Tuesday, 28 Jul, 2026

మహిళా శక్తి ఎంతో అవసరం

నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీ ఆర్ ఎఫ్) లో మహిళల సంఖ్య పెంచాలన్నది లక్ష్యం గా చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర సర్వీస్ లలోని రక్షణ రిజర్వ్ ఫోర్స్ ల్లోని మహిళలను వీటిల్లోకి చేరమని గత సంవత్సరం పిలుపు ఇచ్చింది. అమర్నాథ్ యాత్రికులు వరదల్లో చిక్కుకున్న సమయంలో, అస్సాం వరదల్లో ఈ మహిళా బృందాలు సేవలు అందించాయి. అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా కాన్పు చేయడం ఆపద లో వైద్య సేవలు అందించడం కూడా వీరి విధుల్లో […]

అత్యుత్తమ క్రీడాకారులు

భారత్ నుంచి మరింత ఎక్కువ మంది చెస్ చాంపియన్ లు రావాలని కోరుకుంటున్నా. చెస్ లో ఆడపిల్లలకు నేను ఇచ్చే స్ఫూర్తి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నా అంటారు హంగేరీ కి చెందిన జుడిత పోల్గర్. చదరంగం చరిత్రలో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఈమెను గుర్తించి చెబుతారు. 15 ఏళ్లకే ఇంటర్నేషనల్ గ్రాండ్ మాస్టర్ గా 26 సంవత్సరాల పాటు మహిళల ప్రపంచ నెంబర్ వన్ గా ఆమె క్రీడా స్ఫూర్తి అనితర సాధ్యం విశ్వనాథన్ ఆనంద్, మాగ్నస్ కార్ల్ […]

సరికొత్త ట్రెండ్

మురికిగా కనిపించే ప్లాస్టిక్ వ్యర్థాలతో అందమైన బ్యాగ్ లు యాక్సెసరీస్ తయారు చేయించింది ఢిల్లీకి చెందిన కనిక ఆహుజా. కర్నాటక లో ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ చేసిన కనిక ‘లిఫాఫ’ బ్రాండ్‌ ఐడియాతో, పేదలు, అనాధలకు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేయటం నేర్పించింది. ఈ హ్యాండ్ మేడ్ రీసైకిల్ ప్లాస్టిక్ పని తో వాళ్లు అద్భుతమైన బ్యాగ్ లు యాక్సెసరీస్ తయారుచేస్తే లాక్మే ఫ్యాషన్ వీక్ ఈ ఉత్పత్తులు ప్రదర్శించుకునే అవకాశం ఇచ్చింది. దీనితో అమెరికా, యూరప్ […]

ఉగ్రవాదంపై ఉక్కుపాదం

12 మంది మహిళ కమాండో లతో ఉత్తరప్రదేశ్ ఆల్ ఉమెన్ టీమ్ రంగంలోకి దిగింది. ఈ బృందానికి స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్ అని పేరు పెట్టారు. అంటే స్పాట్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఈ స్పాట్ ను తీర్చిదిద్దారు. ఈ 12 మంది కొరియన్ కోచ్ ల ఆధ్వర్యంలో వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నారు. ఈ టీమ్ లో అమ్మాయిలు అందరూ అవివాహితులే. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు గాను ఈ శిక్షణ తీసుకున్న […]

కళకు ప్రోత్సాహం

ఢిల్లీ కి చెందిన ప్రసిద్ధ ఆర్ట్ కలక్టర్ శాలిని పస్సి (Shalini passi ) యువ కళాకారులను ప్రోత్సహించటం లో ముందుంటారు సంపన్న వర్గాలకే అందుబాటులో ఉన్న ఆర్ట్ వరల్డ్ ను ఇప్పుడు మారుమూల గ్రామాల్లోకి తీసికుపోయింది శాలిని. భోజ్ సలహా సంఘం సభ్యురాలిగా,సొంత ఫౌండేషన్ స్వఫ్ తరఫున యువ చిత్రకారులను ప్రోత్సహించటం తో పాటు కెరీర్ లో నిలదొక్కుకునేలా చేస్తుంది. మెటల్ అండ్ క్లాత్ వర్క్ లో ఆయేషా సింగ్,జియో మెట్రిక్ ఆర్ట్ లో తేజా […]

మహిళాభ్యుదయం ధ్యేయం

గుజరాత్‌లోని మారుమూల గ్రామం అంకోట్‌ లో పుట్టిన మిత్తల్‌ గోహిల్‌ ఇంగ్లీష్ లిటరేచర్ లో డిగ్రీ చదువు కొని అంతర్జాతీయ వేదికలపై మాట్లాడటమే కాకుండా ఎనిమిది రాష్ట్రాల్లోని బాలికలు, మహిళల జీవితాలను తీర్చిదిద్దింది. 2017 లో దేశాయి ఫౌండేషన్ లో చేరిన మిత్తల్‌ రెండేళ్ల తరువాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయింది. ఫౌండేషన్ టీమ్ తో  కలిసి యూపీ,మధ్యప్రదేశ్, గుజరాత్, ఒరిస్సా, మహారాష్ట్ర, తమిళనాడు మొదలైన రాష్ట్రాల్లోని 30 మంది మహిళలు బాలికలకు వృత్తిపరమైన శిక్షణ కంప్యూటర్ ట్రైనింగ్ […]

గొప్ప ప్రయోగం నాట్యం

దేశ సంస్కృతిలో భాగమైన నాట్యాన్ని ఆధారంగా తీసుకొని సంధ్య రాజు చేసిన నాట్యం సినిమాకు ఉత్తమ కొరియోగ్రఫీ అవార్డు వచ్చింది సత్యం రామలింగ రాజు కోడలు సంధ్యా రాజు తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిత్రం ఇది. శాస్త్రీయ నృత్య కళాకారిణి కావడంతో ఆమె అభినయం అత్యంత సహజంగా ఉంది సినిమా మొత్తం నాట్యం చుట్టూనే ఉంటుంది. మంచి చిత్రంగా ప్రేక్షకుల మన్నన పొందిన ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. శాస్త్రీయ నృత్యానికి పెద్దపీట […]

జీవితకాల రక్షణ

వివిధ ప్రమాదాల్లో గాయపడిన జంతువుల రక్షణ కోసం పూనే లో రెస్క్యూ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించాను 100 మందికి పైగా వాలంటీర్లు ఉన్నారు. ఈ ప్రమాదంలో మాకెన్నో అవార్డులు వచ్చాయి. ఈ ఏడాది జూన్ లో ఎన్విరాన్మెంటల్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సంస్థ నాకు ప్రధానం చేసిన వసుంధర పురస్కారం వాటిలో ఒకటి అంటుంది స్నేహ పంచైమా. ఇప్పటి వరకు 65 వేలకు పైగా పశు పక్షులకు మా సంస్థ సేవలు అందించింది. ఈ ప్రపంచం కేవలం […]

మాది 500 కోట్ల వ్యాపారం

15 సంవత్సరాలలో 500 కోట్ల వ్యాపారాన్ని విస్తరించడం అంటే సామాన్యం కాదు ఎన్నో అనుభవాల సారం ఇది అంటుంది డాలి కుమార్. 2017 లో కాస్మిక్ న్యూట్రాకోస్ ప్రారంభించాను. ఇది థర్డ్ పార్టీ లేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అంటే మా ఉత్పత్తులను ఒప్పందం చేసుకున్న వేరే సంస్థల కింద అమ్మటం డాబర్,లాక్మే,పర్పుల్ వంటి సంస్థలతో కలిసి పని చేశాం. 2017 స్కినెల్లా తయారీ మొదలు పెట్టాం టీనేజర్ల కోసం తయారుచేసిన ఈ క్రీమ్ పెటా సర్టిఫికెట్ పొందినవి […]

ఈ దేశభక్తి గీతం అద్భుతం

అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అక్కచెల్లెళ్ళు అశప్ మై కుమారి బెహల్టీ లు పాడిన దేశభక్తి గేయం పారుక్కుళ్ళే నల్లనాళ్ ఎంగల్ భారత నాడు, పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన ఈ పాట 24 నిమిషాల వీడియో లో ఉంది నీ డీపీలో ఉంది ప్రధాని మోడి ఈ పాట విని ట్విట్టర్ లో, ఈ వీడియో చూసి సంతోషంగా గర్వంగా అనిపించింది అని ట్వీట్ చేశారు. అరుణాచల్ సిస్టర్స్ […]

మేకప్ బై ప్రియాంక పన్వర్‌

మేకప్ పైన ఇష్టం తో సరికొత్త మెలకువలు నేర్చుకొని తన ముఖాన్ని కాన్వాస్ గా ప్రముఖ సెలబ్రెటీలను ఆవిష్కరిస్తుంది ప్రియాంక పన్వర్‌. ఘజియాబాద్ కు చెందిన ప్రియాంక పన్వర్‌ ఫార్మశీ లో మాస్టర్స్ చేసి రెగ్యులేటరీ అఫైర్స్ లో ఉద్యోగం చేసేది. కెనడా కు చెందిన ఇల్యూషన్ ఆర్టిస్ట్ ‘మిమి చాయిస్‌’ స్ఫూర్తితో మేకప్ కోర్స్ చేసింది. తనకు నచ్చిన సెలబ్రెటీలను తన మొహం పై రూపొందిస్తూ మేకప్ బై ప్రియాంక పన్వర్‌ పేరుతో వీడియోలు చేసే […]

పాటకు సత్కారం

జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ గాయనిగా పురస్కారం అందుకుంది నాంజియమ్మ 62 సంవత్సరాల నాంజియమ్మ కేరళ లోని అత్త పాడి సమీపంలోని నక్కుపాటి అనే మారుమూల గ్రామంలో పుట్టింది.ఆమె మాతృభాష ఇరులా  లో పాటలు అల్లి ఊరిలోని ఆజాద్ కళా సమితి లో పాడేది సంగీత దర్శకుడు జేమ్స్ బీజాయ్ అయ్యప్పనుం కోషియం  కోసం అనే మలయాళ చిత్రంలో ఆమె చేత పాట పాడించాడు సినిమా రాకముందే యూట్యూబ్ లో ఆ పాటతో కోట్లకొద్దీ అభిమానుల్ని సంపాదించుకుంది […]

ఉజాస్ నా లక్ష్యం

ఉజాస్ పేరుతో ఆడపిల్లలకు రుతు క్రమం పై అవగాహన నెలసరి పరిశుభ్రత శానిటరీ ప్యాడ్లు ఇవ్వటంతో పాటు వాటి తయారీ పైన శిక్షణ ఇస్తున్న పర్యావరణ హిత ప్యాడ్స్ తయారీలో శిక్షణ ఇస్తున్నాం. ఈ ఉత్పత్తులను దేశవ్యాప్తం చేయడమే నా లక్ష్యం అంటుంది అద్వైతేష.  బిర్లా గ్రూప్ అధిపతి కుమార మంగళం బిర్లా మూడో కూతురు 18 వ ఏటనే సేవ వైపు అడుగులు వేసింది అద్వైతేష. 2021 డిసెంబర్ లో ఆదిత్య బిర్లా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ […]

గర్భిణుల ఆరోగ్య భద్రత ధ్యేయం

నేను తల్లి అయినప్పుడే మన దేశంలో ప్రసవాల తీరు, తల్లులు పడే ఇబ్బంది నాకు అనుభవం లోకి వచ్చాయి. వాళ్లకు తగిన సమయానికి తగిన సేవ, సాయం అందించాలని నిర్ణయించుకున్నా బెంగళూరు లో ఆస్ట్రికా మిడ్ వైఫరీ కేంద్రాన్ని ప్రారంభించాను సిజేరియన్ లను ప్రసవ వేదన ను తగ్గించే నైపుణ్యాల గురించి నర్సులు వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తాము అంటున్నారు డాక్టర్ జాహ్నవీ నిలేకని   ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని కూతురు ఆమె […]

అపురూపమైన కళ

అత్యుత్తమ టాక్సీ డెర్మీ కళాకారిణిగా పురస్కారం అందుకున్నారు దివ్య అనంతరామన్. టాక్సీ డెర్మీ అంటే చనిపోయిన జంతువులకు కొన్ని నైపుణ్యాలతో జీవకళ తీసుకురావటం గోతామ్ టాక్సీ డెర్మీ సంస్థ స్థాపించి దివ్య చనిపోయిన జీవుల అందం ఏమాత్రం తగ్గకుండా  చెక్క యాక్రిలిక్ పెయింట్ వాక్స్ సిలికాన్  ఎపాక్సీ డ్రైయింగ్ క్లే వంటివి వారి శరీరాలకు చక్కని ఆకృతి తీసుకొనివచ్చి మ్యూజియంలో భద్రపరాస్తారు దివ్య ఆమె నైపుణ్యాలను గుర్తించి ఇంగ్లాండ్ అసోసియేషన్ ఆఫ్ టాక్సీ డెర్మిస్ట్ అవార్డుతో దివ్యను […]

నీళ్లే ప్రధానం

శరీరానికి ఏం అందిస్తున్నాము అన్న దానిపైన ఎలా కల్పిస్తున్నాము అన్నది ఆధారపడుతుంది. జుట్టు గోళ్ళు నిర్జీవంగా ఉంటే తగినంత ప్రోటీన్ లేదని బ్యాలెన్స్డ్ డైట్ తో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది అంటుంది శిల్పాశెట్టి. శరీరాన్ని చర్మాన్ని మెరిపించడం లో ప్రధాన పాత్ర నీళ్లదే చిరుధాన్యాలు, గోధుమతో చేసిన అల్పాహారం పండ్లు దంపుడు బియ్యం తప్పనిసరిగా నెయ్యి ఆహారంలో ఉంటాయి. మైల్డ్  ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ కు ప్రాధాన్యత ఇస్తా. ఇక యోగా నా జీవితంలో భాగం అంటుంది […]

జీవనశైలి కీలకం

తినే ఆహారమే ఆనందాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ఈ విషయంలో ఇంటి భోజనానికి ప్రాధాన్యత అంటుంది ఐశ్వర్యరాయ్. అందం పై జీవనశైలిదే ఎక్కువ ప్రభావం అంటుంది ఐశ్వర్య. తాజా కూరలు పండ్లు తింటూ ప్యాకేజ్డ్ పదార్థాలు ఎప్పుడూ తినను. ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటాను. కఠిన వ్యాయామాలు, పవర్ యోగ, బ్రిస్క్ వాక్ తప్పనిసరి రసాయనాలతో క్రీములు అసలు వాడను. చర్మం ఆరోగ్యంగా ఉండటం తో చర్మ తత్వానికి తగిన ఉత్పత్తులు ఎంచుకుని ఖచ్చితమైన స్కిన్ కేర్ రొటీన్ […]

బాలిక పంచాయత్

బాలిక పంచాయత్ పేరుతో గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది 11-21 ఏళ్ల వారి కోసం మొదలు పెట్టిన ఈ కార్యక్రమం ఈ తరహాలో ఇదే మొదటిది. రాష్ట్రం లోనే కచ్ జిల్లాలో ఏడాదిగా నిర్వహిస్తున్నారు. అమ్మాయిల లో సామాజిక స్పృహను  చైతన్యాన్ని పెంచి వారికి రాజకీయాల పట్ల ఆసక్తి కలిగించడం దీని ప్రధాన ఉద్దేశం. గ్రామ ఎన్నికల లాగానే బాలిక పంచాయత్ లకు పోటీ ఉంటుంది. అమ్మాయిలంతా కలిసి ఒక సర్పంచ్ ను సభ్యులను ఎన్నుకుంటారు […]

అభివృద్ధి సులభం

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ దేహత్ జిల్లా లో అత్యున్నత స్థాయి అధికారులంతా మహిళలే జిల్లా కలెక్టర్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ చీఫ్ మెడికల్ సూపర్డెంట్ తాసిల్దార్ వరకు 17 కీలక పదవుల్లో మహిళలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా సునీతి పగ్గాలు చేపట్టడం తో ఆ సంఖ్య 18 కి చేరింది. మేమంతా మహిళలం కనుక మా ఆలోచనా రీతి ఒకే తీరుగా ఉంటుంది. అభివృద్ధి దిశగా ఆలోచించడం అమలు చేయటం సులువుగా అవుతుంది అంటారు కలెక్టర్ నేహ […]

విజయానికి నిర్వచనం

ఫోర్బ్స్ అమెరికాస్ రిచెస్ట్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ జాబితాలో చోటు సాధించింది జయశ్రీ ఉల్లాల్. లండన్ లో జన్మించిన జయశ్రీ ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ చేసి క్యాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే నెట్ వర్కింగ్ హార్డ్ వేర్ నెట్ వర్కింగ్ సాఫ్ట్ వేర్ కంపెనీ పిస్కో లో చేరింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి చేరింది. మూడు దశాబ్దాల నెట్ వర్కింగ్ అనుభవముతో ఎంట్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ 2015 వరల్డ్ బెస్ట్ సీఈవో 2018 అవార్డులు అందుకున్నది. […]