Gagana
కథలు చెప్పే బొమ్మలు
ఢిల్లీ లో ఉన్న ఆఫ్ఘనిస్థాన్ శరణార్థుల శిబిరం లో తలదాచుకున్న మహిళలకు జీవనోపాధి కోసం సిలైవాలి పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ నెలకొల్పారు ఐరిష్ స్ట్రిల్ తన భర్త బిశ్వదీప్ తో కలిసి ఢిల్లీలో పోగుపడే చెత్త వ్యర్థాల నుంచి ఫ్యాబ్రిక్ వేస్ట్ ను రీసైకిల్ చేసి వాటితో కళాకృతులు చేసేందుకు గాను అఫ్గాన్ మహిళలకు శిక్షణ ఇచ్చాము.వారు తయారు చేసిన క్లాత్ బొమ్మలు, పర్స్ లు వాల్ హ్యాంగింగ్స్ కు 150 దేశాల్లో డిమాండ్ ఉంది.ఈ […]
సమాజం మార్పు కోసం’హోమ్‌లెస్’
హోమ్‌లెస్ పుస్తకంతో ఈ సంవత్సరం సాహిత్య అకాడమీ యువ పురస్కారం (ఇంగ్లీష్) అవార్డ్ తీసుకుంది రచయిత్రి కె.వైశాలి. 22 సంవత్సరాల వయసులో ముంబై నుంచి వచ్చి హైదరాబాద్ లో ఎలాంటి వసతులు లేని హాస్టల్ లో ఉంటూ తను ఇబ్బంది పడిన డిస్క్ లెక్సియా డిస్క్ గ్రాఫియా ల సమస్యలు అలాంటి మానసిక వైకల్యం ఉన్న పిల్లల పట్ల సమాజం నిర్లిప్తంగా ఉండటం విద్య వ్యవస్థల్లో ఉన్న లోపాల గురించి వైశాలి తన పుస్తకంలో చర్చించింది. యూనివర్సిటీ […]
రేసింగ్ ఛాంపియన్ డయానా
నేషనల్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ గెలిచిన తొలి మహిళ గా నిలిచింది డయానా పండోల్. ఈమెది పూణే. రేసింగ్ అంటే ప్రాణం పెట్టే తల్లిదండ్రులతో కలిసి రేసింగ్ నేర్చుకుంది. జాతీయస్థాయిలో కాదు యూఎస్ ఎ, సింగపూర్, బెల్జియం, యూరప్ తో సహా ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని కప్పులు గెలుచుకుంది. ఇద్దరి పిల్లల తల్లి డయానా. ఛాంపియన్‌షిప్ లో పురుషుల తో పోటీపడి మరీ సత్తా చాటింది డయానా. ఈమె సింగర్ కూడా. అంధుల కోసం పరీక్షలు రాసి […]
ప్రపంచ రికార్డ్ కెక్కిన కన్యా
ట్రాక్ రేసింగ్ అథ్లెట్ గా ప్రపంచ రికార్డ్ కెక్కిన కన్యా సెస్సర్ కాళ్లు వేళ్ళు కూడా లేని వైకల్యంతో పుట్టిన పిల్ల కన్నవాళ్ళు ముళ్లపొదల్లో విసిరేస్తే అమెరికా దంపతులు పెంచుకున్నారు. పోర్ట్ ల్యాండ్ లో పెరిగిన కన్యా కు ఎన్నో సర్జరీలు చేయించారు. పదో తరగతికి వచ్చేసరికి ఈ కాళ్లు లేని అమ్మాయి వీల్ చైర్ రేసింగ్, రగ్బీ ఈత, సర్ఫింగ్ స్నోబోర్డింగ్ క్రీడల్లో రాణించింది. పారా లింపింగ్ ట్రాక్ రేసింగ్ అథ్లెట్ గా జాతీయ స్థాయి […]
ఆధ్యాత్మిక కళ కో పుస్తకం
డాక్టర్ అనితా భారత్ షా దేశంలో విస్తరించిన కళా రూపాల గురించిన వివరాలతో ‘కలర్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో చక్కని పుస్తకం రాశారు. మన చిత్రకళ, శిల్పకళ పురాణ ఇతిహాసాల ద్వారానే అభివృద్ధి చెందాయని, ఈ పుస్తకంలో వివరించారు. హిందూ పురాణాల ఆధారంగా చిత్రాలకు రూపకల్పన చేశారు. అమెరికా ఇండియా లోని వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ చిత్రకళపై సదస్సులు నిర్వహిస్తున్నారు అనితా భారత్ షా. ఆమె భర్తతో కలిసి త్రెడ్స్ ఆఫ్ డివోషన్’ పేరుతో రాజస్థాన్,గుజరాత్ అభివృద్ధి […]
అథ్లెట్ గా రాణిస్తోంది
దిశా పాండ్యా ఎత్తు 4. 2 అడుగులు ముంబై లో పుట్టిన దిశ గ్రాఫిక్ డిజైనర్. డిగ్రీ కూడా చేసింది కానీ ఆమె ఎత్తు కారణంగా ఎక్కడ ఉద్యోగం రాలేదు 17 సార్లు ఉద్యోగ తిరస్కరణ జారీ గాక ప్రైవేట్ సంస్థల్లో పని చేయటం మొదలు పెట్టింది. తన వంటి మరుగుజ్జు ల కోసం 2018 లో లిటిల్ పీపుల్ ఇండియా ప్రారంభించింది. క్రీడల పట్ల ఉండే ఆసక్తితో త్రోబాల్ లో రాణిస్తోంది. నేషనల్ పారా బ్యాడ్మింటన్ […]
చెన్నయ్ అన్నపూర్ణి
చెన్నైకు చెందిన ఉమారాణి తవమొళి అన్నదాన కూడం పేరుతో నాలుగేళ్లుగా పేదలకు ప్రతి రోజు అన్నదానం చేస్తోంది. నర్సింగ్ ట్యూటర్ గా పనిచేసే ఉమారాణి కోవిడ్ సమయంలో ఈ అన్నదానం తన పిల్లలిద్దరి సాయంతో చేస్తున్నారు. రోజుకు 800 మంది పేరట చిరుద్యోగులు, విద్యార్థులు ఈ ‘కూడం’ లో భోజనం చేస్తారు దాతల సహకారంతో ఈ అన్నదాన కూడం నడుస్తోంది. ఈ చెన్నై మహిళా ను ప్రజలు అన్నపూర్ణి గా పిలుస్తారు.
అట్టడుగు ప్రజల కోసం నా రచన
‘చెంగల్ చూళాయిలే ఎంత జీవితం’ పుస్తకం తో పారిశుద్ధ్య కార్మికురాలు ధనుజ కుమారి రచయిత్రిగా ప్రపంచానికి పరిచయం అయింది. కేరళ ప్రభుత్వం ఈ పుస్తకాన్ని కాలికట్, కన్నూర్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా చేసింది. ఆమెను రాజ్య భవన్ కు ఆహ్వానించిన గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ శక్తిమంతమైన మహిళ గా ధనుజ కుమారి ని ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అట్టడుగు ప్రజల కోసం నేను రాయటం మొదలు పెట్టాను అంటోందీ రచయిత్రి .
మిస్ తెలంగాణ 2024
తెలంగాణ 2024 టైటిల్ విజేత ప్రకృతి కంబం తాజాగా మిస్ ఇండియా పోటీలకు ఎంపికైంది. గతంలో మిస్ గ్రౌండ్ కర్ణాటక టైమ్స్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు టైటిల్ గెల్చుకున్న ప్రకృతి తెలంగాణ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మేలవింపును మిస్ ఇండియా పోటీ వేదికపై పరిచయం చేస్తానని చెబుతోంది. తెలంగాణకు చెందిన ప్రకృతి బెంగుళూరు లో పెరిగింది తల్లి రూప తమిళియన్ కావటంతో అక్కడి ఆచార వ్యవహారాలు క్షుణ్ణంగా నేర్చుకుంది.ఇప్పుడి మూడు రాష్ట్రాల సంస్కృతులను ఒక జీవన విధానంగా […]
అమ్మాయిలు ఉద్యోగాల్లోకొస్తే లాభం
శాప్ ల్యాబ్స్ సంస్థ కు తొలి మహిళ ఎం.డి గా పనిచేస్తున్న సింధు గంగాధరన్ తాజాగా నాస్కామ్ కు చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు.ఈమె సాఫ్ట్‌వేర్ డెవలపర్ సింధు గంగాధరన్ ను టెక్నాలజీ హ్యూమనిస్ట్ అంటారు. ఏ స్థాయిలో ఎదిగేందుకైనా జండర్ అడ్డు కాదు అంటారామె. మహిళా సాధికారత సాధించాలంటే ముందు అమ్మాయిలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలకి రావాలి. ప్రస్తుతం నాస్కామ్ ద్వారా గ్లోబల్ ఇన్నోవేషన్ లీడర్ గా మన దేశాన్ని తీర్చిదిద్దేందుకు ఇంజనీరింగ్,ఇలా భిన్నరంగాల మేధావులతో కలిసి పని […]
వృద్ధులకు ఆశ్రయం
స్మిత్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ కేర్ ఫౌండేషన్ స్థాపించి ఇప్పటివరకు 10700 మంది వృద్ధులను ఆదుకొన్నారు యోజన ఘరత్ 2010 లో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బోయిసర్ లో తానే జిల్లాలోని ఏర్పాటైన ఈ సంస్థ ఠానే జిల్లాలోని భివాండీ లో ప్రస్తుతం నడుస్తోంది. ఇక్కడ వృద్ధులు శాశ్వత ఆశ్రయం పొందవచ్చు. ఈ సేవకు గాను యోజన నారీ శక్తి ప్రతిభ పురస్కారం సావిత్రిబాయి పూలే సత్కారం వంటి అనేక పురస్కారాలు గౌరవాలు పొందారు. శారీరక […]
ఆమె జీవితం అద్భుతం
జులేఖ షేక్ అబుదాబి స్పెషల్ ఒలంపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ లో వాలీబాల్ లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి కాంస్య పతకం గెలుచుకుంది. ముంబైకి చెందిన జులేఖ అనాధాశ్రమంలో చదువుకుంది.స్పోర్ట్స్ టీచర్ అశోక్ రామచంద్రన్ నాంగ్రా ఆమెకు వాలీబాల్ లో శిక్షణ ఇచ్చారు రాష్ట్ర, అంతర్ రాష్ట్ర స్థాయిలో ఎన్నో గేమ్స్ ఆడింది జులేఖ. అటు తరువాత ఒలింపిక్స్ అవకాశం వచ్చింది. పేమెంట్ల దగ్గర భిక్షాటన చేసిన జులేఖ ఒలంపిక్స్ లో పాల్గొనడం ఎందరికో ఒక […]
ప్రాచీన కట్టడాలకు కొత్త రూపం
భారతీయ చారిత్రక నిర్మాణాలకు తన కళాత్మక శక్తి తో కొత్త రూపం ఇస్తుంది తెలంగాణకు చెందిన మసూమా రిజ్వి. రాష్ట్రపతి భవనం నుంచి అయోధ్య రామ మందిరం నిర్మాణం వరకు ఎన్నో కట్టడాలకు ఇంటీరియర్ డెకరేషన్ చేసిందామె ఆర్కిటెక్ట్. ఆర్టిస్ట్ కూడా మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఆమె సృష్టే. బెలిటా డిజైన్స్ పేరుతో ఆమె వృత్తి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఆయన భవంతి ఒక వెదురిల్లు నిర్మించి […]
అమెరికన్ జ్యోతిషురాలు
మన దేశంలో లాగే అమెరికాలోనూ జ్యోతిష్యులు ఉన్నారు వారిలో 40 ఏళ్ల అమీ ట్రిప్ అత్యంత ప్రభావవంతురాలైన జ్యోతిషురాలు ఆమె న్యూయార్క్ యూనివర్సిటీ లో సోషల్ వర్క్ లో మాస్టర్స్ చేశారు. ఆ తర్వాత ఎంతో ఆసక్తితో జ్యోతిష్య అధ్యయనం చేశారు. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రాలజీ రీసెర్చ్ వారి ధ్రువీకరణ పొంది సర్టిఫైడ్ ఆస్ట్రాలజీ గా నిలిచారు. అమెరికా రాజకీయాల్లో కమలాహారిస్ శక్తిమంతమైన నాయకురాలిగా ఎదుగుతారని ఆమె ముందే చెప్పారు.
ఈమె నీటి డాక్టర్
నీటి శుద్ధి ప్లాంట్ ల నిర్వహణ బాధ్యత తీసుకుంది మాన్సీ జైన్. ఆమె తన తండ్రి రాజేష్ తో కలిసి స్థాపించిన ‘డిజిటల్ పానీ’ యాప్ ద్వారా ఐ ఓ టి సాంకేతికతలు ప్లాంట్స్ ని సంరక్షిస్తారు ఈ టెక్నాలజీ ని నీటి డాక్టర్ గా చెబుతారు మాన్సీ. భారత దేశంలో 90 వేల నీటి శుద్ధి ప్లాంట్ లు ఉన్నాయి వాటి నిర్వహణ, ఆపరేషన్స్ చాలా కష్టం సరైన నిపుణులు లేకపోవడం సమస్య. డిజిటల్ పానీ […]
థాయ్‌లాండ్ ప్రధాని
37 ఏళ్ల వయసులో థాయ్‌లాండ్ నూతన ప్రధానిగా చరిత్ర సృష్టించింది పెటోంగ్ టార్న్. మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా చిన్న కుమార్తె స్థాపించిన ‘ప్యూ థాయ్ పార్టీకి’ పార్టీకి ఆమె అధినేత బ్యాంకాక్ లో పుట్టి పెరిగిన పెటోంగ్ హోటల్ మేనేజ్మెంట్ చేసింది. 12 కంపెనీ లలో తిరుగులేని ఎంటర్ ప్రెన్యూర్. కమర్షియల్ పైలట్ పిటకా సుక్సావత్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు ఇద్దరు సంతానం సోషల్లీ లిబరల్ క్యాపిటలిస్ట్ గా తనను తాను అభివర్ణించుకునే పెటోంగ్ […]
ఆమెకు రిటైర్మెంట్ లేదు
మామూలుగా ఎవరైనా ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ తీసుకుంటారు కానీ జపాన్ కు చెందిన యసుకో తమకి మాత్రం 94 ఏళ్ళు వచ్చిన రిటైర్మెంట్ తీసుకోలేదు. సన్ కో ఇండస్ట్రీస్ కో సంస్థ లో 1956 లో చేరారామె జనరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ అకౌంటెంట్ అకౌంటింగ్ క్లారికల్ పనులు చేస్తుంది. 30 ఏళ్ల కిందటే ఆమెకు రిటైర్మెంట్ తీసుకునే అవకాశం వచ్చింది. ఇప్పటికి పని చేస్తారామె. సోషల్ మీడియాలో ఆమె పేరు అందరికీ తెలిసింది. 2021 […]
నక్షత్ర విజ్ఞాన్
విజ్ఞాన్ శ్రీ అవార్డు అందుకున్న ఏకైక మహిళగా రికార్డ్ సృష్టించారు అన్నపూర్ణి సుబ్రమణ్యం.బెంగళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. నక్షత్ర మండలాలకు సంబంధించి ఏదో ఒక అంశంపై ఆమె ఎప్పుడూ పరిశోధన చేస్తూనే ఉంటారు. ఆస్ట్రోశాట్ ఆదిత్య ఎల్ 1 ఇన్స్ట్రుమెంట్స్ లో అన్నపూర్ణి పాలుపంచుకున్నారు. కేరళలోని పాలక్కాడ్ లో చదువుకున్న అన్నపూర్ణి నక్షత్ర సమూహాలకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు అది ఆమె వృత్తి,జీవనాశక్తి జీవిక కూడా.
ఆమె తొలి మహిళ
భారత సాయుధ దళాల జనరల్ హాస్పిటల్ సర్వీసెస్ డైరెక్టర్ గా లెఫ్టినెంట్ జనరల్ సాధన సక్సేనా నాయర్ నియమితులయ్యారు. మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన తొలి మహిళగా ఆమె వార్తల్లో నిలిచారు సాధన సక్సేనా. వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కు ప్రిన్సిపల్ మెడికల్ ఆఫీసర్ గా పని చేసిన మొదటి మహిళ కూడా ఆమె. పూణేలో ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజీ నుంచి విశిష్ట విద్య రికార్డ్ లతో డిగ్రీ తీసుకున్నారు. భారత రాష్ట్రపతి […]
రుక్మిణి లక్ష్మిపతి
ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల పోస్టల్ స్టాంప్ లు ప్రభుత్వం గౌరవంగా విడుదల చేశారు.మహిళల త్యాగం పోరాట పటిమ ప్రతిఫలించే ఈ స్టాంప్ లు ఎంతోమందికి స్ఫూర్తి. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలోని మధురై లో పుట్టింది రుక్మిణి సుప్రసిద్ధ ఆయుర్వేద వైద్యులు ఆచంట లక్ష్మీపతి గారి సతీమణి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లిన తొలి మహిళల జట్టులో ఒకరు రుక్మిణమ్మ.1946 లో టంగుటూరి ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. గాంధీజీ హరిజన సంక్షేమ […]
