Sunday, 02 Aug, 2026

కేవలం వ్యాయామమే సాయం

సహజమైన పోషక విలువలు పోకుండా ఆహారంలో మార్పులు తెచ్చి పరిమాణాన్ని ఏమీ తగ్గించకుండా తిని వ్యాయామం యోగ తోనే  శారీరకంగా మానసికంగా ఫిట్ గా తయారయ్యాను అంటుంది స్మృతి ఇరాని. బుల్లితెరపై పేరు తెచ్చుకుని రాజకీయాల్లో అడుగుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన స్మృతి ఇరానీ 45 ఏళ్లకే బరువు బాగా పెరిగింది. ఇటీవల బరువు తగ్గి నాజూకుగా అయిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో చూసి అభిమానులు ప్రశంసలు కురిపిస్తూ ఒకవేళ ఆపరేషన్ల ద్వారా తగ్గారా అని […]

పారేయకండి పనికొస్తాయి

సౌందర్య ఉత్పత్తులు గడువు దాటితే చెత్తబుట్టలో పారేస్తూ ఉంటారు. కానీ వాటితో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఫుట్ మ్యాట్ లు మురికి పడితే గోరువెచ్చని నీటిలో గడువు దాటిన ఫేస్ వాష్ వేసి నానబెట్టి కాస్త బ్రష్ వేస్తే కొత్తవి లాగా మెరుస్తాయి. మగ్గులో నీళ్లు ఫేస్ వాష్ షాంపు కలిపి వాహనాలు తుడిస్తే మురికిపోయి మెరుస్తాయి. పెద్ద స్పూన్ నిండా ఉప్పు వంటసోడా ఫేస్ వాష్ కలిపి ఈ మిశ్రమం తో మురికిగా ఉన్న కిచెన్, బాత్ […]

స్త్రీలకు ప్రత్యేకం

నాటక రంగంలో స్త్రీల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు గాను మహాలక్ష్మి లేడీస్ డ్రామా గ్రూప్ ఏర్పాటు చేశారు జ్ఞానం బాలసుబ్రమణియన్  ఈ ఆల్ విమెన్ డ్రామా గ్రూపు నుంచి కాలక్షేప నాటకాలు రావు కనువిప్పు కలిగించే ఇతివృత్తాలతో నాటకాన్ని మలుస్తారు స్టేజీ ఎక్కేముందర ఒక నాటకం ముప్పై సార్లు రిహార్సల్స్ వేస్తారు. ఇది డిజిటల్ యుగం కాబట్టి ఈ నాటకం గ్రూప్ నుంచి ‘ఎందరో మహానుభావులు’ నాటకం తొలిసారిగా యూట్యూబ్ లో రిలీజ్ అయింది. ఈ నాటకాన్ని మూడు […]

దివ్యాంగులకు అండ

మస్కులర్ డిజార్డర్ వల్ల వీల్ చైర్ కు పరిమితమైన స్వర్ణలత గాయనిగా రచయితగా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలిగా మోటివేషనల్ స్పీకర్ గా గుర్తింపు పొందింది. ఆమె స్థాపించిన స్వర్ణ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పనిచేస్తోంది. ఆమె ఫౌండేషన్ తరఫున సారధి పేర తయారు చేసిన ఒక వాహనంలోకి దివ్యాంగులు తమ వీల్ చైర్ తో పాటు ఎంత దూరమైనా ఇబ్బంది లేకుండా ప్రయాణాలు చేయచ్చు. సోఫా, బెడ్, వేడి నీళ్లు, టాయిలెట్ […]

సోలార్‌ లజ్జా !

సోలార్ లజ్జా మెషిన్  ను కనిపెట్టిన  ముంబై కి చెందిన మధురిత గుప్తా ఆమె తమ్ముడు రూపన్‌ లకు ఎన్నో అవార్డులు వచ్చాయి. వాడి పారేసిన శానిటరీ ప్యాడ్స్ సోలార్ లజ్జా మెషిన్ కాల్చి బూడిద చేస్తుంది. ఇతర మెషిన్ లతో పోలిస్తే ఇది 25 శాతం తక్కువ శక్తి తో పనిచేస్తుంది.దీని ద్వారా పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. దీని ద్వారా వెలువడే బూడిద ను మొక్కలకు ఎరువుగా వేయవచ్చు.  2019లో ప్రారంభించిన ఈ మిషిన్ […]

ఈ ప్లెయిన్ నేటి ఫ్యాషన్

సాంప్రదాయ ఆభరణాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వడ్డానం ఇప్పుడు వెస్ట్రన్ డ్రెస్ ల పైన ధరిం చేందుకు వీలుగా ప్లెయిన్ గా వస్తుంది. పైగా సింపుల్ ప్లెయిన్ వడ్డాణాన్ని సందర్భానుసారంగా స్టయిలింగ్ చేసుకునే వీలుంటుంది మెడలో వేసుకునే హారానికి చెవులకు మ్యాచింగ్ ఆభరణాన్ని మ్యాచింగ్ గా సదా వడ్డానం అయినా అదే మాదిరి లాకెట్ ను సెట్ చేసుకోవచ్చు. బెల్ట్ మాదిరిగా ఉండే ఈ ప్లెయిన్ వడ్డానం బంగారం తోనే కాదు వెండి, వన్ గ్రామ్ గోల్డ్ […]

బయట తిండితో అనారోగ్యం

రోజూ బయట తిండి తింటే ఇబ్బందే అంటున్నారు ఎక్సపర్ట్స్. రోజు రెస్టారెంట్ భోజనం చేసేవారికి 49 శాతం రిస్క్ ఎక్కువ అంటున్నాయి అధ్యయనాలు అమెరికా లోని యూనివర్సిటీ ఆఫ్ లోనా చేసిన అధ్యయనం లో హోటల్ ఫుడ్ లో బ్యాలెన్స్ ఉండదని,రుచి కోసం రంగు కోసం కలిపే కొన్ని రకాల పదార్ధాలు అనారోగ్య హేతువులని తేలింది. సోడియం తో పాటు కొవ్వు ఎక్కువ గా ఉండే పదార్ధాలు శ్యాచు రేటేడ్ ఫ్యాట్స్ పెంచే వాటినే రెస్టారెంట్ లో […]

ఈ నూనె పోషక భరితం

వెంట్రుకల ఆరోగ్యం కోసం, పొడవుగా పెరిగేందుకు ఇంట్లోనే పోషక భరితమైన శిరోజామృతాన్ని తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. ఈ నూనె కోసం పావు కప్పు ఆముదం పావు కప్పు కొబ్బరి నూనె టేబుల్ స్పూన్, మెంతులు టేబుల్ స్పూన్, నల్ల జీలకర్ర టేబుల్ స్పూన్, రోజ్ మేరీ ఆయిల్ రెండు చుక్కలు పిప్పర్ మెంట్ ఆయిల్ రెండు చుక్కలు కావాలి ముందుగా నల్ల జీలకర్ర మెంతులు కొబ్బరి నూనెలో వేసి పదిహేను నిమిషాలు మరిగించాలి. ఆముదం, రోజ్ […]

ఎత్తు పెరుగుతారు

పిల్లలకు కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తే ఎత్తు పెరుగుతారు అంటున్నారు ఎక్సపర్ట్స్. ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేస్తే శరీరంలో ఉన్న ఎముకలు కండరాలపై ఒత్తిడి పెరిగే పిల్లలు పొడవు పెరిగేందుకు సాయిపడుతుంది. తాడాసనం వేయిస్తే కాళ్ళు చేతులు వెన్ను బలోపేతం అవుతాయి. ధనురాసనం వల్ల వెన్ను తో పాటు శరీరం మొత్తం బలం పుంజుకుంటోంది. ఈ రెండు ఆసనాలు పొడుగు ఎదిగేందుకు సాయపడతాయి. వ్యాయామంతో పాటు పోషకాహారం అందించాలి. పాలు, పాల ఉత్పత్తులు, కోడిగుడ్లు, చికెన్, సోయా […]

చీరెకట్టు లో సొగసు

దక్షిణ భారత మహిళలు వేడుకల్లో చీరలు కట్టే తీరులో ఎంతో వైవిధ్యం కనబరుస్తున్నారు. సాంప్రదాయ చీరెకట్టుకు ఆధునిక శైలిని జోడిస్తున్నారు ప్రింటెడ్ శారీని, లాంగ్ స్కర్ట్ తో జత చేస్తే పార్టీల్లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటారు పాంట్ శైలి శారీ అయితే కుచ్చిళ్ళను ప్యాంట్ కు జోడించి వడ్డానం లేదా లెదర్ బెల్ట్ పెడుతున్నారు. ఇంకో వినూత్నమైన శారీ డ్రేపింగ్ చీరె కుచ్చులు వెనక్కు పెట్టుకోవటం ఇంకా లెహంగా  శైలిలో చీరె కట్టించుకోవటం కూడా ఇవ్వాట్టి ఫ్యాషన్ […]

ఈ క్రీములతో జాగ్రత్త

చర్మం తెల్లబరుస్తాయని చెబుతూ మార్కెట్ లో విక్రయిస్తున్న ఎన్నో విదేశీ సౌందర్య ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన మెర్క్యురీ ఉన్నట్లు ఢిల్లీ శ్రీ రామ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధనలు వెల్లడించాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ రసాయనం వల్ల చర్మం అందంగా మారటం కన్నా జరిగే చేటే ఎక్కువ ఇది చర్మానికే కాక పలు రకాల అనారోగ్యాలకు కారణం అని తేల్చారు. ఇది నరాల వ్యవస్థ జీర్ణ వ్యవస్థను దెబ్బ తీయటం తో పాటు వ్యాధినిరోధక శక్తిని […]

క్షణం వృధా చేయను

పనిలేకుండా నిరుపయోగంగా గడపటం నాకు నచ్చదు నాకు వయసు ఒక నంబర్ మాత్రమే. పని చెయ్యాలనే సంకల్పం ఉంటే వయస్సు ఒక లెక్క కాదు అంటుంది యామినీ మజుందార్. బయోకాన్ ఫౌండర్ కిరణ్ మజుందార్ తల్లి 58 ఏళ్ళ వయసులో ఆమె జీన్స్ డ్రై క్లీనింగ్ సర్వీస్ వ్యాపారం ప్రారంభించారు. 1990లో ఈ లాండ్రీ బిజినెస్ కోసం విదేశాల నుంచి హై ఎండ్ ఎక్విప్ మెంట్ ను దిగుమతి చేసుకున్నారు ఇప్పుడామెకు ఎనభై ఏళ్ళు రోజుకు నాలుగు […]

అత్యంత ధనవంతురాలీ కుక్క

ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన కుక్క గుంథర్‌ Vl .ఈ కుక్క కు వాళ్ల తాతగారైన గుంథర్‌ III కి జర్మన్ దేశస్థురాలైన కౌంటిస్ కార్లోట్టా లైచెస్ స్టెయిన్ అన్నావిడ తాను చనిపోయే ముందు 431 కోట్ల విలువ చేసే తన ఆస్తిని ఆ కుక్క కు రాసి ఇచ్చింది. అట్లా తాత ఆస్తి వచ్చి ఇప్పుడు దాని ధర పెరిగి 3715 కోట్లు విలువ చేసే ఈ గుంథర్‌ ప్రపంచంలోనే డబ్బున్న కుక్క గా నిలిచింది.

మోగే చెప్పులు

బట్టలు, నగలు, బ్యాగ్ లు చెప్పులూ అన్ని మ్యాచింగ్సే ఉండాలంటారు అమ్మాయిలు. మరి అలాంటి చెప్పులు సాదాసీదాగా ఉంటే ఎట్లా అనుకొని ఫ్యాషన్ డిజైనర్లు ఘుంఘ్రా ఫుట్ వేర్ పేరుతో మువ్వల చెప్పుల్ని మార్కెట్ లోకి తెచ్చారు రకరకాల సైజుల్లో మువ్వనీ పొదిగిన ఈ చెప్పులు పార్టీ వేర్ శాండిల్స్ నుంచి ఫ్లాట్స్ వరకు మువ్వలు గలగల తో ఆకర్షిస్తున్నాయి. వెరైటీ కావాలనుకునేవారు వెంటనే కొనుక్కొనేంత అందంగా ఉన్నాయవి.

డికాషన్ తో చురుకుదనం

ఉదయం నిద్రలేవగానే కాఫీయో టీ యో గొంతులోకి జారి తేనే గాని ఉత్సాహం రాదు అనుకునేవాళ్ళు ఎంతోమంది. కానీ తాజా పరిశోధనలు ఉదయాన్నే పాలు పంచదార ఏవి కలపకుండా వట్టి డికాషన్ మాత్రమే తాగితే మెదడు చురుగ్గా ఉంటుందని గుర్తించారు. 70 దాటిన వాళ్లకి ఈ డికాక్షన్  చాలా మేలు చేస్తుందట. ఆ వయసులో సాధారణంగా కనిపించే మతిమరుపు ఉండదంటున్నారు పరిశోధకులు.

పర్యావరణ రక్షణ ధ్యేయం

పర్యావరణానికి సంబంధించిన అంశాలను నృత్య రూపకాలు గా మలచి ప్రదర్శనలు ఇస్తున్నారు సాహిని రాయ్ చౌదరి .కలకత్తా ప్రసిద్ధ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ వ్యవస్థాపకురాలు తండ్రి సంగీతకారుడు నాయనమ్మ బోకుల్ సేన్ గుప్తా సంగీతంలో దట్టి తాజాగా సాహిని రాయ్ చౌదరి నేచర్ అండ్ అజ్ పేరుతో కాప్ 26, గ్లాస్గో లో ఇచ్చిన ప్రదర్శన దేశవిదేశాల ప్రతినిధులను ఆకట్టుకొంది ఈ నాట్య ప్రదర్శనలో ఆమె కుమారుడు రిషి దాస్ గుప్తా గిటార్ ప్లే చేశారు. […]

విక్టోరియా అమెజోనిక

అమెజాన్ లో పెరిగే తామరాకుల పైన హాయిగా మనిషి విలువ నిలబడచ్చు వాటర్ లిల్లీ ల కుటుంబానికి చెందిన ఈ విక్టోరియా అమెజోనిక ఇక మూడు మీటర్ల వ్యాసం కలిగి 26 అడుగుల పొడవు వరకు పెరిగే కొమ్మతో ఉంటుంది. ఈ అద్భుతమైన తామరాకులు పువ్వులను క్వీన్ విక్టోరియా పేరిట పిలుస్తారు. ఈ తామర పువ్వులు కూడా మొదటి రాత్రి నాడు తెల్లగా రెండో రాత్రికి గులాబీ రంగులోకి మారిపోతాయి వికసించి.

బెస్ట్ టూరిజం విలేజ్

ప్రపంచంలోనే అరుదైన గౌరవం దక్కించుకొంది భూదాన్ పోచంపల్లి హైదరాబాదుకు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోచంపల్లి వస్త్ర నేత కు ముందు గాజుల,పూసల తయారీకి ప్రసిద్ధి. ఇరవై నంబర్ నూలుతో తేలియా రుమాళ్లు, ఇక్కత్ బ్రాండ్ పట్టు చీరెలు నేస్తూ 1970 నాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది పోచంపల్లి. తాజాగా ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చే బెస్ట్ టూరిజం విలేజ్ గా గౌరవం దక్కించుకున్నది. డిసెంబర్ 2వ తేదీన స్పెయిన్ రాజధాని […]

ఎంబ్రాయిడరీ గాజులు

చీరె రంగు కి సరిగ్గా మ్యాచ్ అయ్యే గాజులు బ్యాగ్ లు కోరుకుంటారు అమ్మాయిలు. శారీ మ్యాచింగ్ ఈ కరెక్ట్ గా సరిపోయేలా సిల్క్ దారపు గాజులు ట్రెండ్ వచ్చింది. ఇప్పుడా సిల్క్ గాజులు ఎంబ్రాయిడరీ తో కనిపిస్తున్నాయి. రంగు మాత్రమే కాదు బ్లౌజ్ పైన వేయించుకున్న వర్క్ మ్యాచ్ అయ్యేలా ఎంబ్రాయిడరీ గాజులు తయారు చేస్తున్నారు. క్లాత్ పైన ముందే పూసలు రాళ్లతో ఎంబ్రాయిడరీ చేసి దాన్ని గాజులకు అతికించి ఇస్తున్నారు. బ్లౌజ్ క్లాత్ ఎదురుగా […]

మేలు చేసే మునగాకు జ్యూస్

మునగాకును సూపర్ ఫుడ్ గా పిలుస్తున్నారు. కరోనా కాలంలో మునగాకు వినియోగం పెరిగింది కూడా రక్తహీనత రాకుండా కాపాడేందుకు, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలే కాకుండా ప్రోటీన్ కూడా మునగాకులో ఎక్కువే గ్రీన్ జ్యూస్ ల్లో  ములగాకు, గ్రీన్ ఆపిల్ జ్యూస్ చాలా శ్రేష్టం అంటున్నారు. ఒక అరకప్పు మునగాకు రెండు గ్రీన్ ఆపిల్ ముక్కలు కలిపి జ్యూస్ చేసుకోవచ్చు బ్రేక్ ఫాస్ట్ తో,లేదా భోజనంతో కలిపి ఈ రసం తాగటం మంచిది […]