Tuesday, 28 Jul, 2026

సక్సెస్ ఫుల్ డాటర్

వారాంతాల్లో సెలవుల్లో మా నాన్నతో ఆఫీస్ లోనే ఎక్కువ సమయం గడిపేదాన్ని నేను మా నాన్నకు ఇష్టమైన గినియా పిగ్ ను అంటుంది నదియా సరదాగా. పార్లే ఆగ్రో చైర్మన్ ప్రకాష్ చౌహాన్ కూతురు నదియా తండ్రి నుంచి వారసత్వంగా వ్యాపార బాధ్యతలు పుచ్చుకున్నారు ఆమె పార్లే ఆగ్రో సంస్థకు జాయింట్ ఎండి సి ఈ ఓ గా వ్యవహరిస్తున్నారు 36 ఏళ్ల నదియా ఎన్నో కొత్త ఉత్పత్తులను విడుదల చేశారు విజయవంతంగా నడుపుతున్న క్రెడిట్ నదియాకే […]

ఇది సుదీర్ఘమైన కెరీర్

మిగతా రంగాలతో పోలిస్తే మహిళ పైలెట్లు రాణించేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి అంటున్నారు ఫ్లైటిక్ ఏవియేషన్ అకాడమీ నిర్వహిస్తున్న కెప్టెన్ మమత హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న శిక్షణా కేంద్రం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పదివేల మంది పైలెట్లకు సుదీర్ఘమైన కెరీర్ లో కొనసాగేందుకు అవకాశాలున్నాయి. కమర్షియల్ పైలట్ కు నెలకు గరిష్టంగా 120 గంటలు మించి పర్మిషన్ ఉండదు కనుక కుటుంబంలో కుటుంబంతో కలిసి గడిపే సమయం ఎక్కువ గానే ఉంటుంది. ప్రసూతి సెలవులు ఉంటాయి […]

అన్నీ అక్కడే

యువ న్యాయవాది, స్క్రిప్ట్ రైటర్, ఖిమని అండ్ అసోసియేట్స్ వ్యవస్థాపకురాలు, ప్రియాంక కుమారి ఫోర్బ్స్ ఇండియా టాప్ 100 న్యాయవాదులు ఒకరుగా ఉన్నారు. సుస్మితాసేన్, ఏ ఆర్ రెహమాన్, శృతి హాసన్ తో మల్లిక దూల వంటి ప్రముఖులు ఆమె ఖాతాదారులు 23వ ఏట లాయరుగా ప్రాక్టీసు మొదలు పెట్టిన ప్రియాంక లతా మంగేష్కర్ కు ముఖ్య సలహాదారు. న్యాయ సేవల రంగంలో స్త్రీలు చాలా అద్భుతంగా రాణిస్తారు. సమస్యలు ఉంటాయి అలాగే పక్కనే పరిష్కారాలు ఉంటాయి […]

స్ఫూర్తి దాత నికితా కుమారి

ఝార్ఖండ్ లోని మైకా గనుల్లో చిన్న పిల్లల రిహాబిలిటేషన్ కోసం పనిచేస్తోంది. నిఖితా కుమారి ధాబ్ గ్రామంలో నివసించే నికిత చిన్నతనం నుంచి ఆ గనుల్లో పనిచేస్తుంది. బచ్ పన్ బచావో ఆందోళన్ ఆ సంస్థ కార్యకర్తల ద్వారా బసరియా పంచాయత్ సభ్యత్వం తీసుకున్న ది 40 మంది పిల్లల వరకు మైకా గనుల నుంచి స్కూళ్లలో చేర్చింది. కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్  ఫౌండేషన్ ప్రతినిధి రాకేష్ సెంగర్ ఆమె ఆశయాన్ని ప్రశంసించారు. నికిత ఎందరికో […]

అబ్బే, ఇది చాలా తప్పు

ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది కొందరు కావాలని సినీ పరిశ్రమ నాశనం కోసం కంకణం కట్టుకున్నట్లు అనిపిస్తోంది ఒక గ్రూప్ ప్రతి సినిమాను ప్రతి నటీనటుల్ని బాయ్ కాట్ చేయమని ప్రచారం చేస్తోంది సోషల్ మీడియాను అలా ఉపయోగించుకుంటుంది. ఇది తరగని ధోరణి అంటోంది బాలీవుడ్ నటి స్వర భాస్కర్. ఈ మధ్యకాలంలో ఈ బాయ్ కట్ అన్న పదం ఎఫెక్ట్ చాలా సినిమాలను నటుల్ని ఇబ్బంది పెట్టింది. ముందా బ్యాచ్ ను బాయ్ కాట్ చేయండి. […]

అత్యంత సాహసికురాలు

శాన్ ఫ్రాన్సిస్కో లోని ఏవియేషన్ మ్యూజియం లో మన దేశానికి చెందిన జోయా అగర్వాల్ సాహస చరిత్రకు చోటు దొరికింది. కోవిడ్ కోరలు సాచిన సమయంలో వందే భారత్ మిషన్ లో భాగంగా విమానంలో విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చింది జోయా. నలుగురు మహిళా పైలట్ లతో ఉత్తర ధ్రువం మీదుగా 17 గంటల పాటు విమానం నడిపి చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జోయా ను ఐక్యరాజ్యసమితి […]

ఇక్కడి ప్రేక్షకులే ప్రత్యేకం

మలయాళ ప్రేక్షకులు జీవితంలో వాస్తవికతను ఇష్టపడతారు. తెలుగు ప్రేక్షకులు యధార్థను  ఇష్టపడుతూనే  అద్భుత కల్పన కోరుకుంటారు ఈ రెండింటి కలయికే తెలుగు పరిశ్రమ అందుకే కేరాఫ్ కంచర్ల పాలెం ఆర్ ఆర్ ఆర్ వంటి విభిన్నమైన చిత్రాలు ఇక్కడ నుంచే వచ్చాయి సక్సెస్ అయ్యాయి. ఇక్కడ వైవిధ్యం ఎక్కువ అంటోంది అనుపమ పరమేశ్వరన్. కార్తికేయ-2 సక్సెస్ ఎంత గానో సంతోష పెట్టింది కెరీర్ ఆరంభం లోనే నన్ను తెలుగు ప్రేక్షకులు గుర్తించి ప్రోత్సహించారు. నేను చాలా అదృష్టవంతురాలిని […]

ఉన్నవ్ లక్ష్మీబాయ్ 1882 -1952

ఉన్నవ లక్ష్మీనారాయణ గారి భార్య లక్ష్మీ బాయి 1992లో ఆ దంపతులు గుంటూరు లో వితంతు శరణాలయాన్ని స్థాపించారు. జాతీయోద్యమంలో గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకలాపాలలో దంపతులు క్రియాశీలకంగా పాల్గొన్నారు. గుంటూరులో దేశ భక్తి కొండా వెంకటయ్య ఇంట్లో ఉన్నావ లక్ష్మీబాయి శారదా నికేతన్ అనే చిన్న పాఠశాల స్థాపించారు. ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది కాంగ్రెస్ తరఫున పురపాలక సంఘం సభ్యురాలిగా ఆమె సేవలు అందించారు. మరణించేవరకు మహిళల అభ్యున్నతే ధ్యేయంగా జీవించారు.

వయసుతో పని ఏముంది ?

పలు దేశాల సమస్యలూ, కష్టాల్లో ఉన్న వ్యక్తుల కథనాలతో ‘ప్రాజెక్ట్ ఇన్వాల్వ్’ తీసుకువచ్చింది అమెరికాలోని న్యూజెర్సీలో హైస్కూల్ విద్యార్థి టీనేజర్ ఆషి చందన ఎవరైనా సహాయం చేయాలంటే అందులో ‘హెల్ప్ నౌ’ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే అందుకు సంబంధించిన ఎన్జీవో సమాచారం వస్తుంది. ఇండియా, కెనడా, జర్మనీ ఇలా 60 దేశాలకు చెందిన ఎన్జీవోలు ఇప్పుడు ఆషి చందన తో కలిసి పని చేస్తున్నారు. ఈ యాప్ కి వేల మంది భాగస్వాములు ఉన్నారు. సమాజంలో […]

ఇండియా అంటే ఇదే

తొలిసారిగా భారతీయ సినిమాలో డబల్ జండర్ రోల్ (హీరోయిన్ హీరో గా) పోషించిన అన్నా హరి సలుంని  చూడాలి అనుకుంటే ఐ.ఎం.పి అనే టైం మెషిన్ లోకి వెళ్ళాలి. ముంబాయి కి చెందిన అనూష యాదవ్ మొదలుపెట్టిన ఇండియన్ మెమొరీ ప్రాజెక్ట్ (ఐ.ఎం.పి). కి ఆన్ లైన్ లో విపరీతమైన ఆదరణ ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ గ్రాడ్యుయేట్ అయిన అనూష యాదవ్ పోర్ట్రెయిట్ ఫోటోగ్రాఫర్ బ్రాండ్ కల్చర్ డిజైనింగ్ కన్సల్టెంట్ ఐ.ఎం.పి ఆన్ లైన్ […]

నేవి లో మహిళలు

భువనేశ్వర్ సమీపంలోని ఐ.ఎన్.ఎస్ బాలిక శిక్షణ కేంద్రం లోకి నేవి ఫస్ట్ ఉమెన్ బ్యాచ్ కు చెందిన ఆరు వందల మంది మహిళలు అడుగు పెట్టబోతున్నారు. పర్సనల్ బి లో ఆఫీసర్ ర్యాంక్ క్యాడర్ లో మహిళలను రిక్రూట్ చేసి తొలి విభాగం నేవి సెయిలర్స్ గా మహిళలకు తోలి అవకాశం దొరికింది గతంలో నేవి కి చెందిన ఉమెన్ టీమ్ నావిక సాగర్ పరిశ్రమ పేరుతో ప్రపంచ నౌక యాత్ర చేసి చరిత్ర సృష్టించింది. అలాగే […]

రాయల్ కేక్స్

మినియేచర్ వస్తువుల నుంచి రాజ భవనాల వరకు దేన్నైనా కేకుల తయారు చేయగలరు ప్రాచీ ధబల్ దేబ్. నాగల దుకాణాలకు అందాల డిజైన్లు కేక్ తోనే చేసి ఇవ్వగలరు ప్రాచీ. పురాతన రాచరికపు కట్టడాలను కేక్ లాగా చేయగలిగే సృజన ఆమె కు గిన్నిస్ బుక్ లో చోటు ఇచ్చింది. ఇప్పటి వరకు పదిహేను వందల వేగాన్ రాయల్ ఐసింగ్ స్ట్రక్చర్స్ తయారుచేసింది. ప్రాచీ ఉమెన్ అచీవర్స్ ఆఫ్ ది పూణే సూపర్ షెప్ ది ఇయర్ […]

సాహసానికి సత్కారం  

తమిళనాడులోని నాగపట్నం జిల్లా కిల్వేరు కు చెందిన బి.ఎళిలరాసి ని తమిళనాడు ప్రభుత్వం కల్పనా చావ్లా అవార్డుతో సత్కరించింది ఆమె ఇంటి దగ్గర లోని ఒక పురాతన ఆలయం లో ఉన్న కొలనులో తంజావూరు నుంచి దేవుడి దర్శనం కోసం వచ్చిన ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తూ పడిపోతే ఈ తరానికి ఎళిలరాసి చూసి ఒక్క నిమిషం కూడా సందేహించకుండా అందులో దూకి వాళ్ళు మునిగిపోకుండా పట్టుకుంది అంతలో స్థానికులు వాళ్లని రక్షించారు ఆమె చూపించిన తెగువ కు […]

ఈమెతోనే మొదలు

ఏవియేషన్ రంగంలో మహిళలు చక్కగా రాణిస్తున్నారు. పైలెట్ ప్రేమ్ మాథుర్. 1947లో హైదరాబాద్ లోని డెక్కన్ ఎయిర్ వేస్ లో 38 ఏళ్ళ వయసులో ఉద్యోగం సాధించారు. ఈ తొలి భారత మహిళా కమర్షియల్ పైలెట్ ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, మౌంట్ బాటెన్ వంటి ప్రముఖులు ఈమె ప్రయాణికుల ప్రేమ్ మాధుర్ జెడి బిర్లా ప్రైవేట్ జెట్ పైలెట్ కూడా.

భర్త అడుగుజాడల్లో

భర్త మరణించాక విధుల్లో చేరే సైనిక వితంతువుల సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతోంది. లెఫ్టినెంట్ కమాండర్ కుంతల్ వాధ్వాని భార్య సంధ్య నేవి పాఠశాలలో టీచర్ గా పని చేశారు. కోల్ కత్తా లో మిసైల్ డిస్ట్రాయర్  ఆయన. ప్రమాదవశాత్తు ఆయన మరణించటం తో 41 ఏళ్ల వయసులో భర్త చేస్తున్న ఉద్యోగం కోసం ట్రైనింగ్ తీసుకుని శిక్షణ పూర్తి చేసి విధుల్లో చేరారు. 2015 గణతంత్ర దినోత్సవాలలో 144 మంది మహిళలతో కూడిన పెరేడ్ ను […]

నా భర్త కోరిక తీర్చా

మేజర్ సుఖ్వీందర్ జీత్ రాధ్వా 1997 జమ్ము, కాశ్మీర్ లో తీవ్రవాదుల దాడికి గురై మరణించాక ఎనిమిది నెలలకు మిలటరీ లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు ఆయన భార్య రవీందర్ భరత చనిపోయేనాటికి వాళ్ల పెళ్లయి మూడేళ్లు నెల పాప వుంది. పాపది ఏడాది వయసు వచ్చాక మిలటరీ లో చేరేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ వప్పించి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ పరీక్ష రాసి అర్హత సాధించారు. 1990లో విధుల్లో చేరి లెఫ్టినెంట్ కర్నల్ స్థాయికి చేరారు […]

సరళా టకరాల్

మహిళలే ఎంతో జాగ్రత్తగా విమానాలు నడుపుతారనీ, రిస్క్ అవకాశాలు ఎన్నిసార్లు అంచనావేసి రంగంలోకి దిగుతారని అధ్యయనకారులు చెబుతున్నారు. మన దేశంలో మహిళా పైలెట్ల శాతం 12.4 ఏవియేషన్ రంగంలో ఇదో రికార్డ్ కూడా. మన దేశంలో మొదటి ఎయిర్ క్రాఫ్ట్ నడిపింది సరళా థక్రాల్. అదీ చీరకట్టుతో పెళ్లయిన తర్వాత 21 ఏళ్ల వయసులో పైలెట్ లైసెన్స్ సాధించారు. వెయ్యి గంటలపాటు విమానం నడిపే ‘ఎ ‘ లైసెన్స్ పొందిన తొలి భారతీయ మహిళగా నిలిచారు సరళా […]

ఉమెన్ ఓన్లీ

ఈ ప్రపంచం చుట్టి రావటం నా లక్ష్యం అంటోంది సజ్నా అలి. కేరళలోని తిరువనంతపురం కి చెందిన సజ్నా అలి ఉమెన్ ఓన్లీ ట్రావెల్ గ్రూప్ కు శ్రీకారం చుట్టింది. ఈ ట్రావెల్ గ్రూప్ నుంచి వందలాది మంది మహిళలు వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేశారు. ఇందులో బడ్జెట్ ట్రిప్స్ కు ప్రాధాన్యత ఇస్తుంది సజ్నా అలి. ఇప్పుడు సజ్నా ట్రావెల్స్ కేరళలో అగ్రస్థానంలో ఉంది సోషల్ మీడియా నెట్ వర్క్ తో ట్రావెల్ ప్లాన్స్ ప్రచారం […]

మాగంటి అన్నపూర్ణాదేవి

1921లో గాంధీజీ బెజవాడలో మహిళా సమావేశానికి హాజరు అయ్యారు. ఆయనను మా ఊరు ఏలూరు రావాలని కోరింది మాగంటి అన్నపూర్ణాదేవి. కాంగ్రెస్ నిధికి తన నగలు ఇచ్చి ఆ విరాళాలు ఇచ్చే సంప్రదాయం మొదలు పెట్టించింది అన్నపూర్ణ. ఆమె తల్లిదండ్రులు కలగర రామస్వామి, పిచ్చమ్మ లు బ్రహ్మ మతాన్ని అనుసరించి అన్నపూర్ణను కోల్కతా లోని బ్రహ్మ బాలిక పాఠశాలలో చదివించారు. బెంగాలి సాహిత్యాన్ని అనువాదం చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో చదువుకున్నది అన్నపూర్ణ. అరవిందుని లేఖలు వంటి […]

తయ్యాబా బేగం

మూసీ వరదల్లో హైదరాబాద్ చిక్కుకుంటే వరదా లో ఉంటూనే ఎంతోమంది స్త్రీలకు అండగా నిలిచారు తయ్యాబా బేగం.దేశంలో మొదటి ముస్లిం మహిళ మంత్రి తయ్యాబా బేగం. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ సంపాదించిన తొలి ముస్లిం మహిళ గ్రాడ్యుయేట్ జాతీయోద్యమం లో స్త్రీల గొంతుకను సమర్థంగా వినిపించిన యోధురాలు. భర్త ప్రోత్సాహంతో మహిళా విశ్వవ్యాప్త కి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ విశేష కృషి చేశారు. అఖిల భారత మహిళా సంస్థ ఉపాధ్యక్షురాలిగా ఎంతో సేవ చేశారు. ప్రస్తుతం […]