Sunday, 26 Jul, 2026

లేజర్ షూటర్

చదువు, ఆట రెండు ముఖ్యమే అంటుంది రిథమ్ సాంగ్వాన్ లేడి శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న రిథమ్ ను లేజర్ షూటర్ అంటారు హర్యానా కు చెందిన ఈ భారతీయ పిస్టల్ షూటర్ అంతర్జాతీయ జూనియర్ ఛాంపియన్షిప్ ప్రపంచ కప్ ల్లో రాణించింది. గత సంవత్సరం స్పోర్ట్‌స్టార్ ఏసెస్ అవార్డ్ ల్లో బెస్ట్ యంగ్ అచీవర్ గా నిలిచింది.గత ఆసియా క్రీడల్లో బృంద విభాగంలో స్వర్ణ పథకం అందుకోవటమే కాకుండా 25 మీటర్ల పిస్టల్ విభాగంలో 29 […]

ఉత్తమ క్యూ రైటర్

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం కోసం అక్కడి విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు మసూమా రిజ్వీ తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన మసూమా పురాతన కట్టడాల పునరుద్ధరణ ప్రాజెక్ట్ లు ఎన్నో చేపట్టారు. రాష్ట్రపతి భవన్ మానెక్షా సెంటర్, దీన్ దయాల్ మ్యూజియం వంటివి ఆమెకు పేరు తెచ్చాయి ఇప్పుడీ విమానాశ్రయం తో బాల్యం నుంచి అయోధ్య చేరేవరకు రాముడి జీవిత ప్రయాణాన్ని కలంకారీ పట చిత్ర రాజా రవి వర్మ చిత్రాల ద్వారా తీసుకువచ్చారు దేశవ్యాప్తంగా 100 మంది కళాకారులు […]

డాన్స్ అంటే ప్రాణం

డాన్స్ అంటే ఎంతో మందికి చాలా ఇష్టం ఎంతో కృషి చేసి నృత్యం లో పరిణితి సాధిస్తారు ఎంతోమంది. అట్లా డాన్స్ పట్ల ఎంత ఇష్టం అంటే ఏకధాటిగా ఐదు రోజులు పాటు డాన్స్ చేసే అంత అంటుంది సృష్టి సుదీర్.పదహారేళ్ల వయసున్న సృష్టి నిరవధికంగా 127 గంటలపాటు నాట్యం చేసి లాంగెస్ట్ డాన్స్ మారథాన్ విభాగంలో గిన్నిస్ రికార్డు సాధించింది.

అత్యంత పొడవైన జుట్టు

గిన్నిస్ బుక్ లో ప్రతి సంవత్సరం సరికొత్త రికార్డు తో తిరగరాస్తుంటారు. అలా కేవలం తన జుట్టు విషయంలో గిన్నిస్ బుక్ రికార్డ్ లోకి ఎక్కింది స్మితా శ్రీవాస్తవ. ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఈమె జుట్టు పొడవు 236. 22 సెంటీమీటర్లు అంటే ఏడు అడుగుల 8 అంగుళాలు. అత్యంత పొడవైన కురులు కలిగిన మహిళగా రికార్డ్ కెక్కింది స్మితా శ్రీవాస్తవ.

ప్రపంచ రికార్డ్

కొంతమంది పుట్టుకతోనే అరుదైన లక్షణాలు కలిగి ఉంటారు. ఇదే వాళ్లకి పేరు తెచ్చి పెడుతుంది. వింటానికి తమాషాగా ఉన్నా ఇది సత్యం అందరికీ నోట్లో 32 పళ్లే ఉంటాయి. తమిళ్ అమ్మాయి కల్పన బాలన్ కు 38 దంతాలు ఉన్నాయి. పై దవడకు రెండు అదనపు పళ్ళు కింద దవడకు నాలుగు అదనపు పళ్ళు కల్పనకు ప్రపంచ రికార్డ్ తెచ్చిపెట్టాయి

బిల్కినో కి అండగా

రేవతి లాల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఫిలిమ్ మేకర్ యాక్టివిస్ట్ కూడా పిల్లల సంక్షేమం కోసం పనిచేసే తార హోమ్స్ అనే ఎన్జీవో కి వ్యవస్థాపక సభ్యురాలు రేవతి ఎన్ డి  టివి తెహల్కా వంటి మీడియా సంస్థల్లో పనిచేశారు. 2002 గుజరాత్ లో అల్లర్ల నిందితుల దుశ్చర్యలపై ‘ది అనాటమీ ఆఫ్ హేట్’ అనే పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. సామూహిక అత్యాచారానికి గురైన బిల్కినో భాను విషయంలో కేసు దాఖలా చేసింది రేవతి. అప్పటి నుంచి […]

నిస్సహాయులకు అండ

రూప్ రేఖా వర్మ లక్నో యూనివర్సిటీ మాజీ యాక్టింగ్ వైస్ ఛాన్సలర్,ప్రొఫెసర్ అనేక కీలక పదవుల్లో బాధ్యతలు వహించారు. సామాజిక కార్యకర్త మహిళలపై అత్యాచారాలు మతపరమైన హింస సంఘటనల్లో బాధితుల పక్షాన ఎన్నో పోరాటాలు చేశారు రూప్ రేఖా వర్మ.  వాటిలో ముఖ్యంగా చట్ట వ్యతిరేకత కార్య కలాపాల నివారణ చట్టం (ఉపా) తో 2020 లో అరెస్టయిన జర్నలిస్ట్ సిద్దిక్ కప్పన్ కోసం ఆమె చేసిన పోరాటం ఎనలేనిది లాంగ్ ఆధారిత హింసకు వ్యతిరేకంగా పనిచేసే […]

మూడు లక్షల మందికి పాఠాలు

యశోద లోధి ఉత్తరప్రదేశ్ లోని మారుమూల గ్రామంలో పుట్టి పెరిగింది ప్రభుత్వ పాఠశాలలో హిందీ మధ్యమంగా చదువుకున్నది ఇంగ్లీష్ పైన పట్టు సాధించి డిగ్రీ పూర్తి చేసింది.పెళ్లయ్యాక భర్తకు ప్రమాదం జరిగి కష్టాలు వచ్చాయి దాంతో కూలి పనులకు వెళ్లే యశోద నెమ్మదిగా 2021 లో ఇంగ్లీష్ విత్ దేహతి మేడమ్‌ గా యూట్యూబ్ లోకి వచ్చింది. తేలికైన ఇంగ్లీష్ లో పాఠాలు చెప్పే యశోదకు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. టెటెక్స్ జోష్ టాక్ […]

ఇంగ్లీష్ విత్ మెర్లిన్

ఇంగ్లీష్ విత్ మెర్లిన్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంగ్లీష్ నేర్పుతారు 80 ఏళ్ల మెర్లిన్ పుట్టింది మయన్మార్. బాగా చదువుకొని పిల్లలకు మ్యాథ్స్,ఇంగ్లీష్ పాఠాలు చెప్పేది. పెళ్లయ్యాక చెన్నైలో స్థిరపడిన తర్వాత  అయినవాళ్లు ఒకరి తరువాత ఒకరు చనిపోవడంతో ఒంటరై  80 ఏళ్ల వయసులో భిక్షాటన మొదలుపెట్టింది.ఈమె గురించి విని వృద్ధాశ్రమంలో చేర్చాడు ఒక కుర్రాడు. ఆమె కథ నెట్ లో అయింది. ఎంతోమంది మాకు ఇంగ్లీష్ నేర్పు అని అడిగారు. ఇప్పుడామె రోజువారి కార్యకలాపాల గురించి సులువుగా […]

బలే వ్యాపారం

పుట్టినరోజులు పెళ్లి రోజుల కోసం చక్కని కానుక అనిపించేంత అందంగా ఉంటాయి అదితి ఖండేల్వాల్ పెంచే ట్రే గార్డెన్స్. ఈమె  సొంత ఊరు జైపూర్ ఎం బి ఏ చదివింది. ఆమెకు అలంకరణ మొక్కలంటే ఇష్టం చిన్నచిన్న పళ్ళేలలో రకరకాల అలంకరణ మొక్కల్ని పెంచి వాటిని అమ్మడం మొదలు పెట్టింది. వాటికి ఎంతో ఆదరణ ఉండటంతో ఫ్లోరా ఫ్రెంజ్ పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసింది.ఈ ట్రే  గార్డెన్ లకు ఎంతో గిరాకీ ఉంది.

స్త్రీల వేదనల సమాహారం

మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పైన డాక్యుమెంటరీలు తీయాలని డైరెక్టర్ తనూజ చంద్ర ధ్యేయం టీవీ సీరియల్స్ జమీన్ ఆస్మాన్ లో డైరెక్టర్ గా వినోద రంగంలోకి అడుగు పెట్టింది తనుజ. ఇప్పుడు వెడ్డింగ్ ఖాన్ అని సరికొత్త డాక్యుమెంటరీ సిరీస్ తో ప్రేక్షకుల ముందు వచ్చింది తనుజ మ్యాట్రిమోనియల్ మసాలా ద్వారా నష్టపోయిన మహిళల కథలు ఇవి ఈ సిరీస్ ద్వారా భారత మహిళలకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది తనుజ.రొమాంటిక్ డ్రామా షార్ట్ ఫిల్మ్ మాన్ సూన్ […]

అత్యుత్తమ నిర్మాత

పంజాబ్ కు చెందిన గునీత్ మోంగా  నిర్మించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ ఆస్కార్ అవార్డ్ లభించింది. పంజాబ్ కు చెందిన గునీత్ మోంగా 16 ఏళ్లకే సంపాదన మొదలుపెట్టారు. డ్రైవర్ గా సేల్స్ ఏజెంట్ గా ఎన్నో పనులు చేశారు.

సమాజ సేవకు అవార్డు

ప్రఖ్యాత రచయిత్రి సమాజ సేవకురాలు సుధా మూర్తి. ఈ ఏడాది గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. మనదేశంలో ఈ అవార్డు అందుకున్న తొలి మహిళ సుధా మూర్తి.ఈ అవార్డుకు ఇచ్చిన 50 వేల డాలర్ల బహుమానాన్ని కెనడా ఫీల్డ్స్  ఇన్స్టిట్యూట్ కు దానం చేశారు సుధా మూర్తి. తన రంగంలో అద్భుతమైన ప్రతిభ, చూపించిన వారికి కెనడా ఇండియా ఫౌండేషన్ ప్రతి ఏటా ఈ అవార్డు ఇస్తుంది.

31 ఏళ్లకు జైల్లోనే

ఇరాన్ కు చెందిన నర్గీస్ మొహమ్మద్ నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు ఇరాన్ లో మరణ శిక్షలు హిజాబ్ ప్రభుత్వం జైలు పాలు చేసింది. ఎంతవరకు ఆమెను 13 సార్లు అరెస్ట్ చేస్తే 31 ఏళ్ల పాటు జైల్లోనే గడిపింది నర్గీస్. ఆమె ధైర్యానికి ఆమెకు నోబెల్ లభించింది.

పిల్లలపై ఒక అదుపు

టెడెక్స్ స్పీకర్, బ్లాగర్ రిచా సింగ్ బ్లాగర్స్, ఇన్ ఫ్లూయన్స్ లను ఒక వేదిక పైకి తెచ్చేలా 2016 లో బ్లాగ్ చాటర్ ప్రారంభించింది.టీనేజర్లు చూసే ఆన్ లైన్ కంటెంట్ ను కాస్త పెద్దవాళ్ల అదుపులోకి తెచ్చేలాగా 2022  లో హాపీ నెట్జ్ ప్రారంభించింది రిచా. ఈ పరికరం ఏ ఐ మిషిన్ లెర్నింగ్ సాయంతో నాలుగు దశల్లో సైట్ ను వడ పోస్తుంది. పెద్దవాళ్ల ఫోన్ కు కనెక్ట్ అయి ఉంటుంది కనుక పిల్లలు ఏ […]

తొలి ఈ రిక్షా డ్రైవర్

జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లా భాదర్వ టౌన్ కు చెందిన మీనాక్షి దేవి చీనాబ్ లోయ లోనే తొలి ఈ రిక్ష డ్రైవర్ గా నిలిచింది. ఆనారోగ్యం తో పని చేయలేని భర్త,ఇద్దరు పిల్లలను బతికించుకునేందుకు మీనాక్షి డ్రైవర్ వృత్తి ని ఎంచుకొంది సబ్సిడీ తో ఆటో కొనుక్కొని నడపడం మొదలు పెట్టింది తొలి సారి ఆటో డ్రైవర్ గా బస్ స్టాండ్ లో అడుగుపెట్టడం కాస్త విచిత్రంగా చూశారు కానీ ఇప్పుడు అంత అలవాటై […]

టాప్ టెన్ లో కియారా

గూగుల్ ట్రెండ్స్ విడుదల చేసిన టాప్ టెన్ జాబితా లో కియారా అద్వానీ పేరు చోటు చేసుకుంది. ఈ సంవత్సరం భారతీయులు ఈమెను తెగ వెతికారు. అలాగే ఈ మధ్య కియారా ను పెళ్లాడిన నటుడు సిద్ధార్థ మల్హోత్రా కూడా టాప్ టెన్ లో ఉన్నాడు. ఫగ్లీ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కియారా అర్జున్ రెడ్డి మేక్ కబీర్ సింగ్ తో ఆకాశంలోకి దూసుకు పోయింది. ఇన్ స్టా లో 3. 3 కోట్ల […]

మంచి కథలు ఎంచుకొంటా

ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్షిత రెడ్డి బలగం సినిమా తో అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకుంది. దిల్ రాజ్ ప్రొడక్షన్స్ స్థాపించి ఏటీఎమ్ వెబ్ సిరీస్ నిర్మించింది హన్షితా రెడ్డి. నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఫిమేల్ ప్రొడ్యూసర్స్ లో హన్షితా కు మంచి పేరు దక్కింది.50 సినిమాలు నిర్మించి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాలు చేసిన నిర్మాత గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు  కుమార్తె గా హన్షితా అర్థవంతమైన కథలనే ఎంచుకుంటాను […]

చీరె తో వర్క్ వుట్స్

ఉదయపు నడకలో లేదా జిమ్ ఆ వ్యాయామాలకు ఉపయోగపడే డ్రెస్ లే అవసరం అనుకుంటారు కొందరు. డ్రెస్ ధరించేందుకు ఇష్టపడరు. అలాంటి వారి కోసం వ్యాయామం పైన అవగాహన కల్పించడం కోసం చీర కట్టుతో వర్క్ వుట్స్ చేసి చూపించింది పూనే కు చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు  శార్వరి ఇనామ్ దార్   జిమ్ లో చీరతో వర్క్ వుట్స్ చేస్తున్న ఆమె ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యాయి.మహిళలు తమ ఆరోగ్యం పైన దాన్ని మెరుగుపరుచుకునేందుకు […]

స్వేత సౌధం లో ప్రదర్శన

విభా జానకిరామన్ చెన్నైలో పుట్టి పెరిగింది. సంగీతాన్ని కెరీర్ గా ఎంచుకొని బ్యాచిలర్స్ చేస్తుంది.సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం ఈమెది. ఆర్కెస్ట్రాల్ చాంబర్ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ లో ప్రదర్శనలు ఇచ్చి స్కాలర్షిప్ అందుకుంది.ప్రధాని మోదీ, అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ సమక్షంలో కూడా పాడి వారి మెప్పు ను పొందింది జానకి రామన్. ఈ అమ్మాయి వయసు 17 సంవత్సరాలు.