Gagana
నేను చాలా మారాను
కోవిడ్ అందరికీ అనేక పాఠాలు నేర్పింది.ప్రమాద పరిస్థితుల్లో పోలీస్ లు, డాక్టర్లు,నర్స్ లు ,మునిసిపల్ సిబ్బంది ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా విధులు నిర్వహించారు. వాళ్ల సేవ అభినందనీయం నేను నిజంగా చాలా మారాను.సమాజం పట్ల దృక్పథం మారింది అంటోంది హీరోయిన్ అదా శర్మ. ఈ కరోనా సమయంలో శారీరకంగా మానసికంగా మనపై ఉండే ఒత్తిడి మన ఆరోగ్యంపై పడుతోంది.ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నా.భోజనం విషయంలో చాలా కచ్చితంగా ఉన్నా.వర్క్ వుట్స్ మానలేదు.దొరికిన విశ్రాంతితో ఇంట్లో పనులు మాత్రం చేస్తున్నా […]
గ్రీన్ ఆస్కార్ కు ‘పెంగ్ యు సై’
గోవాలోని శాలిగావ్‌లో పుట్టి పెరిగిన మలైకా వాజ్ పద్నాలుగేళ్లకే విండ్ సర్ఫింగ్ నేర్చుకుంది. తర్వాత ఫెలిస్ క్రియేషన్స్’ సంస్థలో వైల్డ్‌లైఫ్ పరిశోధకురాలిగా చేరింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఎక్స్‌ప్లోరర్ గ్రాంట్ తీసుకొంది. ఆ గ్రాంట్‌తో ‘లివింగ్ విత్ ప్రిడేటర్స్’లో సిరీస్‌ని రూపొందించింది మలైకా. సింహాలూ, చిరుతపులులూ, పులుల్ని రక్షించే ఆదివాసీ తెగలగురించి వీటిలో చూపించింది.మూడేళ్ల కిందట బెంగళూరు కేంద్రంగా ‘అన్‌టేమ్డ్‌ప్లానెట్’ సంస్థను నిత్యే సూద్‌తో కలిసి ప్రారంభించింది మలైకా. వీరు తీసిన ‘పెంగ్ యు సై’ డాక్యుమెంటరీ ఈ […]
ఇంట్లోనే చెయ్యచ్చు
ఇంట్లోనే నడక యోగా చెయ్యచ్చు 25 నిమిషాలు వ్యాయామం సరిపోతుంది.వ్యాయామంతో పాటు పోషకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అంటోంది బాడీ బిల్డర్ సోనాలి స్వామి.ఇద్దరు పిల్లలు పుట్టాక బాడీ బిల్డింగ్ మొదలు పెట్టి పతకాలు సాధించారు ఈ నలభై రెండు సంవత్సరాల సోనాలి.మెరుగైన ఆరోగ్యం కోసం కూరగాయలు తాజా పండ్లు తినాలి పరిమితికి మించి తింటే వ్యాయామంతో కరిగించ లేని అదనపు కేలరీలు పెరుగుతాయి అంటోంది సోనాలి.కరోనా వైరస్ భయంతో ఇప్పుడు అందరిలో ఫిట్ నెస్ ఆసక్తి […]
పాడైన పాలు మొక్కలకు బెస్ట్
పాడైపోయిన పాలు చెత్త బుట్టలో వేయకండి, వాటిని మొక్కలకు పోస్తే మంచి పోషణతో పాటు ఆరోగ్యం కూడా అంటోంది సమంత.ఎక్సపైరీ దాటిపోయిన పాల ప్యాకెట్ పాలడబ్బా ల లోని పాలు ఆరోగ్యానికి మంచివి కావు.అవి మొక్కలకు మంచి ఎరువుగా పనికి వస్తాయి.ఆ పాలలో యాంటీ ఫంగల్ యాంటీ పెస్టిసైడ్ గుణాలుంటాయి పాలలోని కాల్షియం మొక్కలు పెరిగేందుకు తోడ్పడతాయి.టమాటో, దోస, గుమ్మడి మొక్కల్లో పూత రాలిపోవడాన్ని అడ్డుకుంటాయి. పాలలో ఉండే అత్యవసర /ప్రోటీన్లు విటమిన్ బి మొక్కలను పూర్తి […]
ఆపదలో సాయం
కర్ణాటక కు చెందిన ఆశా వర్కర్ 50 ఏళ్ల రాజీవి నాయక్, తెల్లవారుజామున ఒక నిండు గర్భిణిని తన ఆటోలో ఎక్కించుకుని 20 కిలోమీటర్ల లోని ఆసుపత్రికి తీసుకు పోయి ఆమె ప్రాణాలు నిలిపిన కబురు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.ఉడిపి జిల్లా లోని ఫెర్నాన్ ఖిలా గ్రామానికి చెందిన రాజీవి ఆశ కార్యకర్త గా పనిచేస్తోంది.అవసరంలో గర్భిణీల ను ఆస్పత్రికి తరలించేందుకు ఆశ కార్యకర్తగానే కాక మనసున్న మనిషి లా సిద్ధంగా ఉంటుంది. శ్రీలత అన్న […]
మాట నిలబెట్టుకున్న సోనూసూద్
కోవిడ్ లాక్ డౌన్ లో ఇల్లు గడవక రోడ్డు పైన కర్రసాము చేస్తూ యాచిస్తూ కనబడిన శాంతా బాలు పవార్ సోషల్ మీడియా లో ఎందరో నెటిజన్ల అభిమానం సంపాదించింది. ఆమె వివరాలు తెలియజేస్తే ఆమెచేత ఆడపిల్లలకు ఆత్మరక్షణ శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేస్తాను.అని సోనూ సూద్ ట్వీట్ చేశారు.అన్నట్లు గానే పూణేలో శాంతా పవార్ మమ్మ చేత స్కూల్ పెట్టించాడు. ఇప్పుడామె స్కూల్లో ఆడపిల్లలకు శిక్షణ ఇస్తోంది. కర్రసాము లో శిక్షణ ఇస్తోంది శాంతా పవార్ […]
ఈ చట్నీలు ఎంతో రుచి
విన్ గ్రీన్స్ వ్యవస్థాపకురాలు అంజు శ్రీవాస్తవ్ ఉమెన్స్ ఇనిషియేటివ్ నెట్వర్క్ విన్ గ్రీన్స్ పేరుతో వినూత్నమైన ప్యాకేజ్ ఫుడ్స్ నీ తెస్తోంది. విన్ గ్రీన్స్ చట్నీలు డిప్స్,చట్నీలు స్ప్రెడ్స్ నాన్ చిప్స్ బేకరీ మిక్సెస్ వంటివి వందకుపైగా వెరైటీలు అందిస్తున్నారు ఈ సంస్థలో పనిచేసే షెఫ్ లలో ఉన్న 50 మందిలో 35 మంది మహిళలే విన్ గ్రీన్స్ ఉద్యోగాల సంఖ్య 1500 వారిలో మూడో వంతు మహిళలు. లాక్ డౌన్ లో మరిన్ని ఉత్పత్తులు తీసుకు […]
మా నాన్నకు భూమి కొనిచ్చా
సోనాలి మజుందార్ sholoardari అనే చిన్న గ్రామంలో పుట్టింది. అది బాంగ్లాదేశ్ సమీపంలోని గ్రామం.కలర్స్ టీవీ రియాల్టీ షో ఇండియన్ గాట్ టాలెంట్ సీజన్ 4 విజేత అత్యుత్తమ ప్రదర్శనతో న్యాయ మూర్తులను ఆశ్చర్య పరిచిన సోనాలి కుటుంబం గురించి చెప్పి మరిన్ని ప్రశంసలు పొందింది. మా నాన్న రైతుకూలీ కరెంట్ సౌకర్యం కూడా లేని గ్రామం.ఈ షోలో పాల్గొని నాకు వచ్చిన డబ్బుతో మా నాన్నకు మా ఊళ్లో భూమి కొన్నాను.రైతు కూలి గా కాదు […]
ఇప్పుడు పరీక్షలెందుకు ?
ఎనిమిదేళ్ల Licypriya Kangujam మణిపూర్ కు చెందిన యాక్టివిస్ట్. బెంగళూరు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకుంటుంది. వాతావరణ పరిరక్షణ పైన ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ ప్రసంగాలు చేసింది.డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ చిల్డ్రన్స్ అవార్డ్, వరల్డ్ చిల్డ్రన్స్ పీస్ ప్రైజ్ ,రైజింగ్ స్టార్ ఆఫ్ ఎక్స్ డే నెట్వర్క్ వంటి అవార్డులు సంపాదించింది సుకీఫు అంటే సర్వైవర్ కిట్ ఫర్ ది ఫ్యూచర్ అనే కిట్ తయారు చేసింది శరీరంలోకి స్వచ్ఛమైన గాలిని పంపే సాధనం అది. […]
నాకో ప్రత్యేకత కావాలనుకొన్నా !
పార్లే ఆగ్రో సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యాపారంలో ఉన్నారు నాడియా చౌహాన్.ముందు నుంచే మార్కెటింగ్ విభాగంలో పని చేశారు.నాదైన ప్రత్యేక ముద్ర కావాలనిపించింది.టెట్రా ప్యాక్ తో ఫ్రూటీ ని అందించటం మొదలుపెట్టాం.మా ఉత్పత్తుల అమ్మకాలు దూసుకు పోతున్నాయి. ముంబై లోని పార్లే విల్లే ప్రాంతానికి చెందిన చౌహాన్ కుటుంబం నుంచి వచ్చాను.1929లో మా తాతగారు బిస్కెట్లను తయారుచేసే సంస్థను స్థాపించారు.అందులోంచి వేరువేరు సంస్థలు వచ్చాయి అందులో పార్లే ఆగ్రో సంస్థ మా నాన్న ప్రకాష్ […]
CU SOON (మలయాళం)
ఒక గొప్ప ప్రయోగం ప్రయోగాత్మక సినిమా సి యు సూన్ సినిమా ప్రత్యేకత ఏమిటంటే మొత్తం, మొబైల్ ,వాట్సాప్, ఫేస్ బుక్, జి మెయిల్ ,జూమ్ వీడియో కాల్స్,చాటింగ్ తోనే నడుస్తుంది.ఒక యువకుడికి చాటింగ్ లో ఒక అమ్మాయి పరిచయం అవుతోంది. ఆమె ఇంట్లో ఏదో సమస్య ఉందని చెప్పటంతో ఆమెను తన ఇంటికి తీసుకువస్తాడు. ఆమె ఎవరో, ఎక్కడ నుంచి మాట్లాడిందో, అంతకు ముందు ఏం జరిగిందో అతనికి తెలియదు అతను ఆఫీస్ కు వెళ్లే […]
108 డ్రైవర్ గా వీరలక్ష్మి
తమిళనాడులో 108 వాహనం నడిపే తొలి మహిళగా గుర్తింపు పొందింది వీరలక్ష్మి. చిదంబరం లో ఆటోమొబైల్ ఇంజినీరింగ్ లో డిప్లొమా కోర్స్ చేశారు.చెన్నైదగ్గర లోని తిరువేర్కాడులో నివాసం. భర్త కారు డ్రైవర్ అతని దగ్గరే డ్రైవింగ్ నేర్చుకుని టాక్సీ నడుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా108 వాహనాల సంఖ్య పెంచింది.వాటికి డ్రైవర్ లను ఎంపిక చేస్తారనే విషయం తెలుసుకుని దరఖాస్తు చేసింది వీరలక్ష్మి.ఆమె కోరుకున్నట్లు గానే తిరువళ్లూర్ జిల్లా లోని ఓ అంబులెన్స్ డ్రైవర్ గా నియమిస్తూ ఆర్డర్ […]
సహజమైన రంగు
సౌందర్య పోషణకు బీట్ రూట్ ఎంతో ఉపయోగ పడుతోంది అంటారు ఎక్స్ ఫర్ట్స్ .బీట్ రూట్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఐరన్ ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు ప్రోటీన్ వంటివి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి,వీటిలోని సిలికాన్ ఖనిజం గోళ్ళు జుట్టు పెరగడం లో కీలకంగా పని చేస్తుంది.బీట్ రూట్ దుంప ఉడకబెట్టి మెత్తగా గుజ్జు చేయాలి దీనికి చెంచా బాదం నూనె రెండు చుక్కలు తేనె కలిపి ముఖానికి ప్యాక్ గా వేసుకుంటే చర్మం కాంతిమంతంగా మారుతుంది.రసాయనాలు […]
న్యాయం కోసం పోరాటం
మద్రాస్ హైకోర్టు లో దృష్టి లోపం ఉన్న తొలి మహిళ లాయర్ కర్బగం మాయవన్ డాక్టర్ అంబేద్కర్ లా యూనివర్సిటీ నుంచి న్యాయ విద్యలో గోల్డ్మెడల్ అందుకున్న తన వంటి ఇబ్బందులున్న వ్యక్తులకు వీలైనంత సాయం చేయాలన్న తపనతో ఏర్పాటు చేశారు.వైకల్యాలున్నవారికి న్యాయ పరంగా సామాజిక పరంగా సహాయం అందిస్తూనే మరోవైపు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ద్వారా వ్యవస్థలను కర్బగం నిలదీస్తున్నారు.కరోనా సమయంలో ఎలాంటి సహాయానికి నోచుకోని ప్రత్యేక అవసరాలు ఉన్న వ్యక్తుల పునరావాసం కోసం ప్రయత్నిస్తున్నారు […]
ఎంతో సంతృప్తి
ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలో హీరోయిన్ గా నటించిన రూప కొడువయుర్ డైరెక్టర్ గా కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందిస్తోంది.నాన్న రవి కుమార్ అమ్మ వంగ లక్ష్మి సంస్కృతం టీచర్ గుంటూరు కొటూరి మెడికల్ కాలేజీలో ఫ్రీ సీట్ లోచదువుకున్నారు. ఆంకాలజిస్ట్ అవ్వాలని కోరిక. హాస్పిటల్ లో కోవిడ్ రోగులకు సేవలు అందించేందుకు గాను రెండు మాస్క్ లు గాగుల్స్ ఫేస్ షీల్డ్ పెట్టుకోవాల్సి వస్తుంది. పిపిఇ సూట్ నుంచి గాలి లోపలికి పోదు ఒళ్ళంతా […]
చేనేతకు సాయం
రీతూ గార్గ్ ప్రారంభించిన చీరెలు స్టార్టప్ పేరు పద్మశాలి ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ కానీ అనుభవం గానీ లేవు కానీ ప్రాచీన చేనేత సాంప్రదాయ కలల గురించి తెలుసుకునేందుకు దేశమంతటా పర్యటించారు.నిప్పు నిపుణులైన చేనేత కళాకారుల ను కలుసుకున్నారు వంద మందికిపైగా చేనేత కార్మికులను దేశంలోని పది క్లస్టర్ల నుంచి ఎంచుకున్నారు.బనారస్,కంచి, భుజ్, చందేరి, కోట, సంగనేర్, భాగల్పూర్ మొదలైన ప్రాంతాలనుంచి నేసే చేనేత చీరెలు ఇతర దేశాల కస్టమర్స్ కి అమ్మగాలిగారు వెబ్ స్టోర్ […]
లైన్ ఉమెన్ ఉషా జగ్దాలే
మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్టిబ్య్రూషన్ కంపెనీ లిమిటెడ్‌లో ‘లైన్ ఉమెన్’గా విధులను నిర్వర్తిస్తున్నది ఉషా జగ్దాలే.నిచ్చెన లేకుండానే విద్యుత్ స్తంభం పైకి ఎన్నో భద్రత పరికరాలు లేకుండా తెగిన వైర్లను కలుపుతోంది ఉషా క్రీడాకారిణి కూడా మహారాష్ట్రకు రాష్ట్ర స్థాయి ఖోఖో జట్టుకు కెప్టెన్‌గా ఉంది.11 బంగారు పతకాలు సాధించింది కూడా స్పోర్ట్స్ కోట నుంచి టెక్నీషియన్ గా ఉద్యోగం వచ్చింది. ఉషా ఆఫీస్ పని కి బదులు వైర్ మెన్ గా పని చేసేందుకే ఇష్టపడింది.కరెంట్ […]
పైలెట్ గా కంగనా
ఎయిర్ ఫోర్స్ పైలట్ల సాహసాన్ని చూపించే తేజస్ సినిమాలో కంగనా నటిస్తోంది. 43 అడుగుల పొడవున ఉండే తేజస్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎదురుగా పైలట్ యూనిఫామ్ లో నిలబడ్డ కంగనా ఫస్ట్ లుక్ నెటిజన్లను ఆకట్టుకొంది తేజస్ ఫైటర్ లు మన దేశీయ సాంకేతిక పరిజ్ఞానం తో తయారయ్యాయి ఇంతకు ముందు ఉన్న వింగ్ విమానాలను రీప్లేస్ చేసేందుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు వీటిని తయారు చేశారు. ప్రస్తుతం మన దగ్గర 35 తేజస్ […]
ఉషా కు ధ్యాన్ చంద్ అవార్డ్
నా దగ్గర శిక్షణ పొందుతున్న ఎంతో మంది పిల్లల్లో ఒక్కరైనా ఒలంపిక్స్ బరి లో నిలవాలని నా ఆశయం బాక్సర్ గా ఒలంపిక్స్ పతాకం గెలవాలన్న నా కోరిక అలాగే ఉండిపోయింది. కనీసం కోచ్ గా అయినా ఎంతో మంది విజేతలను తయారు చేయాలనుకొన్నాను అంటున్నారు ఉషా. తాజాగా ధ్యాన్ చంద్ అవార్డ్ ని గెలుచుకొన్నారామె అఖిల భరత్ రైల్వే మహిళల జట్టుకు కోచ్ గా ఉన్నారు.ప్రస్తుతం నగరంలో డీజల్ లోకోషెర్ గ్రేడ్-1 ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు […]
మెరైన్ ఇంజనీర్ సోనాలీ బెనర్జీ
మొట్ట మొదటి ఉమెన్ మెరైన్ ఇంజనీర్ సోనాలీ బెనర్జీ. మెరైన్ ఇంజనీర్ ఓడ మరమ్మతులు,నిర్వహణ. నేటి ఆధునిక నౌకల్లో సరికొత్త సాంకేతిక పరిజ్ఙానం పరికరాలు ఉపయోగిస్తున్నారు. ఒక మెరైన్ ఇంజనీర్ ఈ సాధనాలను అర్ధం చేసుకోవాలి. ఆ పరికరాలు ఆపరేట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. అంటోంది సోనాలి. మెరైన్ ఇంజనీర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో ప్రవేశం పొందారు 1500 మంది క్యాడెట్లలో ఆమె ఏకైక మహిళ అని తేలింది. ఆమెను ఆఫీసర్స్ క్వార్టర్లో ఉంచారు. కోర్సు పూర్తయ్యాక సింగపూర్, […]
