Chinna Maata
చీర కంటే అందం
చీర అందం బ్లౌజ్ పైనే ఆధారపడి ఉంటుంది. కేప్ స్టయిల్ జిగ్ జాగ్ డిజైన్ లాంగ్ స్లీవ్స్ వంటివి చీరను మించి అందంగా ఉంటాయి. డ్రెస్ లకే కాదు బ్లౌజ్ లకు కూడా లాంగ్ స్లీవ్స్ బాగుంటాయి. సన్నగా కనిపించాలనుకుంటే భుజాల పైన నుంచి కిందకి వేలాడే కేప్ ఫ్యాబ్రిక్ నెట్ టైప్ ఎంచుకోవాలి. నల్ల చీరకు జిగ్ జాగ్ డిజైన్లు చక్కగా నప్పుతాయి.
సులభంగా వంటలు
ప్రవాస భారతీయులు అపూర్వమైన భారతీయ వంటకాలను ఇంట్లో సులభంగా ఎలా చేసుకోవాలో చక్కని పుస్తకాలు రాసింది మౌనిక గోవర్ధన్. మౌనిక తాజా పుస్తకం తందూరి హోమ్ కుకింగ్ విజయాన్ని సాధించింది. ఆమె రాసిన ఇండియన్ కిచెన్ థాలి కూడా పసందైన వంటలు గురించి వంటకాల కోసం రెస్టారెంట్స్ పై ఆధారపడకుండా ఈ పుస్తకం సాయంతో చక్కగా ఇంట్లోనే రుచికరమైన వంటలు తయారు చేసుకోవచ్చు.
అత్యున్నత పురస్కారం
అలనాటి అందాల తార వహీదా రెహమాన్ ని ఆమె 85 వ ఏటా 2021 సంవత్సరపు దాదాసాహెబ్ పాల్కే అవార్డు వరించింది.ఆమె పుట్టిన ఊరు చెంగల్పట్. రోజులు మారాయి తెలుగు సినిమాలో ‘ఏరువాక సాగారో ‘ పాట లో డాన్స్ చేసి సినీ రంగంలో గుర్తింపు పొందిన వహీదా భారతీయ చలన చిత్ర రంగంలో తిరుగులేని తారగా నిలబడింది.ఆమె నటనకు మూడు ఫిలింఫేర్ అవార్డులు ఒక జాతీయ స్థాయి ఉత్తమ నటి అవార్డు లభించింది.
కంఫర్ట్ డ్రెస్
కంఫర్టబుల్ గా క్లాస్ గా కలర్ ఫుల్ గా కనిపించాలి అంటే ఇండియన్ స్టయిల్ లో వెస్ట్రన్ లుక్ తో ఉండాలి అలా సాంప్రదాయ వేడుకలకు వెస్ట్రన్ పార్టీల కోసం ప్రత్యేకంగా వచ్చింది. సింగిల్ షోల్డర్ టాప్ లెహంగా పలాజో టు లిప్ పాంట్స్ కి సరిగ్గా నొప్పి ఈ సింగిల్ షోల్డర్ కుర్తీలు గెట్ టు గెదర్ బర్తడే పార్టీలకు చక్కని ఎంపిక. డ్రెస్సింగ్ లోనే ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి ఈ డ్రెస్
సేవే జీవిత లక్ష్యం
చక్కని రచనలతో మంచి రచయితగా పేరు తెచ్చుకున్న సుధా మూర్తి కెనడా ఇండియన్ ఫౌండేషన్ గ్లోబల్ ఇండియన్ అవార్డు అందుకున్నారు. ఏటా తమ రంగాల్లో చెరగని ముద్ర వేసిన భారతీయులను ఎంపిక చేసి ఈ పురస్కారాన్ని అందిస్తారు.ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్థాపించి పేదల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విద్య, వైద్య సహకారం గ్రామీణాభివృద్ధి కళలు సంస్కృతి సాధించే శిక్షణ ఇవ్వడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు సుధా మూర్తి.
శుభ్రం చేయకపోతే నష్టం
దాదాపుగా వంటింట్లో రోజు వాడే చపాతీ కర్రను సక్రమంగా శుభ్రం చేయాలి అంటారు ఎక్సపర్ట్స్. కర్రపై పడిన గాట్లలో పిండి మిగిలి పోతూ ఉంటుంది. వాటిలో బ్యాక్టీరియా నిండి ఆరోగ్య సమస్యలు వస్తాయి. గోరువెచ్చని నీళ్లలో వెనిగర్ వేసి కర్రను నానబెట్టి మెత్తగా ఉన్న పీచుతో కర్రని శుభ్రం చేయాలి. కర్ర ఆరిపోయిన తర్వాత దానికి కొబ్బరి నూనె రాసి బాగా తుడవాలి.
నర్గీస్ మొహమ్మది కి నోబెల్
ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త నర్గీస్ మహమ్మదీ కి అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం లభించింది. ఇరాన్ లో మహిళల అణిచివేత మానవ హక్కులపై అవగాహనా,అందరికీ స్వేచ్ఛ మరణశిక్ష రద్దు కోసం చేస్తున్న ఆమె పోరాటానికి అత్యున్నత పురస్కారం దక్కింది. మహిళల కోసం జీవితాన్ని ధారపోసినందుకు నర్గీస్ ను శాంతి పురస్కారానికి ఎంపిక చేసినట్లు సర్వే నోబెల్ కమిటీ ప్రకటించింది. ప్రస్తుతం ఆమె టెహ్రాన్ లోని ఎనిక్ జైల్లో ఉన్నారు.
డ్రెస్సింగ్ టిప్స్
కాస్త ఎత్తు తక్కువగా ఉండే అమ్మాయిలు దుస్తుల ఎంపికలో డ్రెస్సింగ్ టిప్స్ పాటించాలి. ప్రింటు ఉన్న దుస్తులు చిన్నపాటి మోటిప్స్ ఉన్నవే తీసుకోవాలి. మరీ లూజుగా ఉన్న డ్రెస్ వేసుకుంటే ఆర్మ్ హోల్ లో నుంచి బ్రా కనిపిస్తూ ఉంటుంది. వి నెక్ ఉన్న దుస్తులు స్కూప్ నెక్స్ పొడవుగా ఉన్నట్లు కనిపిస్తాయి.నడుముకు అతికించినట్లు ఉండే టాప్స్, దుస్తులు వేసుకుంటే అవి సరిగ్గా వెయిస్ట్ లైన్ దగ్గర జాయింట్ అయ్యి ఉండేలా ముందే చూసుకోవాలి. మోకాలికి ఎగువగా […]
ఉన్నత పురస్కారం
సిద్రా ఫాత్మా అహ్మద్ ఈ ఏడాది పులిట్జర్ సెంటర్ వార్షిక బ్రేక్‌త్రూ జర్నలిజం పురస్కారం అందుకున్నది ఈ పురస్కారం కింద 12 వేల డాలర్లు ఫాత్మా అందుకుంటున్నారు. ఆమె దర్శకత్వం వహించిన కెన్ ఇండియా అడాప్ట్ టు ఎక్స్‌స్ట్రీమ్ హీట్’ అనే చిత్రానికి జూలియట్ రిడ్డెల్‌తో కలిసి దర్శకత్వం వహించారు. మారుతున్న వాతావరణం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు… దేశంలోని వివిధ వర్గాల పని పరిస్థితుల మీద, ఉత్పాదకత మీద చూపుతున్న ప్రభావం గురించి వివరాలు ఉన్నాయి.రైతులు వ్యవసాయ కార్మికులు […]
అందంగా మార్బుల్ ప్రింట్స్
ఫ్యాషన్ ట్రెండ్ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇళ్లలో వేసుకునే మార్బల్స్ పైన లేత రంగులో సన్నది వలయాల వంటి గీతాలు కనిపిస్తాయి. ఇప్పుడు అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ లో ఈ మార్బల్ ప్రింట్స్ వచ్చాయి. చుడిదార్, కుర్తిలు, బ్యాగ్లు యాక్ససరీస్ లోను ఈ మార్బల్ ప్రింట్స్ నయాలక్ ఇస్తున్నాయి.
నిద్ర పట్టటం లేదా ?
వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర తక్కువైపోతుంది అలా నిద్ర పట్టని వారి కోసం తయారయ్యిందే సౌండ్ స్లీప్ మిషన్. ఓకే స్థాయిలో వచ్చే కొన్ని శబ్దాల వల్ల నరాలకు స్వంతన లభించి నిద్ర పట్టేలా చేస్తుంది అంటారు ఈ మెషిన్ తయారీదారులు.అందుకోసం జలపాతం గాలి వర్షం వంటి కొన్ని రకాల శబ్దాలు రికార్డ్ చేసి ఈ మిషన్ లో ఉంచారు. అందులో నచ్చిన దాన్ని వింటూ ఉంటే హాయిగా నిద్ర పట్టేస్తుంది. టైమ్ సెట్ చేసి పెడితే […]
అన్ని ఫ్రిజ్ లో వద్దు
కొన్ని రకాల ఆహార పదార్థాలు ఫ్రిజ్ లో పెట్టకూడదు అంటారు ఎక్సపర్ట్స్. సాస్, జల్లి జామ్ లకు ఫ్రిజ్ అవసరం ఉండదు.టమాటో లు ఫ్రిజ్ లో పెడితే సహజమైన రుచి మారుతుంది.అరటి పండ్లు కూడా గది ఉష్ణోగ్రత లోనే బాగుంటాయి. బ్రెడ్ స్లైసెస్ ఫ్రిజ్ లో పెడితే పాడైపోతాయి. పీచ్ ప్లమ్ అవకాడో, బ్లాక్ బెర్రీలు ఫ్రిజ్ లో కంటే బయటే తాజాగా ఉంటాయి.
మెంటలిస్ట్
ఇండియాలో ఏకైక ఫిమేల్ మెంటలిస్ట్ సుహాని షా స్టేజ్ పైన 5000 కు పైగా ప్రదర్శనలు ఇచ్చిందామె. సాంప్రదాయ మెజీషియన్ ల దేశంలో ఉండకుండా ఆధునిక ఆహార్యం తో ఆమె కనికట్టు చేస్తుంది.ఆమె కు గోవా లో హిప్నో క్లినిక్ ఉంది. దురలవాట్లను మాన్పించటం లో వ్యక్తులకు సహాయపడుతుంది.సాధన తో సాధించిన స్కిల్ ఇది చెప్పే సుహాని షా మైండ్ రీడింగ్ చేయగలరు నగరాల్లో ఆమె షో లు నడుస్తుంటాయి.
ఇవి శుభ్రం చేయాల్సిందే
జుట్టు పొడవుగా కనిపించేందుకు హెయిర్ ఎక్స్ టెన్షన్ వాడుతూ ఉంటారు.వీటిని మాడుకు అంటిస్తారు. కనుక వెంట్రుకల కుదుళ్ళు బలహీన పడకుండా జాగ్రత్త తీసుకోవాలి. తీసేప్పుడు జాగ్రత్తగా వేళ్ళతో నెమ్మదిగా తీయాలి.తల శుభ్రం చేసుకున్నట్లు ఈ ఎక్స్ టెన్షన్స్ కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి.చెమటతో ఈ ఎక్స్ టెన్షన్ లు ఇన్ఫెక్షన్లకు కారణం అవుతాయి. మరీ బరువైన ఎక్స్ టెన్షన్ లు వాడితే సహజంగా ఉండే వెంట్రుకలు రాలిపోతాయి.
అన్నదాత
రైతులకు మేలు చేసే వరి వంగడాలు సృష్టించే డాక్టర్ స్వాతి నాయక్ నార్మన్ ఇ బోర్లాగ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 500 పైగా వరి విత్తనాలు తయారు చేసేందుకు పదివేలకు పైగా ప్రయోగాలు చేశారు. ఒరిస్సా లోని మయూర్ భంజ్ జిల్లాలో కరువు లేని తట్టుకోగల సహా బాగి దన్ పేరుతో తెచ్చిన వరి వంగడం దేశవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న రకంగా నిలిచింది.
షేప్ వేర్ తో జాగ్రత్త
సాధారణంగా కాస్త పొట్ట కనిపించగానే షేప్ వేర్ ధరించే అమ్మాయిలు ఎక్కువ అయ్యారు. ఇవి సాగే గుణం ఉన్న మెటీరియల్ తో చేస్తారు కనుక వేసుకోగానే శరీరానికి అతుక్కున్నట్టు ఉంటాయి. అయితే తడి పీల్చక పోవడం వేడిని ఉత్పత్తి చేయడం వీటి లక్షణం కనుక ఎక్కువ సేపు ధరిస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. తరచూ వేసుకుంటే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. పొట్ట గట్టిగా అదిమి పెడుతుంది కనుక జీర్ణాశయ సమస్యలు వస్తాయి.
స్విచ్ బోర్డ్ మరకలా ?
అస్తమానం వాడే స్విచ్ బోర్డ్ లు మురికిగా మరకలు పడి జిడ్డు పట్టేస్తాయి. ముఖ్యంగా వంటింటి స్విచ్ లు ఎక్కువ మురికిగా ఉంటాయి. నిమ్మరసం లో బేకింగ్ సోడా కలిపి దానితో స్విచ్ బోర్డు తుడిస్తే దుమ్ము జిడ్డు పోతుంది. నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా మరకలు పోగోడుతుంది. టూత్ పేస్ట్ కూడా వాడి ఈ స్విచ్ బోర్డ్ మరకలు తొలగించవచ్చు. అయితే శుభ్రం చేసే ముందర మెయిన్ స్విచ్ ఆపేయాలి.
సహజ నటి
సర్కారు బడిలో చదువుతున్న తన్మయి సోల్ ‘వాజక్’ అనే చిన్న సినిమాలో నటించింది. కేరళ కు చెందిన దిగువ మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన తన్మయి. తండ్రి ఫోటోగ్రాఫర్ ఈ పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయికి ఉత్తమ బాల నటి అవార్డు వచ్చి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఎప్పుడు స్టేజి పైన నటించని తన్మయి తన మొదటి ప్రయత్నం తోనే జాతీయ నటి అయిపోయింది.
దళితవాడ నుంచి ప్రయాణం
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఒక పారిశుద్ధ్య కార్మికురాలి కూతురు రోహిణి గౌరీ డాక్టరేట్ చేసి దళితుల సంక్షేమానికి కృషి చేస్తానని తండ్రి తో చెప్పిన రోహిణి గౌరీ ఎంతో కష్టపడి ఎం బి ఏ పూర్తి చేసింది.స్విజర్లాండ్ లో డాక్టరేట్ చేసింది. ఈ మధ్యకాలంలో ఐక్యరాజ్య సమితి నిర్వహించిన మానవ హక్కుల మండలి సమావేశానికి హాజరైంది. ఐరాస వరకు ఆమె చేసిన ప్రయాణం అమ్మాయిలకు గొప్ప స్ఫూర్తి.
ప్రతి చోట విజయమే
ఝార్ఖండ్ లోని రామ్ చట్టి అనే పల్లెటూరు లో పుట్టింది దీపికా కుమారి. తండ్రి ఆటో డ్రైవర్ తల్లి చిరుద్యోగి ఆర్చర్ అవ్వాలనే కోరికతో రాంబో లోని అర్జున్ ఆర్చర్ అకాడమీలో చేరింది.నెలకు కాస్త గా దొరికే ఉపకార వేతనం తోనే శిక్షణ పూర్తి చేసింది. విల్లు విద్య లో చేయితిరిగిన క్రీడాకారిణి అయింది. ఒలంపిక్స్ లో పాల్గొన్నది వరల్డ్ కప్ లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. భారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ తో సన్మానించింది పేదరికం […]
