Tuesday, 28 Jul, 2026

పిల్లలెంత అపురూపం 

ఆరాధ్య కు ఆ రోజు చెవులు కుట్టే వేడుక జరుగుతోంది. నా చిన్నారి పాప ఒక్కతే ఆ నొప్పిని భరిస్తూ ఉండటం నేను చూడలేక పోయాను పాప తో పాటు ఆ నొప్పి నేను భరించేందుకు సిద్ధ పడ్డాను. ముందుగా నేను కుట్టించు కొన్నాను ఆరాధ్య ధైర్యంగా నా వైపు చూసింది.పాపాయి తో నా జీవితం ఎంతో అమూల్యంగా అనిపించిందో నేను చెప్పలేను.అన్నాడు అభిషేక్ బచ్చన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆడపిల్లలు ఉండటం ఒక అదృష్టం.వాళ్లకు చిన్నపాటి […]

బియ్యపు గింజలపై గీత 

హైదరాబాద్ కు చెందిన మైక్రో ఆర్టిస్ట్ రామగిరి సారిక భగవద్గీతను బియ్యం గింజలపై రాసి రికార్డు సృష్టించింది.2009లో లక్ష మందితో కలిసి ఒకేసారి కీర్తనలు ఆలపించినందుకు ఆమెకు గిన్నిస్ బుక్ ఆఫ్  రికార్డ్స్ లో చోటు దక్కింది. 4042  బియ్యపు గింజలు ఉపయోగించి 150 గంటల్లో భగవద్గీత రాసింది సారిక. ఇప్పటి వరకూ సారిక రెండు వేలకు పైగా కళాకృతులు బియ్యపు గింజ లపై చిత్రీకరించింది నువ్వుల గింజల పైన కూడా కళాకృతులు  చెక్కిందామె.పేపర్ కార్వింగ్ మిల్క్ […]

యంగ్ సైంటిస్ట్ అనికా 

అనికా చేబ్రోలు యువ శాస్త్రవేత్త.కరోనా వైరస్ వృద్ధిని నియంత్రించే ప్రోటీన్ కు అతుక్కునే  ఒక పదార్ధాన్ని రూపొందించింది అనికా .ప్రపంచం ఎదుర్కొనే సమస్యల పైన ఆవిష్కరణలు చేస్తున్న వారిని  ప్రోత్సహించేందుకు అమెరికా లో నిర్వహించిన 3M యంగ్ సైంటిస్ట్ చాలెంజ్ లో 14 ఏళ్ల అనికా  చేబ్రోలు విజేతగా నిలిచింది.కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తయారు చేయటం కోసం విజేత గా తయారు చేయడం కోసం ప్రత్యేకంగా సార్స్ కోవ్ -2 వైరస్ ప్రోటీన్ ను రూపొందించింది.నేను […]

మిస్ ఇండియా 2020 (తెలుగు)

కీర్తి సురేష్, రాజేంద్రప్రసాద్,జగపతి బాబు నటించిన మిస్ ఇండియా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మానస సంయుక్త చిన్నప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్త కావాలని అనుకుంటుంది.పుట్టి పెరిగిన లంఖ సింగి  గ్రామంలో తాతయ్య బాల్యంలో రుచి చూపించిన హెర్బల్ టీ ని వ్యాపారంగా మలుచుకోవాలనుకుంటుంది.అన్న ఉద్యోగం తో అమెరికా వచ్చిన మానస టీ బిజినెస్ స్థాపించి యువ పారిశ్రామిక వేత్తగా ఎదుగుతుంది.అంతర్లీనంగా మహిళా సాధికారతకు పెద్ద పీట వేసారు దర్శకుడు నరేంద్ర […]

జాగ్రత్తగా ఎంచుకోవాలి

చర్మానికి తేమ మెరుపు ఇస్తుంది టోనర్ .ఈ టోనర్ ను జాగ్రత్తగా ఎంచుకోవాలి. జిడ్డు చర్మం  ఉన్న వారు తేలికగా ఉండి నూనె సంబంధిత పదార్థాలు లేని టోనర్ ను తీసుకోవాలి.సున్నితమైన చర్మం ఉంటే సాలిసిలిక్ ఆమ్లం అధికంగా ఉండే టోనర్ ఉపయోగించాలి.అయితే పారా చేన్స్ ఉన్న టోనర్ వాడకూడదు. చర్మం పైన మచ్చలు ఉంటే ఆల్కహాల్ లేని, ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ ఉన్న టోనర్ వాడాలి.సహజమైన టోనర్ కావాలి అనుకుంటే అలోవెరా రోజ్ వాటర్ కలిపి […]

మనసి జోషి

మనసి ప్రోస్థటిక్ లెగ్ సాయంతో ఆడి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ ఆమె నవతరం నాయకత్వ లక్షణాలు ఉన్న నేటి మహిళగా ఆసియాలోన ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా గుర్తించిన టైమ్స్ మ్యాగజైన్ అక్టోబర్ ఆసియా ఎడిసిన్ ని ఆమె ముఖచిత్రంలో ముద్రించింది చిన్నప్పటినుంచే బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ లో గెలుస్తూ వచ్చినమనసి ప్రమాదంలో కాలు పోగొట్టుకుంది. నెలలపాటు హాస్పిటల్ బెడ్ కే పరిమితమైన నెమ్మదిగా కోలుకొని  ప్రోస్థటిక్ కాలి సాయంతో ప్రపంచ చాంపియన్ గా ఎదిగింది. తాజాగా బార్బీ బొమ్మల […]

ప్రతినిధుల సభకు పోటీలు మంగా అనంతాత్ముల.

అమెరికాలో ప్రతినిధుల సభ (హౌస్ అఫ్ రిప్రజంటేటివ్స్ )కు,వర్జీనియా నుంచి తొలిసారి తెలుగింటి మహిళ తొలిసారి తెలుగింటి మహిళ మంగా అనంతాత్ముల రిపబ్లికన్ల తరుఫున బరిలో దిగుతున్నారు.ఆసియన్ హక్కుల ఉద్యమకారిణిగా సుపరిచితురాలు. 1990లో అమెరికా వచ్చారామె. మొదట్లో రక్షణ శాఖ కొనుగోళ్ల విభాగంలో ఫెడరల్‌ ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేశారు. తొలిసారిగా వర్జీనియా రాష్ట్రం 11వ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి నామినేషన్‌ వేశారు.ఆమె పోటీపడుతున్న నియోజవర్గం లో,గెర్రీ కనోలీతో ఆమె పోటీపడుతున్నామె. నేను గెలిస్తే వలసల హక్కుల కోసం […]

ఇంటికే లవ్ ఫర్ ఫుడ్

హైదరాబాదులో లవ్ ఫర్ ఫుడ్ పేరుతో స్మార్ట్ కిచెన్ నడుపుతున్నారు స్నేహితులు శైలజ చెరువు శశికళ టెకాల్ సాంప్రదాయ కాయగూరలు ఆకుకూరలు పప్పు దినుసులతో రోజు 300 మందికి భోజనం పంపేస్తారు వంటరి వృద్ధులు, డైటింగ్ చేసేవారు ప్రస్తుతం కోవిడ్ బారినపడి కోలుకుంటున్న వారికి ప్రత్యేకమైన ఆహారం పంపిస్తున్నారు. ప్రోటీన్ డైట్ రెడీ టు కుక్ పదార్ధాలు సప్లై చేస్తారు ఆహారాన్ని బట్టి 50 నుంచి వంద రూపాయలు ధర ఉంటుంది డోర్ డెలివరీ ఉచితం.

అసలు రహస్యం ఇదే

ఇంతకుముందు నా ఆహారంలో కార్బోహైడ్రేట్స్ అస్సలు ఉండేవి కావు.తర్వాత ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి అవన్నీ మానేసి వర్క్ వుట్స్   మొదలు పెట్టాను. ప్రతిరోజు నలభై ఐదు  నిమిషాలు అష్టాంగ హఠ యోగా చేస్తున్నాను.వీటితో పాటు మంచి ఆహారం తీసుకుంటున్నాను అంటోంది యామీ గౌతం.సైజ్ జీరో నే అందం అనుకున్నాను నేను కూడా.కానీ అసలా ఆలోచనే అనారోగ్యం హేతువు శరీరం తీరుగా ఉంచుకునేందుకు సక్రమమైన సహజమైన ఆహారం, మంచి వ్యాయామం మాత్రమేనని అనుభవ పూర్వకంగా అర్థమయింది.ఆరోగ్య పూరితమైన […]

గ్లామర్ అంటే కాన్ఫిడెన్స్

గ్లామర్ గా ఉండటం అంటే వస్త్రధారణతో ముడిపెట్టేస్తూ ఉంటారు కానీ నా దృష్టిలో గ్లామరస్ గా ఉండటం అంటే కాన్ఫిడెంట్ గా ఉండటం అంటుంది శ్రద్దాదాస్.నటనతో,నవ్వుతూ సహజమైన సంభాషణలతో చక్కని వాతావరణంలో గ్లామర్ ఉంటుంది.అసలు అవన్నీ కలిస్తే కదా గ్లామర్ అంటే చీరెకట్టులో గ్లామర్ అంటారు.కానీ చీర కట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు కానీ ఎక్సపర్ట్స్ కూడా చీరె కంటే సెక్సియెస్ట్ డ్రెస్ ఏది ఉండదు అంటారు.ఒకళ్ళ దృష్టికోణం ఒకలా ఉంటుంది పైగా నేను ముంబై లో […]

ఉచితంగా  లాప్ టాప్ లు

ఆన్ లైన్ క్లాసు లో పాల్గొనేందుకు టాప్ టాప్, స్మార్ట్ ఫోన్ లు లేక, నిస్సహాయంగా చదువుకు దూరంగా ఉన్న పేద పిల్లల కోసం ఐటీ సంస్థలతో సంప్రదించి వారి సాయం తీసుకొచ్చింది గుణిషా అగర్వాల్.చెన్నై పోలీస్ కమిషనర్ మహేష్ కుమార్ కుమార్తె. థింక్‌ఫినిటీ అండ్‌ కన్సల్టింగ్‌ కంపెనీ గుణిషా కు సాయంగా వచ్చాయి. ఈ సంస్థ ఉచితంగా వెబ్ సైట్ కూడా చేసి ఇచ్చింది. చెన్నై చుట్టుపక్కల చాలామందే లాప్ టాప్ లు గుణిషా కు […]

లైట్స్ అఫ్ ఫ్యాషన్

లైట్స్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2020 విజేత గా నిలబడింది ఐశ్వర్య.లైట్స్ ఆఫ్ ఫ్యాషన్ నేచురల్ హిస్టరీ మ్యూజియం ఈ సంవత్సరం ఇచ్చిన ఫోటోగ్రఫీ ఫోటో థీమ్ తో భూమిపైన, గాలిలో, నీటిలో ఉండే అన్ని ప్రాణుల నడవడిక గురించి ఫోటో తీయాలి. మిణుగురులను ఎంపిక చేసుకుంది ఐశ్వర్య మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లోని భండార్దరా అడవుల్లో ఒక చెట్టు నిండా వాలిన మిణుగురుల ఫోటో తీసింది. ఆ ఫోటో లైట్స్ ఆఫ్ ఫ్యాషన్ నేచురల్ హిస్టరీ […]

నల్ల బియ్యం పండిస్తోంది

సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్ గ్రామంలో మహిళా రైతు జక్కుల రేణుక అనేక రకాల బియ్యాన్ని పండిస్తోంది నలుపు, ఎరుపు పసుపు,బంగారు వర్ణాల  రైస్ వెరైటీలు ఆమె సాగుచేస్తోంది ఔషధ గుణాలు ఉన్న నల్ల, ఎర్ర  వరిసాగు ఆమె ప్రత్యేకం చింతలూరు సన్నబియ్యం, చిట్టి ముత్యాలు,నవారా,కులాకర్ వంటి రకాలతో పాటు సువాసన ఇచ్చే ఎన్నో రకాలున్నాయి. నల్లబియ్యం లో  బి-12 బి-6 విటమిన్లు విరివిగా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, మధుమేహం ఉన్న వాళ్ళకి ఇవి ఔషధం […]

షబ్నమ్ షా కు పురస్కారం

ప్రైజ్ ఫర్ ఉమెన్స్ క్రేయేటివిటీ ఇన్ రూరల్ లైఫ్ పురస్కారం అందుకొంది షబ్నమ్ షా. ఆదివాసీలు హక్కుల కార్యకర్తగా 1500 కుటుంబాలకు వారి భూమి హక్కులు అందేలాచేశారామె. మధ్యప్రదేశ్ లోని అశోక్ నగర్ జిల్లా మంగోలి గ్రామం షబ్నమ్ సొంత ఊరు ఏక్తా పరిషత్ జిల్లా కు కోఆర్డినేటర్ గా పనిచేస్తారామె. వంద గ్రామాల్లో ఆరువేల మంది ఆదివాసీలు పేదల కోసం పనిచేస్తోందీ ఈ సంస్థ.  స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉమెన్స్ వరల్డ్ సమ్మిట్ ఫౌండేషన్ ప్రతి […]

తృణ ధాన్యాల సాగు చేస్తా

మా సొంత ఊరు ఎం కె పురం అక్కడే మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను రైతులు కళాకారులు విద్యార్థులు ఎన్జీవోలు వ్యవసాయ నిపుణులు అందరినీ ఇన్ వాల్వ్ చేశాను.నిపుణులు సాయంతో రసాయనాలు వాడని ఆర్గానిక్ మెన్యూర్  తయారీ ఇక్కడ నేర్చుకోవచ్చు.మిల్లెట్స్ పండిస్తే పోషకాహారలోపం తీరు తోందని నిపుణులు చెపుతూనే ఉన్నారు.రైతులకు తృణధాన్యాల సాగు దిశగా మలిస్తే బావుంటుందని మిల్లెట్ బ్యాంక్ కు శ్రీకారం చుట్టాను అంటోంది చిత్తూరు జిల్లా ఎం కె పురానికి చెందిన విశాల […]

మాకిది గొప్ప అవకాశం  

స్కూళ్ళ ఆధునికీకరణ లో భాగంగా గోడలపైన మ్యూరల్స్ వేయటం మాకు దొరికిన ఒక మంచి అవకాశం. 30 అడుగుల ఎత్తైన గోడలు గోడలపైన బొమ్మ గీయడం నాకు చాలెంజ్ ఎప్పుడూ ఆడ పిల్లల బొమ్మలు స్కూలు గోడలపైన గీస్తూ ఉంటాను. ముఖ్యంగా నేను పుట్టి పెరిగిన ఖమ్మంలో సర్దార్ పటేల్ స్టేడియం గోడ పైన 40 అడుగుల గోడ పైన పి.వి సింధు బొమ్మ గీయటం నాకు గొప్ప సంతృప్తి కలిగించింది అంటుంది స్వాతి విజయ్.భార్యాభర్తలు ఇద్దరూ […]

మనో ధైర్యాన్నిచ్చే స్నేహబాంధవ్యం

స్నేహ బాంధవ్యం మహిళలను మానసికంగా, శారీరకంగా దృడంగా వుంచగలన్నది శాస్త్రీయంగా రుజువైంది. ఒక మహిళ తాను ఇష్టపడే ఇంకో మహిళ నుంచి ఎంతో మనోధైర్యాన్ని అందుకుంటుంది. వయసు, మతం, కులం, వంటివి స్వచ్ఛమైన స్నేహానికి అడ్డు కావు.మహిళల మధ్య ఉండే ఇంటరాక్షన్ మానసిక పరమైంది. సామాజిక ప్రయోజనాలతో కూడుకుని ఉన్నది ఇలాంటి స్నేహాల వల్ల ఆక్సిటోసిన్, కోపమైన వంటి హార్మోన్లు ఉద్దప్తం అయి మహిళలకు ఆనందం ఇస్తాయి. మగవాళ్లతో పోలిస్తే స్నేహితుల విషయంలో మహిళలు ఆప్యాయత అనురాగాలతో […]

తెలుగు అమ్మాయిలకు నో ప్లేస్

కలర్ ఫోటో సినిమా సక్సెస్ నన్నెంతో ఆనందపెడుతుంది. నాకెరీర్ లో ఈ సినిమా ఒక ప్రత్యేకం… నాకు చాలా ఇష్టమైన పాత్ర లభించింది అంటోంది చాందినీ చౌదరి. నేను చదువుకొనే రోజులలో షార్ట్ ఫిల్మ్ చేశాను. ఇప్పుడు దాన్ని చూస్తే ఇంకా బాగా చేయచ్చు,అనుకొంటాను. కానీ దాన్ని చూసే నాకు ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ అవన్నీ కార్యరూపంలోకి వచ్చేసరికి చాలా కాలం పట్టింది. హౌరా బ్రిడ్జి సినిమా తరువాత నాకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అంటోంది […]

తల్లి బిడ్డల ఆరోగ్యం కోసం అర్మాన్

అంతర్జాతీయ మూడో గైనకాలజిస్ట్ గా పేరు పొందిన అపర్ణ హెగ్డే ఆర్మాన్ సంస్థ ఏర్పాటు చేశారు. 16 రాష్ట్రాల్లో లక్ష మంది ఆరోగ్య కార్యకర్తలతో కలిసి పనిచేస్తుందీ సంస్థ ముంబైలోని కామా ఆస్పత్రి లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తారామె వైద్య సేవలు అందని  మారుమూల ప్రాంతాలకు మొబైల్ తో వైద్యాన్ని చేరువ చేయాలనుకున్నారు అపర్ణ.మొబైల్ మిత్ర అనే ఉచిత ఫోన్ కాల్ సర్వీస్ ఏర్పాటు చేశారు. 2018లో ఆర్మాన్ సంస్థ పుట్టింది 43 స్వచ్ఛంద […]

 అయ్యో అలా ఉండలేం

సృష్టి దీక్షిత్ యూట్యూబ్ కమెడియన్.నవ్వొచ్చే సెటైర్ లతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తోంది.తాజాగా ఈమె సృష్టించిన ఒక వీడియోకు  ఏడు లక్షల 50 వేల  రివ్యూస్ రెండువేల కామెంట్స్ వచ్చాయి ‘ ఉమెన్ ఫైనల్లీ  ఆపాలజిస్ట్ ఫార్ ఎవ్రీథింగ్ ‘ అన్న వీడియో రెండు నిమిషాల 30 సెకండ్ల నిడివి గలది మాత్రమే. స్త్రీలు ఎలా ఉంటే బాగుంటుందో, ఆమె ఎలా ఉండకూడదు  పురుషుల కు కొన్ని నిశ్చితమైన  అభిప్రాయాలు ఉంటాయి. అలా పురుషుల అభిప్రాయాలకు తగ్గట్లుగా […]