Monday, 27 Jul, 2026

అందరూ స్త్రీలే

దుబాయ్ లో ఎ ఆర్ రెహమాన్ ఏర్పాటు చేసిన ఫిర్ దౌస్ ఆర్కెస్ట్రా లో అందరూ మహిళలే. రెహమాన్ కుమార్తె ఖతీజా రెహమాన్ కూడా ఇందులో పనిచేస్తుంది. ఈ ఆర్కెస్ట్రా లో వివిధ దేశాల మహిళా సంగీత కళాకారులు పనిచేస్తున్నారు. ఆర్కెస్ట్రా ముఖ్య ఉదేశ్యం అరబిక్ సంగీతాన్ని పాశ్చాత్య సంగీతం లో మిళితం చేసి కొత్త అందాన్ని తీసుకురావటం 26 దేశాల నుంచి వచ్చిన 51 మంది మహిళ సంగీతకారులకు కండక్టర్ గా మోనిక ఉమెన్ అనే […]

మహిళలకు చేయూత

యువ పారిశ్రామిక వేత్తల కోసం లెట్స్ వెంచర్ అనే సంస్థ ప్రారంభించారు బెంగళూరుకు చెందిన శాంతి మోహన్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివిన శాంతి మహిళలను వ్యాపార దిశగా వ్యాపారం దిశగా ప్రోత్సాహం ఇచ్చేందుకు లెట్స్ వెంచర్ ద్వారా అటు స్టార్టప్ లను ఇటు వ్యాపారవేత్తలను ఒక తాటి పైకి తీసుకొచ్చారు.నందన్ నీలేకని,రతన్ టాటా,రాజన్ ఆనందన్,అనుపమ్ మిట్టల్ వంటి వారు ఈ సంస్థకు పెట్టుబడులు పెట్టారు. సామాన్యులు కూడా పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ట్రైకా సంస్థ కూడా ప్రారంభించారు […]

డిజిటల్ స్టార్

శ్రీమణి త్రిపాఠి గ్రాఫిక్ డిజైనర్ ఫ్రీలాన్సర్ గా కథల వీడియోలు సంస్థల సోషల్ మీడియా ఖాతాలకు పనిచేసింది. తనకు నచ్చిన అంశాలతో యూట్యూబ్ లో వీడియోలు చేయడం మొదలుపెట్టింది. యాప్ లో ఫోన్ ఫీచర్లు వ్యక్తిగత ఇంటి సమస్యలకు సాయపడే సాంకేతికత గురించి చెబుతోంది. చదువు రాని వాళ్లకు అర్థమయ్యే రీతిలో చెప్పే ఈమె వీడియోలకు 21 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్స్టా లో 2.1 మంది ఫాలోవర్స్ ఉన్నారు. టెక్ విభాగంలో ఎంపికైన ఇన్ఫ్లుయెన్సర్ల […]

పొడవుగా కనిపించాలా?

పొడవుగా కనిపించాలనుకుంటే వస్త్రధారణ లో మార్పులు తెచ్చుకోండి అంటారు స్టైలిస్ట్ లు. పట్టు రకాల బ్రోకేడ్ జరీ హంగులు భారీ బార్డర్ లు ఆడంబరంగా ఉందా గా ఉంటాయి కానీ బొద్దుగా ఎత్తు తక్కువగా కనిపిస్తారు.అందుకే రా సిల్క్ బెనారస్ జార్జెట్ షిఫాన్ క్రేప్ లైక్రా కాటన్ వంటి ఫ్యాబ్రిక్ రకాల్లో పొడవుగా సన్నగా కనిపిస్తారు. స్ట్రైట్ కట్ కుర్తీలు ఏ లైన్ టాప్ లు చక్కగా శరీరాకృతిని కనిపించేలా చేస్తాయి పెద్ద పెద్ద ప్రింట్లు ఎత్తు […]

వ్యాపారాలకు సాయం

460 మంది పెట్టుబడిదారులతో దేశంలో అతిపెద్ద స్టార్టప్ గ్రూప్ తయారు చేశారు పద్మజ రూపారెల్ భారతీయ స్టార్టప్ రంగంలో ఎక్కువగా వినిపించేను ఈమదే కుటుంబ వ్యాపారమైన రియల్ ఎస్టేట్ రంగా బాధ్యతలు తీసుకొని లాభాల బాటలో పరుగులు తీయించారు.  ఇండియన్ వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ ను ఏర్పాటు చేశారు స్టార్టప్స్ అభివృద్ధి కోసం. మరిన్ని పెట్టుబడులు తేవాలన్న లక్ష్యం తో  ఇండియన్ ఏంజెల్ నెట్వర్క్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ పరదేశాల్లో ఫైనాన్స్ వ్యవసాయం, అంతరిక్షం,బయోటెక్నాలజీ ఫార్మా […]

అందానికి నెయ్యి ప్యాక్

నెయ్యితో రాసే ప్యాక్ చర్మానికి కావాల్సిన పోషకాలు అందించి చర్మాన్ని తాజాగా మారుస్తుంది. రోజుకో స్పూన్ శెనగపిండి కి రెండు స్పూన్ల నెయ్యి కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. చేతిని తడి చేసుకుంటూ ముఖం రుద్దితే మృతకణాలు పోయి ముఖం మెరుస్తుంది. అలాగే స్పూన్ చొప్పున నెయ్యి తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. తేనెలోని ఆంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫ్లమేషన్ ని యాక్నే ని   తగ్గిస్తాయి నెయ్యిలో పసుపు కలిపి మర్దన చేసిన […]

అపర ధనలక్ష్మి

ఈ సంవత్సరం ఫోర్బ్స్ వంద మంది భారతీయ సంపన్నుల జాబితాలో స్థానం సంపాదించారు రేణుక జగతియాని ఆమె భర్త ల్యాండ్ మార్క్ గ్రూప్ వ్యవస్థాపకుడు మిక్కి జగతియాని. రేణుక కంపెనీలో సాధారణ ఉద్యోగి గా జాయిన్ అయ్యి భర్త మరణానంతరం 40,040 కోట్ల సంపదను వారసత్వంగా అందుకొని ఆ సంస్థను లాభాల బాటలో పరిగెత్తించారు. హోమ్ సెంటర్ బేబీ షాప్ మ్యాక్స్ వంటి స్వదేశీ బ్రాండ్స్ ఈ సంస్థ వే. ఈ సంస్థకు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలతో […]

రికార్డ్ గెలుపు

ప్రపంచ రికార్డ్ బద్దలు కొట్టి ఆసియా క్రీడల్లో గన్ షూటింగ్ లో స్వర్ణం గెలుచుకున్నారు సిఫ్ట్ కౌర్ సమ్రా 20 ఏళ్ల వయసులో షూటింగ్ సాధన మొదలుపెట్టిన సిఫ్ట్ వైద్య విద్య లో సీటు సంపాదించుకుంది కానీ జూనియర్ వరల్డ్ కప్ లో బంగారు పతకం సాధించాక ఆమె కెరీర్ గన్ షూటింగ్ నే ఎంచుకుంది.

మూగజీవాలే జీవితం

118 సంవత్సరాల చరిత్ర ఉన్న కాజిరంగా నేషనల్ పార్క్ ను తొలి మహిళా ఫీల్డ్ డైరెక్టర్ గా ఎంపికైన చరిత్ర సృష్టించారు సోనాలి ఘోష్  డెహ్రాడూన్ కు చెందిన సోనాలి ఘోష్ 2000 సంవత్సరం ఐ ఏ ఎస్ బ్యాచ్ టాపర్ ఆమె తొలి నియామకం అస్సాం లోని కాజిరంగా నేషనల్ పార్క్ లోని పలు నేషనల్ పార్క్ లు  జూల్లో పనిచేశారు. రైనో తో సహా ఎన్నో జంతువుల నుంచి అపాయాలను ఎదుర్కొన్నారు.

లక్షల మందికి బాస్

118 సంవత్సరాల చరిత్ర కలిగిన రైల్వే బోర్డు తొలి మహిళా చైర్‌ పర్సన్ మరియు సి ఈ ఓ జయ వర్మ సిన్హా ఆగ్నేయ రైల్వే జోన్ లో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ గా బాధ్యత తీసుకున్న తొలి మహిళ. బంగ్లాదేశ్ రాజధాని దాక్  లో భారత హై కమిషన్ లో రైల్వే సలహాదారుగా నాలుగేళ్లపాటు బాధ్యత నిర్వహించారు. జయ వర్మ సిన్హా అలహాబాద్ యూనివర్సిటీ లో విద్యాభ్యాసం పూర్తి చేసి సివిల్స్ లో మంచి […]

లిప్ స్టిక్ ప్రమాదం !

నిరంతరం పెదవులకు లిప్ స్టిక్ వాడకం వల్ల వాటిలో ఉండే లెడ్ సహా ఎన్నో మినరల్స్ అధిక మోతాదులో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.లిఫ్ట్ స్టిక్స్ లో వాడే పారా బెన్స్ వంటి ప్రిజర్వేషన్ ఆరోగ్యానికి హాని చేస్తాయి. పెదవులపై పగుళ్లు అలర్జీలు వస్తాయి.వీలైనంతవరకు సహజ ఉత్పత్తులే వాడాలి ప్రతిరోజు తేనె చక్కెర కలిపి పెదాలను స్క్రబ్ చేసి పెట్రోలియం జెల్లీ రాసుకోవాలి.బాదం నూనెతో ప్రతిరోజు మసాజ్ చేసుకోవచ్చు. ఎన్ పి ఎఫ్ తక్కువ ఉన్న […]

వెల్ కమ్ టు పారడైజ్

నటి ట్వింకిల్ ఖన్నా చక్కని రచయిత్రి ఆమె రాసిన కొత్త పుస్తకం వెల్ కమ్ టు పార్ డైజ్ మార్కెట్ లో వస్తోంది.ట్వింకిల్ ఫిక్షన్ రైటింగ్ లో మాస్టర్ చేసింది. గతంలో ఆమె రాసిన మిసెస్ ఫన్నీబోన్స్, పైజామాస్ ఆర్ ఫర్ గివింగ్, లెజెండ్ ఆఫ్ లక్ష్మీ ప్రసాద్ పుస్తకాలు పాఠకులను అలరించాయి. మానవ సంబంధాలు అనుబంధాలు ఆప్యాయతలు ఆధారంగా రాసిన వెల్కమ్ టు పారడైజ్ వచ్చే నెలలో వచ్చేస్తోంది.

మళ్లీ అదే ఫ్యాషన్

\ఫ్యాషన్ వేగంగా మారిపోతుంటాయి. అవే తిరిగి వస్తూ ఉంటాయి. ఒకప్పుడు ఎంతో ట్రెండీగా ఉన్న పొడవు చేతుల బ్లౌజ్ లు మళ్లీ చీరల పైన లెహంగాల పైన ఫ్యాషన్ అయి కూర్చున్నాయి. భుజం దగ్గర సీతాకోకచిలుక రెక్కల్లా వచ్చేవి,ఎంబ్రాయిడరీ చేసినవి బుట్టి చేతుల్లో పొడవాటి బ్లౌజ్ లు ఇప్పుడు మళ్లీ ఫ్యాషన్.

అన్నింట అసమాన తే

శతాబ్దాలుగా కార్మిక మార్కెట్ లో మహిళల చారిత్రక సమకాలీన పాత్రలపై సమగ్ర పరిశోధన చేసినందుకుగాను క్లాడియా గోల్డిన్ 2023 వ సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి అందుకున్నారు.1989 లో హార్వర్డ్  ఆర్థిక శాస్త్ర విభాగంలో పదవి పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు క్లాడియా ఆర్థిక వ్యవస్థ లో లింగ అసమానతల గురించి తెలుసుకునేందుకు 200 సంవత్సరాల వ్యవస్థకు సంబంధించిన డేటా సేకరించారు.మహిళల విషయంలో సంపాదనలో తేడాలు సాంకేతికత పాత్ర చివరలో కెరీర్ లో ఎదిగేందుకు వాడిన […]

కాస్త మార్పే అందం

ఇల్లు అందంగా కనిపించాలంటే కొత్త ఫర్నిచర్ కొనక్కర్లేదు. స్థానం మర్చి కొత్త కవర్స్ తొడిగితే చాలు కూల్ గా ఉండే గోడకు త్రీడి స్టిక్కర్లు అంటించవచ్చు.టేబుల్ పైన తాజా పువ్వులు ఉన్న వాజ్ లు ఉండాలి.అందమైన కర్టెన్లు ప్రింటెడ్ కూల్ కలర్స్ కూడా ఇంటికి అందం ఇస్తాయి. చక్కని ఫ్లోర్ మాట్స్ ముఖ్యంగా ఇల్లంతా శుభ్రంగా మురికి మరక లేకుండా కనిపిస్తే చాలు ఎక్కడలేని అందం వస్తుంది.

అగ్ని బాధితులకు రక్ష

బెంగళూరుకు చెందిన డాక్టర్ ప్రేమ దన్ రాజ్ చిన్నతనంలో అగ్ని ప్రమాదంలో గాయపడి కోలుకున్నారు ఆమెకు ఎన్నో శస్త్ర చికిత్సలు చేశారు. కోలుకున్నాక ప్రేమ ఎం బి బి ఎస్ చదివారు.అగ్ని రక్ష అనే సంస్థ స్థాపించి తనలాగా అగ్ని ప్రమాదాలకు గురైన అమ్మాయిలకు చికిత్స చేయించడం మొదలు పెట్టారు. సి ఎం సి లో ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి హెచ్ ఓ డి గా పనిచేస్తున్నారు ప్రేమ ధనరాజ్.

అందంగా లేహంగా

అందమైన దుస్తుల జాబితాలో ముందు కనిపించేది లెహంగా చోళీ. చేనేతల అద్భుతమైన కళ పైన వేసిన అద్దకప్పు హంగులతో రంగుల ప్రపంచంలో మునిగి నట్లే ఉంటాయి.ఈ దుస్తులు వీటిల్లో ఫ్లోరల్స్ బ్లాక్ ప్రింట్స్, కలంకారి గుజరాతి స్టైల్ గ్రాండ్ డ్రెస్ లు గిరిజన సంప్రదాయ కళ ఉట్టిపడే ఎంబ్రాయిడరీ పండగ రోజుల్లో పార్టీల్లో సాయంత్రం షికారుల్లో అందంగా ఉంటాయి.

సంపన్న మహిళ రాధ

360 వన్ వెల్త్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 లో చోటు సంపాదించి మన దేశపు సంపన్న మహిళ గా వార్తల్లో నిలిచారు రాధ వెంబు జోహో మెయిల్ ప్రొడక్ట్స్ మేనేజర్ రాధ వెంబు.టెక్ రంగంలో పురుషాధిక్యత ఎక్కువ గా కనిపించే పరిస్థితుల్లో రాధ వెంబు. ఎన్నో ఆలోచనలు బద్దలు కొట్టి ఎంతో మంది అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచింది.చెన్నైలో పుట్టి పెరిగిన రాధ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్ లో  పట్టా పుచ్చుకున్నది.

కొత్త చెప్పులా ?

రోజువారీగా పార్టీ వేర్ అంటూ అమ్మాయిలు రకరకాల షూ లు మారుస్తూ ఉంటారు. కొత్తగా వేసుకుని సరికి బొబ్బలు వస్తాయి. అలా రాకుండా ముందే పాదాలకు డియోడరెంట్ సిరం లేదా పెట్రోలియం జల్దీ పట్టించాలి. లేకపోతే మడమల వరకే ఉండే సాక్స్ వేసుకోవాలి. పాదాలు బరుసుకున్న ట్రాన్స్పరెంట్ బ్యాండెయిడ్ టేప్ వేసుకోవాలి. సౌకర్యంగా ఉండేందుకు పాదాల పైన వేళ్ళ సందున బేబీ పౌడర్ వేసుకొని తర్వాత షూ వేసుకుంటే సమస్య రాదు.

మురికి మాయం

టూత్ పేస్ట్ తో ఎన్నో మురికి మరకలు పోగొట్టవచ్చు. ఫోన్ కోసం ట్రాన్స్ పరెంట్ కవర్లు వాడుతూ ఉంటాం అవి పసుపు రంగులోకి మారిపోతూ ఉంటాయి. టూత్ పేస్ట్ లో కొన్ని చుక్కల నీళ్లు కలిపి ఈ కవర్ పై రుద్ది కడిగితే కొత్త వాటిలా కనిపిస్తాయి. గోడల పైన పడిన కాఫీ మరకలు కూడా టూత్ పేస్ట్ వేసి రుద్దితే పోతాయి. పిల్లలు తెల్లవి షూ మురికిగా అయిపోతే టూత్ పేస్ట్ వేసి రుద్ది కడిగితే […]