Sunday, 02 Aug, 2026

తంగ్కా ఫ్యాషన్స్

జానపద కళారూపాలను కూడా తమ డిజైన్ లోకి తెస్తున్నారు ఫ్యాషనిస్ట్ లు టిబెటన్ ప్రాచీన బౌద్ధ కళ తంగ్కా డిజైన్ లను శీతాకాలపు ఫ్యాషన్ లుగా తీసుకొచ్చారు ఫ్యాషన్ డిజైనర్లు. కాంతివంతమైన రంగులతో దారపు పోగులతో పల్లె అల్లికలతో శీతాకాలపు దుస్తులుగా అనార్కలీ, లాంగ్ కుర్తాలు మరింత అందాలు తెచ్చుకున్నాయి. బౌద్ధ కళ తంగ్కా ను నింపుకున్న ఈ డిజైనర్ అనార్కలీ డ్రెస్ లు ఎంబ్రాయిడరీ, కచ్ వర్క్, గొటా, పట్టి టాజిల్స్ వంటి హంగులతో ఇప్పుడు […]

సంగీతం నాకు వారసత్వం

నా లక్ష్యం హాలీవుడ్ లో టాప్ 10 వ జాబితాలో చోటు తో పాటు గ్రామీ అవార్డ్ సాధించటం, ఎవరికైనా లక్ష్యంతో పాటు ఫ్యాషన్ కూడా ఉండాలి అప్పుడే విజయం సాధించగలుగుతాము అంటుంది స్ఫూర్తి జితేందర్. మూడో పటనే పాడటం ప్రారంభించి లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకొంది స్ఫూర్తి. 70 కి పైగా సినిమా పాటలు పాడింది 80 పైగా జానపదాలు లక్షల మంది అభినందించారు. మా అమ్మ శాస్త్రీయ గాయని మామయ్య జై శ్రీనివాస్ ప్లేబ్యాక్ […]

అత్యంత స్వచ్ఛం

ప్రపంచం లోని స్వచ్ఛమైన నదుల్లో మేఘాలయా లోని ఉంగోట్ నది మొదటిది(UMNGOT) అట్టడుగున ఉండే ఇసుక కూడా స్పష్టంగా కనిపించే ఈ నది ఒక అద్భుతం మేఘాలయా స్టేట్ లో షిల్లాంగ్ కు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నదిలో ఉన్న బోట్ లను పై నుంచి చూస్తే పడవ గాలిలో తేలినట్లే కనిపిస్తుంది. జలశక్తి మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఒక ఫోటోలో చుట్టూ ఆకాశం పచ్చని కొండలు మధ్యలో ఓ […]

అందంగా షుగర్ లేసులు

పిల్లలు పుట్టిన రోజు వేడుకల కోసం అందంగా ఉండే షుగర్ లేస్ లు తయారు చేస్తున్నారు బేకరీ ఆర్టిస్ట్ లు పువ్వులు, ఆకులు, జంతువుల డిజైన్లతో కూడిన ఎడిబుల్ డాయిలీ లు మార్కెట్ లో దొరుకుతున్నాయి. పంచదార లేస్ లేదా షుగర్ డాయిలీ తయారీ సులభమే బియ్యంపిండి, కార్న్ ఫ్లోర్ మరిగించిన నీళ్లు ఐసింగ్ షుగర్ కలిపి పేస్ట్ లా చేసి దాన్ని మౌల్ట్ పైన పరిస్తే అది ఆరిపోయి అందమైన లేస్ లా విడిగా వచ్చేస్తుంది. […]

చక్కెరకు ప్రత్యామ్నాయం

తీయని చక్కెర కు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. పండ్ల నుంచి తయారు చేసే ఎరిథ్రిటాల్ పౌడర్ రూపంలో దొరుకుతుంది. ఈ తీపి లో సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. మామూలు చక్కెర కన్నా బెల్లం ఉత్తమమైనది. అలాగే మేపిల్ చెట్టు నుంచి తయారు చేసే మేపిల్   సిరప్ ఆరోగ్యాన్నిస్తుంది .పోషకాలు ఎక్కువగా ఉండే ఎండు ఖర్జూరం నుంచి తీసిన డేట్స్ సిరప్ తో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మహిళల్లో రక్తహీనతను దూరం చేస్తుంది. స్వీట్ల తయారీలో […]

గ్రీన్ జ్యూస్ లు బెస్ట్

గ్రీన్ జ్యూస్ లా వాడకం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది ఇవి తాజాగా ఉండటం తో పాటు సేంద్రియమైనవి. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. బరువు తగ్గించడంలో అద్భుతంగా తోడ్పడతాయి. కూరగాయల రసం శరీరంలో డిటాక్స్ గా చేస్తుంది. పచ్చని కూరగాయలు శరీరాన్ని ఆక్సిజన్ రేట్ చేస్తాయి. పళ్ళ రసాల తో పోలిస్తే గ్రీన్ జ్యూస్ లో చక్కెర తక్కువ. నీళ్లు ఫైబర్ ఎక్కువ. ద్రవరూపంలో ఉంటాయి కనుక సులభంగా జీర్ణం అవుతాయి. రుచికోసం కలిపే అల్లం, సైంధవలవణం, […]

అప్డేట్ అవ్వండి

నిరంతరం నైపుణ్యాలు మెరుగుపరచుకోండి, సాంకేతిక వ్యవహార పరంగా వచ్చే మార్పులను తెలుసుకోండి. నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి. అప్పుడే విజయ ప్రస్థానం కొనసాగుతుంది అంటుంది శ్రేయసి. జర్నలిస్ట్ గా జీవితం ప్రారంభించిన శ్రేయసి స్నేహితుడు ప్రథమ్ రాజ్ తో కలిపి ఢిల్లీ కేంద్రంగా హరప్పా ఎడ్యుకేషనల్ స్టార్టప్ మొదలుపెట్టింది ఔత్సాహిక వ్యాపార వేత్తలకు నైపుణ్యాలు నేర్పిస్తోందీ సంస్థ. లక్ష మందికి పైగా ఈ సంస్థలో చేరారు 3.5 లక్షలకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు వ్యాపార నైపుణ్యాల పైన […]

ఎల్లలు లేని సృజన

వినూత్నమైన ఫ్యాషన్ డిజైన్లను రూపొందించింది, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపు తెచ్చుకుంది రేఖ గుప్తా. టిష్యూ పేపర్ తో చేసిన, గౌను మైనం తో చేసిన, డ్రెస్ ఫెవికాల్ తో చేసిన, తెల్లని దుస్తులు స్వచ్ఛమైన బంగారం తో రూపొందించిన లెహంగా వైట్ సిమెంట్ తో చేసిన డ్రెస్ లిక్విడ్ సోప్ తో చీరె ఇలా విభిన్నమైన ఏడు రకాల దుస్తులకు ఆమెను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఫ్యాషన్ […]

ఒక్క రాత్రిలో ఫలితం

చర్మం పొడిబారకుండా కొబ్బరి నూనె రాస్తుంటారు చలి గాలులు నుంచి రక్షణ ఇచ్చే ఈ కొబ్బరినూనెతో ఒక రాత్రిలోనే మెరిసే దంతాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. రాత్రి పడుకునే ముందు పళ్ళ కు కొబ్బరి నూనె పూయాలి. ఉదయం బ్రష్ చేసుకుంటే తెల్లని దంతాలు చూసుకోవచ్చు అంటున్నారు. అలాగే గోళ్లు మెరవాలంటే కూడా గోరువెచ్చని కొబ్బరి నూనె గోళ్ళకు పట్టించి మృదువుగా మర్దన చేయాలి. ఆ నూనె చేతులకు పట్టిస్తే, చేతులు, గోళ్లు మెరుస్తాయి. పాదాల […]

సులువైన వ్యాయామం

కదిలే పని లేకుండా డెస్క్ జాబ్ చేసే వాళ్లను మెడ, నడుము భుజాల నొప్పులు వేధిస్తాయి. బయట వ్యాయామం చేసే సమయం దొరక్క పోతే కనీసం డెస్క్ ఎక్సర్ సైజ్ చేయమంటున్నారు ఎక్సపర్ట్స్. నడుము నొప్పి గా ఉంటే కుర్చీలో కూర్చునే ఇరుపక్కల స్ట్రెచ్ చేయాలి. కుర్చీలో నిటారుగా కూర్చొని పాదాలను నేలకు ఆన్చి చేతులను మోకాళ్లపై ఉంచాలి ఇప్పుడు భుజాలు గుండ్రంగా తిప్పాలి. కాసేపు గడ్డం ఛాతికి తగిలేలా వంగి కాసేపు అలాగే ఉండాలి. వీటిని […]

పిల్లలకు ఆశ్రయం

ఆశ్వాస భవన్ ఏర్పాటు చేశారు సిస్టర్ ఫాబియోలా ఫాబ్రి  ఇటలీ లోని ఫ్లోరెన్స్ లో పుట్టిన సిస్టర్ ఫాబ్రి సేవా కార్యక్రమాలు చేయడం కోసం కేరళ వచ్చింది కొచ్చి చుట్టుపక్కల ఉన్న మురికివాడల్లో అనాధ పిల్లల కోసం 2005 లో స్థాపించిన ఆశ్వాస భవన్ లో ఇప్పుడు 70 మంది పిల్లలు ఆశ్రయం పొందుతున్నారు. ఈ కేంద్రాన్ని మూడు విభాగాలుగా పిలుస్తారు హోమ్ లో శిశువులు, గర్ల్స్, హోమ్ లో ఆరు నుంచి 18 సంవత్సరాల బాలికలు, […]

ఎం.ఎ ఇంగ్లీష్ చాయ్ వాలీ

నేను ఉపాధి వెతుక్కోవటం కాదు, వ్యాపార రంగంలో దిగి, సక్సెస్ అయి, నలుగురికీ ఉపాధి చూపించాలనుకొన్నాను అంటుంది 26 ఏళ్ల తుక్తుకి దాస్ నవంబర్ 2021 హబ్రా రైల్వే స్టేషన్ లో కొంతమంది మిత్రుల మధ్య ఎం.ఎ ఇంగ్లీష్ చాయ్ వాలీ దుకాణం తెరిచింది. తుక్తుకి దాస్. 2020 లో రవీంద్ర భారతి యూనివర్సిటీ నుంచి ఇంగ్లీష్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. పేరు కొత్తగా ఉండటం, తన రోజు వారీ  అనుభవాలు వీడియో తీసి బ్లాగ్ […]

ధైర్యమే ముందు

కోవిడ్ కారణంగా తలెత్తిన మానసిక వత్తిడి మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీసిందని చెబుతున్నారు నిపుణులు. ఎడిన్ బర్గ్ లో జరిగిన సొసైటీ ఫర్ ఎండోక్రినాలజీ వార్షిక సరస్సులో ,కోవిడ్ సమయంలో ఎదురైన మానసిక వత్తిడి మహిళలకు నెలసరి క్రమాన్ని దెబ్బతీసిందని ఇది సంతానోత్పత్తి సామర్ధ్యం పై తీవ్రంగా పడిందని నిపుణులు అంటున్నారు. ఆ సమయంలో నిద్రలేమి, ఒత్తిడి,ఆహార నియమాలు గతి తప్పటం హార్మోన్లను ప్రభావితం చేశాయి. ఇవి నెలసరి క్రమాన్ని నిపుణులు అభిప్రాయపడ్డారు డబ్లిన్ కు చెందిన […]

ఇది కుర్తాల కాలం

కుర్తా లు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. కొత్తగా వస్తున్న డిజైన్స్ మరింత సౌకర్యంగా ఉంటున్నాయి అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్స్. గతంలో ఫ్యాషన్ అయిన టైట్ ఫిటెడ్ కుర్తాలు రూపం మార్చుకుని లూజ్ ఫిటెడ్ కుర్తాలోచ్చాయి. లేత, ముదురు రంగుల్లో ఈ కుర్తాలను యూత్ ఎంతో ఇష్టపడుతున్నారు. అలాగే అసిమెట్రిక్ డిజైన్స్, లూస్ ఫిట్టింగ్ విశాలమైన స్లీప్స్ తో కఫ్తాన్ కుర్తా లు, ప్రింటెడ్ ఎంబ్రాయిడరీ చేసిన లాంగ్ స్ట్రెయిట్ కుర్తాలు కాస్త పొడవు తక్కువగా టాప్ […]

కొవ్వు కరిగించే పానీయం

శరీరంలో కొవ్వు శాతం తగ్గించుకోవాలంటే ఈ లెమన్ డ్రింక్ ప్రయత్నించండి అంటున్నారు ఎక్సపర్ట్స్. రెండు నిమ్మకాయలు ఒక అల్లం ముక్క తో ఒంట్లో ఫ్యాట్ కరిగించే పానీయం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకటిన్నర లీటర్ నీటిని మరిగించి నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసి విత్తనాలు తీసేసి అందులో వేయాలి. అందులో అల్లం ముక్క కూడా వేసేయాలి. నీళ్లు మరుగుతూ పొంగులా వస్తే నిమ్మకాయ రసం అల్లం రసం నీళ్ళలో కరిగి పోయి నట్లు అనుకోవాలి. ఈ వేడి […]

ఇలాంటి ప్రయాణాలు అవసరం

కొచ్చి నుంచి కాశ్మీర్ వరకు 17 వేల కిలోమీటర్లు కారులో ప్రయాణం చేశారు డాక్టర్ మిత్రా సతీష్. కొచ్చి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ మిత్ర 10 ఏళ్ళ కొడుకు నారాయణ్ తో పాటు చేసిన ఈ ప్రయాణంలో 28 రాష్ట్రాలు, ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు కవర్ చేశారు జమ్మూ, ఉత్తరాఖండ్, డెహ్రాడూన్, జైపూర్, ఉజ్జయిన్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా మీదుగా కేరళ చేరుకున్నారు. ఈ ప్రపంచంలో భౌగోళిక  చారిత్రక […]

మలసార్ బాలిక సంగవి

మలసార్ తెగకు చెందిన గిరిజన అమ్మాయి సంగవి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకున్నది. ఈ తెగలో పదో తరగతి చదవటమే గొప్ప. టెన్త్ వరకు ఎలాంటి కుల సర్టిఫికెట్ లేకుండా చదువుకున్న సంగవి పాలిటెక్నిక్ చదవడం కోసం కుల సర్టిఫికెట్ ఇమ్మని అడిగింది అధికారులు అంగీకరించకపోవడంతో సంవత్సరంపాటు సర్టిఫికెట్ కోసం తిరిగింది. ఆమె పోరాటం తెలుసుకొన్న తమిళనాడు మంత్రి సెల్వరాజ్ స్వయంగా ఆమెను కలిసి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదవాలి అనుకుంటోంది […]

జేమ్స్ బాండ్ నవలలో స్త్రీవాదం

ఇప్పటివరకు గూఢచారి జేమ్స్ బాండ్ నవలలను ఆరుగురు రచయితలు రాశారు. వారి సరసన చేరారు రచయిత్రి కిమ్‌ షెర్వుడ్‌  ఆమె రాసిన టెస్ట్ మెంట్ నవల బాత్ నోవెల్ అవార్డు అందుకుంది. ఆ నవల ద్వారా కిమ్‌ షెర్వుడ్‌ బాండ్ నవలలు రాసే అవకాశం దక్కించుకున్నారు పాత జేమ్స్ బాండ్ 007 అయితే రాయబోయే నవలలో 00 ఏజెంట్స్ ఉంటారు ఇప్పటివరకు బాండ్ నవలల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం తక్కువ. ఈ నేపథ్యంలో ఈ యువ మహిళా […]

ఇద్దరూ ఒక్కరే

నీలగ్రీవో విలోహితం అనే వేద మంత్రం పరమేశ్వరుడు సూర్యుడు ఒక్కరే అని చెబుతోంది. శివుని కంఠంలో నీలిరంగు మచ్చ ఉంటే సూర్య బింబాన్నితా తేరిపార చూస్తే నీలిరంగు లోనే బింబం కనిపిస్తూ ఉంటుంది. సూర్యుడు ఎర్రని రూపంలో ఉంటాడు శంకరుని శరీరపు రంగు కూడా ఎరుపే కానీ ఆయన శరీరం మొత్తం నిండుగా, ఎరుపు రంగు కనిపించకుండా విభూతి ధరించడం వల్ల ఆయన తెల్లని వాడుగా కనిపిస్తూ ఉంటాడు.

నేనే మొదటిదాన్ని

తొలి మహిళా ప్రొఫెషనల్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా నన్ను గుర్తించటం నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వృత్తి ఎన్నో సవాళ్లతో కూడుకున్నది జీవజాతుల పై అమితమైన ప్రేమ గల వారు మాత్రమే ఇటు రాగలరు. శారీరకంగా మానసికంగా దృఢంగా ఉన్న వారే అడవిలో అడుగు పెట్టాలి అంటుంది రాధిక రామస్వామి. 17 సంవత్సరాల నుంచి ఆమె ఎన్నో క్రూర మృగాలు అద్భుతమైన పక్షుల ఫోటోలు తీశారు. తమిళనాడులోని తేని జిల్లా పశ్చిమ కనుమల దగ్గర […]