Tuesday, 28 Jul, 2026

 కత్రిన్ జాకబ్స్ డాట్టిర్ శ్రమ కీలకం 

ఈ కరోనా సమయంలో ఐస్ ల్యాండ్ ప్రధాని  కత్రిన్ జాకబ్స్ డాట్టిర్. ఆ దేశ ప్రజలకు తల్లి పాత్ర పోషించారు మూడున్నర లక్షల కు ఎక్కువగా ఉన్న ఆదేశ జనాభాలో 12 శాతం మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య కేవలం పది …. కరోనా వైరస్ ప్రమాదం అర్ధం చేసుకొని ఆరోగ్య శాఖాధికారులు అంటువ్యాధి నిపుణులు శాస్త్రవేత్తల తో సమీక్షలు నిర్వహించారు. ట్రేసింగ్ యాప్ తో కరోనా సోకిన […]

సన్నా మారిన్  కృషి అపూర్వం 

కరోనా కట్టడి విషయంలో ఫిన్ లాండ్ ప్రధాని సన్నా మారిన్ తీసుకొన్న చర్యలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. మర్చి 16 నాటికి మూడు వందల కేసులు నమోదయ్యాయి. వెంటనే దేశంలో ఆరోగ్య ఎమర్జెన్సీ ప్రకటించారు సన్నా మారిన్ దేశాదీ నేతగా కాకుండా తల్లి మనసుతో వ్యవహరించింది ఫిన్ లాండ్ ప్రధాని సన్నా మారిన్. ఇతర దేశాలతో రాకపోకలు నిషేదించారు. లాక్ డౌన్ కఠినంగా అమలైంది. పిల్లల భవిష్యత్ కోసం వర్చువల్ క్లాసులు కొనసాగించారు. వయస్సు మళ్ళిన […]

మానవత్వపు పరిమళం 

ఒడిస్సాలోని మహిళా పోలీస్ అధికారి శుభ శ్రీ నాయక్ ఒక మతిస్థిమితం లేని మహిళకు అన్నం తినిపిస్తున్న దృశ్యం సామాజిక మాధ్యమాల్లో జనం ప్రశంసలు అందుకుంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆ దృశ్యాన్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు .ఆమె ఒడిషాలోని మల్కాన్ గిరి మోడల్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ .లాక్ డౌన్  లో డ్యూటీ లో రోడ్డు పై వెళ్తుండగా బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టుకొని తాగేందుకు అవస్తపడుతున్న మహిళ కనిపించింది.ఆమెకు మంచి […]

నా లక్ష్యాన్ని తెలుసుకొన్న

ఈ కరోనా విపత్తు నాకెన్నో పాఠాలు నేర్పించాయి  అంటున్నారు ములుగు ఎమ్మెల్యే, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సీతక్క. ములుగు సబ్ రిజిస్ట్రార్ తస్లీమ్  మహమ్మద్ చేసిన ‘ గో హంగర్  గో ‘ చాలెంజ్ ను తీసుకొని పెనుగోలు గ్రామానికి బయలుదేరాను. అక్కడికి కాలినడకనే వెళ్లాలి గుట్టలు వాగులు దాటుతూ అక్కడి 20 కుటుంబాల ఆకలి తీర్చడం కోసం చేసిన ప్రయాణం నాలో ఆత్మస్థైర్యం నింపింది .మారుమూల గ్రామాల్లో 470 కి పైగా […]

 రాచ్చసి 

తమిళంలో వచ్చిన ‘రాచ్చసి’ సినిమాలో గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఎలా ఉంటుందో ,ఒక మంచి హెడ్ మాస్టర్ దీన్ని ఎలా చక్కదిద్దవచ్చో చాలా అద్భుతంగా చెప్పారు .జ్యోతిక ఒక ప్రభుత్వ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయురాలు గా వస్తుంది.ఎక్కువ మంది టీచర్లు సొంత పనుల్లో కాలక్షేపం చేయటం విద్యార్థుల్లో కుల ఘర్షణలు ,పేద కుటుంబాల్లో ఎలాంటి సదుపాయాలు లేని చోట విద్యార్థులు ఎలా వెనుకబడతారో వాళ్ల కోసం ఏం చేస్తే వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందో ప్రైవేట్ […]

అనుష్క ఆరోగ్య రహస్యం 

శరీరం తీరైన ఆకృతి లో ఉండాలంటే వర్క్ వుట్స్  ఎంత అవసరమో ఆహారం కూడా అంతే అవసరం అంటోంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ .తన 31 వ పుట్టినరోజు సందర్భంగా లైవ్ చాట్ లో అభిమానులతో మాట్లాడుతూ,ఈ కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచే ఆహారంలో భాగంగా ఇమ్యూనిటీ బూస్టింగ్ టీ  గురించి వివరంగా చెప్పారు. ఆమె చెప్పిన పసుపు మిరియాల తో కూడిన ఈ టీ ని ఇంట్లో సులభంగా చేసుకోవచ్చు .మిరియాలు […]

ఏక్ హజారాచి నోట్

చదువు సంధ్య లేని పేదవాళ్ళ విషయంలో ఎన్నో అన్యాయాలు జరుగుతోనే ఉంటాయి. అరే ఇది కూడానా అనిపించే సంఘటనలు చాలా ఉంటాయి. అలాంటి సంఘటనే మరాఠీ సినిమా ఏక్ హజారాచి నోట్.  శ్రీహరి సాథే తీసిన ఈ సినిమా ఎన్నో అవార్డులు గెలుచుకోంది. బుధ విదర్భలో నివశించే జముసలామె . అప్పుల బాధతో భర్త కొడుకు ఆత్మహత్య చేసుకొంటారు. కోడలు పుట్టింటికి వెళ్ళిపోతుంది. కటిక పేదరికంలో బతికే బుధ కి  పక్కింటి సుదామా తోడుగా ఉంటాడు. ఓ […]

మన తెలుగు సామెతలు

అన్ని ఉన్న ఆకు అణిగి మణిగి ఉంటే ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడిందట అంటారు అన్ని అర్హతలు ఉన్న వాళ్ళు సర్వశక్తి సంపన్నలు తన బలాన్ని తెలుసుకొని నమ్రతగా ఉంటే ఎలాంటి మంచి గుణం లేనివాడు ఉరికే బడాయి మాటలు చెపుతూనే వెక్కిరింత ఈ సామెత విస్తరిలో అన్ని పదార్ధాలు ఉంటే అది నెమ్మదిగా నేలనే ఉంటుంది. ఏ పదార్ధం లేని ఆకు గాలికి ఉరికే ఎగిరి పడుతూ ఉంటుంది. శక్తి లేనివారి గావు కబుర్లు […]

కష్టమైనా కొనసాగిస్తున్నం

ఈ లాక్ డౌన్ సమయంలో ప్రాజెక్ట్ బాలా ( project Baala ) ద్వారా ఢిల్లీ లోని మురికివాడల ప్రాంతంలో 18 వేలకు పైగా శానిటర్ నాప్ కిన్స్ ఉచితంగా పంపిణి చేశాం అంటోంది సౌమ్యా డబ్రీవాల్‌ ,మహిళల ఆరోగ్యం కోసం శుభ్రత గురించి డిజిటలైజ్డ్‌ వర్క్‌షాప్ లు నిర్వహిస్తున్నం నగరాల్లో పట్టణాల లోనే అన్నివైద్య సేవలు అందుబాటులో లేవు ఇక వ్యక్తిగత శుభ్రత గురించి ఆలోచించలేని పరిస్థితుల్లో మహిళలు బాలికలు అనారోగ్యం బారిన పడే అవకాశం […]

ఎందరో మహిళలకు స్ఫూర్తి

నా వృత్తి జీవితంలో కోవిడ్ -19 నియంత్రణ ఒక పెద్ద సవాల్. ఏడేళ్ళ నా కొడుక్కి పరిస్థితిని వివరించాను, విధి నిర్వహణలో ఎంతో మంది తల్లులు పిల్లల ఆరోగ్యాల కోసం నిరంతరం పని చేస్తున్నాం అంటున్నారు రూబల్ అగర్వాల్. అత్యత్తుమ అధికారి రూబల్ మహారాష్ట్ర లో మంచి పేరు ఉంది పుణే అడిషనల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా పుణే స్మార్ట్‌ సిటీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ సీఈవోగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. రెండు వేలకు పైగా కరోనా పాజిటివ్ […]

నా వంతు నేను  

మొదట్లో బయటికి వెళ్ళంటే భయం గానే ఉండేది కానీ ఇంట్లో ఎన్నాళ్ళు. జనం ఆపదలో ఉంటే ఆదుకొని తీరాలి. వలంటీర్లతో పాటు నేను చేతులకు గ్లౌజులు,ముఖానికి మాస్క్ వేసుకొని ఈ లాక్ డౌన్ లో అవసరం అయిన వాళ్లకు భోజనం అందిస్తున్నాం అంటోంది ప్రణీత. ప్రణీత ఫౌండేషన్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇచ్చాను. మీడియా కధనాలు విని బాధితులను గుర్తించి,ఓ పదిలక్షల వరకు విరాళాలు సేకరించి అందించాను అలానే ఇప్పుడు ప్రతిరోజు భోజనం ప్యాకెట్లు […]

కన్నడ రుచులకు ప్రసిద్ధి     

‘ హల్లి మనే రొట్టి ‘ మంగళూరులో చాలా ఫెమస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్. ఈ సెంటర్ ను నడిపే శిల్ప జీవితాన్ని ఇప్పుడు యూత్ పాఠాలుగా వింటున్నారు. 2009 వరకు భర్తతో హాయిగా జీవించిన శిల్ప ఉన్నట్లుండి అతను మాయం అవటంతో తల్లితండ్రులు,తమ్ముడు తన కన్నబిడ్డను బతికించు కొనేందుకు మొబైల్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టార్ట్ చేసింది. సాంప్రదాయ కన్నడ రుచి తో ఉండే ఈ భోజనానికి ఉద్యోగులు ప్రధానమైన కష్టమర్లు . మౌత్ పబ్లిసిటీ […]

పిల్లలను మిస్ అవుతున్న 

లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి క్షణం తీరిక లేకుండా పనిచేస్తోన్నా. మా డిపార్ట్ మెంట్ నేను డాక్టర్ ని కావటం వల్ల పోలీసుల కోసం జీవన శైలి సమస్యల పైన దృష్టి పెట్టవలసి వస్తోంది వారి ఆరోగ్య బాధ్యత కూడా నాదే కానీ మా ఇద్దరమ్మాయిల ను మాత్రం బాగా మిస్ అవుతున్నాను. పెద్ద పాపకు పదేళ్ళు చిన్న పాపకు నాలుగు. ఇంటికి వెళుతూనే నేను కనబడగానే మీదికి రాకుండా ఆపటం చాలా కష్టంగా ఉంది అంటున్నారు […]

ఇది సమిష్టి విజయం 

లాక్ డౌన్ వేళలో తంతి తపాలా శాఖలో 17 వేల మంది నిర్విరామంగా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సారథ్యం వహించిన చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ సంధ్యారాణి కన్నెగంటి పేరు చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రధాన బాధ్యత ప్రభుత్వం అందించే రకరకాల పింఛన్లు కరోనా ఆర్ధిక సాయం లబ్ధిదారులకు పంపిణీ చేయటం,వందల కోట్ల రూపాయలు మారుమూల గ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక వాహనాలు ఏర్పాట్లు  ఇవన్నీ సమర్ధవంతంగా నిర్వహించారు సంధ్యారాణి డైరక్టర్లు,ప్రాంతీయ జిల్లా అధికారులతో చర్చించి సూచనలు […]

యాక్టింగ్ క్లాసుల్లో సమంత 

ఇప్పుడు నేను మరింత చక్కని నటిని అయ్యను పనిచేసే సమయం కోసం నన్ను నేను చాలా తీర్చి దిద్దు కొంటున్న అంటోంది సమంత. ఈ లాక్ డౌన్ సమయంలో అమెరికన్ ఆన్ లైన్ ఎడ్యుకేషనల్ ఫ్లాట్ ఫామ్ మాస్టర్ క్లాస్ లో పాఠాలు వింటోంది సమంత. ది క్వీన్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆస్కార్ పురస్కారమందుకొన్న హెలెన్ మేరీస్ యాక్టింగ్ పాఠాలు చెపుతున్నారు. ఈ ఆన్ లైన్ పాఠాలు వింటుంటే నా నటన మరింత ఇంప్రూవ్ […]

న్యూయార్క్ కోర్టు జడ్జిగా సరిత కోమటిరెడ్డి

తెలంగాణకు చెందిన భారతీయ-అమెరికన్‌ సరితా కోమటిరెడ్డిని యూఎస్‌ డిస్ర్టిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ఈస్ట్రన్‌ డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ న్యూయార్క్‌కు జడ్జిగా నియమితులయ్యారు. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి బీఏ, న్యాయవాద పట్టా తీసుకొన్న సరితా  కెలాగ్‌ హన్సెన్‌ టాడ్‌ ఫిజెట్‌ అండ్‌ ఫ్రెడెరిక్‌ సంస్థలో ప్రైవేటుగా ప్రాక్టీసు పూర్తి చేసుకున్నారు.అమెరికా న్యాయవ్యవస్థ లోని పలు విభాగాల్లో పని చేశారు. ఆమె తండ్రి హనుమంత్ రెడ్డి మిస్సౌరీలో కార్డియాలజిస్ట్‌ ,తల్లి గీతారెడ్డి రుమటాలజిస్ట్‌.

అడవి బిడ్డలకు అమ్మ సీతక్క 

ఈ కరోనా కాలంలో నలభై రోజులుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క అడవి లో తిరుగుతున్నారు. రాళ్ళు రప్పలు పట్టించుకోకుండా నిత్యావసర వస్తువులు మోస్తూ గిరిజన కోనలో పర్యటిస్తున్న సీతక్క ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఎర్రని ఎండలో నడుస్తూ అనుచరులతో కలిసి వెళ్ళి అడవి బిడ్డలకు బియ్యం నిత్యావసర వస్తువులు అందించటం మొదలు పెట్టారు. ములుగు నియోజక వర్గం కొత్తగూడ,తడ్వాయ్, మంగపేట తదితర మండలాల్లో చిన్న చిన్న గూడేలకు సరైన రహదార్లు లేవు అలాటి ప్రాంతాలకు […]

అసలు తినను,తెలుసా ! 

లాక్ డౌన్ సమయాన్ని,అనుకోకుండా లభించిన తీరికను నేను ఎంజాయ్ చేస్తున్నాను. అందరి లగే సరదాగా కొత్త కొత్త వంటలు చేస్తున్నాను కానీ నోటికి నచ్చిన ప్రతి వంటకాన్ని మాత్రం తినటం లేదు. ఎందుకంటే ఇదే జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఖాళీగా ఉండి,ఏది పడితే అది తినేస్తే లావైపోతారు. బరువు తగ్గాలంటే ఎంత కష్టం అందుకే ఫిట్ నెస్ పైన శ్రద్ధ పెడుతున్న అంటోంది కియారా అడ్వాణీ. అందరిలాగే సినిమాలు చూస్తూ విశ్రాంతిగా గడుపుతున్న తినే విషయంలో అత్యంత […]

 సర్వైవల్ థ్రిల్లర్ హెలెన్ సినిమా  

అన్నబెన్ లీడ్ రోల్ లో నటించిన చూడదగిన సినిమా హెలెన్ ! . బి.ఎస్.సి నర్సింగ్ పూర్తి చేసి కెనడాలో జాబ్ కోసం ప్రయత్నిస్తూ ‘ది చికెన్ హబ్’ అనే ఫాస్ట్ ఫుడ్ షాప్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్న హెలెన్ పొరపాటున ఫ్రీజర్ లో 18 డిగ్రీల ఉష్ణోగ్రత లో చిక్కుకు పోతుంది. ఆ రోజు ఉదయమే తండ్రితో గొడవ పడుతుంది హెలెన్. ఆ ఫ్రీజర్ లోంచి తనను తాను రక్షించుకొనేందుకు ఆమె చేసే […]

సబ్ టైటిల్స్ 

లాక్ డౌన్ సమయాన్ని ఎంతో మంది చాలా సమర్ధవంతంగా ఉపయోగించుకొంటున్నారు. కేరళ,నొర్ నార్ కు చెందిన స్వాతి లక్ష్మి విక్రమ్ కొట్టాయంలోని పి.ఎం.ఎస్ కాలేజీలో బిఎ ఇంగ్లీష్ లిటరేచర్ ఆఖరి సంవత్సరం చదువుతోంది. ఆమెకు సినిమాలు చాలా ఇష్టం హిందీ ఇంగ్లీష్,తమిళం,వరల్డ్ మూవీస్,షర్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ కు మళయాళంలో సబ్ టైటిల్స్ రాసే పని పెట్టుకొంది వీటన్నింటికి సినిమా ఆధారంగా సబ్ టైటిల్స్ రాస్తోంది. ఒక్క సినిమాకు వెయ్యికి పైగా సబ్ టైటిల్స్ అవసరం అవుతాయి. […]