Saturday, 25 Jul, 2026

తొలి సెయిలర్

ఒలంపిక్స్ లో భారత ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళ సెయిలర్ గా చరిత్రకెక్కారు నేత్ర కుమనన్. తమిళనాడులోని చెన్నై కు చెందిన 26 ఏళ్ల నేత్ర ఎప్పుడు పారిస్ ఒలంపిక్స్ లో సెయిలింగ్ లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 2019లో శిక్షణ మొదలుపెట్టిన నేత్ర 2014 నుంచి జాతీయ అంతర్జాతీయ పోటీల్లో రాణిస్తోంది. 2022 లో యూరోపా కప్ లో కాంస్యం సాధించింది. 2015, 2016 లో వరుసగా నేషనల్ టైటిల్స్ అందుకున్నది నేత్ర కుమనన్.ఆమెకు భరతనాట్యం, […]

పోషకాహారానికే ప్రాధాన్యం

ప్యారిస్ ఒలంపిక్స్ లో భారత్ క్రీడాకారులకు ప్రధాన పోషకాహార నిపుణురాలు ఆరాధనా శర్మ. పూణే కి చెందిన ఆరాధన శర్మ అథ్లెట్స్ కు పోషకాహారాన్ని సూచించే బాధ్యతల్లో ఉన్నారు. క్రీడాకారుల శక్తిసామర్థ్యాలు నైపుణ్యాలు మెరుగ్గా ప్రదర్శించాలంటే పోషకాహారానికే ప్రధాన పాత్ర. బాక్సింగ్, రెజ్లింగ్ మ్యాచ్ ల విరామంలో, రికవరీ కాలంలో అథ్లెట్స్ కు ఎలక్ట్రోలైట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు సమతులంగా అందాలి.  మహిళ అథ్లెట్స్ కు హార్మోన్ల ప్రభావాన్ని తగ్గించే పోషకాహారం ఇవ్వాలి. రుతుక్రమ సమయంలో రక్తహీనతకు గురవకుండా […]

స్త్రీవాద రూపం

మైసూర్ కు చెందిన ఫర్ మీ కుటుంబంలో 1879 లో పుట్టిన మెహెర్‌బాయి టాటా మహిళల విద్య, సమాన హక్కుల కోసం కృషి చేశారు.1927 లో హిందూ వివాహ బిల్లు కోసం ఈమె చేసిన కృషి శారద చట్టం రావడానికి కారణమైంది. రాజ్యాంగంలో మహిళలకు సమాన రాజకీయ హోదా కోసం పోరాడారు మెహెర్‌బాయి టాటా. దొరాబ్జీ టాటా ను పెళ్లి చేసుకున్నారు. 1924 పారిస్ ఒలంపిక్స్ లో మిక్స్‌డ్ డబుల్స్ టెన్నిస్ మ్యాచ్  లో పాల్గొన్న తొలి […]

చరిత్ర సృష్టించిన శృతి హెగ్డే

అమెరికాలో జరిగిన మిస్ యూనివర్సల్ పెటైట్‌ కిరీటం గెల్చుకొని దాన్ని అందుకున్న తొలి భారతీయురాలు గా నిలిచింది శృతి హెగ్డే. ఈమె డాన్సర్, యాక్టర్ కూడా నృత్య ప్రదర్శనలు ఇస్తుంది.సీరియళ్లతో పాటు సినిమాల్లో నటిస్తోంది.”శరా శరా శక్తి”  అనే కన్నడ చిత్రం శృతి కి  ఎంతో పేరు తెచ్చింది. ప్రస్తుతం డెర్మటాలజీ లో ఎం డి చదువుతోంది. ఈమెది కర్ణాటకలోని హుబ్లీ వృత్తి రీత్యా చర్మ వైద్యురాలు.

నిరంతరం అప్రమత్తం

దేశంలో ఉన్న అతి తక్కువ మంది వెదర్ ఇంటర్ ప్రెటర్స్ లో నీతా కె గోపాల్ ఒకరు. మెరైన్ వెదర్ ఫోర్ కాస్టింగ్ ట్రాఫికల్ సైక్లోన్ ఫోర్ కాస్టింగ్ స్పెషలైజేషన్ కోర్స్ లు చేశారు. పాతికేళ్లుగా నీతా భారత వాతావరణ శాఖ లో సేవలందిస్తున్నారు. తిరువనంతపురం లోని మెటియోరోలాజికల్ సెంటర్ హెడ్ ఆమె. వాతావరణ మార్పులను అంచనా వేయగల మహిళ నిపుణుల్లో ఈమె ఒకరు. ఎన్నో ఏళ్లుగా ఒకే తక్షిణ తో వాతావరణ మార్పులను పరిశీలిస్తూనే ఉన్నారు. […]

వాన గురించి చెప్పగలను    

కీర్తిగ మురుగేశన్ వెదర్ ఫోర్ కాస్టర్ ఖచ్చితమైన వాతావరణ సమాచారాన్ని ఇచ్చే ఎక్సపర్ట్. వెదర్ ఫోర్ కాస్టింగ్ మేనేజ్మెంట్ లో పీజీ చేసిన కీర్తిగ ప్రస్తుతం వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ లో సీనియర్ ప్రోగ్రాం అసోసియేట్ మునుపటిగా కాలం ఒకే రీతిగా లేదు.కొన్ని ప్రాంతాల్లో వరద కొన్నిచోట్ల వర్షపు చినుకే లేదు. కరిగే ధ్రువ ప్రాంత సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి.ఇవే తుఫాన్ లకు కారణం వీటిని సకాలంలో గుర్తించి ప్రజలకు తెలియజేయడం నా పని అంటున్నారు కీర్తిక […]

పురాణాలతో గేమ్స్

పురాణాలకు సంబంధించిన స్ఫూర్తిదాయకమైన అంశాలతో ‘చిత్తం’ అనే గేమింగ్ కంపెనీ ప్రారంభించారు చరణ్య కుమార్.యు.ఎస్ లో ఇంజనీరింగ్ చేసిన చరణ్య పురాణాలు అంటే చాలా ఆసక్తి. ఫన్ ఎలిమెంట్ జత చేస్తూ రూపొందించిన గేమ్స్ యాక్టివిటీస్ బుక్స్ సూపర్ హిట్ అయ్యాయి.భరత్ విలాస్ అన్నది చిత్తం బెస్ట్ సెల్లార్ తమిళ సామెతలను దృష్టిలో పెట్టుకొని పార్టీ టాక్స్ అనే గేమ్ తయారు చేస్తే దాన్ని అందరూ మెచ్చుకున్నారు. చిత్తం లో ప్రస్తుతం 13 ప్రొడక్ట్స్ ఉన్నాయి.

డాన్స్ తెచ్చిన పేరు

కొన్ని వారాల క్రితం సామాన్య గృహిణిగా ఉన్న 64 ఏళ్ల లీలమ్మ ఒక పెళ్లి లో డాన్స్ చేసి రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోయింది.కేరళ రాష్ట్రం ఎర్నాకుళంలోని పల్లిక్కర్ లో ఉంటున్న లీలమ్మ చిన్నప్పుడు స్కూల్ ఫంక్షన్స్ లో డాన్స్ చేసేది. అలా మొదలైన ఇష్టం పెద్దయినా ఏ స్నేహితుల ఇళ్లల్లో వేడుకలు జరిగిన డాన్స్ చేసేది. క్రితం నెల పట్టాంబి లో బంధువుల ఇంట్లో లీలమ్మ చేసిన డాన్స్ ను ఆమె కొడుకు సంతోష్ వీడియో […]

వ్యాపార సామర్థ్యం

ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ సెల్ఫ్ మేడ్ ఉమెన్ 24 జాబితాలో స్థానం తగ్గించుకున్నారు రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రూక్ ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అనన్య త్రిపాఠి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసిన అనన్య చీఫ్ స్ట్రేటాజి ఆఫీసర్ గా మింత్రా లో చేరారు. ఆ తర్వాత ముంబై కెకె ఆర్ క్యాప్ స్టోన్ ఇండియాలో మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశాక రియల్ ఎస్టేట్ కంపెనీ బ్రూక్ ఫీల్డ్ కు వచ్చారు. సంస్థలోని ఖాతాదారులకు సరికొత్త […]

గోడలకు ప్రాణం

ఎత్తుగా ఉండే గోడలపై భారీ మ్యురల్స్ గీస్తుంది ఢిల్లీకి చెందిన స్నేహ చక్రవర్తి. దేశంలో పేరు ఉన్న కుడ్య చిత్రకారిణి కాగితం పైన వేసిన బొమ్మను పదింతలు 20 ఇంతలు పెంచి గోడ పైన గీయాలి.ఈ మ్యూరల్ ఆర్ట్ లో ప్రావీణ్యం సాధించిన స్నేహ ముంబై స్లమ్స్ లో ప్రతి గోడను బొమ్మలతో తీర్చిదిద్దింది. ఆమె గీసిన ఒక పెద్ద స్త్రీ బొమ్మ, చుట్టూ రాసిన ఫర్ సేల్, ఫర్ సేల్ అన్న నినాదం ఆమెకు చాలా […]

టోర్నడో విల్మా రుడాల్ఫ్

12 ఏళ్ళు వచ్చే వరకు ఎన్నో అనారోగ్యాలతో మంచం పట్టిన విల్మా రుడాల్ఫ్ తర్వాత పరుగులు తీయటమే ధ్యేయం కనుగొన్నది. 16 ఏళ్లకే ఒలంపిక్స్ లో పోటీ పడింది.1956 లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలంపిక్స్ లో కాంస్య పతకాన్ని,ఆపైన అమెరికన్ గేమ్స్ లో బంగారం సాధించింది. రోమ్ ఒలంపిక్స్ లో 200 మీటర్ల పరుగు 23. 2 సెకండ్ల లో పూర్తి చేసి రికార్డ్ స్థాపించింది. ఆమెను పరుగుల రాణి టోర్నడో అని పిలుస్తారు.

వాయు కాలుష్యం ఎంతో ప్రమాదం

భవ్రీన్ కంధారి వారియర్స్ మామ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా 13 రాష్ట్రా లో పర్యావరణ హిత ప్రచారాన్ని చేస్తున్నారు. భవ్రీన్ కాపీ రైటర్ ఉద్యోగం చేస్తూ వాయు కాలుష్యం గురించి పరిశోధన చేశారు. ఆ తరువాత ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ గా మారారు. వాయు కాలుష్యం అన్నది గ్లోబల్ ప్రాబ్లం అంటారు భవ్రీన్.వాయు కాలుష్యం చర్మం,జుట్టు,ఊపిరితిత్తుల పై ప్రభావం చూపెడుతుంది. ఆహార ఉత్పత్తుల లోని పోషక విలువలను నాశనం  చేస్తుంది అంటూ ప్రచారం […]

నిశ్శబ్దం కోసం పోరాటం

‘వాయిస్ ఇన్ అవర్ నేషన్’ పుస్తకం రాసి శృతి మించిన ధ్వని వల్ల వచ్చే అనారోగ్యాల గురించి చెప్పారుసవితారావు ఒక వాహనం మోగించే హారన్ శబ్దం, పెళ్లిళ్లు వేడుకల్లో పెద్ద శబ్దంతో పెట్టే పాటలు,పబ్లిక్ ఫోన్ ల్లో కూడా పెద్దగా గొంతెత్తి మాట్లాడటం ఇలాంటివి నివారించాలి. కనిపించే చెత్త లాగే ఈ కనిపించని శబ్ద కాలుష్యం. మానవుల శారీరక మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అంటుంది సవితా రావు. ముంబై కి చెందిన ఈ సామాజిక కార్యకర్త నిశ్శబ్దం […]

కలలు నిజం చేసుకున్న సిమ్రాన్

జపాన్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో బంగారు పతకం సాధించింది సిమ్రాన్ శర్మ దృష్టి లోపంతో పుట్టిన సిమ్రాన్ తల్లి సాయంతో చదువు పూర్తి చేసింది. అథ్లెట్ కోచ్ అయినా గజేంద్ర సింగ్ ను పెళ్లి చేసుకుంది.ఇండియన్ ఆర్మీ లో పనిచేసే సింగ్ సిమ్రాన్ ను పరుగుల రాణి గా తీర్చిదిద్దారు. 2021 లో ప్యారిస్ పారా ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్ గా గుర్తింపు పొందింది. […]

అందాల లక్క గాజులు

హైదరాబాద్ పాతబస్తీ అంటేనే లక్క గాజులకు ప్రసిద్ధి.అంతర్జాతీయంగా ఎంతో పేరు పొందిన ఈ లక్క రాళ్ల గాజులకు భౌగోళిక గుర్తింపు కూడా ఉంది. ఈ హస్తకళ కుతుబ్ షా నిజాంల కాలంలో ప్రారంభం అయింది. రాజవంశీకులు ఇష్టంగా ధరించే ఈ గాజులు ఎలాంటి మిషన్  లు లేకుండా చేతులతో తయారుచేస్తారు. ఈ గాజులు తయారీ పైనే నాలుగు వేలకు పైగా కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి.

ఒంటరి మహిళల గ్రామం

ఈజిప్ట్ లోని కైరా నగరానికి దగ్గర గా ఉండే అల్ సమాహా  గ్రామంలో కేవలం ఒంటరి మహిళలు మాత్రమే ఉంటారు.మగవాళ్లకు ఇక్కడ ప్రవేశం లేదు. ఈ ఉరిని 1998 లో వితంతు మహిళల కోసం కేటాయించింది ప్రభుత్వం. సాగు చేసుకొనే భూమి ఇచ్చింది. నెమ్మదిగా విడాకులు తీసుకున్నవారు గృహహింస బాధితులు కూడా వచ్చి చేరారు వీరంతా వ్యవసాయం ,పశువుల పెంపకం చేతి వృత్తుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొంటారు. మహిళల రక్షణ బాధ్యత ప్రభుత్వమే తీసుకొంది.

ఆమె మేడమ్ సర్

బీహార్ లో తొలి మహిళా ఐ పి ఎస్ గా కొత్త అధ్యాయం ప్రారంభించిన మంజరి జరుహార్‌. తన ఆత్మ కథను “మేడమ్ సర్” పేరుతో అక్షర బద్దం చేశారు. వృత్తి జీవితం గురించే కాదు, మహిళలు సమాజం నుంచి ఎదుర్కొనే వివక్ష గురించి చెప్పేందుకే ఈ పుస్తకం రాశాను అంటారు మంజరి. 2010 లో సి ఐ ఎస్ ఎఫ్ స్పెషల్ డైరెక్టర్ జనరల్ గా రైటర్ అయ్యారు. ప్రెసిడెంట్ మెడల్ తో సహా ఎన్నో […]

క్యాన్సర్ బాధితులకు ఊరట

ది 12 కమాండ్ మెంట్స్ ఆఫ్ బీయింగ్ ఎ ఉమెన్ అన్న పుస్తకం లో క్యాన్సర్ తో తాను పోరాడి గెలిచింది వివరించింది తాహిరా కశ్యప్ ఖురానా. బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య క్యాన్సర్ బాధితుల్లో స్ఫూర్తి నింపేందుకు ఆ పుస్తకం రాశానంటారు తాహిరా మంచి రచయిత్రి. ‘శర్మాజీ కి బేటీ’ చనల చిత్రాన్ని రచించి దర్శకత్వం వహించింది. ఐ ప్రామిస్ సోల్డ్ అవుట్ క్రాకింగ్ ది కోడ్ వంటి మంచి పుస్తకాలు రాసింది తాహిరా […]

మొదటి ఒలంపియన్

72 ఏళ్ల క్రితం ఒలంపిక్స్ లో పాల్గొన్న తొలి తరం అమ్మాయి నీలిమ ఘోష్. అప్పటికి ఆమెకు 17 సంవత్సరాలు 1952 లో హెల్సింకీ ఒలంపిక్స్ లో తొలిసారి భారత మహిళలు పోటీ పడ్డారు. వెళ్ళింది నలుగురైనా సాంకేతికంగా మొదటి పోటీలో పాల్గొన్నది నీలిమ. అందుకే ఆమె తొలి భారత మహిళా ఛాంపియన్ గా  చెప్తారు.100 మీటర్ల పరుగు, 80 మీటర్ల హర్డిల్స్ తో పోటీ పడింది వెండి కాంస్య పతకాలు గెలుచుకొన్నది తొలి ఒలింపియన్ నీలిమ […]

చూపు లేదు, అయినా గెలిచింది

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని ఒట్టపాలెంకు గ్రామానికి చెందిన గీత సలీష్ కు 13 ఏళ్ల వయసులో చూపు పోయింది. పునరావాస కేంద్రంలో చేరి బ్రెయిలీ నేర్చుకుంది. సలీష్ కుమార్ తో పెళ్లయ్యాక ఆర్గానిక్ రెస్టారెంట్ తెరిచారు. ప్రసవానంతరం మహిళలకు ఇచ్చే మంజిల్ వరకియత్తు వంటి బలమైన ఆహారం కోసం పరిశోధనలు చేసి పచ్చి పసుపు, ఖర్జూరం, పాలు, బాదం, బెల్లం కలిపి తయారు చేసింది. గీతాస్ హోమ్ టు హోమ్ పేరుతో ఆమె పది రకాల ఉత్పత్తులను […]