Monday, 27 Jul, 2026

అరుదైన కళాకారిణి

బెంగాల్ నాటక రంగంలో ఆధునిక దోరణులు పరిచయం చేసిన నటిగా పేరు తెచ్చుకుంది.బినోదిని దాసి.1847 లో కోల్ కత్తా నేషనల్ థియేటర్ తరఫున తొలిసారిగా ఒక సీరియస్ డ్రామా లో నటించింది బినోదిని 12 వ ఏటా మొదలుపెట్టిన నటనను 23 వ యేటా స్వస్తి పలికిన బినోదిని జీవిత చరిత్ర రాసుకున్న తొలి దక్షిణాసియా నటిగా ప్రసిద్ధికెక్కింది. ఆమె జీవిత చరిత్ర అమర్ కథ నటి బినోదిని పేరుతో బెంగాలీ సినిమా వచ్చింది.ఇప్పుడు ఆమె జీవితం […]

సెంగోల్ ఎక్కడ?

తమిళనాడు కు చెందిన శాస్త్రీయ నృత్యకారిణి పద్మ సుబ్రహ్మణ్యం సెంగోల్ రాజదండం గురించి ప్రధాని మోదీకి లేఖ రాయడం వల్లనే ధర్మానికి న్యాయానికి చిహ్నమైన ఆ సెంగోల్ ని కనుక్కోగలిగారు బ్రిటిష్ వారి నుంచి అధికారం బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు తమిళనాడు సాంప్రదాయం ప్రకారం ఈ రాజదండాన్ని 1947 ఆగస్టు 14న నెహ్రూ అందుకున్నారు. దాన్ని ఆయన అలహాబాద్ మ్యూజియాలకు చేర్చారు. రెండేళ్ల క్రితం ఈ రాజ దండం గురించిన వార్త చదివిన పద్మ సుబ్రహ్మణ్యం దీన్ని […]

నిరంతర పోరాటం లక్ష్యం

కేరళలో మొదటి ట్రాన్స్ జెండర్ న్యాయవాది గా సృష్టించారు 27 ఏళ్ల పద్మా లక్ష్మి కేరళలోని కొచ్చి లో జన్మించిన పద్మా లక్ష్మి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని న్యాయవాద వృత్తి లోకి ప్రవేశించారు.  ఇది సరికొత్త అధ్యాయానికి నాంది అంటూ కేరళ న్యాయ శాఖ మంత్రి ఎ.రాజీవ్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ట్రాన్స్ జెండర్ ల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని చెబుతున్నారు పద్మా లక్ష్మి.

ఈ హ్యాండ్ బ్యాగ్స్ మరీ స్పెషల్

రస్కీ పేరుతో బనానా బెస్ట్ లెదర్ ప్రొడక్ట్స్ తో మార్కెట్ లో అడుగు పెట్టింది శివాని పోపట్. తన బ్యాగులు యాక్ససరీస్ కు ముందు క్రూయాలిటీ ఫ్రీ అనే వాక్యం చేర్చి ఎంతో మందికి దగ్గర అయింది. శివాని. పర్యావరణ హితం కోరుతూ ఆమె ప్రారంభించిన ఈ కంపెనీతో చాలా త్వరలో పాదరక్షలు కూడా తేబోతోంది.వినియోగదారులు ఇష్టపడే లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లో రస్కీ కూడా ఒకటి.

బామ్మ ది గ్రేట్

ఆస్కార్ విన్నింగ్ టీవీ సీరియల్ ‘డి కుమార్స్ ఎట్ నంబర్ 42 లో మీరా స్వాల్ పోషించిన సుశీల అనే భామ పాత్ర సూపర్ హిట్. ఆమె ప్రతిష్టాత్మకమైన ‘భాస్టా’ ఫెలోషిప్ కు ఎంపికైంది. రచయిత్రిగా మీరా రాసిన ‘అనితా అండ్ మి’ పుస్తకానికి ఎంతో గుర్తింపు లభించింది. రచయితల తొలి పుస్తకానికి ఇచ్చే ప్రఖ్యాత బెట్టీ ట్రాస్క్ అవార్డు గెలుచుకుంది.ఆమె చక్కని గాయని.పంజాబ్ గ్రామీణ ప్రాంతాలలోని జానపదాలు చక్కగా.61 సంవత్సరాల మీరా బహుముఖప్రజ్ఞశాలి.

నృత్యమే జీవితం

చెన్నయ్ కు చెందిన రాణీ రామస్వామి భారత నాట్య కళాకారిణి మూడు దశాబ్దాల క్రితం అమెరికా లోని మినియా పోలీస్ లో రాగమాల డాన్స్ కంపెనీ కి శ్రీకారం చుట్టింది. ప్రసిద్ధ జాతీయ అంతర్జాతీయ కళాకారులతో కలిసి పని చేస్తోంది రాణీ రామస్వామి ఆమెతో పాటు ఆమె ఇద్దరు కూతుళ్లు అపర్ణ అశ్విని కూడా ఆమె తోడుగా ఈ ప్రయాణంలో ఉన్నారు. హిందూ, సూఫీ తత్వాన్ని మేళవిస్తూ రూపొందించిన రిటన్ ఇన్ వాటర్ నృత్యరూపకం వాళ్ల ముగ్గురికి […]

ఓ అమ్మ కదా

తన బిడ్డలను తనకు అప్పగించాలని నార్వే ప్రభుత్వం పై సాగరిక చక్రవర్తి చేసిన పోరాటం ఇప్పుడు రాణి ముఖర్జీ ప్రధాన పాత్రలు ‘మిసెస్‌ ఛటర్జీ వర్సస్‌ నార్వే’ సినిమాగా వచ్చి విజయం సాధించింది. భారతదేశంలో అలవాటైన పద్ధతిలో చేత్తో అన్నం తినిపించడం పాపాయి పక్కన పడుకోవడం వంటివి బ్యాడ్ పేరెంటింగ్‌ రిపోర్ట్ చేసి నార్వే లో పిల్లల సంరక్షణ సభ్యులు పిల్లలను పోస్టర్ పేరెంటింగ్ లో ఉంచారు. దూరమైన పిల్లల కోసం కోర్టుల చుట్టూ తిరిగి సాగరిక […]

ఆమెదే తొలి అడుగు

బెంగళూరుకు చెందిన అదితి అశోక్  ఐదేళ్ల వయసులోనే క్రీడారంగంలో అడుగుపెట్టింది బెంగళూరు గల్ఫ్ క్లబ్ కర్ణాటక గల్ఫ్ అసోసియేషన్ తరఫున ఎన్నో పోటీల్లో పాల్గొన్నది తాజాగా ఎల్.పి.జి.ఏ ప్రపంచ ర్యాంకింగ్ టాప్ 50 లోకి ప్రవేశించింది.ఆ ఘనత అందుకున్న తొలి భారతీయురాలు అదితి.

ప్రకటనల్లో మహిళ కోణం  

రీడిఫ్యూజన్ బ్రాండ్ సొల్యూషన్ సంస్థ ఆల్ విమెన్ యాడ్ ఏజెన్సీ ప్రారంభించింది టిస్టా సేన్. దానికి డైరెక్టర్ చైర్ పర్సన్ తన్వి గోయిల్  ఈ సంస్థలో అందరూ మహిళా ఉద్యోగులే ఒక నివేదిక ప్రకారం ఎన్నో బ్రాండ్ లకు మహిళలే ఎక్కువ కొనుగోలు దారులు. ప్రకటనల్లో స్త్రీ కోణాలను సృజించటం వ్యాపార, వాణిజ్య రంగాల్లో కొత్త వరవడి సృష్టించటం తమ లక్ష్యం అంటారు.

ఆర్.జె కేరాబాయి  

72 సంవత్సరాల కేరాబాయి ఫేమస్ రేడియో జాకి మహారాష్ట్ర లోని మహాస్వాద్ లో ఉంటుంది. మన్ దేశీ అనే కమ్యూనిటీ రేడియో ద్వారా చక్కగా పాడుతుంది. కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం లో కూడా పాల్గొన్నది. యుఎస్ ఇంటర్నేషనల్ బ్రాడ్ కాస్టర్ వాయిస్ ఆఫ్ అమెరికా తారాబాయ్ జీవితాన్ని వాటర్ ఫర్ గోల్డ్ పేరుతో రూపొందించింది. ఇంటి పనులు,వంట పనులు, పొలం పనులు చేస్తూ కనిపించే తారాబాయి ఆశువుగా కవిత్వం కూడా చెబుతుంది.

తీయని వ్యాపారం

జాగర్ కేన్ పేరుతో నాణ్యమైన బెల్లం పొడి వ్యాపారం చేస్తోంది నవనూర్ కౌర్. చక్కెర కు ప్రత్యామ్నాయం బెల్లమే అని చెప్పే నవనూర్ కౌర్  తయారు చేసే బెల్లం 9 నెలలు నిల్వ ఉంటుంది ఆమె జన్మస్థలం లుధియానా. ఆమె బ్రాండ్ జాగర్ కేన్. గత ఏడాది రెండు కోట్ల టర్నోవర్ సాధించింది. పంజాబ్ లోని 22 జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ ఉంది.

అత్యుత్తమ రుచులు

చిన్న వయసులోనే స్టార్ చెఫ్ గా పేరు తెచ్చుకున్న ముంబై కు చెందిన నియతి రావు.ఫోర్బ్స్ 30 అండర్ 30 ఏషియా 2023 జాబితాలో చోటు సంపాదించింది.కోపెన్‌హాగన్ లో వరల్డ్ ఫేమస్ రెస్టారెంట్ నోమాలో ఇంటర్న్ షిప్ చేసి నియతి ‘ఎక్కా’ రెస్టారెంట్ ప్రారంభించింది. 14 నెలల్లో ఎక్కా ఆసియాలోని అత్యుత్తమ రెస్టారెంట్స్ జాబితాలో చోటు సంపాదించింది.భారతీయ వంటకాలలో ఉపయోగించే దినుసులతో కొత్త ప్రయోగాలు చేసే నియతి ఎన్నో కొత్త రుచులు పరిచయం చేసింది.

క్రీడా స్ఫూర్తి

బౌ సామ్నాంగ్ కంబోడియా రన్నర్ అయిదువేల కిలో మీటర్ల రేసులో పాల్గొన్నది ఆమె కటిక పేదరికంలో వట్టి పాదాలతో సాధన చేసి నేషనల్ ఆధ్లటీ గా ఎదిగిన సాహసి ఆరోగ్యం కూడా బాగాలేదు. ఆరోజు జోరున వాన కురుస్తుంది అప్పటికే విజేత పేరు కూడా ప్రకటించారు కానీ కళ్ళల్లో వర్ష దారాలు పడుతున్న కాలు పటుతపుతున్న ఎలాగో పరుగు పూర్తి చేసిన సామ్నాంగ్ వీడియో వైరల్ అయిపోయింది.సౌత్ ఈస్ట్ ఏషియన్ గేమ్స్ లో చోటు చేసుకున్న ఈ […]

తొలి గ్రాఫిక్ నవల

దేబాస్మిత దాస్‌గుప్తా గ్రాఫిక్ నవల రచయిత్రిగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తాజాగా ఆమె రాసిన టెర్మినల్-3 గ్రాఫిక్ నవల కు విశేష ఆదరణ లభించింది. మాస్ కమ్యూనికేషన్స్ చదువుకొన్న దేబాస్మిత సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఏషియా యూరప్ ఫౌండేషన్ తో పాటు ఎన్నో అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేసింది. ఆర్ట్ పాజిటివ్ అనే స్వచ్ఛంద సంస్థ కు శ్రీకారం చుట్టింది.ఆమె రాసిన నవల చదువుతూ అందులో బొమ్మలు చూస్తుంటే ఆ బొమ్మల ద్వారా సినిమా చూస్తున్నట్లు […]

మిన్ను మణి

మిన్ను మనీ కేరళ కు చెందిన తొలి గిరిజన మహిళ క్రికెటర్ కేరళలోని వయనాడ్ జిల్లా లోని గిరిజన గూడెం కరూబియ గిరిజన తెగ బ్రహ్మగిరి కొండల అంచున జీవిస్తారు. మిన్ను మణి వయనాడ్ జిల్లా జట్టుతో అండర్ 16 జట్టుతో కేరళ రాష్ట్ర మహిళా జట్టుతో ఆడింది. ఇప్పుడు ఆమెను విమెన్స్ ప్రీమియర్ లీగ్ కోసం 30 లక్షల కు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకున్నాయి. మిన్ను మణి భారత్ అండర్ 23 జట్టులో ఆడింది. […]

పాటే జీవితం

ఈశాన్య రాష్ట్రం మిజోరం లో రన్రెసంగి ని సాంస్కృతిక చిహ్నం లా భావిస్తారు.మిజో జానపద గీతాలు రారాణి  అంటారు. మిజోరం లోని సెర్చిప్ జిల్లా కీటమ్ గ్రామం ఆమె జన్మస్థలం పెళ్లి వేడుకల్లో, చర్చి కార్యక్రమాలల్లో పాడే చిన్న గ్రామీణ గీతాలను ఆమె రేడియోలో పాడారు జానపదాలు, భక్తి గీతాలు, ప్రణయ గీతాలు సేకరించారు సంగీతం రంగానికి ఆమె చేసిన సేవలకు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. 2017 లో సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది. మూడు […]

షోస్ టాపర్ దర్శన

దర్శన రాజేంద్రన్ ను షోస్ టాపర్ అంటూ పరిచయం చేసింది ఫోర్బ్స్ జయ జయ జయ జయహే సినిమాలో మార్షల్ ఆర్ట్ నేర్చుకుని భర్తకు బుద్ధి చెప్పిన భార్య గా నటించిన దర్శన పుట్టిన ఊరు ఎర్నాకుళం. లండన్ లో ఫైనాన్షియల్ ఎకనామిక్స్ లో పిజీ చేసింది. నటిగా  సినిమాల్లో కెరీర్ మొదలు పెట్టింది. హృదయం,డియర్ ఫ్రెండ్, నయా సఫర్, సినిమాలు విజయవంతంగా అయ్యాయి. అట్లా ఆమె షోస్ టాపర్స్ జాబితాలోకి ఎక్కింది.

వైద్య వృత్తే నా కెరీర్

హౌస్ సర్జన్ చేస్తూనే సినిమాల్లో నటిస్తోంది ఐశ్వర్య లక్ష్మి. సినిమా పరిశ్రమలో అడుగు పెట్టాక నటించిన ప్రతి సినిమాకు పురస్కార్ వచ్చాయి అమ్ము, మట్టి కుస్తీ, గార్గి, పొన్నియన్ సెల్వన్ అన్నింటిలోనూ ఘనవిజయమే. గార్గి సినిమా సహనిర్మాత కూడా. ఫోర్బ్స్ ఆమెను  షోస్ టాపర్ జాబితాలో చేర్చి గౌరవించింది. ఎప్పటికైనా డాక్టర్ గా స్థిరపడతాను అని చెబుతోంది ఐశ్వర్య లక్ష్మి.

నవలా రాణి

తెలుగు అమ్మాయిలు కలలు ఎందుకు కనాలో ఆ కలలు ఎలా సాకారం చేసుకోవాలంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలో సరిగ్గా 60 ఏళ్ల క్రితం యద్దనపూడి సులోచనారాణి తన నవలల ద్వారా చెప్పారు. దక్షిణ భారతదేశంలో తొలి తెలుగు డైలీ సీరియల్ యద్దనపూడి రాసిన ఋతురాగాలు ,సెక్రటరీ ఆరాధన, మీనా జీవనతరంగాలు వంటి నవలలు జనాదరణ పొందాయి. చందమామ వరకే చదివే అలనాటి ఆడపిల్లలను నవల సాహిత్యం లోకి తీసుకుపోయిన ఘనత నవల రాణి సులోచన రాణి దే. […]

అంతులేని దయ

ఒంగీ గిరిజన తెగల కోసం పనిచేసిన శాంతి తెరిసా లక్రా ను ప్రభుత్వం ఎప్పుడో పద్మశ్రీ ని బహుకరించింది. అండమాన్ లోని డుగోంగ్ క్రీక్‌ లో ఆదివాసీలు ఎక్కువ వారు నాగరిక ప్రపంచంలో కలువరు వైద్య సేవలు తీసుకోరు శాంతి లక్రా ఎంతో ఓర్పుతో వారి నమ్మకం సంపాదించుకుంది. 2004 లో అండమాన్ ను కుదిపేసిన సునామీ విపత్తులో కూడా శాంతి ఆదివాసీల సేవలోని మునిగి ఉన్నది.2020 కోవిడ్ కాలంలో ఆదివాసీలను ఒప్పించి అందరికీ వ్యాక్సిన్ వేసుకునేలా […]