Saturday, 25 Jul, 2026

దివ్యాంగుల సేవలో ధన్యత

రమా పద్మనాభన్  పరీక్షల సీజన్ లో చాలా బిజీగా ఉంటుంది. ఎంతోమంది దివ్యాంగులకు ఆమె పరీక్షలు రాసి పెట్టే పనిలో ఉంటుంది. కోయంబత్తూర్ కు చెందిన రమా పద్మనాభన్ సైకాలజీ లో డిగ్రీ చేసింది. గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసింది. 2013 లో ఒక ఆంధ్ర విద్యార్థి కి పరీక్ష రాసి పెట్టాక ఆ విద్యార్థి మొహం లో కనిపించిన కృతజ్ఞత ఆమెకు ఎంతో సంతృప్తి కలిగించింది. ఆ తరువాత దివ్యాంగులకు, […]

రకుల్ రెస్టారెంట్ ఆరంభం

దక్షిణాదిలో అగ్ర తారగా తనకు ప్రత్యేకత నిరూపించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ వ్యాపార రంగంలో తన ప్రత్యేకత చూపిస్తోంది. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఫిట్ నెస్ సెంటర్లు నడుపుతున్న రకుల్ దేశవ్యాప్తంగా రెస్టారెంట్లను స్థాపిస్తోంది.ఈ ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ లో ఒక చక్కని రెస్టారెంట్ ఓపెన్ చేసింది. ఆ తొలి రెస్టారెంట్ పేరు ‘ఆరంభం’ ఒక బిజినెస్ తో కొంతమందికైనా ఉపాధి అవకాశాలు ఇవ్వగలగడం నాకు సంతోషం ఇస్తుంది అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.

అవంతిక కు అవార్డ్

తెలుగు అమ్మాయి హాలీవుడ్ నటి అవంతిక వందనపు నాకు హార్వర్డ్ యూనివర్సిటీ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చి గౌరవించారు. మీన్ గర్ల్స్ ఫేమ్ గా పాపులర్ అయిన ఈ నటి భారతీయ ఓటిటి సిరీస్ బిగ్ గర్ల్స్ ”డోంట్ క్రై”లో అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నది. అవంతిక వందనపు నటనకు,కళలకు ఆమె చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం అందించారు. ఆమె చక్కని డాన్సర్ కూడా. అమెరికన్ కన్జర్వేటరీ థియేటర్ లో […]

మిస్ యూనివర్స్ రోడ్రిగ్జ్

ఈ సంవత్సరం మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ 2024 అలెజాండ్రా మరిస్సా రోడ్రిగ్జ్ 60 ఏళ్ల రోడ్రిగ్జ్ తన కన్నా చిన్న వాళ్లను పక్కకు నెట్టి కిరీటం సొంతం చేసుకుంది. అందాల పోటీలు అంటే శారీరక సౌందర్యం మాత్రమే కాదు విలువలూ, ప్రమాణికమే అనేందుకు నేనే నిదర్శనం అంటోంది రోడ్రిగ్జ్ అర్జెంటీనా లోని లా ప్లాటా ఆమె ఊరు. న్యాయవాది జర్నలిస్ట్ కూడా.

విమానం మా గుప్పిట్లో

ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ పూజ ఉమా శంకర్ విమానాశ్రయం లో ఈ రంగానికి ప్రాముఖ్యత చాలా ఎక్కువ విమానం ఎగిరే ముందర ఇంధన స్థాయి, టైర్లలో ప్రెషర్, లైట్లు అన్ని యంత్రాలు సరిగ్గా చెక్ చేసి ఎగిరేందుకు అనుమతి ఇచ్చే విభాగం ఇది. ఏరోనాటికల్ ఇంజనీర్ గా బాధ్యత తీసుకున్న ఉమాశంకర్ ప్రపంచవ్యాప్తంగా విమాన నిర్వహణ విభాగంలో 2.6 శాతం మాత్రమే మహిళలు ఉన్నారని చెబుతోంది. ఎండ వానల్లో పనిచేయాల్సిన ఈ ఉద్యోగం ఎన్నో సవాళ్లతో […]

సమస్యకు పరిష్కారం

‘పిరుల్స్’ సంస్థ ద్వారా అడవుల సంరక్షణ, అలాగే స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.నుపుర్ పోహార్కర్ ఉత్తరాఖండ్ లోని ఖేతి ఖాన్   గ్రామంలో ఉన్న పైన్ చెట్ల వల్ల అక్కడ అడవుల్లో మంటలు చెలరేగటం స్థానికులు గృహాల్లో తలదాచు కోవటం చూసింది నుపుర్. పల్ల ల్లాంటి పైన చెట్ల ఆకులతో గృహోపకరణాలు తయారు చేయటం నేర్పించటం ద్వారా అక్కడ ప్రజలకు జీవనోపాధి దొరికింది అలాగే చెట్ల  ఆకులు మొత్తం పరుచుకోవటం వల్ల అడవుల్లో మంటలు కూడా ఆగిపోయాయి […]

భాష లేని కాలంలో లిపి

డూడల్స్ డబ్బా సంస్థను ప్రారంభించి భారతీయ డూడల్స్ కళకు కొత్త రూపం పోసింది ఖుష్బూ గుప్తా.భాష లేని కాలంలో మన పూర్వికులు విషయాన్ని రకరకాల బొమ్మలు, గీతల రూపంలో గుహల గోడల పైన గీసే వాళ్ళు ఆ కళ పేరే డూడ్లింగ్.ఆ కళే ఖుష్బూ గుప్తా ప్రాజెక్ట్ బాడీ షేమింగ్ ప్రకృతి ఆధ్యాత్మిక ప్రపంచం రహస్యాలకు సంబంధించిన అంశాలను ఎంచుకొని డూడల్స్ రూపొందిస్తుంది ఖుష్బూ ఈ ఎల్ ఐ సిరీస్ యానిమల్స్ అరౌండ్ ది గ్లోబ్ లవ్ […]

కెరటాలపై స్వారీ

2024 పారిస్ సమ్మర్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది 26 సంవత్సరాల నేత్ర కుమనన్.సెయిలింగ్ లో జాతీయ అంతర్జాతీయ పథకాలు సాధించింది. నీలి సముద్రం లో సెయిలింగ్ చేయటం అంటే కెరటాలపై స్వారీ చేయటం అంటుంది నేత్ర. దేశం తరఫున రెండు సార్లు ఆసియా క్రీడల్లో పాల్గొన్నది అంతర్జాతీయ సెయిలింగ్ ఛాంపియన్ షిప్ లో 20 కి పైగా పథకాలు సాధించింది. ఎంబిఎ చదువుతున్న నేత్ర ఈ సాహస క్రీడ ఆడవాళ్లకు సాధ్యమే అని నిరూపించింది.

వేల మంది అమ్మాయిలకు విముక్తి

బిబిసి తో సహా ప్రముఖ వార్తా సంస్థలతో కలిసి పనిచేసిన జర్నలిస్ట్ రుచిరా గుప్తా. తన డాక్యుమెంటరీ ది సెల్లింగ్ ఆఫ్ ఇన్నసెంట్స్ కు ఎమ్మి పురస్కారం లభించింది. అవుట్ స్టాండింగ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం లో పురస్కారం అందుకున్న రుచిరా గుప్తా కొన్ని వేల మందికి సెక్స్ వర్కర్స్ గా మారిన అమ్మాయిలను విముక్తులుగా చేసింది. తను సేకరించిన సమాచారం లో వందమంది హ్యూమన్ ట్రాఫికర్స్ ను జైలుకు పంపారు. ఈ క్రమంలో ఫ్రెంచ్ అత్యుత్తమ పురస్కారం […]

అత్యంత సంపన్న ముస్లిం మహిళ

దేశంలోనే సంపన్న ముస్లిం మహిళ కూడా ఫరా మాలిక్ భాంజీ. పేరున్న రిటైల్ పాదరక్షల సంస్థ మెట్రో బ్రాండ్ ఆమె తండ్రి కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి నెమ్మదిగా డైరెక్టర్ గా ఎదిగారు. 2010లో లైన్ వెబ్ సైట్ ఏర్పాటు చేసి 800 పైగా శాఖలతో సంస్థను దేశమంతా విస్తరించారు. నాయకురాలిగా ఫోర్బ్స్ జాబిదాలో ఎక్కారు. ఆమె 28 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తోంది. పాదరక్షల రంగంలో మెట్రో ని లీడర్ గా నిలిపారామె.

దివ్యాంగులకు అండ

అమితా పటేల్ అహ్మదాబాద్ సమీపంలోని జోద్ పూర్ లో పుట్టారు పసితనం లోనే పోలియో సోకి వీల్ చైర్ కే పరిమితం అయ్యారు గ్రామపంచాయతీ స్కూల్లోనే చదువుకుని అంచెలంచెలుగా లా పూర్తి చేశారు. వికలాంగుల కోసం కంప్యూటర్ కోర్సులు నేర్పిస్తారామే మంచి అథ్లెట్ కూడా. జావెలిన్ త్రో లో చాలా పథకాలు సాధించింది. సామాజిక కార్యకర్త మంచి రచయిత్రి కూడా. దివ్యాంగత రోజ్ గార్ మేళ, దివ్యాంగ్ జీవనోపాధి వంటి కార్యక్రమాలు నిర్వహించి వారికి మంచి జీవితం […]

పుస్తకాల గురించి ప్రచారం

సోనా లీన్ బుక్ క్లబ్ పేరుతో గత ఏడు సంవత్సరాలుగా పుస్తకాల గురించి ప్రచారం చేస్తుంది సోనాలి బింద్రే. పుస్తక పఠనం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రచారం చేయటం ఈ బుక్ క్లబ్ లక్ష్యం. కేరళ కు చెందిన రియా జార్జ్ కుటు బుక్ యు అనే స్టార్టప్ ద్వారా పుస్తక పఠనం గొప్పదని ప్రచారం చేస్తూ ఉంటే సోనాలి కూడా ఆమెతో కలిసి పనిచేస్తుంది.కుటు బుక్ అంటే పుస్తకాల పురుగు అని అర్థం. పుస్తకాన్ని మీ […]

పొడవైన కురులు

తన పొడవైన కురులతో స్లోవాకియాకు చెందిన అలియా నసిరోవా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. 8 అడుగుల 5.3 అంగుళాల పొడవున్న జుట్టుతో ప్రపంచంలోనే అతి పొడవైన శిరోజాలు ఉన్న మహిళ ఆలియా. రోజు జుట్టు దువ్వుకోలేను వారానికి ఒకసారి దువ్వెందుకు జడ వేసుకునేందుకు గంట పైగా సమయం పడుతుంది. ఇక తల స్నానం చేస్తే తడి ఆరెందుకు 24 గంటలు పడుతుంది అని చెబుతున్నా ఆలియా వృత్తి రీత్యా పెయింటర్ తన పొడవైన […]

సెలబ్రిటీ స్టయిలిస్ట్

ఏకా లఖానీ కాస్ట్యూమ్ డిజైనర్ న్యూయార్క్ ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్ చేసింది. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ సభ్య సాచి అసిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించింది ఏకా లఖానీ. బాలీవుడ్ లో సెలబ్రెటీలకు  స్టయిలిస్ట్ కూడా. సంజు పొన్నియిన్,సెల్వమ్,షేర్ షా, జుగ్ జుగ్ జియో వంటి సినిమాల్లో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేసింది. కరణ్ జోహార్ రణబీర్ లకు పర్సనల్ స్టయిలిస్ట్ కూడా.ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ స్టయిలిస్ట్ అంటారు.

అత్యంత ప్రతిభాశాలి

ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఆలియా భట్ మళ్లీ వార్తల్లో నిలిచింది. ప్రసిద్ధ టైమ్ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన 100 మంది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఆఫ్ 2024 లిస్ట్ లో ఆమె పేరు చోటుచేసుకుంది.ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో ఆమె కూడా ఒకరు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో దశాబ్దికి పైగా ఆమె ఎంతో చక్కని చిత్రాల్లో తన ప్రతిభ నిరూపించుకుంది వ్యాపారవేత్త కూడా.

మహిళలే పూజారులు

రామ్ ఘాట్ ప్రాంతంలో సరియు నది తీరాన ఉండే శ్రీరామ్ జానకి మందిర్ లో పూజాదికాలు, నిర్వహణ అంతా మహిళలే  మాయి బడా   ఆశ్రమం గా పిలిచే ఈ జానకి బాగ్ లో 120 మంది స్త్రీలు ఆశ్రయం పొందుతున్నారు. పూజలకు పురుషులను అనుమతించారు. ప్రధాన అర్చకులు కృష్ణరాసి. వితంతువులు, అనాధలు, కుటుంబాలకు దూరమైన స్త్రీలు ఈ మాయి బడా ఆశ్రమంలో ఉన్నారు.

ప్రొఫెషనల్ కార్ రేసర్

చిత్రలహరి, పాగల్, ధమ్కీ వంటి సినిమాల్లో నటించిన నివేత పేతురాజ్ ప్రొఫెషనల్ కార్ రేసర్ కూడా. 2017 నుంచి ఛాలెంజర్ స్పోర్ట్స్ కారు కొని రేసింగ్ ప్రాక్టీస్ చేసింది.క్రమంగా ఫార్ములా వన్ రేసింగ్ పైన పట్టు సాధించింది. ఇప్పుడు ప్రొఫెషనల్ ఎఫ్1 కార్ రేసర్ చక్కగా బ్యాడ్మింటన్ ఆడుతుంది. మధురై లో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో మిక్స్డ్  డబల్ కేటగిరిలో కప్ సాధించింది నివేతా తెరపైన నటనే కాదు ఇన్ని టాలెంట్స్  ఉండటంపై సర్వత్ర ఆమె […]

చక్కని కళాకారిణి

పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అంటుంది నభా నటేష్.చిన్నతనంతోనే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని ఎన్నో పథకాలు సాధించింది. కాన్వాస్ పెయింటింగ్,ఆయిల్ పెయింటింగ్, వాటర్ కలర్స్ తో ఎలాంటి కష్టమైనా చిత్రాన్నైనా నాలుగైదు గంటల్లో వేయగలదు. ఈ మధ్యకాలంలో ఆమె గీసిన చార్లీ చాప్లిన్ బొమ్మకు సోషల్ మీడియాలో ఎంతో స్పందన లభించింది.స్క్రీన్ పైనే కాదు కాన్వాస్ పైన కూడా మ్యాజిక్ చేస్తుందని నెటిజన్లు ఆమెను మెచ్చుకున్నారు.

నటనతో పాటు పాటలు కూడా

కొందరు తారలు కేవలం నటించటం మాత్రమే కాదు ఇతరత్రా ఎన్నో టాలెంట్స్ కలిగి ఉంటారు కేవలం అందంగా నటించటం తోనే కాదు తన అద్భుతమైన గొంతుతోను అభిమానులను అలరిస్తోంది రాశి కన్నా. ఇప్పటికే మలయాళంలో ఒకటే తెలుగులో ఐదు పాటలు పాడేసింది. షూటింగ్ లేకపోతే చాలు ఎంచక్క పాటలు పాడడం నేర్చుకోవడం తోనే గడిపేస్తా అంటుంది రాశి కన్నా. చక్కగా గిటార్ వాయించగలదు కూడా.

స్త్రీల రక్షణ కు పింక్ స్క్వాడ్

చెన్నై లోని ఎంజీ రామచంద్రన్ సెంట్రల్ మెట్రో స్టేషన్ లో తొలిసారి గా విమెన్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. పింక్ స్క్వాడ్ గా పిలిచే ఈ దళం లో 23 మంది మహిళలు మార్షల్ ఆర్ట్స్ లో ఆరితేరిన వాళ్లు. ఎయిర్ పోర్ట్, మెట్రో స్టేషన్లలో మహిళల పట్ల ఎలాంటి అవాంచిత ఘటనలు జరగకుండా ఈవ్ టీజింగ్ కు గురికాకుండా ఈ స్క్వాడ్ కాపలా కాస్తుంది. లక్షల మంది ప్రయాణం చేసే మెట్రో లో మహిళలను కాపాడుతుంది […]