Gagana
కెరీర్ కే ప్రాధాన్యం
30 కి పైగా భారతీయ భాషల్లో విడుదల చేసిన సుడల్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో వచ్చింది. అందులో నేను చేసిన లక్ష్మి పాత్ర నాకు విపరీతమైన ఆదరణ ఇచ్చింది అంటోంది నివేదితా సతీష్. గుంటూరు లో పుట్టి చెన్నై లో పెరిగిన నివేదిత కుటుంబం రేసింగ్ కార్ల బిజినెస్ లో ఉన్నారు. తమిళ తెరపై విజయవంతమైన చిత్రాలలో నటించిన నివేదితా సతీష్ వెబ్ సిరీస్ లోకి వచ్చింది. విభిన్నమైన పాత్రల్లో భిన్నమైన దర్శకులతో నటులతో […]
నేతన్నకు చేదోడు
చేనేత వస్త్రాల ప్రమోషన్ కోసం ఇంప్రెసా పేరుతో ఆన్ లైన్ లో చీరల అమ్మకాలు ప్రారంభించింది అంజలి. విప్రో లో చేసే సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి కాలికట్ లో ఒక దుకాణం, ఆన్ లైన్ స్టోర్ ని ప్రారంభించింది. ఆంధ్ర ప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలా పలు రాష్ట్రాల్లో నేత కారులను కలుపుకొని ఆన్ లైన్ లో ఆర్డర్ లు చేస్తోంది అంజలి. పారిస్ లోని కాప్ జెమినీ 2017 లో ఇంప్రెసా ను […]
అత్యంత సాహసి మోనికా
పాట్నా నుంచి ఢిల్లీ బయలుదేరిన బోయింగ్ 737 విమానంలో ఇంజన్ లో మంటలు వచ్చాయి . పైలెట్ మోనికా ఖన్నా ప్రతిభతో నిమిషాల్లో తిరిగి ల్యాండింగ్ చేసి 185 మంది ప్రాణాలను కాపాడింది . మోనికా ఖన్నా ది పంజాబ్ . ఎం బి ఏ చదువుకొంది . పైలెట్ గా శిక్షణలో ఉన్నపుడే ధైర్యసాహసాలు ఉన్న యువతి గా పేరుతెచ్చుకొన్నది . ఆదివారం నాడు పాట్నా నుంచి బయలుదేరిన విమానాన్ని పక్షి ఢీకొనటంతో మంటలు వచ్చాయి […]
నా పైన నాకు ఎంతో ప్రేమ
ఎం.బి.ఎ చేస్తూ పార్ట్ టైం జాబ్ చేసే దాన్ని. అక్కడ ఖాన్ కళ్ళు నా పైన పడ్డాయి. నేను అతనికి లొంగి రాలేదు. దానితో నా పై యాసిడ్ పోయించాడు. నా కన్ను పోయింది. ఇంకో కన్ను దృష్టి దెబ్బతింది నా మొహానికి ఇరవై కి పైన ఆపరేషన్లు జరిగాయి. అయినా నేను కోల్పోలేదు. ఎంతో మానసిక క్షోభ తర్వాత ఎందరో ఆసిడ్ బాధితులతో కలిసి పనిచేశాక బ్రేవ్ సోల్ ఫౌండేషన్ పేరుతో ఒక ఎన్జీవో ప్రారంభించాను. […]
పఠనం దివ్యౌషధం
ఈ పుస్తకం చేతిలో ఉంటే ప్రశాంతత ఉన్నట్లే ఇప్పుడు నేను విలియం కాల్ డింపుల్ రాసిన వైట్ మొఘల్స్ చదువుతున్నారు ప్రపంచ కప్ విజేత గా భారత్ ను మార్చటంలో ఆయన పాత్ర కీలకం. జట్టు ఎలా ఓకే పట్టుతో ముందుకు వెళ్లాలో సానుకూల దృక్పథం తో ఉండాలో నూరిపోశారు ఆయన మనోబలం దివ్యౌషధం అని పుస్తకం ద్వారా నే తెలుసుకున్నాను అంటుంది మిథాలి రాజ్. క్రికెట్ క్రేజ్ లోకి వెళ్ళ వలసిన సమయం వచ్చే వరకు […]
‘అలా కుదిరింది మరి’
సెంటిమెంట్లు తప్పే కానీ అలా కుదిరింది మరి. ఒక సారి ఐపీఎల్ మ్యాచ్ కు వెళ్ళినప్పుడు మరిచిపోయి రెండు వాచ్ లు పెట్టు పోయాను మా జట్టు గెలిచింది. అలాగే కాలు మీద కాలేసుకుని కూర్చుని ఉన్నాను అప్పుడు మా టీమ్ కే గెలుపు ఇక ప్రతి మ్యాచ్ కు రెండు వాచ్ లు కాలు మీద కాలు సెంటి మెంటయి కూర్చున్నాయి అంటుంది శిల్పా శెట్టి. ఆమె నటి మాత్రమే కాదు, ఐపీఎల్ క్రికెట్ టీమ్ […]
నేనేం ఫీలవను
నా సీరియల్స్ అన్ని సూపర్ హిట్ అందులో కె అనే మాట ఉండటం వల్లనే. అందుకే సీరియల్ టైటిల్ లో కె అక్షరం ఉండేలా చూసుకుంటాను అంటుంది ఏక్తాకపూర్. కుమ్ కుమ్ భాగ్య, కసౌటీ జిందగీ కె, కస్తూరి, ఏవైనా సరే కె వర్డ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై సక్సెస్ అంటుంది. చాలామంది గాఢ నమ్మకం అంటారు కానీ నాకైతే నమ్మకం ఎవరు ఏమనుకున్నా నేనేం ఫీలవ్వను అంటుంది ఏక్తాకపూర్.
సాదియా కు స్వర్ణం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో మంగళగిరి కి చెందిన పవర్ లిఫ్టర్ సాదియా అల్మాస్ తన సత్తా చూపించింది. 57 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. ఇప్పటికే టర్కీ లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో స్వర్ణ పతకం సాధించిన సాథియా దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసింది .
మిసెస్ ఇండియా సర్గమ్
మిసెస్ ఇండియా వరల్డ్ కిరీటం గెలుచుకుంది సర్గమ్ ఆమె భర్త భారత నౌకాదళ అధికారి వృత్తి రీత్యా విశాఖపట్నంలో ఉంటున్నారు. ఇంగ్లీష్ లిటరేచర్ చదువుకున్న సర్గమ్ టీచర్ గా పని చేశారు. క్యాన్సర్ బాధ్యత పిల్లల కోసం సేవా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. అందాల పోటీల్లో పాల్గొనేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఎంపికైన 52 మందిని వెనక్కి నెట్టి కిరీటం సాధించారామె. ఈ గెలుపుతో వచ్చే ఏడాది అమెరికాలో జరుగుతున్న మిసెస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించారు […]
టట్టింగ్ విజేత నిధి
అంతర్జాతీయ టట్టింగ్ కాంపిటీషన్ లో విజేతగా నిలిచింది నిధి అచ్చా. ముంబైలోని కుర్లా కు చెందిన డాన్సర్ నిధి అచ్చా సరదాగా చేసిన ఈ డాన్స్ ఆమెను అంతర్జాతీయ పోటీలకు తీసుకుపోయింది. టట్టింగ్ అనేది ఒక స్ట్రీట్ డాన్స్.1960-70 ల్లో కాలిఫోర్నియా లో వాడుకలో ఉంది. జామెంట్రీ కల్ ఆకారంలో 90 డిగ్రీల కోణంలో చేతులు కాళ్ళను కదిలించటానికి ఈ డాన్స్ ప్రత్యేకత అమెరికా, చైనా రష్యా బ్రిటన్ దక్షిణాసియా దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఇండియా […]
ప్రయోగాలు వద్దు
తెరపైన తారలను చూసి అలా నాజూగ్గా అయిపోవాలని అనవసర ప్రయోగాలు చేయొద్దు బాడీ సైజ్ రూపం మార్చాలంటే ఎక్సపర్ట్స్ పర్యవేక్షణలో ఎన్నో వర్క్ వుట్స్ చేయాలి. సహజంగా ఉన్నదే అందం సినిమా వాళ్ళ అందం మేకప్ మహిమ మాత్రమే అంటోంది యామీ గౌతమి. బ్యూటీ కేర్ ప్రకటనల్లో ఎక్కువగా కనిపించే ఆమె సహజమైన గాలి, వెలుతురు వాతావరణంలోనే అందం ఆనందం ఉన్నాయంటుంది. మహిళలు చక్కగా చదువుకుంటేనే భవిష్యత్ అంటోంది. అచీవ్మెంట్, యాంబిషన్, సక్సెస్ అన్న పదాలు ప్రతి […]
చినుకుల్లో పూవులే మ్యాచ్
చినుకులు రాలే వర్షాకాలంలో పూవ్వుల ప్రింట్స్ ఉన్నా దోస్తులు బెస్ట్ ఎంపిక అంటుంది ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా. ఈ రోజుల్లో ప్రకాశవంతమైన నారింజ, ఎరుపు, గులాబీ, నీలం రంగుల్లో లైక్రా లేదా పాలిస్టర్ వంటి ఫాబ్రిక్ లు ధరిస్తే బావుంటాయి. అవి ముడతలు పడకుండా సులభంగా పొడిగా అయిపోతాయి. పలాజోలు బాటమ్ గా విశ్రాంతిగా ఉంటాయి. ప్రింటెడ్ ఆర్గాంజాలు సిల్క్ డ్రెస్ లు బాగుంటాయి. ఓవర్ కోట్స్, జంప్ సూట్స్ ఏవైనా సరే చిన్న ప్రింట్ […]
ఐ పి ఎస్ నా ధ్యేయం
థాయ్ లాండ్ లో జరిగిన 14 వ ఏషియన్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనడం నాలో ఆత్మవిశ్వసం పెంచింది.మేము గెలిచింది ఒక మ్యాచ్ లో అయినా వివిధ జట్ల క్రీడాకారిణుల ఆటను దగ్గర నుంచి చూడటం నాకు ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇచ్చింది. జాతీయ స్థాయి సీనియర్స్ జట్టుకు ఎంపిక కావటం,ఐ పి ఎస్ సాధించటం నా ఆశయం అంటోంది శాంతకుమారి. ఉమ్మడి పాలమూరు వనపర్తి జిల్లా చిట్యాల మండలం తూర్పు తాండ కు చెందిన క్రీడా […]
ఎం ఎల్ సి మున్నీ రజక్
రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ తరఫున ఎం ఎల్ సి గా 75 మంది సభ్యుల విధాన పరిషత్ లో కాలు పెట్టబోతుంది. మున్నీ రజక్. బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి జీవించే మున్నీ రజక్ లాలూ యాదవ్ మెప్పుదల పొందింది.గత పదేళ్లుగా మున్నీ ఆర్జేడీ కార్యకర్తగా ఉంది చక్కగా పాటలు పాడగలదు పార్టీ సభల్లో పడుతుంది గట్టిగా మాట్లాడగలదు. ఎం ఎల్ సి ఎన్నికల్లో ఆర్జేడీ తరఫున పోటీ లేకుండానే గెలిచింది మున్నీ రజక్.
పిసీఐ చైర్మన్ గా రంజనాదేశాయ్
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పిసీఐ) చైర్‌పర్సన్‌గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ (72) ని ఎంపిక చేశారు. ఈ మేరకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా,సిపిఐ సభ్యుడు ప్రకాష్ తో కూడిన కమిటీ సమావేశంలో ఆమోదం తెలిపారు. జస్టిన్ రంజనాదేశాయ్ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజన కమిషన్ కు నేతృత్వం వహించారు.
అందాల పోటీల్లో శివాని
ఎవరిపై వారికి నమ్మకం ఉండాలి. ఎంతమంది నీ అభిప్రాయాన్ని మార్చాలని చుసినా మనసు చెప్పిందే విను నీకలాల్ని నువు నెరవేర్చుకో అంటుంది శివాని. హీరో రాజశేఖర్,జీవిత ల పెద్ద కూతురు. శివాని సినిమాల్లో నటించి,ఇప్పుడు మోడలింగ్ పైన దృష్టి పెట్టింది. ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతోంది ఫెమీనా ఇండియా అందాల పోటీల్లో తమిళనాడు తరఫున ఎంపికైంది. జులై లో జరగనున్న అందాల పోటీలకు దరఖాస్తులో వివిధ రాష్ట్రాలను ఎంచుకొనే అవకాశం ఉంటే శివాని ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,తెలంగాణ లను ఎంచుకొంది. […]
క్రికెట్ తోనే ఫ్యూచర్ కూడా
వన్డే ప్రపంచ కప్ లో నిరాశ ఎదురైంది. ఇంకో ప్రపంచ కప్ ఆడే పరిస్థితి లేదు అలాంటప్పుడు క్రికెట్ లో కొనసాగటం లో అర్థం లేదు. అందుకే వీడ్కోలు పలికాను అంటోంది మిథాలీ రాజ్.రెండు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్ లో ఎన్నో రికార్డ్ లు అందుకొన్న మిథాలీ ఇటీవలే ఆటకు వీడ్కోలు పలికారు. భవిష్యత్ లో కూడా కెరీర్ క్రికెట్ మాత్రమే. కోచ్ గా ఉండచ్చు లేదా వ్యాఖ్యాత గానో నన్ను చూడచ్చు. దేశం కోసం […]
మహిళలకోసం టాయ్ లెస్
ఏ పని చేసిన సామాజిక బాధ్యత కోణం నుంచే ఆలోచిస్తాను నేను మొదలుపెట్టిన పూర్ లివింగ్ పేపర్ పెన్ కాన్సెప్ట్ మొదలైనవి, దేశవిదేశాల్లో ఆదరణ పొందాయి. ఇప్పుడు ప్రారంభించిన ‘టాయ్ లెస్’ స్టార్టప్ కేరళ మొత్తం వ్యాప్తి చేయాలన్నదే నా లక్ష్యం అంటుంది లక్ష్మీమీనన్. కేరళ కు చెందిన లక్ష్మి మీనన్ ప్రయాణాలు చేసే మహిళలకు శుభ్రమైన వాష్ రూమ్స్ గురించి సమాచారం సదుపాయం కలిగించేందుకు టాయ్ లెస్ స్టార్టప్ ని ప్రారంభించారు. మహిళలు కాసేపు ఫ్రెషప్ […]
ఇది మహాదానం
అన్నదానం మాత్రమే కాదు రక్త దానం కూడా మహాదానం అంటుంది ఆశ సూర్యనారాయణ్ బెంగళూరుకు చెందిన ఆశా ను గోల్డెన్ బ్లడ్ డోనర్ అంటుంటారు అభిమానులు. 24 సంవత్సరాల వయసు నుంచి ఆమె నిరంతరం రక్తదానం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడామె వయస్సు 55 సంవత్సరాలు రక్తదానం తో మొదలైన ఆమె సమాజ సేవ అక్కడితో ఆగిపోలేదు కోవిడ్ సమయంలో అన్నదానం అనాధ శవాలకు దహన సంస్కారాలు చేయటం. వ్యాక్సినేషన్ డ్రైవ్ ఆమె చేసిన మంచి పనుల్లో కొన్ని.
ఆకలి తీర్చే ఫ్రిజ్
ది పబ్లిక్ ఫౌండేషన్ పేరుతో ఆహారం తో పాటు దుస్తులు, స్టేషనరీ, నిత్యావసరాలు, బొమ్మలు పేదలకు పంచి పెడుతోంది చెన్నై కు చెందిన ఫాతిమా జాస్మిన్. ఈమె దంత వైద్యురాలు పేదల కోసం నిత్యం భోజనం పెట్టాలి అనుకుందామె. అందుకే ఫ్రిజ్ లను ఏర్పాటు చేసి రోజంతా అందులో ఉండేలా ఆహారపదార్థాలు పెడుతుంది. చెన్నై లోని 15 చోట్ల ఫ్రిజ్ లు పేదలకు అందుబాటులో ఉన్నాయి. వాలంటీర్ల సాయంతో హోటళ్లలో ఆహారం కొని, పండ్లు, మంచినీళ్లు, బిస్కెట్లు […]
