Tuesday, 28 Jul, 2026

ఇంకా ఎక్కువ శ్రమ అవసరం

టెక్నాలజీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను మిట్ గుర్తిస్తోంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో మహిళలు తమను తాము నిరూపించుకొనేందుకు నాయకత్వం స్థాయికి చేరుకునేందుకు పురుషులు కన్నా ఎక్కువ శ్రమించాలి అంటుంది సుచరిత మన్యాల తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్ నగర్ నుంచి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిట్ లో సీట్ సంపాదించింది. అందులో సిస్టం డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ ను ఇటీవలే పూర్తి చేసింది సిస్టం డిజైన్ అండ్ […]

అలాటి ట్యాగ్స్ వద్దు

నన్ను లేడి పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయటం నాకు అసలు నచ్చలేదు పేరుకు ముందు ఇలాంటి ట్యాగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఇటువంటి వాటికి నేను కనెక్ట్ కాను. ఈ ట్యాగ్స్ వల్ల ఎంతో ఒత్తిడికి గురవుతున్నాను అంటుంది సాయి పల్లవి. ఇప్పటివరకు నేను పోషించిన పాత్రల వల్లే ప్రేక్షకులు ఆరాధిస్తున్నారు. వారి ప్రేమను దృష్టిలో ఉంచుకొని మంచి పాత్రలలో నటిస్తా  చాలా సాధారణంగా ఉండేందుకే ఇష్టపడతాను. అంటోంది సాయి పల్లవి.

జ్ఞాపకాన్ని భద్రంగా

మనకు ఎంతో ఇష్టమైన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం వారు వాడిన వస్తువులు దుస్తులు జాగ్రత్తగా భద్ర పరచుకుంటూ ఉంటారు. దీన్ని ద్రుష్టి లో పెట్టుకొని డెహ్రాడూన్‌ లో పుర్కాల్‌ స్త్రీ శక్తి అనే సమితిని ఏర్పాటు చేసింది నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే ఈ సంస్థలు. గత పదిహేను సంవత్సరాలుగా డెహ్రాడూన్ లోని నలభై గ్రామాల్లోని దాదాపు 200 మంది మహిళల మహిళలు ఈ సంస్థలో బొంతలు కుడతారు. ఈ మధ్యకాలంలో ముంబైకి చెందిన […]

వత్తిడికి ఇదే వైద్యం

కిమ్స్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ గా పని చేస్తాను. చిన్నతనం నుంచే సాంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకొన్న. డాక్టర్ ఉమా రామారావు మా గురువుగారు. కూచిపూడిలో డిప్లమా చేసి వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. దేశ విదేశాల్లో మూడు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చా. వైద్య వృత్తిలో ఉండే వత్తిడికి నా నృత్యం ద్వారా నేను అధిగమిస్తాను అంటారు డాక్టర్ జ్వాలా శ్రీకళ. వత్తిడి తో కూడిన వృత్తి నిపుణులు,డాన్స్ సంగీతం,పెయింటింగ్,ఫొటోగ్రఫీ ఇలా ఇలా ఏదో […]

తక్కువ బడ్జెట్ తో అలంకరణ

అతి తక్కువ బడ్జెట్ తో మోడ్రన్ లుక్ వచ్చేలా ఇల్లు ఆఫీసు ఎలా అలంకరించుకోవాలో చక్కని సలహాలు ఇస్తుంది నిహేరా సోనావన్ వృత్తి రీత్యా ఆమె ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ లో జాగ్రత్తలు ఎలాంటి మెటీరియల్ ఎంచుకోవాలి ఏ రంగులు ఎలాటి వాటికి బావుంటాయి. ఎక్కువ కాలం మన్నిక గా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వంటి ప్రతి చిన్న అంశాన్ని వివరించే లా ఉంటాయి. నిహేరా సోనావన్ వీడియోలు నాలుగు లక్షల మందికి పైగా అనుసరించే […]

పాత చీరెలకు గొప్ప డిమాండ్

ఖరీదైన చీరెలు కట్టాలనుకున్న వారి కళను నిజం చేశాం. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల వారికి చీరెలు సరఫరా చేశాం అంటున్నారు ‘ఎం ఓ ఎస్ ప్రీ లవ్డ్’ వ్యవస్థాపకులు సుస్మితా మిశ్ర ఆమె చెల్లెలు సునీత. 11 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ ఆన్ లైన్ వేదిక పైన ఎవరైనా ఒకసారి ఉపయోగించిన చీరలను అమ్మవచ్చు కొనుక్కోవచ్చు. అంటే వేడుకల కోసం కొనుక్కొని తర్వాత ఎక్కువ సార్లు ఉపయోగించలేని సరికొత్త పాత చీరెల ఆన్ లైన్ […]

ఇదే అసలైన చదువు

ఏ దారి లేదు అనుకున్నప్పుడు ఈ మిల్లు దారి చూపింది. మా చదువు కొనసాగేందుకు సాయం చేసింది మా అక్క చెల్లెళ్ళం చదువుకున్నాం అంటుంది నివేదా.ఎం. తమిళనాడులోని కోయంబత్తూరు లో కే పి ఆర్ మిల్స్ లో పనిచేస్తున్నారు అక్క చెల్లెలు ముగ్గురు. యాజమాన్యానికి విద్యాసంస్థలు ఉన్నాయి తన సంస్థలో పనిచేసే యువతులకు కళాశాలలో చదువుకునే అవకాశం కల్పించారు. ఆ వస్త్రాల మిల్లు లో ఆపరేటర్ గా పని చేస్తూ రాత్రివేళ చదువుకున్నారు. తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ […]

తోలి హెలికాప్టర్‌ పైలట్‌

అమ్మాయిలకు అదంతా సులువుకాదు అని కొట్టిపడేస్తారు కానీ హెలికాప్టర్‌ పైలట్‌ అవ్వటం నా జీవిత కాంక్ష. నా పట్టుదల చూసి అమ్మ నాన్న వప్పుకొన్నారు. 2016 లో అమెరికా లోని హవాయిలోని మానలోవా హెలికాప్టర్‌ అకాడమీలోచేరాను. నేను చేరిన సంస్థనే నాకు ఉద్యోగం ఇచ్చింది అంటోంది వైజాగ్ అమ్మాయి క్రితి గరుడ. దేశం నుంచి తొలి మహిళా సివిలియన్‌ హెలికాప్టర్‌ పైలట్‌. విమానాల్లో లాగా దీనిలో ఆటో పైలట్ అవకాశం ఉండదు. ప్రతి సెకను దీక్ష తో […]

చీరెల బ్యాంక్

2016 లో ఆస్థాజనవికాస్‌ పేరుతో శారీ బ్యాంక్ ఏర్పాటు చేసింది ఔరంగాబాద్ కు చెందిన డాక్టర్ ఆర్తి శ్యామల్ జోషి. ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా పని చేసే ఆర్తి తన ఇంట్లో పోగుపడిన అనేక పాత చీరెలను ఏం చేయాలో అని ఆలోచించింది. ఇవి నిరుపేద మహిళలకు ఉపయోగపడతాయి అని భావించి తన దగ్గర ఉన్న చీరలను పంచడం ప్రారంభించింది. వాళ్ళు చెప్పిన కృతజ్ఞతలే స్పూర్తి సారీ బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు 25 వేల చీరెలను […]

సామాజిక సేవలో పాలక్

పాలక్ ముచ్చల్ అద్భుతమైన గాయని హిందీ లోనే కాదు ఎన్నో ప్రాంతీయ భాషల్లో పాటలు పాడింది పాలక్. గజల్స్,భజన్స్ ఆలాపనలు గీత రచన తో, ఆమె ఎంతో పాపులర్, గుండెకు సంబంధించిన రుగ్మతతో బాధపడేవారు చిన్న పిల్లల కోసం దిల్ సే దిల్ తక్ పేరుతో దేశ విదేశాల్లో ఎన్నో చారిటీ షోలు చేసింది పాలక్ ముచ్చల్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా ఎందరో పేద పిల్లలను ఆదుకున్నారు.సామజిక సేవలో ఆమె కృషికి గాను గిన్నిస్ బుక్ ఆఫ్ […]

దట్ గర్ల్ విత్ ఎ బ్రోకెన్ నెక్

ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ఎడెల్ వీస్ సి ఈ ఓ గా ఉన్నారు రాధికా గుప్తా. పుట్టుకతోనే కాస్త మెడ వంకర తో ఉన్న రాధిక ఎన్నో అవమానాలకు గురయ్యారు. దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన సి ఈ ఓ గా అరుదైన గుర్తింపు సాధించారు. వార్టన్ బిజినెస్ స్కూల్లో కంప్యూటర్ సైన్స్ ఎకనామిక్స్ లో డ్యూయల్ డిగ్రీ చేశారు రాధిక. సొంతంగా ఫోర్ ఫ్రంట్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ పనితీరు […]

మా తెగలో నేనే మొదట

బడగా తెగ కు చెందిన ఆర్.మీరా నుంచి తొలి నౌకాదళ అధికారిగా గుర్తింపు తెచ్చుకోంది.  మా బడగా తెగ లో ఇంత వరకు ఒక్క ఎయిర్ ఫోర్స్ అధికారి ఉన్నారు. నేవీలో మొదటి మహిళా అధికారిని నేనే. నేను ప్రస్తుతం సబ్‌-లెఫ్టినెంట్‌ గా ఉన్నారు. తర్వాత లెఫ్టినెంట్‌ కెప్టెన్ ప్రమోషన్లు వస్తాయి. యుద్ధ నౌకలకు అమర్చిన ఆయుధాలు ఆపరేట్ చేయటం,నాణ్యత ధృవీకరణ పరిశీలించే బాధ్యతలను ప్రస్తుతం నేను నిర్వహిస్తున్నాను. నీలగిరి జిల్లా అచనకల్‌ నేను పుట్టిన ప్రాంతం. […]

హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్

25 దేశాలకు చెందిన 82 మంది మహిళలు ఒకేసారి ఎత్తైన బ్రీతోర్న్ పర్వతాన్ని ఎక్కి కొత్త అధ్యయనం సృష్టించారు. ఈ లాంగెస్ట్ ఉమెన్ రోప్ టీమ్ లో ప్రపంచంలో నలుమూలల నుంచి మహిళలు పాల్గొన్నారు. మన దేశం నుంచి అంచల్ ఠాకూర్, షిబానీ ఘరత్, ఛార్మి దేధియా లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సాహసిక పర్వతారోహణలో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు స్విట్జర్లాండ్ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఉమెన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

సలహాదారు ఆరతి

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అంశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కు సలహాదారుగా ఆరతి. దిల్లీలో పుట్టిన ఆరతి 1993లో బిల్‌క్లింటన్‌ అధ్యక్షుడిగా ఉండగా ‘నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్టాండర్డ్స్‌ అండ్‌ టెక్నాలజీ’ హెడ్‌గా బాధ్యతలు తీసుకొన్నారు. తర్వాత డీఏఆర్‌పీఏ కు నాయకత్వ బాధ్యతలు వహించారు.‘క్యాన్సర్‌ మూన్‌షాట్‌’ పేరుతో క్యాన్సర్‌ పరిశోధన, చికిత్స కోసం జో బైడెన్‌ తెచ్చిన కార్యక్రమంలోనూ ఆరతి పనిచేశారు. ‘ప్రతిభావంతురాలైన ఇంజినీర్‌, భౌతికశాస్త్రవేత్త. శక్తిమంతమైన ఆవిష్కరణలలో అమెరికాను ముందుంచే వ్యక్తి అని ఆరతిని […]

రక్షణ విభాగంలో సుమన

బెంగాలీ మూలాలున్న సుమన గుహ బైడెన్ కు స్పెషల్ అసిస్టెంట్ గా దక్షిణాసియా వ్యవహారాల సీనియర్ డైరెక్టర్ గా నియమించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో బైడెన్ కమల హ్యారిస్ లా బృందానికి దక్షిణాసియా వ్యవహారాలపై ఏర్పడిన కమిటీ సహా చైర్మన్ సుమన. అంతకు ముందు విదేశీ విభాగం లో అధికారికగా, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాల కు సంబంధించిన ఆఫీసర్ ఆఫ్ ది స్పెషల్ రిప్రజెంటేటివ్ కు సీనియర్ సలహాదారుగా పనిచేశారు ప్రస్తుతం ఈమె అమెరికా నేషనల్ సెక్యూరిటీ […]

సలహాదారు నీరా టాండన్

51 సంవత్సరాలు లేదా నీరా టాండన్ డెమోక్రాటిక్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉంది. హిల్లరీ క్లింటన్ కు అతి సన్నిహితురాలు. ఒబామా ఆరోగ్య బీమా పథకం రూపకర్తల్లో నీరా ఒకరు.బైడెన్ అధ్యక్షుడు అయ్యాక నీరా సీనియర్ సలహాదారుగా స్టాఫ్ సెక్యూరిటీ గా నియమించారు. ఈమె తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికా వెళ్లారు నీరా టాండన్ ఇక్కడే పుట్టారు ఇంజనీరింగ్ చదివారు తర్వాత లా చేశారు.

‘వయసు కేవలం సంఖ్య’

53 ఏళ్ల వయసులో మహారాష్ట్రకు చెందిన కల్పనా జంభలే పదో తరగతి ఫస్ట్ క్లాస్ లో పాసై ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు చిన్న వయసులో కుటుంబ పరిస్థితుల మూలంగా చదువు లేకపోయినా కల్పనా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త స్కీమ్ తో ఉత్సాహం తెచ్చుకుంది. పదో తరగతి పూర్తి చేయని వాళ్ళు ఆన్ లైన్ క్లాసుల్లో శిక్షణ తీసుకుని పరీక్ష రాయవచ్చు. స్టడీ మెటీరియల్ ప్రభుత్వం ఇస్తుంది. ఈ స్కీమ్ ప్రకటన రాగానే ఎక్కడలేని ఆనందం […]

న్యాయపీఠంపై వనితా గుప్తా

తమ ప్రతిభ సామర్థ్యాలతో అగ్రరాజ్యంలో అత్యున్నత హోదాల్లో ఉన్నారు భారతీయ మూలాలు ఉన్న అనేక మంది స్త్రీలు. వారిలో వనిత గుప్తా ఒకరు ఈమె అసోసియేట్ అటార్నీ జర్నల్ అమెరికా న్యాయ వ్యవస్థలో ఇది మూడో అత్యున్నత స్థానం.ఈ స్థానానికి ఎంపికైన శ్వేతా జాతీయేతరుల్లో తొలి మహిళ ప్రజా హక్కుల న్యాయవాదిగా వనితకు అమెరికాలో ప్రత్యేక గౌరవం.వలస కుటుంబాలు, నల్లజాతీయుల తరపున అనేక కేసుల్లో గెలిచారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజా హక్కుల విభాగానికి అసిస్టెంట్ అటార్నీ […]

కష్టమైన ప్రయాణం ఇది

మేజర్ సినిమాకు కాస్ట్యూమర్ గా చేయటం ఒక ప్రత్యేకమైన అనుభవం అంటోంది రేఖ బొగ్గరపు. హీరో పాత్ర కోసం ఏడు ఎనిమిది రకాల యూనిఫామ్ లు తయారు చేశాను. ఎన్డీఏ, ఆర్మీ, ఎన్‌ఎస్‌జీ.. వీటికి వేర్వేరు ర్యాగ్‌లూ, బ్యాడ్జీలూ ఉంటాయి. నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ ఇంకా పోలీసులూ ఉంటారు మొత్తంగా యూనిఫామ్స్ పైన పెద్ద పరిశోధన చేశాను సినిమాకు ఆర్మీ క్లియరెన్స్ కోసం చూపించినప్పుడు యూనిఫామ్ విషయంలో ఒక్క మార్పు కూడా చెప్పలేదు. ఫ్యాషన్ పైన ఇష్టంతో ఈ […]

రెండు స్వర్ణాలు గెలుచుకున్న బామ్మ

హరియాణాకు చెందిన 105 సంవత్సరాల రాంబాయి రెండు వందల మీటర్ల పరుగు పందేన్ని ఒక నిమిషం 52.17 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది హరియాణాలోని చరికదాద్రీ జిల్లా కద్మా గ్రామంలో 1917లో పుట్టిన రాంబాయి గత సంవత్సరం లోనే పరుగులు సాధన మొదలు పెట్టింది. వారణాసి లో తొలి పరుగు పందెంలో పాల్గొన్నది. కర్ణాటక మహారాష్ట్ర కేరళ లో జరిగే పోటీల్లో పాల్గొని డజను పైగా పతకాలను గెలుచుకుంది. జూన్ 15 న అథ్లెటిక్స్‌ఫెడరేషన్‌ […]