనేత వస్త్రాలు వెరైటీలు చూశాక రకరకాల డిజైన్ దుస్తులు తయారు చేస్తే ఎలా ఉంటుందీ అని వ్యాపార ఆలోచన కలిగిందట. అలా 50 మీటర్ల ఫ్యాబ్రిక్ తో కుట్టించిన కుర్తీల తో బిజినెస్ మొదలుపెట్టారు ఇద్దరూ ది ఇండియా ఎథినిక్ కో […]

మంచి రోజులున్నాయి

మంచి రోజులు ముందున్నాయి మళ్లీ సుకుమార్ తో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ పుష్ప సినిమాలో తాను నటిస్తున్నానని చెపుతోంది అనసూయ. అన్నట్లు నేను లీడ్ రోల్ చేసిన ఒక సినిమా ఓ టి టి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నది పుష్ప సినిమాలో నాది కీలక పాత్ర గతంలో రంగస్థలం లో నేను నటించిన పాత్ర ఎంత మైలేజ్ ఇచ్చిందో ఇప్పుడు ఈ సినిమా నాకు సంతోషాన్ని కలిగిస్తోంది అంటోంది అనసూయ. […]

అమ్మ జాగ్రత్త

ఐదు నెలల గర్భిణీ దంతేవాడ డి.ఎస్.పి శిల్ప సాహు లాక్ డౌన్ లో విధులు నిర్వహణలో మాస్క్ కట్టుకొని మామూలు దుస్తుల దుస్తుల్లో రహదారుల్లో డ్యూటీ చేస్తున్న దృశ్యం సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఆమె ఫోటోను ఐ పి ఎస్  ఆఫీసర్ ఛతీస్ ఘడ్ అడిషనల్ ట్రాన్స్ పోర్ట్  కమిషనర్ ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్ట్ చేయగానే ధరా పతంగా ప్రశంశలు కురుస్తూనే  ఉన్నాయి పదులు వందల సంఖ్యలో ఆమెను జాగ్రత్తగా ఉండండి ఎండలో […]

రైడ్ టు రైజ్

స్త్రీలపై జరిగే హింస కు వ్యతిరేకంగా వన్ బిలియన్ రైజింగ్ కాంపెయిన్  లో భాగంగా సైకిల్ యాత్ర చేస్తున్నారు  24 ఏళ్ల సబితా మహతో, 21 ఏళ్ల శృతి రావత్. స్త్రీలపై జరిగే హింస కు వ్యతిరేకంగా చైతన్యం ప్రచారం కలిగించాలని అమెరికన్ ఫెమిస్ట్ ఈవ్ ఎన్స్‌లర్ మొదలుపెట్టిన కార్యక్రమం లో భాగంగా రైడ్ టు రైజ్ పేరుతో 85 రోజులు వీరు యాత్ర చేస్తారు. బీహార్ కు చెందిన సబితా మహతో ఉత్తరాఖాండ్ కు చెందిన […]