Gagana
బిజినెస్ సక్సెస్
పారుల్ గులాటి పేరున్న నటి నిష్ హెయిర్ పేరుతో హెయిర్ ఎక్స్ టెన్షన్స్ విగ్స్ బిజినెస్ చేస్తోంది. సహజమైన జుట్టు తో తయారయ్యే ఈ ఎక్స్ టెన్షన్ లతో నెలకు 70,80 లక్షలు సంపాదిస్తోంది పారుల్. ప్రస్తుతం వెబ్ సిరీస్ తో కూడా బిజీగా ఉన్న పారుల్ కు సామాజిక మాధ్యమాల్లో ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. ప్రధానంగా ఇన్ స్టా, ఫేస్ బుక్ యూట్యూబర్స్ ద్వారానే ఆమె వ్యాపారం విజయవంతంగా సాగుతోంది.
అందమైన వ్యాపారం
స్మార్ట్ రాప్ పేరుతో గిఫ్ట్ రాప్ లు బిజినెస్ చేస్తారు కృతక సబర్వాల్. వర్క్ షాప్ లు వెబినార్ ద్వారా టీచర్ ప్రెన్యూర్ గా గిఫ్ట్ ప్యాక్ తయారీలో శిక్షణ ఇస్తుంది. దేశవ్యాప్తంగా 1300 మంది మహిళలకు ర్యాపింగ్ క్రాఫ్ట్ నేర్పించింది. బహుమతులు అందమైన రూపంతో అందించడం స్మార్ట్ రాప్ ఉద్దేశం బేకర్లు, స్వీట్లు గిఫ్టింగ్ కంపెనీలు గృహాలంకరణ బ్రాండ్స్ ఈ కళ పట్ల ఇష్టం చూపిస్తున్నారు .
ఆల్ రౌండర్
గీతిక కొడాలి అమెరికా అండర్ 19 క్రికెట్ టీమ్ కెప్టెన్. ఆమె తండ్రి విజయవాడ కు చెందిన ప్రశాంత్ కొడాలి ఆన్ లైన్ లో ఇంజనీరింగ్ చదువుతున్న గీతిక 2019 లో అండర్ 19 టీమ్ తో కెరీర్ ప్రారంభించింది.14 ఏళ్ల వయసులో యు.ఎస్ ఉమెన్స్ టీమ్ లో ఎంపికయింది. క్రికెట్ లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుని ఆట పైన పట్టు సాధించింది గీతిక.
వస్త్రం పై గ్రంధాలు
అస్సాం కు చెందిన హేమ ప్రభ చుటియా వస్తాం పైన చిత్రాలు వేయగలరు. సిల్క్ వస్త్రం పైన ఆమె ఆధ్యాత్మిక చిత్రాలు నిక్షిప్తం చేస్తారు. శ్రీమంత శంకర్ దేవ్ రచించిన గుణమాల, శ్రీ మాధవ దేవ్ అస్సామీ లో రాసిన నామ్ ఘోసా వైష్ణవ గ్రంధాన్ని ఆమె సిల్క్ వస్త్రంపై నేశారు. 280 గజాల పొడవు, రెండు అంగుళాల వెడల్పు ఉన్న ఈ వస్త్రం పై మూడేళ్ల పాటు కష్టపడి ఈ ఆధ్యాత్మిక గ్రంథాలు నేశారు.ఈ అరుదైన […]
విశేష ప్రతిభ
భారతీయ మూలాలున్న ప్రొఫెసర్ మేఘన పండిట్ బ్రిటన్ లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్ ఎన్‌హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్ నేషనల్ హెల్త్ సర్వీసెస్ ట్రస్ట్ కు సి ఈ ఓ గా నియమితులయ్యారు. ఈ ట్రస్ట్ కు బ్రిటన్ లో ఎన్నో టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి ముంబైలో ఎం బి బి ఎస్ చేసిన మేఘన పండిట్ ఈ బాధ్యత చేపట్టిన తొలి మహిళగా ప్రత్యేకత చాటుకున్నారు.
జంగల్ కి టార్జన్
జమున టుడు పర్యావరణ ఉద్యమకారిణి సంతాల్ ఆదివాసి మహిళ. ఆమె పుట్టినిల్లు ఒడిశా అత్తిల్లు జార్ఖండ్ భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము కు దగ్గర బంధువు. 2019లో పద్మశ్రీ అందుకున్నారు జమున టుడు ను జంగల్ కి టార్జాన్ అని పిలిచి గౌరవించారు.ప్రధాని పర్యావరణాన్ని కాపాడుకుంటే మనిషికి జీవితం ఉంటుందని నమ్ముతారు జమున. ఊరందరినీ కలుపుకొని మొక్కలు నాటారామె వన సంరక్షణే ఆమె ధ్యేయం.
గ్రీన్ గ్యాంగ్
ఉత్తర ప్రదేశ్ లోని ఆరు జిలాల్లోని 150 కి పైగా గ్రామాల్లో 14 వేల మంది సభ్యులతో గ్రీన్ గ్యాంగ్ పనిచేస్తోంది. గృహహింస పైన దానికి దారితీస్తున్న వ్యసనాల పైన మహిళలు చేసిన తిరుగుబాటు ఈ గ్రీన్ గ్యాంగ్ ఆవిర్భావం ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి జిల్లాలో 15 మంది మహిళల తో మొదలైన ఉద్యమం ఇప్పుడు పలు ప్రాంతాలకు విస్తరించింది. ఇందులో సభ్యులు ఆకుపచ్చ చీరెలు ధరిస్తారు. మహిళలది ఒకే సమస్య ఇంట్లో మగవాళ్ళు తాగుడు,పేకాట […]
చీరె కట్టుకో నిముషం
వన్ మినిట్ శారీ ప్రారంభించారు సాషా రేవంకర్ ఈమె డిజైన్ చేసిన చీరెలు మూడు విధాలుగా కట్టుకోవచ్చు చీర కట్టు సమయం ఒకే ఒక నిమిషం ఈ డిజైనర్ శారీ లు భారత్ తో పాటు అమెరికాలోనూ దొరుకుతాయి. సాంప్రదాయ చీరలను ఎంతో తేలికగా ధరించేలా డిజైన్ చేసిన సాషా ప్రారంభించిన బిజినెస్ ఏడాదిలో కోటి రూపాయలు లాభాలతో నడుస్తోంది.
బేకింగ్ క్వీన్
ప్రాచీ ధబల్ ను మనదేశంలో బేకింగ్ క్వీన్ గా గొప్ప కేక్ ఆర్టిస్ట్ గా పిలుస్తారు. కేక్ ను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా మలుస్తుంది ప్రాచి. ఆమె ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్ కేథడ్రల్ చర్చ్ కు రెప్లికా తయారు చేసింది. ఈ భారీ చర్చ్ తయారు చేసినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ 2022 లో కి ఆమె పేరు నమోదయింది. ఈమె చేసే కస్టమైజ్ కేకులకు ఎన్నో ప్రశంసలు వస్తాయి. కలకత్తా లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన […]
అందాల సుందరి స్ట్రెలా
మిస్ ఇండియా 2023 ఫైనల్స్ లో మణిపూర్ కు చెందిన స్ట్రెలా లువాంగ్ సెకండ్ రనరప్ప గా నిలిచింది. మణిపూర్ వంటి చిన్న గ్రామం నుంచి మిస్ ఇండియా పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో ఒకరుగా నిలబడటం కోసం చాలా పెద్ద పోరాటం చేసింది. టీనేజ్ లో మూర్ఛ వ్యాధి బారిన పడి కోలుకుంది. బిజినెస్ స్టడీస్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది.అడ్డంకులు వస్తేనే మనం పోరాడి శక్తిమంతులం అవుతాం అంటుంది స్ట్రెలా.స్ట్రెలా మోడల్ కూడా.
రైతులకు బహుమతి
వ్యవసాయ ఉత్పత్తులు భద్ర పరుచుకునేందుకు సన్ హార్వెస్టడ్ కూల్ రూమ్స్ కు రూపకల్పన చేసింది 19 ఏళ్ల మహేక్ పర్వేజ్. ఇందులోని అల్యూమినియం షీల్డ్ సూర్యుడి వేడి గ్రహిస్తాయి. కూరగాయలు పండ్లు తాజాగా ఉంటాయి ఈ కూల్ రూమ్ లో ఎకో ఇనోవేషన్ పేరిట దేశవ్యాప్తంగా పోటీ పడ్డ వెయ్యి ప్రాజెక్టులతో ఈ కూల్ రూమ్ లకు ది లెక్సస్ డిజైన్ అవార్డు ఇండియా 2023 వరించింది.
రంగుల ప్రయాణం
మధ్యప్రదేశ్ లో ఖాండ్వా లో అదనపు ఎస్పీ గా పనిచేస్తున్న సీమ ఆల్వా చక్కని చిత్రకారిణి ఇప్పటి వరకు 180 పైగా పెయింటింగ్స్ వేశారు. సమాజంలో మహిళలు, ఆడవాళ్లు ఎదుర్కొనే అణిచివేతకు ప్రధాన వస్తువుగా ఆమె చక్కని చిత్రాలు గీస్తారు ఆమె గీసిన చిత్రాలు ఆలయాల నుంచి రాజభవన్ వరకు గోడలపైన కనిపిస్తాయి. పోలీస్ అధికారి గా కంటే కళాకారిణి గా గౌరవం పొందడం నాకు ఇష్టం అంటారు సీమ ఆల్వా.
తెలివైన ఇన్ వెస్టర్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కు చిన్న చిన్న ఇన్ వెస్ట్ మెంట్స్ లో మార్పు చేయటం హాబీ ఫిట్ నెస్, లైఫ్ స్టైల్ బ్యూటీ ఫుడ్ వంటి స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది దీపిక. ఈ మధ్యకాలంలో బంబుల్ ఇండియా అని డేటింగ్ యాప్ లో భాగస్వామి అయింది దీపిక.ఈ డేటింగ్ యాప్ లో కొత్త తరం తమ ఇష్టానుసారం పెళ్లిళ్లు చేసుకోవచ్చు అలాగే సిలికాన్ వ్యాలీ కి సంబంధించి హాల్బర్టన్ స్కూల్లో పెట్టుబడులు పెట్టింది […]
వీల్ చెయిర్ తో సాహస యాత్ర
వీల్ చెయిర్ పైనే దేశాలు చుట్టేస్తోంది అట్లాంటకు చెందిన రెనీ బ్రూన్స్. ఒక ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 117 దేశాలు సందర్శించా రామె. మొత్తం 195 దేశాలు సందర్శించే ఈ సాహస యాత్రలో ఆమె వివిధ దేశాల భాషలు సంస్కృతి సంప్రదాయాలు వంటలు నేర్చుకుంటూ కొనసాగుతోంది.వీల్ చైర్ పైన అత్యధిక దేశాలు సందర్శించిన యాత్రకురాలిగా రికార్డ్ సృష్టించిన రెనీ బ్రూన్స్.
మెట్ గాలా కు దీపిక
ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో మెట్ గాలా ఒకటి న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్ లో నిర్వహించే ఈవెంట్ కు ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లు గాయకులు, మోడళ్ళు, ఫోటోగ్రాఫర్లు వస్తారు ఒక్క టికెట్ ధర 28 లక్షలు 2021లో ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన 137 కోట్ల రూపాయలు యూనిసెఫ్ అనుబంధ సంస్థలు ఇతర ఎన్జీవోలకు ఇచ్చారు. ఈ సంవత్సరం ఆలియా బట్ ఈవెంట్ లో పాల్గొంటుంది ప్రముఖ నేపాలీ అమెరికన్ డిజైనర్ […]
అనువాద రచయిత్రి
పొన్నియిన్ సెల్వమ్ తమిళ నవల ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసింది నందిని కృష్ణన్ .చెన్నైలో స్థిరపడ్డ నందిని స్టేజ్ యాక్టర్, నాటక కర్త రచయిత్రి, హెచ్డ్ మోడ్రన్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఇన్ విజిబుల్ మెన్ పుస్తకాలు రాశారు నందిని.ఇప్పుడు పొన్నియిన్ సెల్వమ్ అనువాదం పాఠకుల ముందుకు రాబోతోంది.
అపూర్వ సాహసం
యుద్ధంలో వీరమరణం పొందిన వీరులకు ఇచ్చే అశోక చక్ర అందుకున్న తొలి మహిళ నీర్జా భానోత్ చండీగఢ్ లో జన్మించిన నీరజ ఫ్లైట్ అటెండెంట్ గా పని చేసేది. 1986 సెప్టెంబర్ 5 ముంబై నుంచి అమెరికా వెళ్లే విమానంలో విధులు నిర్వహిస్తోంది నీర్జా తీవ్రవాదులు దాన్ని హైజాక్ చేసి 380 మంది ప్రయాణికులను బంధించారు ఆ ప్రయాణికులను వేరే మార్గం ద్వారా బయటకు పంపి కాపాడిన నీర్జా ఆ క్రమంలో ప్రాణాలు వదిలింది ఆమె ధైర్య […]
స్త్రీవాద గ్రంథాలయం
ముంబైలోని ధారావి లో మొట్టమొదటి స్త్రీ వార గ్రంథాలయం ఉంది ఇది డార్జిలింగ్ కు చెందిన 32 సంవత్సరాల అక్వి థామీస్ ఏర్పాటు చేశారు ఈమె తల్లిదండ్రులు తేయాకు తోట లో కూలీలు చదువు పూర్తయ్యాక ఆక్వి మురికివాడల పిల్లల కోసం ధారవి ఆర్ట్ రూమ్ ఏర్పాటు చేసింది. తర్వాత స్త్రీల రచనలతో సిస్టర్స్ లైబ్రరీ ప్రారంభించింది. ఇక్కడ దేశీయ సాహిత్యం తో పాటు నేపాల్, బంగ్లాదేశ్,న్యూజిలాండ్, అమెరికా దేశాల రచనలు కూడా ఉంటాయి. సిస్టర్స్ ప్రెస్ […]
యువతకు జోష్
చిన్న వయసులో కాలేజీ రోజుల్లోనే జోష్ టాక్స్ స్టోరీ స్టార్టప్ ప్రారంభించారు సుప్రియ పాల్. ఈ మీడియా ప్లాట్ ఫామ్ వివిధ అంశాలపై నిపుణులపై మాట్లాడించడం లైవ్ ఈవెంట్స్ సమావేశాలు నిర్వహించటం చేస్తుంది.10 లక్షల మంది పెయిడ్ యూజర్లు ఈ యాప్ ద్వారా వివిధ రంగాలలో నైపుణ్యాన్ని పొందుతున్నారు జోష్ కోష్ 5 లక్షల మంది సభ్యులకు ప్రతి నెల కెరీర్ గైడెన్స్ అందిస్తోంది. ఇంత విజయాన్ని సాధించిన సుప్రియ పాల్ డిజిటల్ ఉమెన్ అవార్డ్ 2017 […]
సాహస యాత్రలు
థ్రిల్లోఫిలియా టూర్స్ ప్రైవేట్ లిమిటెడ్, చిత్ర గుర్నాని దాగా 2009 లో స్థాపించారు.భారతదేశంలోని టాప్ 20 ట్రావెల్ వెబ్ సైట్స్ లో ఇదొకటి. ఈ వెబ్ సైట్ యూజర్లు 30 లక్షల కంటే ఎక్కువ. 25 పైగా డెస్టినేషన్స్ తో 12,500 యాక్టివిటీస్ వీళ్లు నిర్వహిస్తారు. థ్రిల్లోఫిలియా సంస్థ స్కూబా డ్రైవింగ్ ఒంటెల సఫారీ,బైకింగ్ కేవింగ్,పారా గైడింగ్ వైల్డ్ లైఫ్ ఎక్స్ ప్లోరేషన్ తదితరాల నిర్వహణ లో ఎంతో పేరు తెచ్చుకుంది థ్రిల్లోఫిలియా యాత్రలకు కేరాఫ్ అడ్రస్ […]
