Gagana
లేడీ డాన్ గా రాధిక
ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ఎలాంటి కష్టమైన పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేస్తున్నారు. తాజాగా మార్కెట్ రాజా ఎంబీబీఎస్ సినిమాలో లేడీ డాన్ గా నటిస్తున్న రాధిక ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రాధిక తండ్రి ప్రముఖ సినీ నటుడు ఎం ఆర్ రాధ హావభావాలను , డైలాగ్ డెలివరీని ఈ చిత్రంలో చూపిస్తారట.
‘యూరీ’ సంతోషాన్ని తెచ్చింది
ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు మంచి సినిమాలు రావడానికి కారణం అనుకుంటున్నాను అంటుంది యామీ గౌతమ్.యూరీ చిత్ర విజయంతో తనలో ఆత్మవిశ్వాసం నిండింది అంటుంది. ఓ నాయికగా నేను ఎంతో సంతోషంగా ఉన్నా వారసత్వం లేకపోయినా ప్రతిభగల నటి నటులకు తప్పక గుర్తింపు వస్తుంది అంటుంది యామీ గౌతమ్. తనది సినీ నేపథ్యం కాకపోయినా నిలదొక్కుకోగలిగినందుకు మనసు ఎంతో సంతోషంగా ఉంది అంటుందామే.విజయాలు ఉన్నప్పుడే ప్రయోగాలు చేయాలు. ఇప్పుడు అవకాశం నాకు కూడా ఉంది అంటుంది యామీ గౌతమ్.
అంత నాన్న ఇష్టం
నా విషయంలో నాన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అక్క లాగే నాకు కరణ్ జోహర్ సినిమాతో పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ఉంది. అయితే నాన్నదే నిర్ణయం అంటుంది శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్.ఆమె సినిమాల్లో రావాడానికి సన్నాహాలు జరుగుతున్నాయినేను తొలి సినిమాలో ఎవరితో నటించాలో నాన్న నిర్ణయిస్తారు.ఇప్పుడు నటనలో శిక్షణ కోసం న్యూయార్క్ కూడా వెళుతున్నాను అని చెబుతుంది ఖుషీ. నా మొదటి సినిమా గురించి నేను చాలా ఆసక్తిగా చూస్తున్నా అంది ఖుషీ కపూర్.
నా కష్టంతోనే సక్సెస్
కష్టపడటం తప్ప నాకు ఇంకోటి తెలీదు.నా సక్సెస్ కేవలం ఈ కష్టం వల్లే సాధ్యపడింది. నా విజయ రహస్యం ఇదే అంటుంది సమంత.మజిలీ సినిమాతో అమెకు మంచి ప్రశంసలు దక్కాయి. సినిమా సినిమా కు వైవిద్యం చూపిస్తుందని విమర్శకులు మెచ్చుకున్నారు.ఈ పరిశ్రమలో ఎవరికి ఎవరు సాయం చేయరు. ప్రతిభ,నైపుణ్యం,కృషికి మాత్రమే ఇక్కడ మార్కులు పడతాయి.నా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కాని విజయం వస్తే ఎంతో సంతోషీస్తాను.వైఫల్యం ఎదురైతే అంత కుంగిపోతాను అంటుంది సమంత.
పాత్రలో నేను కనిపిస్తే ఓకె
అందరి అవకాశాలు పరిస్థితులు ఒక్కలా ఉండవు.మొదట దంగల్ సినిమా ఒప్పుకొన్నాను ఎంతో పేరు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ లో నేను నటించాకే నా పైన నాకు నమ్మకం కలగింది. ఇప్పుడు అవకాశాలు బాగానే ఉన్నాయి అంటుంది ఫాతిమా సనాషేక్. ఎప్పుడు నా తోటి వాళ్ళు ఎలాంటి సినిమాలు చేస్తున్నారు నేను ఏం ఒప్పుకోవాలి అని చాలా తికమకగా ఉండేది. దంగల్ తర్వాత మాత్రం ఎంపిక గురించి మరచిపోయాను నేను ఆ పాత్రలో […]
మంజుమణి కుట్టన్ కు పురస్కారం
కేరళలోని ఎర్నాకుళం జిల్లా పెరంబదూరుకు చెందిన మంజు మణి కుట్టన్ ను ఈ ఏడాది నారీ శక్తి పురస్కారంతో గౌరవించింది భారత ప్రభుత్వం . ఉపాధి కోసం సౌదీకి వచ్చి కాంట్రాక్టర్ల చేతిలో పాస్ పోర్ట్ ఇరుక్కుపోయి మాతృభూమి చేరలేక బాధలు పడుతున్న వారికి సౌదీ లోని మన రాష్ట్ర రాయబార కార్యాలయం అధికారుల ద్వారా వెయ్యి మందికి పైగా బాధితులను మన దేశానికి పంపిచిన కారణంగా ఆమెకు ఈ పురస్కారం లభించింది.
తొలి మహిళ ఈమే
క్లెయర్ పొల్సక్ ఇప్పటికే 15కు పైగా మహిళా క్రికెట్ మ్యాచ్‌లకు అంపైర్‌గా చేసిన అనుభవం ఈ ఆస్ట్రేలియన్ మహిళ సొంతం.నమీబియా రాజధాని విండ్‌హోక్‌లో ఏప్రిల్ 27న నమీబియా, ఒమన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో క్లెయర్ అంపైర్‌గా వ్యవహరించారు.దీంతో పురుషుల అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించిన తొలి మహిళ అయ్యారు. కెయర్ అంపైరింగ్‌ను కెరీర్‌గా ఎంచుకునే మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
నృత్యం నా భాష
నేను ఆనందంగా ఉన్నప్పుడు నృత్యం చేస్తాను. ఎవరి కోసం అన్నా వేచి చూస్తున్నప్పుడు కూడా నృత్యం చేస్తాను. నా మనస్సుని ఆవిష్కరించే అద్భుతమైన భాష నృత్యం. ఇది నా నరనరాల్లో దాగి ఉంది అంటూ చెబుతోంది తమన్నా. అంతర్జాతీయ నృత్యాదినోత్సవం సందర్భంగా ఇన్ స్ట్రా గ్రామ్ లో ఈ విషయాన్ని వివరిస్తూ అసలు మనకు ఒక కళలో ప్రావీణ్యం ఉందా లేదా అనికాదు , మనం మనల్ని వ్యక్తీకరించుకోవటానికి ఉపయోగనడిందా లేదా అనేదే చూడాలి అంటుంది తమన్నా.
సెల్ఫీలే అడుగుతారామే
నేను యాక్టర్ అయ్యాక డాక్టర్ గా ప్రాక్టీస్ చేయటం మరిచి పోయాను అంటుంది సాయిపల్లవి.నేను ప్రాక్టీస్ చేయాలంటే తప్పని సరిగా చదివింది రివిజన్ చేయాలి. మెడిసిన్ లో చాలా విషయాలు మరిచిపోతున్నాను. కష్టపడి చదివింది మరిచిపోతున్నందుకు ఎంతో బాధపడుతున్నాను . అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ఆధునిక పరిశోధనలు వస్తాయి .అవన్నీ స్టడీ చేయటం వృత్తిలో భాగం అయినా ,ఇప్పుడు నేను ప్రాక్టీస్ పెట్టినా నన్ను మందుల చీటి గురించి అడిగే వాళ్ళకంటే సెల్ఫీ అడిగే వాళ్ళే […]
ప్రతి దినం కోత్త అనుభవం
పగలంతా షూటింగ్ ,ఓ పాత్రలో పరకాయ ప్రవేశం చేయాలి. సాయంత్రం పేకప్ చెప్పగానే నాలోకి నేను రావాలి. ఇది నటిగా నాకెదురైన గొప్ప సవాల్ అంటుంది అనుపమా పరమేశ్వరన్ . రోజంతా పని చేసి మరో కోత్త పాత్రకు సంబంధించిన ఊహాలలో ఉంటాను. అది నాకెంతో సంతోషం ఇస్తుంది . ఒక పాత్రకు తగ్గుట్టు మమ్మల్ని మేము మార్చుకొంటూ ప్రయాణం చేయాలి.అదో దిన చర్య అంటూ ఒక నటి జీవిత విధానం గురించి చెప్పుకొచ్చింది అనుపమా పరమేశ్వరన్.
నేనెంతో లక్కీ
అదృష్టం వచ్చి వరిస్తుంది అని రష్మికా మండన్నా గురించి అనవచ్చు.పరిశ్రమకు రాగానే అవకాశాలు ఒక్కొక్కటిగా అందుకున్న లక్కీ నేను అంటుంది రష్మిక. నేనెప్పుడు అవకాశాల కోసం ఎదురుచుడలేదు. అదినా అదృష్టం .చిత్ర పరిశ్రమలో అవకాశం ఎంత గొప్పదో దాన్ని నిలబెట్టుకోవటం అంతే ముఖ్యమైనది. ప్రతి పాత్ర గురించి ఎంతో కష్టపడి పని చేస్తున్న నాదైన ముద్ర కోసం ప్రయత్నిస్తున్న అంటుంది రష్మికా మండన్నా.
కఠిన శిక్షణ ఇవ్వాలి
సమంత ఒక వీడియోలో దాదాపు 102.25 కిలోల బరువు ఈజీగా ఎత్తటం కనిపిస్తుంది. ఇది ఆమె శరీరబరువు కు రెట్టింపు.ఇప్పటి యువత వెండి తెర వేల్పులే రోల్ మోడల్స్ ఇంత బరువు ఎత్తేందుకు ఆమె మానసికంగా శరీరకంగా తయారైంది అన్నాడు ఆమె శిక్షకుడు. ఎవరైన ఇలా సాధించగలరు నాజుగ్గా మారాలని కాకపోయినా శరీరం ధృఢంగా ఉంచుకోనేందుకు వ్యాయామంపై దృష్టిపెట్టింది అంటారు నిపుణులు. రోజుకోగంట అదినడక, యోగానా ,సైకిల్ తో శరీరానికి కఠిన శిక్షణ ఇవ్వాలి. తేలికపాటి వ్యాయామం […]
ఎన్ని కోట్లిచ్చినా నో
రెండు కోట్ల రూపాయల ఆఫర్ వదులుకుందట సాయిపల్లవి.అది ఒక ఫేస్ క్రీం యాడ్.ఆ యాడ్ గనుక వచ్చిఉంటే జనాలకు తన పై తప్పుడు అభిప్రాయం ఏర్పడుతుందని పైగా అలాంటి ఫేస్ క్రీమ్ తాను అసలు వాడనుఅని దాదాపు సినిమాల్లో కూడా మేకప్ లేకుండా ఉన్న కొద్దిపాటి మేకప్ తో కనబడే తాను ఈ యాడ్ చేయలేనని చెప్పేసింది.ఇప్పటికే ఈ యాడ్ పేరు మోసిన హీరోయిన్లు నటించేందుకు ఆసక్తి చూపించారట.ఎంత డబ్బు వచ్చినా తన మనస్సుకి వ్యతిరేకమైన పనిచేయనని […]
ఫిట్ నెస్ గురూ దీక్షా చాబ్రా
ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఫిట్ నెస్ పాఠాలు నేర్పుతున్న ఢిల్లీకి చెందిన దీక్ష చాబ్రా ఢిల్లీలో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ గా పనిచేశారు.అప్పుడు ఆమె బరువు 90 కిలోలు పై మాటే.డాక్టర్ హైపో థైరాయిడిజం ఉందని తేల్చారు. అప్పటి నుంచి ఆమె ఫిట్ నెస్ పై దృష్టిపెట్టి ఇంటర్నెట్ లో వీడియోలు చూస్తూ వ్యాయామాలు చేసి బరువు తగ్గింది.2017లో అందాల పోటిలో పాల్గొని మిసెస్ ఎర్త్ 2017 సెకెండ్ రన్నరఫ్ కిరీటం మిసెస్ బాడీఫిట్ […]
మూత్రశాలలు నిర్మించింది
ఎలాంటి ప్రతి ఫలం ఆశించ కుండా ఎంతో మంది సమాజహితం కోరి నిశ్శబ్దంగా పని చేసుకొంటూ పోతారు. సనీతా దేవిది జార్ఖండ్ లోని ఉదయ్ పూర్ . స్వచ్చ భారత్ కార్యక్రమంలో భాగంగా మూత్రశాలలను కట్టేందుకు ముందుకు వచ్చింది. యూనిసెఫ్ సహకారంతో మేస్త్రీగా శిక్షణ పొందింది. తనతో పాటు మరో 300 మంది మహిళలకు శిక్షణ ఇచ్చి మేస్త్రీలుగా మార్చింది. ట్విన్ పిట్ సాంకేతికతో సునీత టాయ్ లెట్ల నిర్మాణం చేపట్టింది. అందరూ కలిసి 1500 టాయ్ […]
జీవితకాలం ఉచిత వైద్యం
భక్తి యాదవ్ ఇండోర్ నుంచి ఎంబీబీఎస్ చేసిన మొదటి డాక్టర్. ఆమె సేవలకుగాను ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ తో గౌరవించింది. గైనకాలజిస్ట్ గా 1948 నుంచి ఉచితంగానే వైద్యం చేస్తున్న డాక్టర్ ఈమె. 1926లో ఉజ్జయిని లో జన్మించారామే. ఎంజీఎమ్ మెడికల్ కాలేజీ ఎంబీబీఎస్ విద్యార్థుల మొదటి బ్యాచ్లో మొదటి మహిళ విద్యార్థి. 1952లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసుకోని ఆమె భారత దేశంలోనే మొట్టమొదటి మహిళ డాక్టర్ అయింది. 2017ఆగస్ట్ 14న ఆమె మరణించే వరకు ఆమె […]
సరిపోదు అనిపించేది
కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు దానికి ఎన్నో రకాలు, కానీ నేను నటిగా ఫెయిల్ అవ్వలేదు అంటుంది అనుపమ పరమేశ్వరన్.సెలబ్రిటిలకు సంతృప్తి తక్కువని ఎవరైన అంటే మందు నాకు అర్ధం కాలేదు. ఎంతో కష్టపడే తమకు మాత్రం సంతృప్తి ఎందుకు ఉండదు అనుకునేదాన్ని, కానీ కొన్నాళ్ళకు కెమెరా ముందు నటించాక నాకు ఆ మాటలకు అర్ధం తెలిసింది.డైరక్టర్ ఒకే అన్న నాకు సరిపోదని ఇంకా బాగా చేయాలని ఆరటపడేదాన్ని నటనలో మరింత పరిణితి సంపాదించి ఆత్మ సంతృప్తి […]
నాకు నేనే సరిపోతా
నిన్ను నువ్వు ప్రేమించుకో ముందు అప్పుడు ఈ ప్రపంచాన్ని ప్రేమించడం నీకు చాతనవుతుంది. అన్న హితోక్తిని మనస్పూర్తిగా తీసుకోమంటుంది లారామిస్త్రీ. ఇటలీకి చెందిన ఈ ఫిట్ నెస్ ట్రైనర్ మనస్పూర్తిగా ఒక అబ్బాయిని ప్రేమించింది.చాలా తొందరలోనే బ్రేకప్ చెప్పేసుకున్నారు.నాకంటే నన్నెవరు ఇంకా ప్రేమించగలుగుతారు.నాకు నేనే తగినదాన్ని అని నిర్ణయించుకుని తనకు తానే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని బ్రహ్మండమైన వేడుకను జరిపేసుకుంది.ఫోటోలు చూస్తేనే తెలుస్తుంది ఎంజాయ్ చేస్తుందో. ఇవ్వాల్టి అబ్బాయిలంతా కాస్త జాగ్రత్తగా శ్రద్దగా […]
స్టీరియో టైప్ నచ్చదు
యామీ గౌతమ్ ఫెయిర్ అండ్ లవ్లీ కార్నెట్టో శామ్ సంగ్ మోభైల్,చవర్లెట్ అడ్వర్టైజ్ మెంట్స్ నిమిషానికో చోట అనిపిస్తుంది. విక్కి డోనర్ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి తెలుగు ,కన్నడ ,పంజాబీ ,మలయాళం ,తమిళ సినిమాల్లో నటించింది. హిమాచల్ లో పుట్టి చంఢీఘడ్ లో పెరిగిన అమ్మాయిని నేను. ప్రతిభను నమ్ముకొనే ముంభై వచ్చాను. నిరతంరం ఒక కొత్త దనాన్ని ఎంచుకోంటూ నన్ను నేను సానబెట్టుకొంటూ స్టీరియో టైప్ ను బ్రేక్ చేస్తూ వస్తున్నాను. ఎన్నొ […]
నేను ,నా కెరీర్ పూర్తిగా భిన్నం
నిజానికి నేను మార్పును పెద్దగా ఇష్టపడను. ఒకే ఆహారం తింటాను, అదే ఫ్రెండ్స్ తో కలుస్తాను. తమాషా ఏమిటంటే నాకెరీర్ ఈ తత్వానికి పూర్తిగా భిన్నంగా ఉంది. అన్ని రకాల పాత్రలతో ప్రయోగాలు చేయాలి. ప్రతి నిమిషం కొత్తదనం సృష్టించగలగాలి అంటోంది సాయిపల్లవి. అది అలా ఉంచితే నా సినిమాల పట్ల నేను కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి సినిమా ఒక అభ్యాస ప్రక్రియలాగా సాగింది. ఇప్పుడు కమర్షియల్ సినిమా చేయాలన్న భయం పోయింది. నాకు సినిమాలో ప్రాముఖ్యత […]
