Saturday, 25 Jul, 2026

ఎవరెస్ట్ నా కల

నేపాల్ లో వృత్తి రీత్యా ఫోటో జర్నలిస్ట్ అయినా పూర్ణిమ శ్రేష్ఠ.13 రోజుల్లో మూడు సార్లు ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన ప్రపంచంలోనే మొదటి మహిళగా రికార్డ్ సాధించింది. 33 ఏళ్ల పూర్ణిమ 2018 లో పర్వతారోహణ మొదలు పెట్టింది. 2022 లో కాంచన గంగ మకాలు ను అధిరోహించింది.ఇకపై తాను మౌంటె నియర్ గా గైడ్ గా పనిచేయాలనుకొంటోంది పూర్ణిమ.వృత్తి రీత్యా ఎవరెస్ట్ మారథాన్ కవర్ చేసే   అసైన్మెంట్ సమయంలో పర్వతారోహణ పరిచయం అయ్యి తానే […]

ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం

‘గో డూ గుడ్‌’ స్టార్టప్‌ ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్యాకింగ్‌ మెటీరియల్ తయారు చేస్తుంది ఖుష్బూ గాంధీ ముంబైలో పుట్టి పెరిగిన ఖుష్బూ నిఫ్ట్‌లో మెటీరియల్‌ డెవలప్‌మెంట్‌ కోర్సు చేసింది. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే దిశగా చేస్తున్న ఈ వ్యాపారంలో ఇప్పటికి వరకు, ఐదు టన్నుల వ్యవసాయ వ్యర్థాలతో సింగిల్ యూజ్ ప్లేట్లు తయారు చేశారు. సి వీడ్ (సముద్రపు నాచు), తో ప్రింటింగ్ కోసం ఉపయోగపడే ఇంక్ తయారు చేశారు. నా ప్రయోగాలు నాకు లాభం […]

మహిళా చైతన్యం లక్ష్యం

ఐక్యరాజ్యసమితి గర్ల్ ఆఫ్ మూమెంట్ కు ఇండియా కంట్రీ మేనేజర్ అదితి అరోరా ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాల్లో ఎంతో మంది మహిళలను న్యాయ దారులుగా తీర్చి దిద్దడం లో కీలకపాత్ర పోషించింది.ఈ గర్ల్ ఆఫ్ ఈ సంస్థ ద్వారా అదితి మహిళల మానసిక ఆరోగ్యం దగ్గర నుంచి ఉపాధి అవకాశాల వరకు ఎన్నో అంశాల పైన పనిచేస్తుంది. స్టోరీ టెల్లింగ్ లో శిక్షణ ఇస్తుంది. పీరియడ్ పావర్టీ ని దృష్టిలో ఉంచుకొని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. […]

ఆర్థిక సలహాదారు

ఫిన్ ఫ్లూయన్సర్ గా (ఫైనాన్షియల్ ఇన్ ఫ్లూయన్సర్ గా) సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. సాక్షి జైన్ కు జార్ఖండ్ రాష్ట్రం రాంచి కి చెందిన సాక్షి సి.ఎ చదివింది. మహిళల్లో ఆర్థికాంశాల పట్ల గల సందేహాలు తీర్చగలిగితే వాళ్ళు చక్కని ఆర్థిక వేత్తలవుతారు అని ఊహించింది సాక్షి ఇన్‌స్టా లో ఫినాన్స్ గురించిన పాఠాలు చెప్పటం మొదలు పెట్టింది.ఆమె టార్గెట్ స్కూల్ ఫైనల్ చదివిన మహిళలు. కానీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లు కూడా సాక్షిని […]

జీవితం నేర్పిన పాఠాలు

‘గురు’ సినిమా నటి రితికా సింగ్ కరాటేలో బ్లాక్ బెల్ట్ కిక్ బాక్సర్ కూడా. పూర్తి పేరు రితికా మోహన్ సింగ్. ముంబైలో పుట్టి పెరిగిన రితికా దక్షిణాది సినిమా అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమాకే ఉత్తమ నటిగా అవార్డు తీసుకుంది. మూడేళ్ల వయసు లో కరాటే ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన రితికా కుటుంబంలో అందరూ బాక్సింగ్ ఫీల్డ్ కు చెందిన వారే.సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నా కరాటే మరచిపోదు అలాగే మోటివేషనల్ స్పీకర్ కూడా.ఆమె జీవితానుభవాలే […]

ప్రాణదాత

కమల్ రణదివె భారతదేశానికి చెందిన కణ జీవ శాస్త్రవేత్త లుకేమియా, రొమ్ము, గొంతు, క్యాన్సర్ లకు కారణాలను గుర్తించడం లో కీలక పాత్ర పోషించిన బయో మెడికల్ పరిశోధకురాలు. ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ అసోసియేషన్ వ్యవస్థాపక సభ్యురాలు కుష్టు వ్యాధికి టీకా తయారు చేయడం లో విశిష్ట పాత్ర పోషించారు.1917 నవంబర్ 8 న మహారాష్ట్రలోని పూణే లో జన్మించిన కమల్ రణదివె బ్రిటన్ యూనివర్సిటీ లో చదువుకున్నారు.1982 లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ గౌరవ పురస్కారం […]

తొలి మహిళా పైలట్

భారత నౌకాదళం లో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు అనామిక బి.రాజీవ్ ఐ ఎన్ ఎస్ రాజాలీ హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందిన అనామిక అరక్కోణం లోని నౌకాదళ ఎయిర్ స్టేషన్ లో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అని అందుకున్నారు అనామిక. సి కింగ్స్, ఏ ఎల్ హెచ్ ధ్రవ్స్ చేతక్స్,వంటి హెలికాప్టర్ లు నడిపేందుకు అర్హత సాధించిన మొదటి అమ్మాయి. […]

కాదంబినీ గంగూలీ

దేశంలో రెండవ మహిళ వైద్యురాలిగా కాదంబినీ గంగూలీ తన పేరు నమోదు చేసుకున్నారు దక్షిణాసియా నుంచి పాశ్చాత్య వైద్యంలో శిక్షణ పొందిన తొలి మహిళ వైద్యురాలు. 1886లో కలకత్తా మెడికల్ కాలేజీ నుంచి వైద్య విద్య పూర్తి చేశారు కాదంబినీ.1889 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించిన ఐదుగురు మహిళల్లో కాదంబినీ ఒకరు.వైద్య చికిత్స లో నూతన ఆవిష్కరణలు చేశారు.తూర్పు భారతదేశం లోని బొగ్గు గనుల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమం కోసం విశేష […]

మిల్లెట్స్ బేబీ ఫుడ్

ఇంజనీరింగ్ చదివి భారత సైన్యం కోసం రాకెట్స్ డిజైన్ చేసిన జ్యోతి శ్రీ వాస్తవ్ పిల్లల పోషకాహారం తయారు చేసే కంపెనీ ప్రారంభించారు.  ‘లిటిల్ చెర్రీ ఫుడ్స్’ పేరుతో నడుస్తున్న ఈ కంపెనీ ద్వారా మిల్లెట్స్ తో చేసే బేబీ ఫుడ్ అమ్ముతారు. ఆయుర్వేదం లో పేర్కొన్న ఎన్నో మూలికలతో పిల్లలకు మేలు చేసే ఈ ఆహారం తయారు చేస్తారు. చిరుధాన్యాల తో పోషకాలు పుష్కలంగా ఉంటాయని తల్లిపాలలోని గుణాలు కూడా వీటిలో ఉంటాయని పిల్లల ఎదుగుదలకు […]

నీరా పై పరిశోధన

భారతదేశ శాస్త్రీయ రంగాలలో బ్రిటిష్ విశ్వవిద్యాలయంలో పి హెచ్ డి పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్త కమలా సోహాని. 1912 లో జన్మించిన కమల కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. రాయల్ ఇన్స్టిట్యూట్ బయో కెమిస్ట్రీ విభాగానికి ప్రొఫెసర్. తాజా తాటికల్లు పై పరిశోధనలు చేశారు. పోషకాహార లోపం తో బాధపడే పిల్లలకు నీరా ఇవ్వచ్చునని ఆమె పరిశోధనలు చేసి తేల్చారు. నీరా పై ఆమె చేసిన పరిశోధనలకు రాష్ట్రపతి అవార్డు లభించింది. శాస్త్ర సాంకేతిక […]

అనీ ఫ్రాంక్ డైరీ

14 సంవత్సరాల యుద్ధ బాలిక ANNE FRANK రాసిన The Diary of a young girl పుస్తకం ప్రపంచంలోని అన్ని భాషల్లోకి తర్జుమా అయింది 1941-45 మధ్య 60 లక్షల మంది యూదులను యువకులను నిర్మూలించాడు హిట్లర్ ఒక యూదు కుటుంబం తన స్నేహితుల ఇంటి  రహస్య గదిలో రెండేళ్ల 35 రోజులు గడిపాక, పట్టుబడి కాన్సన్ట్రేషన్ క్యాంప్ లో మరణిస్తారు. ఆ కుటుంబంలోని బాలికే అన్నా.రెండేళ్ల కాలంలో అన్నా రాసిన డైరీ ఈ పుస్తకం […]

చీరకట్టుతో క్రీడలు

జపాన్ లోని బిబా విశ్వవిద్యాలయం లో డాక్టరేట్ విద్యార్థి అఫ్సానా బేగం చీరకట్టుతో సైక్లింగ్, డ్రైవింగ్, సర్ఫింగ్, గ్లైడింగ్ వంటి క్రీడల్లో పాల్గొంటుంది. దక్షిణాసియా లోని వారసత్వాన్ని ప్రదర్శించేందుకు చీర కట్టుకు గౌరవం తెచ్చేందుకు సాహసోపేతమైన క్రీడలకు కూడా చీరనే ఎంచుకుంది అఫ్సానా. స్కై డ్రైవింగ్ లో కూడా చీరకట్టుతోనే బెల్ట్ తో గట్టిగా కట్టుకొని మరి పాల్గొన్నది. ప్రజా రవాణా లో చీర కట్టుకు గౌరవం తేవాలని నా ఆశయం ఆశ అంటుంది అఫ్సానా.

వారసురాలు

అమెరికాలోని కెర్నిగి మెలన్ యూనివర్సిటీ ఫైనాన్స్ లో డిగ్రీ పూర్తి చేసిన గౌరీ కిర్లోస్కర్ తన కుటుంబ వ్యాపారం లోకి అడుగుపెట్టి ఆ సామ్రాజ్యాన్ని మరింత విస్తరింపజేసింది. కంపెనీ కి సంబంధించిన రియల్ ఎస్టేట్, కు అభివృద్ధి చేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటీ పైన దృష్టి పెట్టింది. ఆమె నాయకత్వంతో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. కిర్లోస్కర్ గ్రూప్ భారతదేశం లోని పంపులు,వాల్స్ ల తయారీ లో అతిపెద్ద కంపెనీ […]

అరుదైన వ్యాఖ్యాత

అమెరికన్ టాక్ షో ‘ది చంద్రిక రవి’ షో కు వాఖ్యాత చంద్రిక. ఆస్ట్రేలియా లో పుట్టి పెరిగిన చంద్రిక యాక్టింగ్, మోడలింగ్ ల్లో కెరీర్ మొదలు పెట్టింది. ‘సెయి’  తమిళ చిత్రంలో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది.సిల్క్ స్మిత బయోపిక్ లో లీడ్ రోల్ లో నటించింది. అమెరికాలోని అతిపెద్ద నెట్ వర్క్ ఒకటైన ఐ హార్ట్ రేడియోలో చంద్రిక షో ప్రసారం అవుతుంది. యు ఎస్ లో రేడియోను హాస్ట్ చేస్తున్న మొదటి భారతీయ […]

చెట్లు గురించి చెపూత

ఇన్ స్టా లో ‘ట్రాన్స్ ఆఫ్ కొచ్చిన్’ పేరు తో ఉండే ప్రతి చెట్టు గురించి వాటి చరిత్ర ను సేకరించి పరిచయం చేస్తున్నారు అశ్వతి జెరోమ్. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ లో పీజీ చేసి కన్సల్టెంట్ గా పని చేస్తున్నారు అశ్వతి. ఈమె పుట్టిన ఊరు కొచ్చి.మొక్కలు, పర్యావరణం పైన అవగాహన కలిగించేందుకు నో యువర్ నైబర్ హుడ్ ట్రీ వాక్, పార్క్ వాక్ వంటివి నిర్వహిస్తున్నారు. పిల్లలకు పెద్దలకు ప్రకృతిని పరిచయం చేయడం […]

జీన్స్ నగలు

వాడి పడేసే పాత జీన్స్ తో బ్యాగులు, జ్యువెలరీ గృహాలంకరణలు యోగ మాట్స్, బొమ్మలు తయారు చేస్తుంది కాకినాడ కు చెందిన సౌమ్య కల్లూరి. ముంబై లో ‘ద్విజ్’ అనే పేరుతో ఒక సంస్థ స్థాపించి వ్యాపారం చేస్తున్నా రామె.’ద్విజ్’ అంటే పునర్జీవం అని అర్థం ఇప్పటివరకు ఆమె 8500 జీన్స్ లను ఐదువేల మీటర్ల ఇండస్ట్రియల్ డెనిమ్ ను రీసైకిల్ చేసింది. జర్మనీ లో కమర్షియల్ వెహికల్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేసిన సౌమ్య 2018 […]

అడవి అందాల చీరలు

పచ్చని అడవిని ప్రతిబింబించే పక్షులు, జంతువులు,పెద్ద వృక్షాలు, దట్టమైన పాదులు అందమైన లత లను ఫ్యాషన్ డిజైనర్ సయంతీ ఘోష్ థ్రెడ్ వర్క్ తో కూడిన హ్యాండీక్రాఫ్ట్ డిజైన్స్ సృష్టించారు ముడి సిల్క్,మస్లిన్, ఆర్గన్జా,టాస్కర్ మూగ సిల్క్ వంటి ఫ్యాబ్రిక్స్ పైన అడవి అందాలను ఆకట్టుకునేలా సృష్టించింది.ఆమె చీరల డిజైన్స్ చెప్పే చక్కని జ్ఞాపకాలు అంటున్నారు ఆమె కష్టమర్స్ .

మొక్కల అసలు పేర్లు ఇవే !

బొటాని ఆఫ్ ఎంపైర్  పేరుతో 126 వృక్షజాతుల మూలాలు,వాటికి గతంలో ఉండే పేర్లు గురించి పరిశోధన చేసి పుస్తకం రాశారు భాను సుబ్రహ్మణ్యం. అమెరికా లోని వెల్లెస్లీ కాలేజీలో ఉమెన్ అండ్ జెండర్ స్టడీస్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న భారతీయురాలు. తెల్లజాతీయులు సమూలంగా నిర్మూలించిన మొక్కల చరిత్ర ను తిరగరాశారు. జాతుల వర్గీకరణ మొక్కల పునరుత్పత్తి దండయాత్రల ద్వారా ప్రవేశపెట్టిన జాతుల వ్యాప్తి కి సంబంధించిన శాస్త్రంగా ఈ పుస్తకం మొక్కల అస్తిత్వాన్ని వివరిస్తుంది.

నష్టపోయేది ఎక్కువ స్త్రీలే

మధుమిత ముర్గియా రాసిన కోడ్ డిపెండెంట్ అనే పుస్తకం నాన్ ఫిక్షన్ కేటగిరిలో విమెన్స్ ప్రైస్ కు షాట్ లిస్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామాన్యులను ఎలా ప్రభావితం చేసింది. దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది. వంటి వాటిని పరిశోధించి ఈ పుస్తకం రాశారు మధుమిత. కెన్యా లోని డేటా లేబర్ల జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి ఫేషియల్ రికగ్నిషన్ లేదా క్రిమినల్ జస్టిస్ ప్రిడిక్షన్ అల్గా రిథమ్ లో లోపాల గురించి ఎంతో పరిశోధన చేసి […]

‘చౌపది’ నిషేధం

పౌలోమి బసు తీసిన మాయ ది బర్త్ ఆఫ్ సూపర్ హీరో అనే వర్చువల్ రియాలిటీ సినిమా అంతర్జాతీయ వేదిక కేన్స్ పైన అందరి ప్రశంసలు అందుకుంది. నేపాల్ లో చౌపది ఆచారం పోలో పౌలోమి బసు ను కదిలించింది. నెలసరి సమయంలో స్త్రీలు ఇంటికి రాకుండా ఊరి చివర గుడిసెల్లో ఉండటం వాళ్లకు ఎన్నో ఇన్ఫెక్షన్స్ రావడం పాముకాటుతో చనిపోవడం చూశాక ఆ ఆచారంపై పోరాటం చేసింది పౌలోమి బసు. ఆ ప్రాజెక్టు కు బ్లడ్ […]