Monday, 27 Jul, 2026

వెల్లుల్లి తో సమస్య

వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిసిందే . కొవ్వుని కరిగించేది . జీర్ణశక్తి ని పెంచేది . నోటి వ్యాధులకు మందుగా వెల్లుల్లి సుగుణాల గురించి విన్నాం . కానీ కొత్త అధ్యయనం వెల్లుల్లి వల్ల సమస్యలు ఉన్నాయంటోంది . ప్రతి రోజూ వెల్లుల్లిని తీసుకొంటే లివర్ పనితీరు దెబ్బ తింటుంది అంటున్నారు అధ్యయనకారులు . పాచి వెల్లుల్లిని తీసుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ హెల్త్ దుష్ప్రభావం పడుతుంది . అంచేత దీన్ని మితంగా వాడాలి . పాచి […]

ముళిక్కల్  పంకజాక్షి

కేరళకు చెందిన కళాకారిణి Moozhikkal Pankajakshi  కి ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు లభించింది . ఆమె  పెదవి పైన తోలు బొమ్మను నిలబెట్టి రామాయణ ,మహా భారత కథలను నాలుకతో ఆడించగలదు . తల్లిదండ్రులు ఆమెకు నేర్పిన ఈ మాల్కవిద్యా ‘ పవక్కలి ‘తన 12వ ఏట నుంచే కాపాడుతూ వస్తున్నారు . కేరళలోని మోనిపల్లి తాలూకా కొట్టాయింకు చెందిన  పంకజాక్షి భర్త శివరామ పాణిక్కల్ కూడా కళాకారుడే . ఐదు వందల సంవత్సరాల నాటి […]

వృత్తిని ప్రేమిస్తే అన్ని సాధ్యమే 

బాలీవుడ్ లో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు దాటినా అదే ఉత్సహం తో ఉండటం ఎలా సాధ్యం అని అడిగితే కరీనా కపూర్ పనిని ప్రేమిస్తూ,దాన్ని క్రమశిక్షణతో పూర్తి చేస్తే మనలో ఆ ఉత్సాహం,పట్టుదల అన్ని ఉంటాయంటోంది. ఏ పాత్ర నటిస్తే ఆ క్షణాలను ఆస్వాదిస్తాను,వృత్తికి వ్యతిగత జీవితానికీ మధ్య అనే  రేఖని ఎప్పుడు దాటను. దేని సమయం దానికే కేటాయిస్తాను అలాగే శరీరానికి అవసరం అయ్యే ఆహారం మాత్రమే తీసుకొంటాను. రోజు గంటసేపు వ్యాయామం చేస్తాను […]

సౌందర్య ఫలం పియర్స్ 

అందం,ఆరోగ్యం ఇచ్చే పండ్ల వరసలో వుంటుంది బేరీ పండు. యాపిల్స్ కు సీమ దానిమ్మలకు దగ్గరగా పసుపు ఆకుపచ్చ గోధుమ లేదా ఎరుపు రంగులో ఉండే ఈ పండు రుచి చాలా బావుంటుంది. క్రమం తప్పకుండా ఈ బేరీ పండు తింటే వయసు రిత్యా వచ్చే కండరాల బలహీనతను ఆపవచ్చు. పియర్ గా పిలిచే ఈ పండులో గ్లూకోజ్,ఫుక్ట్రోజ్ పుష్కలంగా ఉండటం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. ఒక్క గ్లాస్ బేరీ పండు రసం తాగితే జ్వరం […]

ఇది చిన్న విషయమా ? 

‘మిమి’ పాత్ర కోసం ఏకంగా పది కిలోలు బరువు పెరగావలసి వచ్చింది. దీన్ని గురించి ఎంతో ఆలోచించాను. క్యాలరీలు లెక్క పెట్టుకొంటు ఆహారం తీసుకోవలసివస్తోంది. ఇలా బరువు పెరగవలసి రావటం నాకు ఛాలెంజ్ గా అనిపిస్తోంది అంటోంది కృతిసనన్. బరువు పెరగటం వెంటవెంటనే ఆ బరువును కంట్రోల్ చేసుకోవటం అంత తేలికైన విషయం కాదు. ఎన్నో ఆహారపు అలవాటు మార్చుకోవాలి జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. కానీ శరీరాన్ని మరీ ఇంత అదుపులో ఉంచుకోవటం అంటే […]

బంగారు వన్నె అందం

వేడుకల్లో మెరిసిపోయేందుకు బంగారు రంగు ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు అందం అంటారు ఎక్స్ పర్డ్స్. అలాంటి ఖరీదైన మేరీస్ వర్ణాల లెహంగాకు మ్యాచింగ్ గా బంగారు రంగు పూలు డిజైన్ లతో ఉండే బ్లౌజ్ ఫ్యాషన్ అంటున్నారు లేదా మ్యాచింగ్ బ్లౌజ్ ,ఫాయిల్ వర్క్ ను పోలి ఉంటే బావుంటుంది . ముదురు ఎరుపు ,నారింజ,గులాబీ రంగు ళెగాంగాలు చూడ చక్కని డిజైన్ లతో ఫాయిల్ కుట్టటం ప్రత్యేకమైన పనితనం. లతలు ,అల్లికలు పులా డిజైన్ లలో […]

అది నా బాధ్యత

డబ్బు సంపాదన లోనూ ఖర్చు విషయంలో నేను కాస్త ఎక్కువే అంటుంటారు కానీ నేనేం విచ్చల విడిగా ఖర్చు పెట్టను . తెలివిగా వెచ్చిస్తాను అన్నది కంగనా రనౌత్ . ఇష్టమైన వారి కోసం నన్ను ప్రేమించే వారికోసం ,సామజిక కార్యక్రమాల కోసం చేసే ఖర్చు ఏదైనా ఉందీ అంటే అది అసలు ఖర్చుగానే చూడను అవన్నీ నాకు ఇష్టం . నా సంపాదనలో కొంతభాగం వాటన్నింటి కోసం హక్కుగా పంచవలసిన వాళ్ళు ఎందరో ఉన్నారు . […]

నా కోరిక తీరింది

నిజ జీవితంలో అస్సలు ఊహించటానికి అవకాశం లేని పనులు ఊహలు తెరమీద అయినా చేయగలగడం నాకేంతో ఆనందం ఇస్తోంది అంటోంది జాన్వీ కపూర్ . నాకు చిన్నప్పటి నుంచి ఫైలెట్ అవ్వాలని కోరిక ఉండేది . ఇప్పుడా కోరిక గుంజేన్ సక్సేనా కార్షిల్ గర్ల్ తో తీరబోతోంది . ఈ సినిమా లో నా పాత్రా కోసం యుద్ధ హెలికాఫ్టర్ నడిపాను స్వయంగా నేను నడపగలను అన్నంత శ్రద్ధతో నేర్చుకున్నాను . షూటింగ్ ఆరంభించాక తొలిసారి పైలట్ […]

బిల్లీ కి గ్రామీ అవార్డ్

టీనేజ్ పాప్ సింగర్ బిల్లీ ఎలిష్ గ్రామీ అవార్డ్ అందుకొన్నా అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్ సృష్టించింది . 18 సంవత్సరాల బిల్లీ లాస్ ఏంజిల్స్ లోని చిల్డ్రన్ సింగర్స్ బృందంలో సభ్యురాలు . అక్కడే సంగీతం లో మెళుకువలు నేర్చుకొన్నది . ఆమె పాడే పాటలన్ని వాళ్ళ అన్నయ్య ఫిన్నేయాన్ రాసినవే . అతనే బిల్లీకి పాటలు రాయటం వాటిని ప్రొడ్యూస్ చేయటం నేర్పించాడు . ఆమె తల్లిదండ్రులు ఇద్దరికీ నటన ,సంగీతం వచ్చు 2016 లో […]

అత్యంత స్ఫూర్తి నింపిన సినిమా

72 సంవత్సరాల లతా భగవాన్ కరే గురించిన సినిమా ఇప్పుడు విడుదలైంది . ఫిలిం మేకర్ నవీన్ దేశ్ బోయిన్ మరాఠీ లో ఈ సినిమా నిర్మించారు . అనారోగ్యంతో ఉన్నా భర్తను బ్రతికించుకొనేందుకు మారథాన్ లో పరుగులు తీసింది లతా కరే . ఆ సమయంలో ఆమె భర్త భగవాన్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు . మారథాన్ లో గెలిస్తే ఐదువేల రూపాయిలు బహుమతి వస్తుందని తెలుసుకొని నిర్వాహకులను వేడుకోంది లతా . కాళ్ళకు చెప్పులు […]

నేను హ్యాపీ పర్సన్ ని 

నన్ను ఆమోదించిన తెలుగు ప్రేక్షకులకు నేను కృతజ్ఞతావాదినై ఉంటాను. నిజానికి తెలుగు తమిళం రెండు భాషలూ నాకు రావు. సినిమా అంగీకరించాక ఆ పాత్ర ని అర్ధం చేసుకోవాలంటే భాష భావం అన్ని తెలియాలి. నటించేప్పుడు అందుకు అనుగుణంగా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాలి. డైలాగ్స్ విషయంలో చాలా హార్డ్ వర్క్ చేశాను. రికార్డ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని ఇప్పుడు డబ్బింగ్ చెప్పుకోగలిగే స్థాయిలో ఉన్నానంటే అదంతా నా హార్డ్ వర్క్ వల్లనే అంటోంది పూజా హెగ్డే. అలవైకుంఠపురం […]

అది నా స్వభావం

‘పంగా ‘లో తల్లి పాత్ర నాకెంత తృప్తి నిచ్చిందో చెప్పలేను . అసలా కారెక్టర్ గురించి తలచుకొంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తుంది . పల్లె వాతావరణం నుంచి పట్నానికి వచ్చాను . అందుకే పల్లెటూరు నా అభిమాన విషయం అంటుంది కంగనా రనౌత్ . నేను కాస్త చురుగ్గా మాట్లాడతానని అంటారు కానీ అది నా పల్లెటూరి మొహమాటం లేని  అలవాటు  సూటిగా ,మనసులో ఏమీ ఉంచుకోకుండా మాట్లాడటం నా పనిని నాకు నచ్చినట్లు చేసుకుపోవటం ,ఎలాటి […]

పుస్తకాలే నా నేస్తాలు

పుస్తకాల మించి నాకెవరూ స్నేహితులు ఉండరు ,నేను ఇంటికి దూరంగా ఉన్నపుడు పుస్తకాలే నాకు తోడుగా ఉంటాయి . ఏ కొంచెం తీరిక దొరికినా ఎదో ఒక పుస్తకం చదువు తూనే ఉంటాను అంటుంది షాలినీ పాండే . ఒకేఒక్క సినిమా తో పాపులర్ అయిన షాలినీ పాండే పుస్తకాల తోనే లోకం అంటుంది . ఒక పాఠకునికి వందమంది జీవితాల్లో ఉండే అనుభవాలు అన్ని అందుతాయి . ఒక్క పుస్తకం ఒక్క జీవితానుభవం అనుకొంటాను నేను […]

హాకీ కెప్టెన్ కు పురస్కారం

భారత హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్ ను పద్మశ్రీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం . ఆమెది హరియాణా లోని షాబార్ . తండ్రి రిక్షా కార్మికుడు . ఆమెకు హాకీ క్రీడ పైన ఆశక్తిని గమనించి ప్రోత్సహించారు తల్లిదండ్రులు . రైల్వేలో జూనియర్ క్లర్క్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది రాణీ . అన్ని అవరోధాలను దాటుకొంటూ ఆటలో మేటిగా నిలిచి రాణీ ఇప్పటి వరకు 200 పైగా మ్యాచ్ లు అడి జట్టుకు ఎన్నో […]

వన నారి కి పద్మశ్రీ 

కర్నాటక లోని అందోలా తాలుకా హొన్నోలి గ్రామానికి చెందిన తులసి గౌడ్ ను ఎన్ సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్ అంటారు. ఇప్పుడు తులసికి 76 సంవత్సరాలు. అరవై సంవత్సరాలుగా అడవిలో ఆమె 40 వేలకు పైగా చెట్లు పెంచింది. చిన్న తనంలోనే గోవింద్ గౌడ్ తో ఆమెకు వివాహం జరిగింది. కొన్నాళ్ళకే ఆయన చనిపోయాక అడవిలో తాత్కాలిక ఉద్యోగి గా చేరి పోయింది తులసి ఆ చెట్ల పెంపకం పరి రక్షణ లోనే జీవితాన్ని గడిపిన తులసి ప్రతి […]

రైతు సేవకు పద్మశ్రీ

సేంద్రీయ పసుపు సాగుతో గ్రామాల్లో 900 మందికి ఆదాయ మార్గం చూపుంచిన మేఘాలయకు చెందిన ట్రినిటీ సాయొ కి పద్మశ్రీ లభించింది . మేఘాలయా లోని ములేహ్ అనే చిన్నఊరు ఆమె స్వగ్రామం . ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు . రైతులను కూడగట్టి సహకార సంఘం ఏర్పాటు చేసి ,పసుపు కొమ్ములు ఆరబెట్టి మిల్లులో పసుపుగా మర్చి ఫ్యాకింగ్ చేయటం అలవాటు చేశారు . ఇప్పుడు రైతులు తమ పంట ఉత్పత్తులు దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ ఆ […]

అహింస ప్రచారానికి సత్కారం

గాంధీ మార్గాన్ని అనుసరిస్తూ బ్రెజిల్ సమాజంలో అహింస నెలకొల్పేందుకు కృషి చేసిన లీయా దిస్కిన్ ను ఈ ఏడాది పద్మ శ్రీ లభించింది . బ్రెజిల్ లో ఎంతో హింస నేరాలు ,ఘోరాలు ఉన్నాయి . లీయా గాంధీ ప్రభావం తో విద్య, శాంతి ,విలువలు ,సంస్కృతి సంప్రదాయలు గురించి రాసిన  ‘పీస్ హౌ టు మేక్’ అన్న పుస్తకం ఐదు లక్షల కాపీలు అమ్ముడైంది. . బ్రెజిల్ లోని ఆరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆపుస్తకాన్ని పిల్లల […]

సుష్మాస్వరాజ్ కు పద్మవిభూషణ్ 

దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మాస్వరాజ్ కు లభించింది. ఏడు సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా,మూడు సార్లు శాసన సభ్యురాలుగా ఎన్నికయ్యారు 1977 లో 28 సంవత్సరాల వయసులో క్యాబినెట్ మంత్రి గా చేసారు సుష్మా. 27 సంవత్సరాల వయసులో జనతా పార్టీ  రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నారు. 1987 నుంచి 1990 వరకు ఆమె హర్యానా రాష్ట్ర విద్య మంత్రిగా ఉన్నారు.

సామజిక సేవకు గుర్తింపు 

సామజిక సేవ రంగంలో ఉషా చౌమార్ కు పద్మశ్రీ పురస్కారం లభించింది. పదేళ్ళ వయసులో పారశుధ్య కార్మికురాలుగా జీవనం ప్రారంభించి ఎన్నో ఛీత్కారాలు, అంటరాని తనాన్ని ఎదురుక్కొన్నారు ఉషా చౌమార్,నయా దిశ స్వచ్చంద సంస్థ ఆమెను చేరదీసింది. ఇప్పుడా సంస్థ లోని సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ కు ఉషా అధ్యక్షురాలు. చేతులతో మల మూత్రాల ఎత్తి వేతకు వ్యతిరేకంగా ఉషా పోరాటం చేస్తున్నారు.

సింధు కు పద్మభూషణ్ 

క్రీడా కారులకు,యువతకు ఆదర్శంగా నిలిచిన బాడ్మింటన్ సంచలనం పి.వి సింధుని ఈ సంవత్సరం పద్మభూషణ్ వరించింది. సాధారణ నేపద్యం నుంచి వచ్చి ప్రపంచ,బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో రెండు కాంస్యాలు రెండు రజితాలు సాధించింది. గత సంవత్సరం స్వర్ణం సాధించి ప్రపంచ బాడ్మింటన్ శిఖరం పై సగర్వంగా నిలబడింది సింధు. 2013 లో అర్జునా, 2015 లో పద్మశ్రీ,2016 రాజీవ్ ఖేల్ రత్న అవార్డ్ లు ఆమెకు దక్కాయి.