Monday, 27 Jul, 2026

మిస్ ఇండియా

ఈ సంవత్సరం మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్ కు చెందిన నందిని గుప్తా సొంతం చేసుకుంది. మణిపూర్ లోని కుమన్ లింప్ ఇండోర్ స్టేడియం లో జరిగిన 50 9వ ఫెమీనా మిస్ ఇండియా పోటీల్లో ఆమె విజేత. గత సంవత్సరం మిస్ ఇండియా గా ఎంపికైన సినీ శెట్టి ఆదివారం నందిని కి కిరీటాన్ని తొడిగారు. ఈ మిస్ ఇండియా పోటీల్లో ఢిల్లీకి చెందిన శ్రేయ మొదటి  రన్నరప్  మణిపూర్ కి చెందిన తౌజ్యోమ్ రెండో […]

ఈ మోడల్ చాలా ప్రత్యేకం

వోగ్ ఫ్యాషన్ మ్యాగజైన్ కవర్ పేజీగా 106 సంవత్సరాల బామ్మ అపోహంగడి అపో వాంగ్-ఓడ్ కనువిందు చేశారు.ఫిలిప్పీన్స్‌ లోని బుస్కలన్క గ్రామానికి చెందిన ఈమె అద్భుతంగా పచ్చబొట్టు వేస్తుంది. ఈమె వేసే టాటూ కోసం పర్యాటకులు వెతుక్కుంటూ వస్తారు. కళింగ తెగకు చెందిన ఈ పచ్చబొట్టు వేయటంలో చివరి వారసురాలు. వెదురు కర్ర ముల్లు బొగ్గులతో ఈమె వేసే టాటూ ఆకారాలకు యువతరం ఫిదా అవుతోంది.ఆర్థికంగా వెనుకబడిన ఈ గ్రామానికి ఈమె కళ గుర్తింపు తెచ్చింది.

కళాభిమాని

కిరణ్ నాడార్ ఎం సి ఎం లో కమ్యూనికేషన్ అండ్ బ్రాండ్స్ ప్రొఫెషనల్ గా కెరియర్ ప్రారంభం చేశారు. హెచ్.సి.ఎల్ వ్యవస్థాపకుడు శివ నాడార్ భార్య ఆమె. 2005 లో కిరణ్ నాడార్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ప్రారంభించారు. ఎంతో ఇష్టంగా కిరణ్ నాడార్ సేకరించిన ఐదు వేల కళాకృతుల తో ఈ మ్యూజియం ప్రారంభమైంది. శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ గా భారత్ ఫ్రెంచ్ దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాల పురోభివృద్ధికి కళల సహకారానికి కృషి […]

సినిమాలకో లాయర్

గీతిక అగర్వాల్ సినిమాలకు న్యాయ సలహాదారు 400 చిత్రాలకు పైగా ఆమె న్యాయ సలహాలు ఇచ్చారు. సినిమాలకు వచ్చే ప్రైవేట్ పెట్టుబడులు, లాభాల్లో వాటా శాటిలైట్ మేధా హక్కులు కాపాడుకోవడం మార్కెటింగ్ విషయాల్లో ఆమె సలహాలు ఇస్తారు. గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్, మస్తాన్, ఎం.ఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ బాహుబలి,ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలు ఆమె న్యాయ సలహాలు తీసుకున్నాయి. సినిమా హక్కుల రాయితీల విషయంలో లాయర్ల అవసరం ఎంతో ఉంటుంది.

ఆర్థికవేత్త అను అయ్యంగార్

వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకటించిన వంద మంది ఆర్థికవేత్తల జాబితాలో అను అయ్యంగార్ కూడా ఉన్నారు. ప్రపంచ అగ్రశ్రేణి పెట్టుబడుల బ్యాంక్ లో ఒకటైన జెపీ మోర్గాన్ ఛేజ్‌ లో విలీనాలు, కొనుగోళ్ల విభాగానికి అంతర్జాతీయ అధిపతి అను అయ్యంగార్. ఆమె స్వస్థలం కేరళ చదువు నిమిత్తం అమెరికాలో అడుగుపెట్టి జాత్యహంకారాన్ని లింగ వర్ణ వివక్ష ను అడుగడుగునా ఎదుర్కొన్నారు అను. తన ప్రతిభతో వాటిని దాటి ఎమ్ అండ్ ఏ విభాగంలో సుమారు 500 వేల […]

ఆర్థికవేత్త

సోనాల్ దేశాయ్ ఆర్థికవేత్త పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కెరీర్ ప్రారంభించారు 2009 లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్   లో చేరిన ఆమె 2018 లో ఈ సంస్థ గ్లోబల్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ కు ముఖ్య పెట్టుబడుల అధికారి గా నియమితులయ్యారు. ఫ్రాంక్లిన్ మున్సిపల్ కార్పొరేట్ క్రెడిట్, ఫ్లోటింగ్ రేట్ మల్టీ సెక్టార్, గ్లోబల్ మనీ మార్కెట్ ఫిక్సిడ్ ఇన్ కామ్ టీమ్ ల బాధ్యత సోనాల్ దే. వాల్ స్ట్రీట్ జర్నల్ […]

కన్నీటి ఉప్పెన

బలగం సినిమాలో తోడుగా మా తోడుండి పాట పాడిన కొమరమ్మ బుడగ జంగాల గాయకురాలు.భర్త మొగిలయ్యతో తో కలిసి తంబురా దిమ్మెస వాయిస్తూ పాటలు పాడుతోంది.చావులు,దినాలకు ప్రత్యేక పాటలు పాడే కొమరమ్మ పాట తెలుగు ప్రేక్షకులను కదిలించి కంటి తడి పెట్టించింది.కుటుంబ అనుబంధాలు విలువలు గుర్తుతెచ్చే పాటలను అప్పటికప్పుడు కూర్చి పాడుతుంది కొమరమ్మ.

అందరి నోట ఈ పాట

దసరా సినిమాలో చమ్కీల అంగీ లేసి పాటతో ట్రెండ్ సెట్టర్ అయ్యింది. దీక్షిత వెంకటేశన్.’దీ’ గా సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన తమిళ అమ్మాయి తండ్రి సంతోష్ నారాయణ తో పాటు ఏ.ఆర్ రెహమాన్ తో కలిసి పనిచేస్తుంది. దీక్షిత పూర్తిగా తెలంగాణ యాసతో సాగే ఈ ఒక్క పాటతో దీక్షిత తెలుగు జానపద గీతానికి ఒక కొత్త సొగసు తెచ్చింది.

తుదిశ్వాస వరకు…

ఒడిశా కు చెందిన అలక్ నందా కథక్ నృత్య కళాకారిణి. ఆమెకు ఒవేరియన్ క్యాన్సర్ పాకింది. కీమోథెరపీ లు చేయించుకుంటూ వైద్యం తీసుకుంటున్న ఆమె నృత్యం మానలేదు. గురువు గా ఆమెకు మంచి పేరుంది. మహాభారతంలోని గాధలను కథ రూపకాలుగా ప్రదర్శిస్తుంది. ద్రౌపతి పాత్ర లోని స్త్రీ వారి కోణాన్ని ప్రదర్శించే ఆమె తలపైన ఒక్క వెంట్రుక కూడా లేకుండా కథక్ ప్రదర్శన ఇస్తూ నా పోరాటం క్యాన్సర్ తో నా నృత్యం నృత్యమే. జబ్బు నా […]

అందమైన పుస్తకాలు

బెంగళూరుకు చెందిన రచయిత్రి బిజల్ వచ్చే రజని పర్యావరణం పైన పిల్లల పుస్తకాలు చాలా అందంగా రాస్తారు కథను. క్వారీ రేచర్ల  రూపంలో గీసి వాటి చుట్టూ కథ అల్లుతుంది రజిని. ఆమె రాసిన ‘ఎ క్లౌడ్ కాల్డ్ బూర’, కిటెన్ ట్రబుల్, ఎ బెండ్ ఇన్ టైమ్, ది గ్రేట్ ఇండియన్ నేచర్ ట్రయల్ విత్ అంకుల్ బిల్కి వంటి రచనలు పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు. సావీ అండ్ ది మెమొరీ కీపర్ పుస్తకం బాల […]

చిన్ని పిట్టకు ప్రచారం

తమిళనాడు  తిరునల్వేలి కి చెందిన విద్యా సుందర్ బెంగళూరులో ఉంటారు గృహిణిగా అందరికీ ఉండే పనులే ఆమెకు ఉన్నాయి.కానీ ఆమె బర్డ్ వాచింగ్ హాబీగా తీసుకుంది. ఈ బర్డ్ అనే గ్లోబల్ ఇంటర్ నెట్ ప్లాట్ ఫామ్ లో వేలాదిమంది బర్డ్ వాచర్స్ సభ్యులుగా ఉన్నారు. విద్యా సుందర్ ఈ గ్రూప్ మెంబర్.తనకు బాగా నచ్చిన ముగ్గులతో పిట్టలను గురించి వాటిని రక్షించుకోవాల్సిన అవసరం గురించి ప్రచారం చేస్తారామే. ప్రతిరోజు ఇంటి ముందు అందమైన పిట్ట బొమ్మ […]

స్ఫూర్తి ప్రదాత

బొటానికల్ సైన్స్ లో డాక్టరేట్ చేసిన తొలి మహిళ గా జానకి చరిత్ర సృష్టించింది.కేరళలోని తలస్సేరి లో 1897 లో జన్మించిన జానికి అమ్మాళ్ అమెరికా కు చెందిన ప్రతిష్టాత్మక ‘యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్’ స్కాలర్ షిప్ కు ఎంపిక అయ్యారు.అమెరికా లో చదువుకున్నారు చెరుకు మొక్కల జీవ పరిణామ క్రమం పై ఆమె రాసిన క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ ఒక ప్రామాణిక పుస్తకం. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (కోల్ కతా) కు […]

సుభద్ర కు పద్మశ్రీ

మధుబని కళాకారిణి సేలంపూర్ గ్రామానికి చెందిన సుభద్రా దేవి కి పద్మశ్రీ పురస్కారం లభించింది. కాగితపు గుజ్జు మనోహరమైన ఆకృతులను సృష్టించే సుభద్ర చిత్రించిన రాధాకృష్ణులు పెయింటింగ్‌ బ్రిటిష్ మ్యూజియంలోకొలువు’తీరింది కళల వ్యాప్తికి కృషి చేసిన ఆమెను 1980 లో రాష్ట్ర ప్రభుత్వం 1991 లో కేంద్ర ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించాయి. ఆమె నైపుణ్యానికి దేశ విదేశాల్లో గుర్తింపు లభించింది.

సృజనకు సోపానం

అంజలీ సూద్ విమియో సంస్థ సిఈఓ ఒకప్పుడు మామూలు వీడియో షేరింగ్ సంస్థగా ఉన్న విమియో సంస్థ ను నేడు గ్లోబల్ కంపెనీగా మార్చింది అంజలి. 2015 లో మార్కెటింగ్ విభాగంలో చేరిన అంజలి రెండేళ్లలో సి ఈ ఓ అయింది. ఫార్చ్యూన్ 40 అండర్ 40 జాబితాలో  పవర్డ్ ఎకనామిక్ ఫోరమ్ యంగ్ గ్లోబల్ లీడర్ గా నిలిచి సత్తా నిరూపించుకుంది. చిరు వ్యాపార సంస్థలు తమ ప్రకటనలో చక్కని వీడియోలు చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. విమియో […]

ధ్వని వల్లనే బి.పి

శబ్ద కాలుష్యం వల్లనే బి.పి పెరుగుతుందని కనిపెట్టారు శాస్త్రజ్ఞులు రద్దీ ఎక్కువగా ఉండే రోడ్డుపైన నిరంతరాయంగా హారన్లు ఇంజన్ల మోతలు వినటం వల్ల బి.పి విపరీతంగా పెరుగుతుందట. తాజాగా ఒక పరిశోధన, ట్రాఫిక్ లో ఉండే వాళ్లలో కూడా బి.పి ఎక్కువగా ఉందని గుర్తించారు. సాధ్యమైనంత వరకు తక్కువ శబ్దాలున్న చోట ఉండమంటున్నారు నిపుణులు. పెద్ద శబ్దంతో టీవీ వినటం ముఖ్యంగా ఇయర్ ఫోన్లు వాడటం తగ్గించమంటున్నారు.

గోల్ ఇన్ శారీ

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ మున్సిపల్ కార్పొరేషన్ స్థానిక ఎన్జీవో తో కలిసి గోల్డ్ ఇన్ శారీ పేరుతో ఫుట్ బాల్ పోటీలను నిర్వహించింది. 8 బృందాలు పోటాపోటీగా ఆడాయి.వీళ్లంతా చిరు వ్యాపారులు,గృహిణులు 20 నుంచి 72 ఏళ్ల వాళ్ళు దాదాపు వంద మంది ఈ పోటీల్లో పాల్గొన్నారు రంగు రంగుల చీరెలతో విల్లు పాల్గొన్న ఈ పోటీ క్రీడల్లో మహిళల సామర్థ్యానికి నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.

బాక్సింగ్ లో ఛాంపియన్

ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో నిఖిత జరీన్ 50 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది 13 ఏళ్ల వయసులోనే బరిలోకి దిగింది జరీన్. తెలంగాణ రాష్ట్ర నిజామాబాద్ కు చెందిన జరీన్ వరుసగా రెండో ఏడాది కూడా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచింది. మేరీ కోమ్ తర్వాత ఎక్కువ స్వర్ణాలు గెలిచింది జరీన్ ఈ స్వర్ణ విజేత ఎంతో మందికి ఆదర్శం.

తొలి మహిళా మంత్రి

నాగాలాండ్ మహిళ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు సెల్ హౌతు వోనునో క్రూసే  60 మంది శాసనసభ్యులున్న నాగాలాండ్ అసెంబ్లీలో కాలు పెట్టిన తొలి మహిళ ఈమె గత పాతికేళ్లుగా అంగామీ ఉమెన్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలిగా అంగామీ పబ్లిక్ ఆర్గనైజేషన్ బోర్డ్ సభ్యురాలిగా పనిచేశారు.

మొదటి అడుగు

హామై దేశంలో మొదటి మహిళా ఫోటో జర్నలిస్ట్ (Ho mai vyara walla) చీరకట్టుతో, భుజానికి కెమెరాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.హామై 1913 లో గుజరాత్ లోని పార్సీ కుటుంబంలో జన్మించిన హోమై ఫోటోగ్రఫీ నేర్చుకున్నారు. ఢిల్లీ లోని బ్రిటిష్ ఇన్ ఫర్మేషన్ సంస్థ  లో పనిచేశారు. 50 ఏళ్ల పాటు ఆమె తీసిన ఫోటోలు చరిత్రకు సాక్ష్యాలుగా ఉన్నాయి. స్వతంత్రం ముందు పరిస్థితులు, దేశ రాజకీయాల్లో మార్పులు ఆమె తీసిన ఫోటోలు స్పష్టంగా కనిపిస్తాయి.

40 కోట్ల అభిమానులు

అమెరికన్ పాప సింగర్ సెలెనా ఇన్ స్టా లో అనుసరించే వారి సంఖ్య 40 కోట్లు. 2002 లో బర్నీ అండ్ ఫ్రెండ్స్ సీరియల్ తో కెరియర్ ప్రారంభించిన సెలెనా కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. 2017 లో బిల్ బోర్ట్  ఉమెన్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికైన, ఆమె నటిగా, గాయనిగా, నిర్మాత వ్యాపారవేత్త గా ఎన్నో అంశాల్లో దూసుకుపోయింది. యూనిసెఫ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక అయింది. ఆమె కొత్త […]